విద్యార్థుల విహార యాత్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
వెంకటాపురం (వరంగల్): విద్యార్థుల విహార యాత్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామప్ప చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం టవర్ గ్రామానికి చెందిన పాలకొండ మణికుమార్‌గా మృతి చెందిన విద్యార్థిని గుర్తించారు.
శరత్ వికాస్ హైస్కూల్‌కు చెందిన 49 మంది విహారయాత్రలో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట చూసుకుని రామప్పలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం స్నానం కోసం విద్యార్థులు చెరువులో దిగినప్పుడు మణికుమార్‌కు ఈత రాకపోవడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది.