9 రైల్వేస్టేషన్‌లకు ఐఎస్‌ఓ–సర్టిఫికేషన్‌ గుర్తింపు | ISO Certification Recognition For 9 Railway Stations | Sakshi
Sakshi News home page

9 రైల్వేస్టేషన్‌లకు ఐఎస్‌ఓ–సర్టిఫికేషన్‌ గుర్తింపు

Dec 18 2019 3:21 AM | Updated on Dec 18 2019 3:22 AM

ISO Certification Recognition For 9 Railway Stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైల్వేస్టేషన్‌లకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ–14001:2015 సర్టిఫికేషన్‌ గుర్తింపు లభించిం ది. రైల్వే స్టేషన్‌లలో పరిశుభ్రత, పర్యావరణ అనుకూల విధానాల ఆధారంగా ఈ గుర్తింపు లభిస్తుంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌(నాంపల్లి), సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, బాసర, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని విజయవాడ, కర్నూలు సిటీ, నాందేడ్‌ డివిజన్‌ పరిధిలోని పర్లి వైద్యనాథ్‌ స్టేషన్లు ఈ ఘనతను సాధించాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జాతీ యస్థాయిలో ఎకో–స్మార్ట్‌ స్టేషన్‌లుగా మార్చేం దుకు 36 స్టేషన్‌లను ఇటీవల ఎంపిక చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లున్నా యి. ఈ ఎంపికకు దోహదం చేసిన అంశాల్లో కొన్ని తాజా సర్టిఫికేషన్‌ గుర్తింపునకు ఉప యోగపడ్డాయని అధికారులు తెలిపారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement