రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ! | sachin Tendulkar to discuss Sarita Devi ban with Sonowal tomorrow | Sakshi
Sakshi News home page

రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!

Nov 25 2014 10:14 PM | Updated on Sep 2 2017 5:06 PM

రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!

రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!

భారత మహిళా బాక్సర్ సరితా దేవి నిషేధం అంశంపై క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్, సచిన్ టెండూల్కర్ బుధవారం సమావేశం కానున్నారు.

న్యూఢిల్లీ: ఏఐబీఏ నుంచి తాత్కాలిక నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవి అంశంపై రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో బుధవారం సమావేశం కానున్నారు. ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు.

 

ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆ సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయిందని,  దురదృష్టవశాత్తు అది బహిర్గతమైందన్నాడు.  ఈ క్రమంలోనే రేపు క్రీడా మంత్రితో సచిన్ సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement