Dehradun
-
Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులకు కలచివేసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.డెహ్రాడూన్(Dehradun)లోని ముస్సోరీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న లగ్జరీ కారు రోడ్డు పక్కగా నడుస్తున్న ఆరుగురు పాదచారులను వేగంగా ఢీకొంది. దీంతో వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దరిమిలా కారు డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్ఎస్పీతో సహా ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్(Chandigarh registration number) కలిగిన మెర్సిడెస్ కారును నడుపుతున్న డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ, రోడ్డుపై వెళుతున్న నలుగురు కార్మికులను, ఒక స్కూటర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, స్కూటర్‌పై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోస్టుమార్టం కోసం నాలుగు మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షతగాత్రులను డూన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కారును నడిపిన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా ఆయుధాలు -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పిల్లలు ప్రాణాలు పోయినా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం హృదయ విదారకరంగా మారింది.మంగళవారం ఉదయం 1.30 గంటల సమయంలో డెహ్రడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్ సమీపంలో యువతి యువకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 25ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేష్ను స్థానిక సినర్జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.అయితే రోడ్డు ప్రమాదంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేయలేదు. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమి లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. వాహనం నడుపుతున్న కారు యజమాని ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ కేసులో అతను బాధ్యత వహించలేడు. కాబట్టే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్సై కేసీ భట్ వెల్లడించారు.కాగా, మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు యువతి యువకులు అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం.👉 చదవండి : చికెన్ బిర్యానీలో నిద్ర మాత్రలు..భర్తకు తినిపించిన భార్య.. ఆపై -
ఘోర కారు ప్రమాదం.. ఆరుగురి మృతి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓఎన్జీసీ క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కార్గో ట్రక్కును ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కాంట్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతులు, తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డెహ్రాడూన్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా కారు బల్లూపూర్ నుంచి కాంట్ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.A tragic road accident occurred in Dehradun, in which six people lost their lives and one person was seriously injured. The incident took place near the ONGC Chowk in Dehradun, when a speeding truck collided violently with an Innova car.#DehradunAccident #TragicCrash pic.twitter.com/za532tIPBz— Archana Pandey (@p_archana99) November 12, 2024 -
రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్.. తప్పిన పెను ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదానికి కుట్రపన్నిన వైనం వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్ లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ డిటోనేటర్ పడివుంది.పండుగల సమయంలో ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డిటోనేటర్‌ను ఈ వ్యక్తి అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్‌పై డిటోనేటర్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో కనిపించింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్ -
డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు. -
బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్‌సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్‌కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ఘోర ప్రమాదం
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటన ఉత్తరఖండ్‌లో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఓ ఖాళీ ఇంట్లో క్లోరిన్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైంది. మంగళవారం ఉదయం చోటుకున్న ఈ ఘటనతో సమీపంలో ఉన్న పలు నివాసాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందలను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ నివసించే పలు కుంటుంబాలను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. #WATCH | Uttarakhand: On receiving information about people facing difficulty in breathing due to leakage in the chlorine cylinder kept in the empty plot in the Jhanjra area of Prem Nagar police station in Dehradun, Police, NDRF, SDRF and Fire team reached the spot and are… pic.twitter.com/Xq7n71Ot3n — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024 ఈ ఘటనపై సాహస్పూర్ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ స్పదిస్తూ... 7 క్లోరిన్ సిలిండర్లు ఖాళీగా ఉన్న ఇంట్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నుంచి క్లోరిన్ లీకేజీ వల్ల ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అన్నారు. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎస్ బృందాలు తీసుకున్న చర్యలు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. చదవండి: Ayodhya: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్‌లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్‌లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!
ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, అత్యంత సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన జంట టాలీవుడ్ ప్రముఖు కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. దీపావళి సందర్భంగా తొలిసారి మెగా కోడలిగా వేడుకలు జరుపుకుంది లావణ్య. తాజాగా మరోసారి రిసెప్షన్ వేడుకల కోసం బయలుదేరారు. డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్‌లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు. లావణ్య తరఫు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో నిహారిక కొణిదెల కూడా డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive: The newly wed couple Mega Prince @IAmVarunTej & @Itslavanya along with their family snapped at airport as they’re off to Dehradun for their reception ceremony!! 😍📸#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/s2mQxVG4Ev — Telugu FilmNagar (@telugufilmnagar) November 15, 2023 -
కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట
ఇంట్లో నుంచే పని, రివ్యూలు రాసే పార్ట్‌టైమ్ ఉద్యోగంతో భారీ ఆదాయం అంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలి ప్పిస్తానని మభ్య పెట్టి ఆరు నెలల్లో 21 కోట్లు ఆర్జించాడు. చివరికి డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కయ్యాడు. 10 రాష్ట్రాల్లో, 37 ఫ్రాడ్ కేసులు సహా, 855 ఇతర కేసులలో ఇతడిదే కీలక పాత్ర అని తేలింది. దీంతో అతనిపై పలు కేసులు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన విషయాలతో పోలీసులే నివ్వెరపోయారు. ఉత్తరాఖండ్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం రిషబ్ శర్మ ఫరీదాబాద్‌లో కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాడు. కానీ ఆ తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పేరుతో రూ. 21 కోట్ల మోసానికి తెగబడ్డాడు. అయితే తాజా బాధితుడు, డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త రూ. 20 లక్షల మోసపోయాడు. దీంతో అతను ఉత్తరాఖండ్‌లోని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు అక్టోబర్ 28న రిషబ్ శర్మను అరెస్ట్ చేశారు. సైబర్ స్కామర్‌గా ఏలా మారాడంటే...! కరోనా ఆంక్షల కారణంగా కూరగాయల వ్యాపారి గుర్గావ్కు రిషబ్ శర్మ కూడా భారీగా నష్టపోయాడు. దుకాణాన్ని మూసివేశాడు. ఈ సమయంలోనే కుటుంబ పోషణ నిమిత్తం వర్క్ ఫ్రం హోం ఆఫర్లపై దృష్టి పెట్టాడు. అలా అప్పటికే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న పాత స్నేహితుడిని కలిశాడు. తాను కూడా రంగంలోకి దిగి పోయాడు. పలువుర్ని మోస పుచ్చటం మొదలు పెట్టాడు. దీని ద్వారా ఊహించని ఆదాయం లభించడంతో మరింత రెచ్చి పోయాడు. అలా కూరగాయల వ్యాపారి కాస్తా సైబర్ స్కామర్‌గా మారాడు. లక్షల మందిని మోసం చేశాడు. కేవలం ఆరు నెలల్లోనే అతను రూ. 21 కోట్లు సంపాదించాడని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసు అధికారి అంకుష్ మిశ్రా తెలిపారు. హోటల్ చైన్ అసలు వెబ్సైట్ మారియట్ డాట్ కామ్ పోలిన "మారియట్ బోన్వాయ్" పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించడమే అతని పని. తన ఉచ్చులో పడిన బాధితులకు హోటల్ యజమానిని అని, తన ఒక హోటల్లో పని చేస్తున్న సహోద్యోగి సోనియాను కూడా పరిచయం చేస్తాడు. ఆ హోటల్‌కు నకిలీ రివ్యూ రైటర్లకు తొలుత రూ.10 వేలు చెల్లించే వారిని ఆకర్షిస్తాడు. ఇందుకోసం టెలిగ్రామ్ గ్రూపును కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌కు చెందిన బడా వ్యాపారికి ఈ ఏడాది ఆగస్టు 4న వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులోని నంబరుకు కాల్ చేయడం ఆలస్యం రిషబ్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక్కో రివ్యూకు రూ.10 వేలు చొప్పున రెండుసార్లు చెల్లించడంతో రిషబ్‌పై పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో ఏకంగా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు సదరు వ్యాపారి. తరువాత రిటర్న్స్ గురించి అడిగితే మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇక ఆ తరువాతనుంచి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రిషబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబట్టారు. ఇతర దేశాలకు రహస్యంగా పంపే ముందు దొంగిలించిన డబ్బు కోసం బ్యాంకు ఖాతాలను తెరవడానికి భారతదేశంలోని వ్యక్తులను నియమించు కునే అంతర్జాతీయ క్రిమినల్ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు క్రిప్టో రూపంలో చైనా, సింగపూర్ వంటి దేశాల నిర్వాహకులకు కోట్లాది రూపాయలు చేరివేసినట్టు అంచనా వేశారు. అంతర్జాతీయ ముఠాలలో ఒకదానికి ఏజెంట్ అని, సాధారణంగా, ఈ ఏజెంట్లకు అసలు సూత్రధారి గురించి ఎటువంటి సమాచారం ఉండదని, మాస్టర్ మైండ్‌ని పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మిశ్రా తెలిపారు.. -
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ -
ఉత్తర భారతాన్ని వదలని వానలు
డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది! -
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు
డెహ్రడూన్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది. చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేలకు పైగా ఆస్పత్రులు అత్యద్భుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఏకంగా రెండువేలకుపైగా ఆస్పత్రులు అనుసంధానమై ఉన్నాయని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పథకాలు ఎక్కడా అమలవడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజంటేషన్ సందర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చురుగ్గా ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకం కూడా చాలా ఎక్కువ ఆస్పత్రుల్లో అమలవుతోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్యమైందో మిగిలిన రాష్ట్రాలు పరిశీలస్తే బాగుంటుందని సూచన చేశారు. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల వరకు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్నర కోట్ల మందికి అబా ఐడీలను ఏపీ ప్రభుత్వం జారీ చేయగలిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొరవకు కేంద్ర సహకారం కూడా మరింతగా తోడైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని..
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తన ముక్కుపచ్చలారని ఇద్దరు కుమార్తెల ప్రాణం తీశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని డోయీవాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పిల్లల అమ్మమ్మ అల్లుని ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేశవ్పురి డోయివాలా నివాసి ఆశుదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన చిన్న కుమార్తె రీనాకు ఐదేళ్ల క్రితం జితేంద్రతో వివాహమయ్యిందని పేర్కొంది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారని, వారు ప్రస్తుతం పాలు తాగే వయసులో ఉన్నారని తెలిపింది. జితేంద్ర తన భార్య రీనాను తరచూ కొడుతుండేవాడు. కొన్నాళ్ల పాటు ఆమె భర్త పెట్టే బాధలను భర్తిస్తూ వచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలను తండ్రి వద్దనే వదిలేసి, రీనా హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో జితేంద్ర మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు. పిల్లలను అంతమెందించి మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టాడు. అర్థరాత్రి ఆ చిన్నారుల గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారులు మృతి చెందివుండటాన్ని గుర్తించిన వారి అమ్మమ్మ డోయీవాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి ఎస్ఎస్ఐ రితేష్ షా మాట్లాడుతూ మృతిచెందిన చిన్నారుల అమ్మమ్మ తన అల్లుడే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నదని తెలిపారు. కాగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందుతుని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతనిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
హిందూ యువకుని ‘ముస్లిం వ్యవహారం’.. తండ్రి ఫిర్యాదుతో..
దేశంలో హిందూ- ముస్లిం వివాదాలకు సంబంధించిన ఉదంతాలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా డెహ్రాడూన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరిధిలోని డోయీవాలా ప్రాంతంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. తన 24 ఏళ్ల కుమారుడు ఇంటిలో ఉన్నట్టుండి నమాజ్ చేస్తున్నాడని, అలాగే అతని లాప్టాప్, మొబైల్ ఫోన్లలో ఆశ్చర్యకరమైన డేటా ఉందని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వైభవ్ బిజ్లవాణ్(24) గత మూడేళ్లుగా డిప్రెషన్లో ఉన్నాడు. అతనికి ఇస్లాంపై విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. పోలీసుల విచారణలో అతని ల్యాప్ టాప్, మొబైల్ ఫోను నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వైభవ్ ముస్లిం మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. ప్రతీరోజూ వీటిని అనుసరిస్తున్నాడు. పోలీసుల దర్యాప్తులో.. వైభవ్ తన గది నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, గత మూడేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వెల్లడయ్యింది. పోలీసులు వైభవ్‌కు సైకలాజికల్ టెస్ట్ చేయిస్తున్నారు. డెహహ్రాడూన్ పోలీసు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆ యువకుడు నిత్యం గదిలోనే ఉంటున్నాడని, దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ బృందం పరిశీలనలో ఆ యువకుడు డిప్రెషన్లో బాధపడుతున్నాడని తెలిసిందన్నారు. ఆన్లైన్లో ఇస్లాం ఆచారాల గురించి తెలుసుకుంటున్నాడని, ఉర్దూ నేర్చుకుంటున్నాడని తెలిపారు. ఆ యువకునికి సంబంధించిన మెడికల్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. చదవండి: జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర -
90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్లు.. టాప్ 4లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్‌తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్–4లో హైదరాబాద్ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్ బీఎన్బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్–ఇన్లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్‌ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి. టాప్ 10 నగరాలివే శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్ పూణె, మన హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వరుసగా టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని రాయ్‌ఘర్, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని నైనిటాల్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.. వివరాలు.. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తుంది. దాదాపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు షేర్ ఘడి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్ డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. గాయాలయ్యాయి. సమాచారం వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు మరణించారు. మరొకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot. More Details awaited. pic.twitter.com/LZWvg3riML — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023 -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు
భారత జట్టులో చోటు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌లతో ఈశ్వరన్ 165 పరుగులు సాధించాడు. అతడితో పాటు టాప్ఆర్డర్ బ్యాటర్ సుదీప్ ఘరామి 90 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరాఖండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ అభిమాన్యు ఈశ్వరన్.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. అభిమన్యు తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ డెహ్రాడూన్‌లో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు. దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీగా పేరు పెట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా రంజీ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ వేదికలో బెంగాల్ జట్టుకు ఇదే తొలి మ్యాచ్. కాగా అభిమాన్యు ఈశ్వరన్ స్వస్థలం డెహ్రాడూన్ అయినప్పటకీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలి సారిగా తన తండ్రి నిర్మించిన స్టేడియంలో అభిమాన్యు ఈశ్వరన్ మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడంతో అభిమాన్యు తండ్రి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా తన పేరిట నిర్మించిన స్టేడియంలోనే మ్యాచ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఈశ్వరన్ రికార్డులకెక్కాడు. -
Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు... దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు. ‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు. మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు. ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు. కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు. ‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే. విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది. ఖర్చు లక్షలు అయింది ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్రూమ్, రెండు బెడ్లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు. ‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది. వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల. చదవండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి -
కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి -
ప్రకృతి రక్షకు స్త్రీ శక్తి..
వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి పెరిగిందా?! మనం ఎలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా జీవించాలో.. మార్కెట్ శక్తులు మనపైన పనిచేస్తున్నాయా?! పర్యావరణవేత్త, రచయిత, వక్త, సామాజిక కార్యకర్త అయిన డాక్టర్ వందనశివ డెహ్రాడూన్ నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ మన దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. సేంద్రీయ ఆహార ఉద్యమంలో మార్గదర్శకులుగా ఉన్న మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తారు? ఇది మంచి పరిణామం. అయితే, మన మూలాలను మర్చిపోయి చాలా ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మళ్లీ మూలాలను వెతుక్కుంటూ వెళుతున్నాం. ఎవరు ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన జీవనం కోసమే కదా. మంచి ఆహారం వల్లే ఇది సాధ్యమని మనందరికీ తెలుసు. హరిత విప్లవంలో భాగంగా 1984లో వ్యవసాయ రంగంపై దృష్టిసారించినప్పుడు రసాయనాల వాడకం అంతగా లేదన్నది నిజం, కానీ, ఆ తర్వాత సంభవించిన పరిణామాలతో వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జీవ వైవిధ్యం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చాయి. ఇటీవల కాలంలో దేశంలో క్యాన్సర్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతోందో మనకు తెలిసిందే. దీనితోపాటు పరిశ్రమల్లో తయారయ్యే ఇన్స్టంట్ ఫుడ్ ప్రజలపై మరీ హానికరమైన ప్రభావం చూపుతోంది. వేగంగా విజృంభించిన వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఒక దేశ స్థితి అక్కడి వాతావరణం, ప్రజల ఆదాయం, ఆరోగ్యం.. ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. నేటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులన్నీ మన దగ్గర 10 వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్ ఏరియా వ్యవసాయం నుంచి మిగతా రంగాలకు వలసపోయింది. ఇప్పుడిప్పుడు ఇతర రంగాల్లో ఉన్నవారూ వ్యవసాయరంగం వైపు చూస్తున్నారు. మనిషికి కావల్సింది ఆరోగ్యకరమై ఆహారం. దానిని తనే స్వయంగా పండించుకోవాలనే ఆలోచన పెరగడం శుభపరిమాణం. ప్రస్తుతం మార్కెట్‌ను సేంద్రీయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పులు చేసిన ఆహార ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి కదా... ఇవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? నేను అర్థం చేసుకున్నదేంటంటే.. క్వాంటమ్ థియరీ ప్రకారం ప్రతీదానికి ఒక జెనోమ్ ఉంటుంది. ఉదాహరణకు మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక సంపూర్ణత్వం ఉంటుంది. ఏ ఒక్క భాగానికి విఘాతం కలిగినా మిగతా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అలాగే, జీవరాశి కూడా. ప్రపంచ మార్కెట్‌ను చూస్తే కార్న్, కనోలా, కాటన్, సోయా.. ఈ ఉత్పత్తులే. ఆహారం పైనే కాదు జీవనశైలిపైనా విపరీతమైన ప్రభావం చూపాయి. మన దేశంలో బీటీ పత్తి అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలో పత్తి పంట కారణంగా రైతుల ఆత్మహత్యలు చూశాం. ఆ సమయంలో రైతు ఆత్మహత్యలకు గల కారణాలేంటో తెలుసుకోవడానికి వరంగల్‌తో పాటు మిగతా ప్రాంతాలకూ వెళ్లాను. మొత్తం రసాయనాలే. అమెరికాలో అక్కడి వ్యవసాయం దాదాపు రైతుల చేతుల్లోనే ఉంటుంది. కానీ, మన దగ్గర అలా లేదు. జన్యుపరమైన మార్పుల వల్ల జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడింది. పంట దిగుబడి పెరగడానికి అవలంబించే విధానాల వల్ల నిరంతర హాని జరుగుతూనే ఉంది. ఈ ప్రభావం నుంచి జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? దేశీ విత్తనాలు. ఇప్పుడు రైతులు వేసే విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కెమికల్ సీడ్స్. ముందు దేశీ విత్తనాలు రావాలి. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ పెరగాలి. విత్తనం గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రియల్ సీడ్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు అని గుర్తించాలి. మన ప్రాంత వాతావరణానికి అవి ఏ మాత్రం అనువైనవి కావు. దేశీ విత్తనాల అభివృద్ధిలో భాగంలో దేశవ్యాప్తంగా 150 కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశాం. నాలుగు వేల వరివంగడాలు, 300 రకాల గోధుమ, మిల్లెట్స్.. దేశీ విత్తనాలలో పెద్ద మార్పు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, ఆహారమే అతి పెద్ద ఆయుధం. దానిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసుండాలి.. మనం తినే తిండి, విత్తనాన్ని మనకు మనంగా సాధించుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ రావాలి. ఇండస్ట్రియల్ ఫార్మింగ్ తగ్గాలి. ప్రభుత్వాలు స్థానికంగా రైతుల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. ఎవరు పండిస్తున్నారో వారే అమ్ముకోగలగాలి. అంతేకాదు, వాటిని ఆ కుటుంబం కూడా తినగలగాలి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనారోగ్యకరమైన వంటనూనెలకు గాంధీజీ సూచించిన కట్టెగానుగ నూనె సరైన పరిష్కారమా? కచ్చితంగా! గానుగ నూనెలు, మిల్లు నూనెలను చూస్తే మనకే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది వేటిలో పోషకాలు ఉన్నాయి అనేది. సత్యాగ్రహకాలంలోనే గానుగ నూనె ల ప్రాధాన్యం గురించి గాంధీజీ సూచించారు. దీనిని కూడా మార్కెట్ శక్తులు మనపై పనిచేశాయి. విదేశీ కంపెనీలు మన గానుగ నూనెలు మంచివి కావని, ఫిల్టర్, పోషకాలు కలిసిన నూనెలు మంచివని నూరిపోశారు. తమ ఆదాయాలు పెంచుకోవడానికి పరిశ్రమలు వేసిన ఎత్తుగడలకు మనం బలయ్యాం. దానిని మనం గుర్తించాలి. మీ ‘నవధాన్య’ కేంద్రం ఏర్పాటు గురించి.. ప్రాంతాలవారీగా ఉన్న జీవరాశి అక్కడి వాతావరణ స్థితిగతులపైన ఆధారపడి మనుగడ సాగిస్తుంది. దేశంలోనే ప్రాంతాలవారీగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట దిగుబడులను చూస్తుంటాం. వాటి మీద ఒక మనిషి మాత్రమే కాదు, అక్కడ ఉన్న సమస్త జీవరాశి మనుగడసాగిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శక్తుల కారణంగా మన దేశీయ జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం నెలకొంది. మనవైన వేప, బాస్మతి, వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు పెత్తనం చెలాయించాలని చూశాయి. వాటి హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇవన్నీ గమనించే ‘నవధాన్య’ కేంద్రం ద్వారా దేశీ విత్తనాల పెంపునకు కృషి జరుగుతోంది. మీకు ఇష్టమైన ‘ఎకోఫెమినిజం’ గురించి. ప్రపంచంలో ఈ భావన ఎలా ఉంది? వ్యవసాయంలో ఏ ఇజం ఉండదనేదే నా అభిప్రాయం. అయితే, మనం భూమిని తల్లిగా భావిస్తాం. వందల ఏళ్ల క్రితం నుంచి మహిళ ఇలాంటి పనులను చేయలేరు అనే ఒక విధానం మన వ్యవస్థలో ఉండేది. ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ రెండింటినీ విడదీయలేం. శక్తి చూపడంలో స్త్రీ అన్నింటా ముందుంటుంది. పైగా పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రక్షగా ఉండే స్త్రీ, ప్రకృతిలోని జీవరాశిని కాపాడటంలోనూ ముందుంటుంది. అందుకే సేంద్రీయ వ్యవసాయంలో మహిళ చాలా బాగా వర్క్ చేస్తోంది. ప్రకృతిలో జీవించే హక్కు, తనకు, కావల్సినవి సాధించుకునే శక్తి అన్ని జీవులకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఆహారం, వ్యవసాయం రంగాల్లో మహిళల శాతం అధికంగా ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
యువతి దారుణ హత్య.. సోషల్‌మీడియా గొడవ వల్ల గన్‌తో..
సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, కామెంట్లు చేయడం సాధారణమే! కానీ ఓ సోషల్ మీడియా పోస్ట్.. అమ్మాయి, అబ్బాయి మధ్య చిచ్చు రేపింది. ఈ గొడవలో తీవ్ర అవమానానికి గురైన ఓ యువకుడు తన క్లాస్మేట్ అయిన అమ్మాయిని అంతమొందించాడు. ఈ ఘటన ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గురువారం చోటు చేసుకుంది. వనిష్క బన్సాల్ అనే అమ్మాయి కాలేజీ హాస్టల్లో ఉంటుంది. ఆమె గురువారం సాయంత్రం హాస్టల్ సమీపంలోని ఓ షాప్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. ఆమె క్లాస్మేట్ అయిన ఆదిత్య తోమర్ అక్కడికి బైక్‌పై వచ్చి.. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకువెళ్లాలని ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనతోపాటు తెచ్చిన గన్ ఆమెను షూట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వనిష్క అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆదిత్య తోమర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొన్ని రోజులు కింద వనిష్క సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై ఆమె క్లాస్మేట్ అయిన ఆదిత్మ కామెంట్ చేశాడు. దీంతో ఆమె తన స్నేహితులకు అతనిపై ఫిర్యాదు చేసింది. వనిష్క స్నేహితులు.. ఆదిత్యను పట్టుకొని ఆమె కాళ్లు మొక్కించి క్షమాపణ చెప్పించారు. దీంతో స్నేహితుల మధ్య జరిగిన అవమానం తట్టుకోలేని ఆదిత్య.. వనిష్కపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని భావించి.. ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. -
ఉత్తరాఖండ్ బరిలో 632 మంది పోటీ
డెహ్రాడూన్: ఈనెల 14న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని 81.43 లక్షలమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. నామినేషన్ వేసిన వారి నుంచి 95మంది ఉపసంహరించుకోగా 632 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 136 మంది స్వతంత్ర అభ్యర్థ్ధులున్నారు. డెహ్రాడూన్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 117 మంది, హరిద్వార్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 110మంది పోటీచేస్తున్నారు. చంపావత్, బాగేశ్వర్ జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 14మంది పోటీపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. బరిలో ఎస్పీ, ఆప్, బీఎస్పీ, యూకేడీ కూడా ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పౌరిలోని థాలిసైన్ పట్ట్టణం నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈఘటనలో మంత్రికి స్వల్పగాయలవ్వగా, ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా? కాగా మంత్రి తన సిబ్బందితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుది. ఘటనా స్థలంలో తీసిన పై ఫోటోలో.. ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు బోల్తా పడగా, మరొకటి దాని పక్కనే ఆగి ఉన్నట్లు కనిపిస్తోంది. చదవండి: షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు.. -
తమతో కూర్చొని భోజనం చేశాడని చంపేశారు!
డెహ్రాడూన్: ఆధునికంగా మనిషి ఎంత ఎదుగుతున్నా.. ఇంకా కులం పేరుతో జరిగే హత్యలు ఆగడం లేదు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. మరోవైపు రోజురోజుకు దళిత, గిరిజనులపై అగ్రకులంవారి దాష్టికం తగ్గడంలేదు. తాజాగా ఓ దళిత వ్యక్తిని ఆగ్రకులానికి చెందిన కొందరు దాడి చేసి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన వివాహవేడుకలో రమేశ్‌రామ్ అనే దళిత వ్యక్తి తమతో పాటు కూర్చొని భోజనం చేశాడని అగ్రకులానికి చెందినవారు అతనిపై దాడికి దిగారు. చదవండి: Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై బీర్ బాటిల్‌తో దాడి తమకు దూరంగా ఉండి భోజనం చేయాలన్న నియయాన్ని అతడు ఉల్లంఘించాడని చావబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్‌రామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్రకులానికి చెందిన కొంతమంది వివాహం వేడుకలో తన భర్తపై తీవ్రంగా దాడిచేశారు. వారి దాడి కారణంగానే తన భర్త మృతి చెందడని రమేశ్‌రామ్ భార్య తులసిదేవి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర
భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఉత్తరాఖండ్‌వాసులు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ దినోత్సవాన్నిఉత్తరాఖండ్ డే లేదా ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే లేదా ఉత్తరాఖండ్ దివాస్‌గా జరుపుకుంటున్నారు ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర: భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో ఆమోదించబడిన తరువాత యునైటెడ్ ప్రావిన్సులు ఉత్తరప్రదేశ్‌గా మారాయి. ఇది ఆ తరువాత భారతదేశ రాష్ట్రంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసుల అంచనాలను అందుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది గానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులకు సరైన జీవనోపాధి అవకాశాలను అందించడం కోసమే ఉత్తరాఖండ్ క్రాంతి దళం ఏర్పడింది. అంతేకాదు అక్టోబర్ 2,1994న హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ దళంలోని వ్యక్తులను విజయవంతంగా నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత చివరకు చాలా సుదీర్ఘ కాల పోరాటం తర్వాత ఉత్తరాఖండ్ వంబర్ 9, 2000న ఉత్తరాంచల్‌గా ఏర్పడింది. ఈ మేరకు ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త జనవరి1, 2007న ఉత్తరాఖండ్గా మారింది. పైగా 2020 మార్చిలో గైర్‌సైన్‌ని ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా పిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ శీతాకాల రాజధానిగా డెహ్రాడూన్‌ని పిలుస్తారు. ఈ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా "దేవభూమి" అభివర్ణిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటివి క్షేత్రాలు కొలువుదీరి ఉండటమే. ఈ మేరకు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. పైగా భక్తులు ఈ ఉత్తరాఖండ్ యాత్రను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఏవిధంగా జరుపకుంటారంటే: ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్ర ప్రజల ధైర్యసాహసాలను లేదా వారి ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి వెలికతీసి మంచి అవార్డులతో సత్కరించడం ద్వారా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 2016వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రత్న అవార్డును ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ధైర్యసాహసాలకు చూపిన చాలా మందికి ఈ అవార్డును అందించారు. 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 2018లో,ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 18వ వార్షిక రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో ఈ వేడుక దాదాపు ఒక వారం పాటు జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో మాత్రం 20వ వార్షిక రాష్ట్ర స్థాపన దినోత్సవ వేడుకలను కరోనా మహమ్మారికి ముందే ప్రారంభించారు. -
బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బస్సులోయలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షచోప్పున ఎక్స్గ్రెషియాను ఇస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజేశ్‌కుమార్ తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారికి 40,000 వేల రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న (ఆదివారం) బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌కు బయలు దేరిన బస్సు.. చక్రాటా అనే ప్రాంతంలో అదుపుతప్పి 300 అడుగుల లోతున పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చక్రాటా అనే ప్రాంతంలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు .. బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌లోని చక్రాటాకు బయలు దేరింది. ఈ క్రమంలో మలుపుల వద్ద.. బస్సు అదుపుతప్పింది. ప్రమాద ప్రాంతం.. అత్యంత లోతుగా ఉండటంతో సహయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సహయక చర్యలకు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. चकराता क्षेत्र के अंतर्गत बुल्हाड़-बायला मार्ग पर हुए हृदय विदारक सड़क हादसे पर शोक व्यक्त करता हूँ। ईश्वर मृतकों की आत्मा को शांति और परिजनों को दुःख सहने की शक्ति प्रदान करे। — Pushkar Singh Dhami (@pushkardhami) October 31, 2021 చదవండి: ర్యాష్ డ్రైవింగ్.. అడ్డంగా ఉన్న కార్లన్ని ధ్వంసం.. అంతలో.. -
సింగర్‌గా ఎదగాలనుకున్నా! కానీ.. అదృష్టం ఆ రూపంలో తలుపుతట్టింది!
రంగుల ప్రపంచంలో.. ఎవరు ఏం కావాలన్నది పరిశ్రమే నిర్ణయిస్తుందంటారు. ఈ మాట సోనల్ పవార్ జీవితంలో అచ్చంగా నిజం.. గ్రేట్ సింగర్‌గా ఎదగాలనుకున్న ఆమెను.. బిజీ యాక్ట్రెస్‌గా మార్చింది ఇండస్ట్రీ. ప్రస్తుతం తనలో దాగిన నటనకు మెరుగులు దిద్దుతూ వరుస సీరియల్స్, సిరీస్‌తో దూసుకుపోతోంది.. సొంత ఊరు డెహ్రడూన్. చిన్నప్పుడే సింగర్ కావాలని ఫిక్స్ అయిపోయింది. స్కూల్లో ప్రేయర్ బెల్ కొట్టినా.. ఫ్రెండ్స్‌కు బోర్ కొట్టినా తన పాటే వినబడేది. పలు సంగీత పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తితో ప్రసిద్ధ రియాలిటీ షో ‘సరిగమప’ లోనూ పాల్గొంది. విజేతగా నిలవకపోయినా, వెంటనే ఓ సినిమాలో పాడే చాన్స్ కొట్టేసింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. అవకాశాల కోసం ఆమె ప్రయత్నమూ ఆగలేదు. షోలో వచ్చిన పాపులారిటీ నెమ్మది నెమ్మదిగా తగ్గి, సింగర్‌గా స్థిరపడకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లింది. ఒకరోజు తను పాడిన పాట.. టీవీలో రిపీట్ ఎపిసోడ్లో వినబడుతోంది. అప్పుడే ఆమె ఓ విషయాన్ని గమనించింది. అక్కడికి వచ్చిన అతిథుల్లో కొంతమంది నటీమణులు కూడా ఉండటం. వారికి సింగర్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. రిపీట్ ఎపిసోడ్ ఇచ్చిన ప్రేరణతో నటిగా మారింది. అదృష్టం ఆమె తలుపు తట్టినట్లు కొద్దిరోజుల్లోనే స్టార్ ప్లస్‌లో ప్రసారమమ్యే ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్లో అవకాశం లభించింది. సింగర్‌గా కాకపోయినా, నటిగా మంచి సక్సస్ సాధించింది. వెబ్ దునియాలోకి అడుగుపెట్టి ‘గందీ బాత్’, ‘మాయ–2’, ‘క్యాండీ’ సిరీస్‌లతో అలరిస్తోంది. చదవండి: పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది! -
ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామాను గవర్నర్ కార్యదర్శి బ్రిజేశ్‌కుమార్ సంత్ ధ్రువీకరించారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు సమాచారం. చదవండి: ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్.. మంత్రి అవంతి 1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టు 26వ తేదీన ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతనెలలో ఆమె గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. బేబీ రాణి గతంలో అనేక పదవులు చేపట్టారు. ఆగ్రా మేయర్‌గా పని చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సమాజ్ రత్న, ఉత్తరప్రదేశ్ రత్న, నారీ రత్న అవార్డులు పొందారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. నిద్రలోనే బూడిదైన ఖైదీలు -
ఆటో డ్రైవర్ కూతురు ఇంటర్లో అదరగొట్టింది
డెహ్రాడూన్ : చదువులో ప్రతిభ కనపర్చడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డుకాదని నిరూపించిందో యువతి. ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఐరమ్(18) అక్కడి పూల్‌చంద్ నారి శిల్ప బాలికల ఇంటర్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్ చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల చదువు దగ్గర ఏమాత్రం రాజీ పడలేదు. తండ్రి కష్టాన్ని వృధాకానీకుండా.. ఐరమ్ చదువు తన ఊపిరిగా చేసుకుంది. ఇష్టపడి చదివి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. అంతేకాదు బయాలజీలో 99 శాతం మార్కులు సాధించింది. దీనిపై ఐరమ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యురాలు కావాలన్నదే నా లక్ష్యం. నేనిప్పుడు నీట్‌కు సిద్ధం అవుతున్నాను. నేను డాక్టర్ అవ్వటం వల్ల మా ఇంటి ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేసిన నా ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉన్నాను. కోవిడ్ కారణంగా నాన్న సంపాదన బాగా తగ్గింది. నేను, మా అక్క ఇద్దరం ఒకే ఫోన్లో ఆన్లైన్ తరగతులు విన్నాం’’ అని పేర్కొంది. ఐరమ్ తండ్రి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘ నా పిల్లలకు మంచి విద్య అందించటానికి డెహ్రాడూన్ వచ్చాను. నాకొచ్చే అరకొర సంపాదనతో నా నలుగురు పిల్లలను చదివించటం సాధ్యపడలేదు. అందుకే పెద్ద బిడ్డను చదువు మాన్పించి నాకు సహాయంగా ఉండమని కోరాను. అయితే, లాక్డౌన్ కారణంగా ఉన్న పని కూడా పోయింది. లోన్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పించాను. వారందరూ చక్కగా డిగ్రీ చదువులు పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఐరమ్ ఇంటర్లో ప్రతిభ కనపర్చడం గర్వంగా ఉంది. నా పిల్లలెవరూ భవిష్యత్తులో ఆటో నడపరని భావిస్తున్నాను’’ అని అన్నాడు. -
చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్ధామ్ యాత్రను పాక్షికంగా తెరవాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. కోవిడ్ మహమ్మారి మధ్య యాత్ర నిర్వహించడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించి న్యాయవాదులు దుష్యంత్ మైనాలి, సచి్చదానంద్ దబ్రాల్, అను పంత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోవిడ్ మహమ్మారి మధ్య యాత్రికులు, పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అంతేగాక దేవాలయాలలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన, అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్లుగా ప్రభుత్వ వాదన ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా చార్ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ను తిరస్కరిస్తూ, అవి కుంభమేళా సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల నకలు కాపీ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎస్ఓపీలో హరిద్వార్ జిల్లాలో పోలీసుల మోహరింపు ప్రస్తావించారని, ఇది యాత్ర విషయంలో ప్రభుత్వం ఏమేరకు సీరియస్‌గా ఉందో చూపిస్తోందని కోర్టు తెలిపింది. చార్ధామ్ యాత్ర కుంభ్‌మేళా మాదిరిగా మరో ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్’గా మారకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దేవాలయాలతో ప్రజలకు ఉన్న మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘శాస్తాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనలను ప్రసారం చేసేందుకు టెలివిజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం కొంతమంది భావాలను పట్టించుకోకుండా, డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించడం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా, కరోనా రెండవ వేవ్ వేగం కాస్త మందగించడంతో చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల నివాసితుల కోసం పరిమితంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చదవండి: Auli Bugyal: మంచు తివాచీ.. రెండు కళ్లు చాలవు! Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! -
Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు
డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై శనివారం కుంభమేళా నిర్వహణ అధికారి సంజయ్ గుంజ్వాల్ వివరణ ఇచ్చారు. గంగానదిలో స్నానాలు చేసిన వారిని కోవిడ్-19 "సూపర్-స్ప్రెడర్" అని పిలవడం సరికాదన్నారు. హరిద్వార్‌లో జనవరి 1 నుంచి నిర్వహించిన 8.91 లక్షల ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కేవలం 1,954 (0.2 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కుంభమేళా డ్యూటీలో పాల్గొన్న 16,000 మంది పోలీసు సిబ్బందిలో కేవలం 88 (0.5శాతం) మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు. కుంభమేళా ప్రారంభం నుంచి ముగిసే వరకు హరిద్వార్ వ్యాప్తంగా కోవిడ్ డేటాను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఈ విషయాలు తెలిసినట్టు పేర్కొన్నారు. ‘సూపర్ స్ప్రెడర్’’ కుట్ర కుంభమేళాపై ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనే అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగినట్టు గుంజ్వాల్ మీడియాకు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నాటికి హరిద్వార్‌లో 144 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కుంభమేళా నిర్వహణ కాలం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 55.55 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..అందులో 17,333 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మార్చి నుంచే భక్తుల తాకిడి మొదలైందని, మహాశివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని మేళా ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. ఈ సంవత్సరం కుంభంమేళా నిర్వహణ కాలంలో భక్తులు మూడు సార్లు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సమయంలో 34.76 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఏప్రిల్ 12 (సోమావతి అమావాస్య)రోజున 21 లక్షల మంది, ఏప్రిల్ 14 (మేష్ సంక్రాంతి)నాడు 13.51 లక్షల మంది, ఏప్రిల్ 27( చైత్ర పూర్ణిమ) రోజున 25,104 మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు) -
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ!
మనకెంతో ఇష్టమైన రంగంలో మంచి స్థాయికి ఎదగాలని కలలు కంటాము. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలతో అనుకున్న దారిలో కాకుండా మరో దారిలో ప్రయాణిస్తూ.. జీవితాన్ని నెట్టుకొస్తుంటాం. ఈ జన్మకింతేలే అని సరిపెట్టుకునేవారు లేకపోలేదు. కానీ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన స్వాతీసింగ్ తనకిష్టమైన సంగీతాన్నీ నేర్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్నీ వదిలేసింది. శాకాంబరి కొట్నాల అనే మరో మహిళ మంచి లాభాలు వస్తోన్న బోటిక్‌ను మూసేసి సంగీతం నేర్చుకుని దాన్నే కెరీయర్గా మలుచుకున్నారు. తనలా సంగీతం అంటే ఎంతో ఇష్టముండే శాకాంబరితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలను కలుపుకుని స్వాతీసింగ్ ‘ఉమేనియా బ్యాండ్’ను ఏర్పాటు చేసి ఎంతో విజయవంతంగా నడుపుతున్నారు. ఈ బ్యాండ్‌లో ఓ 16 ఏళ్ల అమ్మాయికూడా ఉండడం విశేషం. సంగీతమంటే చెవికోసుకునే స్వాతీసింగ్‌కు.. 2007లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. తన అభిరుచి వేరుగా ఉండడం వల్ల టీచర్ ఉద్యోగానికి న్యాయం చేయలేను అని భావించి ఆరు నెలల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తరువాత తనకెంతో ఇష్టమైన సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే అందరూ అమ్మాయిలు ఉన్న ఒక మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ బ్యాండ్‌లో ఇన్స్ట్రుమెంట్స్ కూడా మహిళలే వాయించాలని ఆమె కోరిక. బ్యాండ్కోసం అమ్మాయిలను వెతికి 14 ఏళ్ల తరువాత.. 2016 మార్చి 8న శాకాంబరి కొట్నాల (44), శాకాంబరి కూతురు శ్రీవిద్య కొట్నాల (16), విజుల్ చౌదరీ(24)లతో కలిసి స్వాతీ సింగ్ ‘ఉమేనియా బ్యాండ్’ ను ఏర్పాటు చేశారు. తొలినాళ్లల్లో ఈ బ్యాండ్‌కు అంత ఆదరణ దొరకలేదు. క్రమంగా వీరి లైవ్ ఫెర్ఫార్మెన్స్ చూసేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ బ్యాండ్‌కు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. బ్యాండ్‌లో స్వాతీ సింగ్ ప్రధాన గాయకురాలేగాక మంచి గిటారిస్టు కూడాను. ఈ బ్యాండ్ ముఖ్యంగా క్లాసికల్, సూఫీ మ్యూజిక్‌తోపాటు బాలీవుడ్ సాంగ్స్‌ను పాడుతుంటుంది. ఇవేగాక బృందం స్వయంగా కంపోజ్ చేసిన సాంగ్స్‌తోపాటు, డౌరీ, మహిళా సాధికారత, స్త్రీలపై జరుగుతున్న దాడులపై సమాజాన్నీ జాగృతం చేసే గీతాలు కూడా ఆలపిస్తారు. శాకాంబరీ బోటిక్‌ను మూసేసి ఈ బ్యాండ్‌లో చేరడమేగాక.. తన కూతురు శ్రీవిద్యను కూడా బ్యాండ్‌లో చేర్చారు. శ్రీవిద్య ఎనిమిదో ఏట నుంచే డ్రమ్స్ వాయించడంలో శిక్షణ తీసుకుంది. 16 ఏళ్లున్న శ్రీవిద్య బ్యాండ్‌లో మంచి డ్రమ్మర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాండ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్లేగాక, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా పెర్ఫార్మెన్స్ వీడియోలతో వేలమంది ఫాలోవర్స్ మనుసులు దోచుకుంటుంది. వీరి ప్రతిభ ను గుర్తించిన రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి రేఖా ఆర్యా... కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటకు ఉమేనియా బ్యాండ్ మంచి ఉదాహరణగా నిలస్తోందని మెచ్చుకున్నారు. -
మీది లవ్ బ్రేకపా? అయితే ఇక్కడకు వెళ్లండి
డెహ్రాడూన్: నలుగురూ బాగుండాలి, అందులో నేనుండాలి... అనుకున్నాడు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి. అందుకే పగిలిన హృదయాలను అతికించలేకపోయినా కనీసం వారి మనసుకు స్వాంతన చేకూర్చాలనుకున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయండి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రాకు 21 ఏళ్లుంటాయి. అతడు ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. కానీ లాక్డౌన్లో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి ఈ ప్రేమజంటను విడదీశారు. నెచ్చెలి దూరం కావడంతో కుంగిపోయాడు. హైస్కూల్ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని హఠాత్తుగా మర్చిపోలేక నరకం అనుభవించాడు. ఆరు నెలలు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. పబ్జీకి బానిసగా మారాడు. ఈ మనోవేదనలోనే కొట్టుమిట్టాడుతున్న అతడికి హఠాత్తుగా ఓ రోజు ఇలా ఎంకెంతకాలం ఆమెను గుర్తు చేసుకుంటూ పిచ్చివాన్నైపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆమె జ్ఞాపకాలకు తాళం వేసి ఓ కెఫేను ప్రారంభించాడు. దానికి దిల్ తుట ఆషికి-చాయ్‌వాలా అన్న పేరును ఖరారు చేశాడు. ఇక్కడ లవ్‌లో ఫెయిలయిన వాళ్లు వారి బాధను మనసారా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిది బ్రేకప్ అయిన ఎంతోమందికి ఆశాదీపంగా కనిపిస్తోంది. (చదవండి: ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?) ఈ కెఫే గురించి దివ్యాన్షు మాట్లాడుతూ.. "నాలానే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. వాళ్ల మనసులోని బాధనంతా కక్కేస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రేకప్ అయినవాళ్లను నా కెఫెకు వచ్చి వాళ్ల కథలను చెప్పమంటాను. అలా వారి భారాన్ని ఇక్కడే దించేసుకుని జీవితంలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కెఫే ఐడియా విని దివ్యాన్షు తండ్రి కోప్పడ్డాడట. దీని గురించి అతడు మాట్లాడుతూ... "ఒక అమ్మాయి కోసం నేను పిచ్చోడిలా అయిపోయాను. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నప్పుడు అమ్మ నాకు సపోర్ట్ చేసింది. కానీ కెఫే పేరు చెప్పగానే నాన్న ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు నాన్న స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కెఫె గురించి, దాని ప్రాముఖ్యతను గూర్చి మెచ్చుకున్నాడు. అప్పుడు కానీ మా నాన్న నేనో మంచి పని చేస్తున్నానని అంగీకరించలేకపోయాడు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో కూడా ఈ కెఫెను ప్రారంభించాలనుకుంటున్నాడు. (చదవండి: బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!) -
డెహరాడూన్లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్‌తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ర్టిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేది సింఘ్ రావత్ శుక్రవారం ఈ బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్ మాట్లాడుతూ “ఈ సంవత్సరంలో 30 ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ బస్సులు డెహరాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ కొండ ప్రాంతాల్లో కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తాయని" తెలిపారు. (చదవండి: కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) తొమ్మిది మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ఉంటుంది. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్‌ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.(చదవండి: లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే ముంబాయి, పూణె, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళలో తాము అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ ప్రామాణికతను సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఒలెక్ట్రా కంపనీ ఇప్పటికే వివిద రాష్ట్రాలలో 280 బస్సులను సరఫరా చేసింది. దేశ రహదారులపై పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 2 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. CO2 ఉద్గారాలను 13000 టన్నుల మేరకు తగ్గించింది. ఇది లక్ష చెట్లు నాటాడానికి సమానం. మనాలి నుండి రోహ్తాంగ్ పాస్ వరకు ఎత్తైన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదయింది. ఎలక్ర్టిక్ బస్సు నిర్మాణ రంగంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అలాగే FAME-II లో భాగంగా మంజూరు చేసిన 5595 బస్సుల్లో 20 శాతం మేరకు ఒప్పందాలను సాధించింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపాణి రేపు (శనివారం) ఒలెక్ట్రా ఎలక్ర్టిక్ బస్సుల ట్రయల్ రన్ కు సూరత్ లో ప్రారంభించనున్నారు. సూరత్ మునిసిపల్ కార్పోరేషన్ కు ఒలెక్ట్రా కంపనీ 150 ఎలక్ర్టిక్ బస్సులను దశల వారీగా సరఫరా చేయనుంది. అలాగే సిల్వాసా కు కూడా 25 ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తుంది. వీటి ట్రయల్ రన్ వచ్చే వారం చేయబోతున్నారు. ఫేమ్-II లో భాగంగా వివిధ రాష్ట్రాలకు 775 ఎలక్ర్టిక్ బస్సులను ఒలెక్ట్రా దశల వారీగా అందించనుంది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో స్థాపించబడింది. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపనీ. 2015లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ కావడం విశేషం. -
సెల్ఫీ పిచ్చి.. యువకుడి మృతి
కోల్‌కతా: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తూ.. నదిలో కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటన డెహ్రడూన్‌లోని సాంగ్ నది వద్ద జరగింది. వివరాలు.. నగరంలోని క్లెమెంట్ టౌన్లో నివాసం ఉండే శుభం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వినాయకుడి నిమజ్జనం సందర్భంగా సాంగ్ నది వద్ద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన దళం సాయంతో రెండు గంటల అన్వేషణ తర్వాత శుభం మృతదేహాన్ని వెలికి తీశారు. -
నుదురులోకి చొచ్చుకెళ్లిన తాళం చెవి
డెహ్రాడూన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలిగిస్తారు. కానీ, ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ఓ వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించారు. బైక్ తాళం చెవిని అతని మొహంపై పెట్టి బలంగా నెట్టేశారు. దీంతో ఆ కీ అతని నుదురులోకి చొచ్చుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్‌లోని ఈ ఘటన జరిగింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ముగ్గురు ట్రాఫిక్ సిబ్బందిని పై అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, వాహనదారుడిపై పోలీసుల దాడి విషయం బయటపడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ కుమార్ జోక్యంతో పరిస్థితులు చక్కబడ్డాయి. స్థానికులు నిరసన విరమించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ వాహనదారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
ఉత్తరాఖండ్‌లో వరదలు: ముగ్గురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్ జిల్లాలోని మడ్‌కట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని గాలిస్తున్నామని ఆయన తెలిపారు. #cloudburst in Uttarakhand's Tanga Village in #Pithoragarh , reports suggest 3 people burried under debris and 11 people yet to be traced. pic.twitter.com/9OLWxa2aro — Utkarsh Singh (@utkarshs88) July 20, 2020 -
భారీ వర్షాలకు భవనం కూలి ముగ్గురు మృతి
డెహ్రాడూన్: భారీ వర్షాలకు ఓ భవనం కూలి ముగ్గురు మృతచెందిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చుక్కువాలా ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 37 ఏళ్ల గర్భిణీ మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటన స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. #UPDATE NDRF team rushed to building collapse site at Chhukhuwala, Dehradun & did search & rescue operation with local SDRF. 3 rescued alive and 3 dead bodies retrieved. Operation on: Satya Pradhan, Director General of NDRF (National Disaster Response Force). #Uttarakhand https://t.co/cM8AqvVYYX pic.twitter.com/u4VAMsRPnj — ANI (@ANI) July 15, 2020 -
డెహ్రాడూన్‌లో 48 గంటల లాక్డౌన్
డెహ్రాడూన్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 48 గంటల లాక్డౌన్ విధిస్తున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ శ్వేతా చౌబే శనివారం ప్రకటించారు. ఈరోజు నాయంత్రం నుంచి సోమవారం 7 గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తామని తెలిపారు. నిత్యవసర వస్తువులు మినహా మిగతా దుకాణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు లాక్డౌన్ ఎత్తివేస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,177 ఉండగా, ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 14, 516 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (భారత్: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు ) -
పసి బాలుడిపై వార్డెన్ లైంగిక దాడి
డెహ్రాడూన్ : లాక్డౌన్ కారణంగా స్కూల్ హాస్టల్లో ఒంటరిగా చిక్కుకుపోయిన తొమ్మిదేళ్ల బాలుడిపై వార్డెన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పసి బాలుడని చూడకుండా తన వ్యక్తిగత పనులు చేయిస్తూ ప్రతి రోజు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఓ ప్రేవేటు పాఠశాలలో గత నెలలో ఈ ఘోరం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవల డెహ్రాడూన్‌కు వచ్చారు. కానీ విద్యార్థిని అప్పగించేందుకు తొలుత స్కూలు యాజమాన్యం ఒప్పకోలేదు. అనుమానం వచ్చి తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గత్యంతరం లేక బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికెళ్లిన బాలుడు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించారు. తనతో వ్యక్తిగత పనులను చేయించుకుంటూ లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పాడు.దీంతో బాలుడు తల్లిదండ్రులు శనివారం రోజు హరీశ్(30) అనే వార్డెన్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పొక్సో చట్టంతో పాటూ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందిడుని అరెస్ట్ చేశారు. -
గంగా నీళ్లు శుభ్రంగా తాగొచ్చు..
డెహ్రాడూన్: కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్‌డౌన్‌తో పలు నదుల్లోని నీటి కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. దేశంలోనే పెద్ద నదిగా గుర్తింపు పొందిన గంగానదిలోని నీరు తేటగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న గంగా నదిలోకి వెళ్లి కలవటం వల్ల తీవ్ర కాలుష్యానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగా నదిలోని కాలుష్యాన్ని తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. ఇక లాక్‌డౌన్‌తో హరిద్వార్, రిషికేశ్‌లో ప్రవహించే గంగనది నీరు మునుపెన్నడు లేని విధంగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడతాయని ఉత్తరాఖాండ్ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇలా గంగానది నీరు తాగే విధంగా కాలుష్యం తగ్గటం 2000వ సంవత్సరంలో ఉత్తారఖాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అని పేర్కొంది. (లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత) నాణ్యతను బట్టి గంగానది నీరు రెండు వర్గాలుగా విభజించబడింది. మొదటిది నీటిని వడపోసిన తర్వాత తాగడానికి ఉపయోగించడం. మరోకటి తాగకుండా కేవలం స్నానానికి వినియోగించటం. కాగా హరిద్వార్‌లోని హర్ కి పౌరి ప్రాంతంలో ప్రవహించే గంగానది మొదటి వర్గంగా మార్పు చెందింది. ప్రస్తుతం ఈ నీటిని వడపోసిన తర్వాత తాగడానికి వీలుంటుందని శాస్తవేత్తలు తెలిపారు. ఇక గంగానదిలోని ఆక్సిజన్ స్థాయి కూడా పెరిగిందని బయోలాజిక్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) పేర్కొంది. సాధారణంగా గంగానదిలో 80 శాతం ధూళి, మురుగు నీరు, కాలుష్యం ఉండగా.. లాక్‌డౌన్‌తో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంగా నదితోపాటు యమునా నదిలోని నీటి నాణ్యత కూడా మెరుగుపడిందన్నారు. -
‘అది ఏం చేయదు.. వెళ్లిపో’
డెహ్రాడూన్: నగర శివారులో ఖాళీగా ఉన్న రోడ్డుపైకి షీకారుకు వచ్చిన ఓ ఏనుగును చూసి వాహనదారుడు బెంబెలేత్తి పారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా తాజాగా ట్విటర్లో షేర్ చేశారు. ‘అది ఏం చేయదు.. నీ దారిన నువ్వు వెళ్లిపో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసిన ఈ వీడియోలో.. పొద్దున్నే పాలు అమ్మేందుకు వెళ్తున్న ఓ వ్యక్తికి ఏనుగు ఎదురుపడింది. దాన్ని చూసి కంగుతిన్న ఆ వాహనదారుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతన్ని చూసిన ఏనుగు కూడా కాస్తా ఆగి అతన్ని గమనించింది. (కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ) ‘Kuch nahin karega yaar, Sidha chaal ra he’😊😊 The person saying this at the end should face elephant head on once to become an expert & air his commentary.... Be careful as Vaibhav @VaibhavSinghIFS says. Human elephant interface can be scary. Don’t assume things🙏 https://t.co/rFu3ukOVMc — Susanta Nanda IFS (@susantananda3) April 3, 2020 ఇక వెంటనే ఏనుగు అతని వైపుకు నడవడం మొదలు పెట్టగానే ఆ వ్యక్తి తన బండిని కింద పడేసి పరిగెత్తి జాగ్రత్త పడ్డాడు. అయితే అదే సమయంలో ఈ సంఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ‘‘అది ఏం చేయదు... నీ దారిన నువ్వు వెళ్లిపో’’ అంటూ అరుస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి మాటలకు సుశాంత్ నందా స్పందిస్తూ ‘ఏనుగును ఎదుర్కొవాలంటే ధైర్యం కావాలి. నిపుణత కలిగిన వారు మాత్రమే దానిని ఎదుర్కొగలరు. మనిషి, ఏనుగు ఎదురుపడినప్పుడు అది భయానక ఘటనగానైనా మారవచ్చు. కానీ ఏదేమైనా ఆ వాహనదారుడిలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు. -
కూతురు ముచ్చట తీర్చిన ధోని
-
కూతురు ముచ్చట తీర్చిన ధోని
డెహ్రాడూన్ : టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని మంచు కొండల్లో కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. అటు క్రికెట్‌కు ఇటు కుటుంబంతో గడపడానికి సమ ప్రాధాన్యమిచ్చే ధోని.. తాజాగా డెహ్రాడూన్ యాత్రకు వెళ్లాడు. తన అద్భుతమైన ఆటతోనే కాకుండా.. కూతురు చిన్నారి జీవాతో ఆడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరిస్తుంటాడు ధోని. ఇక డెహ్రాడూన్‌లో.. కూతురు జీవా మంచు మనిషిని రూపొందిస్తుండగా.. ఆమెకు సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోని అభిమానుల గ్రూప్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం ధోని ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధంపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ధోని సూపర్ డాడ్’ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. -
ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా ఉండాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈనెల 18న డెహ్రడూన్‌లో జరిగిన చట్టసభల సభాపతుల సదస్సుకు హాజరైన ఆయన ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘సభాపతుల సదస్సులో నేను, పలు రాష్ట్రాల సభాపతులు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని ప్రస్తావించాం. ఈ చట్టంలో ఉన్న అస్పష్టతలు, లోపాల కారణంగా ఇప్పటికీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గత శాసనసభ కాలంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించినా అప్పటి సభాపతి దానిపై ఐదేళ్లూ నిర్ణయం తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితిని తెచ్చింది. శాసనసభ గడువు తీరేలోపు కూడా సంబంధిత పిటిషన్లను పరిష్కరించకపోవడంతో వాటికి కాలం చెల్లిన పరిస్థితి దాపురించింది. ఈ విషయాలన్నీ సదస్సులో వివరించాను. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరాలనుకునే చట్టసభ సభ్యుడు కచ్చితంగా పదవికి రాజీనామా చేసే పార్టీ మారాల్సిన పరిస్థితి రావాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పాన్ని కూడా వివరించాను. రాజకీయాల్లో ఇదొక గొప్ప ముందడుగంటూ పలువురు సభాపతులు దీనిని స్వాగతించారు’ అని వివరించారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం ‘సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్న నిబంధనలో కూడా స్పష్టత లేకపోవడం వల్ల శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం తలెత్తుతోంది. ఫిరాయింపుల చట్టంలో ఉన్న విలీన నిబంధనను ఉపయోగించి పార్టీ మారుతున్నారు. దీనిపైనా సదస్సులో చర్చ జరిగింది. ఫిరాయింపులపై వివిధ రాష్ట్రాల్లో ఎదురైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా కేంద్రానికి సిఫారసులు చేస్తారు’ అని స్పీకర్ చెప్పారు. -
పార్టీ ఫిరాయింపుల నిరోధానికి చర్యలు తీసుకోవాలి
-
‘ఫిరాయింపు’ చట్టంలో లోపాలను సరిచేయాలి
సాక్షి, అమరావతి: ‘‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సాకుగా తీసుకుని ఈ చట్టం అమలులోకి వచ్చిన 25 ఏళ్ల తరువాత కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఇలా పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించేందుకు వీలుగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత చట్టసభల అధ్యక్షుల(ప్రిసైడింగ్ అధికారుల) సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ‘ఫిరాయింపుల నిరోధక చట్టం–సంస్కరణల ఆవశ్యకత’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. చట్టంలోని లోపాలను తొలగించకపోతే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఆయన ఉదహరిస్తూ.. రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేవిగా ఇవి ఉన్నాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా అప్పటి సభాపతి వాటిని పట్టించుకోకపోవడం రాజ్యాంగ సూత్రాలను నిర్లక్ష్యం చేయడమేనన్నారు. జగన్ నిర్ణయానికి అన్ని పార్టీలూ మద్దతు తెలపాలి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పార్టీలోకి ఇతర పక్షాలకు చెందిన ఏ సభ్యుడిని అనుమతించబోనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విలువలతో కూడుకున్న నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని తమ్మినేని కోరారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా ఇన్ని రోజుల వ్యవధి లోపల పరిష్కరించి తీరాలన్న నిబంధనను చట్టంలో చేర్చాలని సూచించారు. ‘స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం’ అన్న అంశానికి కచ్చితమైన నిర్వచనాన్ని కూడా చట్టంలో పొందుపర్చాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ‘విలీన’ నిబంధనను కూడా స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. సభాపతులు సరైన న్యాయబద్ధమైన నిర్ణయాలను తీసుకోక పోవడం వల్లే స్పీకర్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. 18, 19 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో చట్టసభల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. -
భావితరాలకు తప్పుడు సంకేతాలు : స్పీకర్ తమ్మినేని
సాక్షి : పార్టీ ఫిరాయింపుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే భావితరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన వాళ్లమవుతామని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. గురువారం డెహ్రాడూన్‌లో జరిగిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులను కూడా ఇచ్చిందని వెల్లడించారు. ఇలాంటి అవకాశం ఉండడం మంచిది కాదని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలను పాటించి ఆదర్శవంతంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. షెడ్యూల్ 10 లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ట పరిచి పార్టీ మారితే చర్యలు తీసుకునేలా ఉండాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. -
నా భార్య ఇంట్లో లేదు.. వచ్చి వంట చేయి!
డెహ్రాడూన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. హాస్టల్ విద్యార్ధినికి అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపుతూ.. వేధింపులకు గురిచేశాడు. విద్యార్ధిని పట్ల పిచ్చి వేషాలు వేసిన ఆ ప్రొఫెసర్‌కు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో దెబ్బకు దిమ్మతిరిగింది. ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోని మహిళల హాస్టల్ వార్డెన్ అదే యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హస్టల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్ అర్ధరాత్రి ఫోన్ చేసి ‘ప్రస్తుతం నా భార్య ఇంట్లో లేదు. నువ్వు వచ్చి వంట చేయి’ అని పిలిచాడు. అయితే అప్పటికే ప్రొఫెసర్ పలుమార్లు ఫోన్లు, మెసేజ్‌లు చేయడంతో విసిగిపోయిన విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయిన సదరు విద్యార్థి విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తింది. దీనికితోడు ప్రొఫెసర్ నుంచి వచ్చిన సందేశాలను ఆధారాలుగా చూపించింది. ఈ వ్యవహారం కాస్తా గవర్నర్ బేబీ రాణి మౌర్య దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై స్పందించిన గవర్నర్ గురువారం ప్రొఫెసర్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఇంత వరకు సమస్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయితే విద్యార్ధి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వనందున నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని యూనివర్సిటీ డీన్ సలీల్ తివారి తెలిపారు. అనంతరం ఈ విషయంపై వెంటనే దర్యాప్తు జరపాలని, వార్డెన్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాలికల హాస్టళ్ల నిర్వహణపై గవర్నర్ నివేదిక కోరారు. హస్టల్లోని అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్పిటీ రిజిస్టార్ శర్మ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామన్నారు. కాగా తాజా ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులనే వేధింపులకు గురిచేస్తున్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో...
డెహ్రాడూన్ : భారత వైమానిక దళం మరోసారి సత్తా చాటింది. కేదార్నాథ్ సమీపంలో కూలిపోయిన ఓ పౌర విమానాన్ని కాపాడటంలో విజయవంతమైంది. ఈ నెల 26న ఎమ్ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వివరాలు.. కొద్ది రోజుల క్రితం యుటి ఎయిర్ ప్రైవేటు విమానం కేదార్నాథ్ దేవాలయం సమీపంలో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్ వద్ద కూలిపోయింది. దీంతో ఆ విమానాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాల్సిందిగా సదరు సంస్థ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా భారత వైమానిక దళాన్ని కోరింది. అంతేగాక దేవాలయం మూసివేయకముందే వాటిని బయటకు తీయాలని విఙ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం రంగంలోకి దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్లు.. సదరు విమానాన్ని ఘటనా ప్రాంతం నుంచి తరలించాయి. వీటిలో ఒకటి కూలిన విమానాన్ని పైకి తీయడానికి ప్రయత్నించగా, మరొకటి దానికి సహాయాన్ని అందించింది. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టి, అనంతరం దానిని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి చేర్చారు. కేదార్నాథ్ ప్రాంతంలో ఇరుకైన లోయలు, కేవలం ఫుట్ ట్రాక్ కనెక్టివిటీ మాత్రమే ఉన్నందున విమానాన్ని వేరే ప్రాంతానకి తరలించడం ఓ సవాలుగా మారిందని, అయితే ఐఏఎఫ్ దీనిని విజయవంతంగా పూర్తి చేసిందని... ఇది ఐఏఎఫ్ నైపుణ్యతకు నిదర్శమని భారత వైమానికి దళ ప్రతినిధి పేర్కొన్నారు. #WATCH On 26 October, Mi 17 V5 helicopters of Indian Air Force evacuated a crashed aircraft of UT Air Pvt limited at 11500 feet at Kedarnath helipad. The helicopter was flown to Sahastradhara near Dehradun #Uttarakhand pic.twitter.com/fgoOxKIMSr — ANI (@ANI) October 27, 2019 -
బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..
డెహ్రాడూన్ : తన బంధువులకు పరిచయం చేస్తానని చెప్పి ఓ మహిళను లోయలో తోసిన ఘటన ఆదివారం ఉత్తరాఖండ్‌లోని పాటూరి జిల్లాలో చేటు చేసుకుంది. కాగా ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మహిళను 108 సిబ్బంది, అక్కడి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరేంద్ర పత్వాల్ అనే వ్యక్తి భాదితురాలితో కలిసి రెండేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అద్వానీ గ్రామంలో ఉంటున్న తన బంధువులకు పరిచయం చేస్తానని చెప్పి ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయలుదేరారు. అద్వానీ గ్రామ శివారుకు రాగానే వారిద్దరు ట్యాక్సి దిగి నడుచుకుంటూ వెళ్తుండగా బీరేంద్ర పత్వాల్ సదరు మహిళను పక్కనే ఉన్న లోయలోకి నెట్టేసి అక్కడినుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం లోయ నుంచి కేకలు వినిపించడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వీలైనంత తొందరగా నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
మద్యం మత్తులో ఎమ్మెల్యే హల్చల్
-
మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్ చల్
డెహ్రాడూన్ : మద్యం మత్తులో ఓ బహిష్కృత ఎమ్మెల్యే హల్చల్ చేశారు. మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు తుపాకులను చేతపట్టుకుని చిందులు వేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్ ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పురాలేదు. కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. కాలు ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆయన మద్దతు దారులతో కలిసి చిందులు వేశారు. మద్యం తాగుతూ.. గన్నులను నోట్లో పెట్టుకుంటూ బాలీవుడ్ పాట‘‘ ముజ్కో రాణాజీ మాఫ్ కర్నా’’కు డ్యాన్స్ వేశారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలై పోలీసు అధికారుల దృష్టిలో పడింది. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఈ సంఘటనపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఆయుధాలకు లైసెన్స్ ఉందో లేదో తేల్చి, ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
హరిద్వార్ : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. డెహ్రాడూన్‌లోని నలపాని ప్రాంతంలో నాలుగేళ్ల బాలికపై 11 సంవత్సరాల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు నివసించే ప్రాంతంలోనే ఉండే నిందితుడు మంగళవారం సాయంత్రం ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. బాలికను మభ్యపెట్టి తన ఇంటికి తీసుకువెళ్లిన నిందితుడు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడగా, పని నుంచి ఇంటికి రాగానే తన తల్లికి జరిగిన విషయం వెల్లడించింది. ఇక మరుసటి రోజు ఉదయం బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని డెహ్రాడూన్ ఎస్పీ శ్వేతా చౌబే వెల్లడించారు. బాలికపై వైద్య పరీక్షలు నిర్వహించామని నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. -
పైప్‌కు కట్టేసి.. దారుణంగా హింసించి
డెహ్రడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నేపంతో సీనియర్లు ఓ విద్యార్థిని కొట్టి చంపారనే వార్త డెహ్రడూన్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు సదరు విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే ఖననం చేసింది. స్థానిక మీడియా ప్రోద్బలంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకెళ్తుండగా బాధితుడు దగ్గర్లోని కిరాణ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఉపాధ్యాయులకు తెలిపాడు. దాంతో ఔటింగ్ క్యాన్సల్ అయ్యింది. బాధితుడి వల్లే ఇలా జరిగిందని భావించిన సీనియర్ విద్యార్థులు అతన్ని ఒక క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాధితుడి కాళ్లు చేతులను ఓ పైప్‌కి కట్టి బ్యాట్, స్టంప్స్ తీసుకోని విపరీతంగా కొట్టారు. అంతేకాక సదరు విద్యార్థి బట్టలు తొలగించి చల్లని నీటిలో ముంచారు. అంతటితో ఊరుకోక కుర్కురే చిప్స్‌ని, బిస్కెట్లని టాయిలెట్ వాటర్‌లో ముంచి తినమని బలవంతం చేశారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సదరు విద్యార్థి చేసిన ఆక్రందనలు పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులు కానీ.. ఉపాధ్యాయులు కానీ వినిపించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సదరు విద్యార్థి ఒంటరిగా అదే గదిలో పడి ఉన్నాడు. సాయంకాలం వార్డెన్ ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదం అని భావించిన పాఠశాల యాజమాన్యం సదరు బాలుడి మృతదేహాన్ని పాఠశాలలోనే ఖననం చేసింది. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫుడ్ పాయిజన్ వల్ల మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు. కానీ స్థానిక మీడియా విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం.. యాజమాన్యం కూడా బయటి వారిని లోపలికి అనుమతించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వారు పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బందిని, వార్డెన్ని కూడా అరెస్ట్ చేశారు. -
దారుణం.. బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని
డెహ్రాడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నెపంతో తోటి విద్యార్థిపై దాడి చేసి చంపేశారు సీనియర్ విద్యార్థులు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యాజమాన్యం చనిపోయిన బాలుని మృతదేహాన్ని ఖననం చేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అదే సమయంలో వాసు యాదవ్(12) అనే బాలుడు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఆరోపించాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు. దాంతో విద్యార్థులు ఎవరూ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఔటింగ్ క్యాన్సిల్ కావడంతో వాసు యాదవ్ మీద సీనియర్ విద్యార్థులు కోపం పెంచుకున్నారు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో వాసు యాదవ్‌ను చావబాదారు. ఆ తర్వాత అతడిని చిత్రహింసలు పెట్టి శరీరం మీద చన్నీళ్లు పోశారు. అంతే కాదు, అతడిని కొన్ని గంటల పాటు క్లాస్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని వార్డెన్ గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వాసును ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం బయటకు పొక్కితే పాఠశాలకే ప్రమాదం అని భావించిన యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా వాసు మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ ఈ వార్త బయటకు రావడంతో సమాచారం రాబట్టేందుకు లోకల్ మీడియా ప్రయత్నించింది. కానీ పాఠశాల యాజమాన్యం వారిని పాఠశాల లోనికి అనుమతించలేదు. చివరకు ఈ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికలో రావడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విచారణ చేశారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. తీవ్రంగా గాపడిన వాసును సకాలంలో ఆస్పత్రికి తరలించలేదు. అంతేకాక వాసు చనిపోయినట్లు అతని తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేద’ని తెలిపారు. -
బిక్కుబిక్కుమంటున్న కశ్మీర్ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టు దాడికి ప్రతీకారంగా కశ్మీర్ వీధులు తగులబడి పోతుంటే మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, హర్యానాలోని అంబాలా, రాజస్థాన్‌లోని జైపూర్, బీహార్‌లోని పట్నా నగరాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా కళాశాలలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ దాడులు నేటికి కొనసాగుతున్నాయి. కశ్మీరు విద్యార్థులకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు దాడులకు భయపడి వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల కశ్మీరు విద్యార్థుల సామాన్లను బయటపడేసి నిర్దాక్షిణ్యంగా తలుపులు వేసుకుంటున్నారు. కొంత మంది మానవతావాదులు మాత్రం కశ్మీర్ విద్యార్థులున్న రూములకు బయట నుంచి తాళాలు వేసి తమ ఇంట్లో కశ్మీరీ విద్యార్థులు లేరంటూ వారిని రక్షించేందకు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆపదలో ఉన్న విద్యార్థుల గురించి ‘జమ్మూ, కశ్మీరు విద్యార్థి సంఘం’ రంగప్రవేశం చేసి వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీలైనన్ని చోట్ల రూములను అద్దెకు తీసుకొని రోడ్డున పడ్డ విద్యార్థులకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తోంది. గత రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు తప్ప ఎలాంటి ఆహారం లేకుండా చీకటి గదుల్లో తలదాచుకున్నామంటూ కొంత మంది విద్యార్థులు తమ గాధలను మీడియాకు వివరిస్తుంటే, ఇలాంటి కష్టాలు తమకు కొత్త కాదని, మున్ముందు తమ చదువులు కొనసాగుతాయా, లేదా ? భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలు వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని అల్పైన్ కళాశాలలో రసాయన శాస్త్రంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంతియాజ్ అహ్మద్ మీర్, మరో 29 మంది విద్యార్థులు దాడులకు భయపడి చండీగఢ్ చేరుకున్నారు. అక్కడ వారికి కశ్మీర్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందారు. ఢిల్లీలోని మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జావెద్ అక్తర్ స్వగ్రామమైన కుప్పారలోని లోలబ్కు తిరిగి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. ఆయన కూడా ప్రస్తుతం చండీగఢ్ శిబిరంలో ఆశ్రయం తీసుకున్నారు. కత్తులు, కర్రల ధరించి దాదాపు 40 మంది తమ కాలేజీ వద్దకు వచ్చి తమను బెదిరించారని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కళాశాలల్లోగానీ, నగరంలోగానీ ఒక్క కశ్మీరీ కూడా ఉండరాదంటూ హెచ్చరికలు చేశారని మీర్ తెలిపారు. చండీగఢ్‌లో తాము ప్రస్తుతం నాలుగు ఫ్లాట్స్ తీసుకున్నామని, వాటిలో 20 రూములు ఉన్నాయని, వంద మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉందని, అయితే మధ్యలో చిక్కుబడి చండీగఢ్‌కు చేరుకున్న కశ్మీర్ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఉన్నారని ఆశ్రయానికి ఇంచార్జిగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి ఖవాజా ఇత్రత్ తెలిపారు. తమ ఆశ్రయానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది డెహ్రాడూన్ నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పారు. అంబాలాలోని మహారుషి మార్కండేశ్వర్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ హాస్టల్లో తలదాచుకొని కశ్మీర్ విద్యార్థి సంఘం సందేశం మేరకు చండీగఢ్ చేరుకున్నానని చెప్పారు. తన తోటి విద్యార్థులే ఓ కశ్మీరి విద్యార్థిని పట్టుకొని కొడుతుంటే భయపడి పోయి వచ్చానని చెప్పారు. ఆ విద్యార్థి తన పేరును బహిర్గం చేయడానికి కూడా నిరాకరించారు. చండీగఢ్‌లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థుల్లో సోబియా సిడికో అనే 19 ఏళ్ల మహిళ ఒక్కరే ఉన్నారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన ఆమె డెహ్రాడూన్‌లోని ‘కంబైన్డ్ పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్’ మూడో సంవత్సరం చదువుతున్నారు. తాను ఓ హిందు కుటుంబంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నానని, శుక్ర, శనివారం రెండు రోజుల పాటు తనను ఇంటి యజమాని ఓ రూములో దాచి బయటి నుంచి తాళం వేసిందని చెప్పారు. శనివారం నాడు మూడు గంటల ప్రాంతంలో ఓ హిందూ సంఘానికి చెందిన కార్యకర్తలు తానుంటున్న ఇంటికి వచ్చి యజమానిని బెదిరించారని, తమ ఇంట్లో కశ్మీరి విద్యార్ధులెవరూ లేరని యజమాని చెప్పారని, ఇంతలో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారని తెలిపారు. డెహ్రాడూన్‌లోని విద్యార్థినుల హాస్టల్ నుంచి గత మూడు రోజులుగా ఎవరూ బయటకు రావడం లేదు. -
తండ్రి మృతదేహనికి కడసారి సెల్యూట్..
-
రమ్మని.. రావద్దని
డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన ఈ తొంభై ఏళ్ల రచయిత్రి.. గడప బయటి నుంచి బయటికే లిటరరీ ఇన్విటేషన్‌ని కూడా వాపస్ చేసి ఉండవలసింది. మాధవ్ శింగరాజు నయన్‌తార సెహగల్ ‘పాత నేరస్తురాలు’. అయితే ముఖ్య అతిథిగా ఆమెకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకునేందుకు ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన’ నిర్వహణ కమిటీ చెప్పిన కారణం పూర్తిగా వేరు. మరాఠీ సమ్మేళనానికి ఒక ఆంగ్ల భాషా రచయిత్రిని పిలవడం ఏమిటన్న అభ్యంతరాలు రావడంతో ఆహ్వానాన్ని రద్దు చేసినట్లు సమ్మేళనం వర్కింగ్ ప్రెసిడెంట్ రమాకాంత్ కోల్టే సంజాయిషీ ఇచ్చారు. రాజ్‌థాకరే కూడా అపాలజీ చెప్పారు. ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి’ అధినేత ఆయన. అయితే రాజ్‌థాకరే అపాలజీ చెప్పింది నయన్‌తార కు కాదు. సమ్మేళన నిర్వాహకులకు! ‘‘నయన్‌తారను ముఖ్య అతిథిగా పిలిచి, ఆమె చేత సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభింపజేయడాన్ని మావాళ్లు వ్యతిరేకించారు. అనవసరమైన వివాదాలను తప్పించడం కోసం.. మీ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న మావాళ్ల అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకురాక తప్పడం లేదు’’ అని ఆయన మృదువైన భాషలో వివరణ ఇచ్చారు. వాస్తవానికి సంజాయిషీ గానీ, వివరణగానీ ఇవ్వనవసరం లేనంత నిర్ణయాధికారం కలిగివున్న వాళ్లు కోల్టే, రాజ్‌థాకరే. అయినా ఇచ్చారు. మొదట నయన్‌తారను పిలవడమే తప్పు. పిలిచి, రావద్దనడం రెండో తప్పు. పిలుస్తున్నప్పుడు వాళ్లకు తప్పు అని తెలియదు. ముఖ్య అతిథిగా ఆమె ఏం మాట్లాడబోతున్నారో తెలిశాక తప్పు చేశామని వారికి అర్థమయింది. నియమం ప్రకారం సమ్మేళనంలో ప్రసంగించబోయేవారు తమ ప్రసంగ పత్రాలను మూడు రోజుల ముందుగానే కమిటీకి సమర్పించవలసి ఉంటుంది. నయన్‌తార అలా సమర్పించినప్పుడు మరాఠీలోకి తర్జుమా అయిన ఆమె ప్రసంగాన్ని చదివి, నిర్వాహకులు చేష్టలుడిగిపోయారు. మరాఠీ సాహితీ సమ్మేళనంలో ఆమె మోదీని విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు ప్రసంగ పాఠంలో బహిర్గతం అయింది. మహారాష్ట్రలోని యవత్మల్లో ఈ నెల 11న మొదలౌతున్న మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరవుతున్నారు. డయాస్ మీద ఆయన ఆ పక్కన కూర్చొని ఉంటే, నయన్‌తార ఈ పక్కన నిలబడి మోదీని, హిందుత్వను విమర్శిస్తూ మాట్లాడితే ఇబ్బంది ఫడ్నవిస్‌కే. పైగా నయన్‌తార మీద ‘పాత కేసులు’ చాలానే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న హిందుత్వ అసహనానికి నిరసనగా 2015లో ప్రభుత్వానికి అవార్డులు తిరిగి ఇచ్చేసిన కళాకారులకు స్ఫూర్తిప్రదాత నయన్‌తార. ఆమె తన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కు తిరిగి ఇచ్చేయడంతో మిగతావాళ్లు ఆమెను అనుసరించారు. మోదీ వచ్చాక దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయని బహిరంగంగానే విమర్శించిన తొలి రచయిత్రి కూడా నయన్‌తారనే. భావోద్వేగాల చెయ్యి పట్టుకుని వెళ్లిపోకుండా, భావోద్వేగాలనే తమ చూపుడు వేలితో నియంత్రించే వివేచనాపరులైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్యలను నయన్‌తార లాంటి ఒక నికార్సయిన రచయిత్రి ఖండించడం కూడా సహజంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అలాంటి మనిషిని తీసుకొచ్చి డయాస్ ఎక్కించడం అంటే కొరివితో సొంత ప్రభుత్వం తల గోకినట్టే ఫడ్నవిస్‌కి. మరెందుకు నిర్వహణ కమిటీ మొదట నయన్‌తారకు ఆహ్వానం పంపినట్లు? ప్రస్తుతం జరగబోతున్నది 92వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం. నయన్‌తార సెహగల్ వయసు 91. సమ్మేళనం, సెహగల్ ఒక ఈడువాళ్లు. అయితే ఒక భాష వాళ్లు కాదు. నయన్‌తార పుట్టింది అలహాబాద్‌లో. ఆమె ఆలోచనలు పుట్టేది ఆంగ్లంలో. రాసేదీ ఆటోమేటిక్‌గా ఇంగ్లిష్‌లోనే. పుట్టుకతో ఒకవేళ ఆమె హిందీ మాట్లాడగలరనుకున్నా, ఆ భాషతో మళ్లీ మరాఠీలకు పేచీ. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నవల ‘రిచ్ లైక్ అజ్’ (1986) సహా నయన్‌తార రాసిన పదీపన్నెండు కూడా ఇంగ్లిష్ నవలలు. అదంతా కూడా జవహర్లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిట్ కూతురు కావడం వల్ల కూడా అబ్బిన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అయి ఉండొచ్చు. విజయలక్ష్మీ పండిట్ అప్పట్లో లండన్‌కు అతి ముఖ్యమైన దౌత్యవేత్త. అరవైలలో మహారాష్ట్రకు విజయలక్ష్మి గవర్నర్‌గా ఉండడం ఒక్కటే బహుశా నయన్‌తారకు మరాఠీలతో ఉన్న సంబంధం. ఇప్పుడు మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ఆమెకు ఆహ్వానం వచ్చినా అందుకు ప్రత్యేక కారణాలేమీ లేవు. ఒక పెద్ద రచయిత్రి. సాహిత్యంలో పేరున్న రైటర్. అంతవరకే. మోదీ మీద నేడు ఆమెకున్న కోపం, గతంలో ఇందిరాగాంధీ మీద కూడా ఉన్నదే. ఇందిర విధించిన ఎమర్జెన్సీని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. నయన్‌తార వ్యక్తులను కాకుండా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంటారు. అలా ఎత్తి చూపడం సాహితీ ధర్మం అని కూడా భావిస్తారు. ఇది తెలిసి కూడా ఆమెను ఆహ్వానించడం సాహితీ సమ్మేళనకర్తల తప్పయితే, తనను పిలుస్తున్నవారెవరో తెలిసి కూడా ఆహ్వానాన్ని అంగీకరించడం ఆమె తప్పనే అనుకోవాలి. డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన నయన్‌తార గడప బయటే లిటరరీ ఇన్విటేషన్‌ని వాపస్ చేసి ఉండాల్సింది. -
బంధువుల మెప్పు కోసం...
డెహ్రడూన్ : బంధువుల మెప్పు కోసం.. వారి ముందు ధనవంతులుగా గుర్తింపు పొందడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు ఓ జంట. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రడూన్‌కి చెందిన సప్న(26) పేద కుటుంబానికి చెందిన మహిళ. ఇమెకు 2009లో వివాహం అయ్యింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయి వర్మ అనే మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సప్న సోదరునికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వచ్చే తన బంధువుల ముందు తాను గొప్పగా కన్పించడం కోసం కారులో వెళ్లాలని భావించింది. ఇందుకోసం డెహ్రడూన్‌కు చెందిన శుభం శర్మ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి తమను ఢిల్లీ తీసుకెళ్లి.. తిరిగి డెహ్రడూన్‌కి చేర్చేలా కిరాయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న సప్న, వర్మలు మరో స్నేహితురాలితో కలిసి టాక్సీలో ఢిల్లీ బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత సప్న, వర్మ తమ దగ్గర ఉన్న తుపాకీతో టాక్సీ డ్రైవర్‌ను బెదిరించి కారు తీసుకుని పారిపోయారు. టాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సప్న, వర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె సీనియర్లు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక రోజు ముందు( ఆగష్టు 14) జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసి కూడా ఫిర్యాదు చేయకపోగా,అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడం గమనార్హం. డెహ్రడూన్ హాస్టల్ ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(16) గత నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే ఈవెంట్లో పాల్గొనాలంటూ సీనియర్లు ఫోన్ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆమెను ఒక స్టోర్‌రూంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా పట్టించుకోలేదు. పైగా ఈ విషయాన్నిఇంట్లో చెప్పొందని హెచ్చరించారు. అబార్షన్ చేయిండానికి ఆస్పత్రికి సైతం తీసుకెళ్లారు. దీంతో ఆ అమ్మాయి తన అక్కకు అసలు విషయాన్ని చెప్పింది. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులకు 17 ఏళ్ల వయసుంటుందని వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయట పడకుండా రుజువులను ధ్వంసం చేసినందుకు గాను... పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన భార్య, హాస్టల్ వార్డన్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ క్షేత్రమే సేంద్రియ విశ్వవిద్యాలయం!
‘నవధాన్య’.. ఈ పేరు మన దేశంలో జీవవైవిధ్యంతో కూడిన సేంద్రియ సేద్యం గురించి తెలిసిన వారికెవరికైనా చటుక్కున స్ఫురణకు వస్తుంది.. ‘నవధాన్య’ అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం సుప్రసిద్ధ శాస్త్రవేత్త, సంప్రదాయ విత్తన హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనా శివ.. మూడు దశాబ్దాలుగా మన దేశంలో వివిధ దేశీ ఆహార పంటలకు సంబంధించి కనీసం 6 వేల సంప్రదాయ వంగడాలను సేకరించి, కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రముఖ సంస్థ ఇది.. ‘నవధాన్య’ జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయానికి, లోతైన శాస్త్రీయ పరిశోధనలకు పట్టుగొమ్మ.. భారతీయ పాత పంటల జీవవైవిధ్య వైభవానికి తలమానికంగా విరాజిల్లుతున్న ‘నవధాన్య’, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు సమీపంలో, హిమాలయాల చెంతన సముద్ర తలానికి 500 మీటర్ల ఎత్తున కొలువై ఉంది.. ఇటీవల ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు డెహ్రాడూన్‌లోని ‘నవధాన్య’ క్షేత్రంలో పంటల వైవిధ్యాన్ని, విత్తన భాండాగారాన్ని దర్శించారు. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. నవధాన్యాలు.. అంటే తొమ్మిది రకాల విత్తనాలు. నవధాన్యాలకు మన సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. జీవవైవిధ్య పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా డా. వందనా శివ ‘నవధాన్య’ను 1987లో డెహ్రాడూన్‌లో నెలకొల్పారు. 1991లో ఇది ట్రస్టుగా మారింది. వేలాది ఏళ్లుగా మన భూముల్లో విరాజిల్లుతున్న సంప్రదాయ విత్తన వంగడాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవడం.. విత్తన జ్ఞానాన్ని పదిలపరచుకోవడం.. అంతిమంగా మన విత్తనాలతో కూడిన ఆహార స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం.. జీవవైవిధ్య సేంద్రియ సేద్యాన్ని చిన్న రైతులకు అందించడం, వారికి సముచితమైన ఆదాయాన్ని అందించే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయటం.. స్థూలంగా ఇవీ నవధాన్య లక్ష్యాలు. నవధాన్య ప్రధాన కేంద్రం డెహ్రాడూన్ అయినప్పటికీ దేశంలో మరో రెండు చోట్ల ఉప కేంద్రాలున్నాయి. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్ ఇలా అన్నారు.. ‘ఇప్పటికి మొత్తం 6 వేల దేశీ పంటల విత్తనాలను పరిరక్షించాం. 22 రాష్ట్రాల్లో 127 సామాజిక విత్తన నిధులను ఏర్పాటు చేశాం. వేప, బాస్మతి వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు మేధోపరమైన హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇప్పటికి సుమారు 10 లక్షల మంది చిన్న రైతులు, విత్తన సంరక్షకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి, దేశ విదేశీ కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చాం. 20 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లించాం. ఈ రైతుల సాగు ఖర్చును 30%కు తగ్గించి, దిగుబడులు 3 రెట్లు పెంచాం. అంతేకాదు, 40 వేల మంది చిన్న రైతులను కూడగట్టాం. దేశంలోకెల్లా మొదటిగా ఇందుకోసం ‘ఫెయిర్ ట్రేడ్ నెట్వర్క్’ను నెలకొల్పాం. వారి సేంద్రియ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తూ, వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చేశాం. మోహన్ సింగ్ అనే ఓ రైతు ఎకరంలో అనేక పంటలు కలిపి సాగు చేసి 2013లో రూ. 80,300 ఆదాయం పొందారు...’ అని అన్నారు. డెహ్రాడూన్‌లోని నవధాన్య సేంద్రియ వ్యవసాయ క్షేత్రం వయసు 30 ఏళ్లు. 45 ఎకరాల విస్తీర్ణం. చిన్న, చిన్న కమతాలలో ఎన్నో పంటలను కలిపి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వరిలో తప్ప ఇతర పంటలన్నీ మిశ్రమ పంటలే. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు.. అన్నిటినీ కలిపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా అపురూపమైన ఈ వంగడాలను సాగు చేస్తూ.. విత్తనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఢిల్లీ తదితర చోట్ల విక్రయిస్తున్నారు. అమూల్యమైన ఈ దేశీ వంగడాల విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడి విత్తన నిధిలో భద్రపరిచారు. 2017లో ఈ క్షేత్రంలో 1,722 వంగడాలున్నాయి. ఇందులో వరి 730, బాసుమతి 41, గోధుమ 212, కూరగాయలు 158, రాజ్మా 130, పప్పుధాన్యాలు 97, నూనెగింజ రకాలు 54, ఆవ 22, కొర్ర 21, మొక్కజొన్న 20, అమరంత్ 3, ఓట్స్ 19, రాగి 30, పచ్చిరొట్ట పంటలు 17, సుగంధ ద్రవ్యాలు 58, ఔషధ మొక్కలు 47.. రకాల పంటలను సాగు చేసి, ఆ విత్తనాలను విత్తన నిధిలో ఉంచారు. ఏక దళ, ద్విదళ పంటలను కలిపి సాగు చేయటం, దేశీ విత్తనాలను భద్రపరచటంతోపాటు.. సేంద్రియ సేద్యం వల్ల దిగుబడులు ఎలా ఉన్నాయి? భూసారం పెరుగుతోందా తగ్గుతోందా? రసాయనిక ఎరువులు వేసే భూముల్లో భూసారం ఎలా ఉంది? వంటి ఆసక్తికరమైన అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో తులనాత్మక అధ్యయనాలు చేయటం ‘నవధాన్య’ ప్రత్యేకత. ఇందుకోసం డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో 2000లోనే సాయిల్ ఎకాలజీ ల్యాబ్‌ను నెలకొల్పి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. 2014–15లో 5 రాష్ట్రాల్లో డాక్టర్ వందనా శివ ఆధ్వర్యంలో చేసిన ఒక అధ్యయనంలో రసాయనిక వ్యవసాయంలో కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు వివిధ పంటల్లో 0.85% నుంచి 106.25% వరకు పెరిగాయని తేలింది. రసాయనిక సేద్యంలో ఒకే పంట సాగు వల్ల భూముల్లో సేంద్రియ పదార్థం నిర్దిష్ట కాలంలో 14% తగ్గిపోగా, అదేకాలంలో సేంద్రియ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల 29–99% వరకు పెరిగిందని నవధాన్య జరిపిన మరో అధ్యయనంలో నమోదైంది. సేంద్రియ/రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలను గురించి విశ్లేషించినప్పుడు భూసారం, ఉత్పాదకత, ఆదాయం వంటి విషయాల గురించే సాధారణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే, నవధాన్య అంతటితో సంతృప్తి చెందలేదు. ఎకరానికి సేంద్రియ/రసాయనిక పద్ధతుల్లో ఎంతెంత పరిమాణంలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయో కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక(హెల్త్ పర్ యాకర్)ను ప్రచురించడం విశేషం. సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటల సాగు(సేంద్రియ పద్ధతుల్లో పొలం అంతటా ఒకే పంటను సాగు చేయడం కూడా అనర్థమే) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికే మేలు కలగడమే కాదు.. అధిక పరిమాణంలో పోషక పదార్థాల దిగుబడి, తద్వారా ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని పారదోలటం కూడా ఈ వ్యవసాయ పద్ధతితోనే సాధ్యమవుతుందని ఈ అధ్యయనం రుజువు చేసిందని చెప్పొచ్చు. ‘దేశీ వరి వంగడాల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే, చిరుధాన్యాలను ప్రధానాహారంగా తినటం ద్వారా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. చిరుధాన్యాల పైనుంచి మన దృష్టి మళ్లించేందుకే బ్రిటిష్ పాలకులు వీటికి జంతువుల పేర్లతో (ఉదా.. కొర్రలకు ఫాక్స్‌టెయిల్ మిల్లెట్, ఉలవలకు హార్స్‌గ్రామ్..) పేరు పెట్టి ఉంటారు. ఇది కుట్ర పూరితంగానే జరిగింది..’ అని నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భట్ వ్యాఖ్యానించారు. జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తన పరిరక్షణ, చిన్న రైతును ఫోకస్‌లోకి తేవడంలో 30 ఏళ్ల క్రితమే ముందు నడచిన సంస్థగా అత్యంత శ్లాఘనీయమైన కృషి చేస్తున్న ‘నవధాన్య’ దిన దిన ప్రవర్థమానం కావాలని ‘సాక్షి సాగుబడి’ ఆకాంక్షిస్తోంది! సేంద్రియ సేద్యం భూమికి బలం! ఐదు అంతకన్నా ఎక్కువ ఏళ్ల నుంచి సేంద్రియ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పొలాల్లో భూసారం స్థితిగతులు ఎలా మారాయన్న అంశంపై డెహ్రాడూన్‌లోని నవధాన్య జీవవైవిధ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ గత ఏడాది ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల వల్ల ఆయా భూముల్లో సూక్ష్మజీవరాశి, పోషకాల స్థాయిల్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లోని వివిధ భూముల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. సేంద్రియ వ్యవసాయ భూముల సారం పెరిగిందని, రసాయనిక వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయిందని తేలింది(శివ 2017). ఈ పట్టిక చూస్తే సేంద్రియ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం, నత్రజని, పొటాషియం తదితర పోషకాలు పెరిగిన సంగతి, రసాయనిక వ్యవసాయ భూముల్లో తగ్గిపోయిన సంగతి అర్థమవుతుంది. నేలతల్లికి వందనం.! సముద్ర తలం నుంచి 500 మీటర్ల ఎత్తులో నవధాన్య డెహ్రాడూన్ వ్యవసాయ క్షేత్రం ఉంది. జీవవైవిధ్య సేంద్రియ సేద్యం 30 ఏళ్లుగా చేస్తున్న ఆ భూమి జీవజీవాలతో సుసంపన్నంగా విరాజిల్లుతోంది. సేంద్రియ కర్బనం 1.6(తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం 0.5–0.2 మధ్యలో ఉన్నట్లు ఒక అంచనా!), సేంద్రియ పదార్థం 6.5, ఉదజని సూచిక 7గా ఉందని నవధాన్య సాయిల్ ఎకాలజీ ల్యాబ్ నిర్వాహకురాలు భువనేశ్వరి తెలిపారు. 1996లో ఇక్కడ 120 అడుగుల్లో భూగర్భ జలాలు ఉండేవి. 20 ఏళ్లలో నీటి మట్టం 40 అడుగులకు పెరిగాయి. భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొద్దీ నీటì తేమను పట్టుకునే శక్తి భూమికి పెరుగుతుంది. తద్వారా నీటి వినియోగం తగ్గిపోతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో పంటల సాగుకు 20 ఏళ్లలో నీటి వినియోగం 60% తగ్గిందని భట్ వివరించారు. నవధాన్య క్షేత్రం వరి పంట డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో వానపాముల విసర్జితాల కనువిందు విత్తన నిధిలో వేలాడదీసిన విత్తన కంకులు డబ్బాల్లో భద్రపరచిన విత్తనాలు డెహ్రాడూన్‌లోని నవధాన్య వ్యవసాయ క్షేత్రం విశిష్టతలను వివరిస్తున్న నవధాన్య ప్రతినిధి భువనేశ్వరి www.navdanya.org -
ఆ పోలీస్ స్టేషన్‌కు స్కూల్ బ్యాగులతో పిల్లలు క్యూ!
రోజూ ఉదయం తొమ్మిదిన్నర అయితే చాలు ఆ పోలీస్ స్టేషన్‌కు స్కూల్ బ్యాగులతో పిల్లలు క్యూ కడతారు. మధ్యాహ్నం మూడున్నర వరకు అక్కడే ఉండి పాఠాలు వల్లె వేస్తారు. కొంతమంది పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తూనే ఖాళీసమయాల్లో వారికి పాఠాలు చెబుతారు..పోలీస్‌స్టేషన్ ఏంటి? పాఠాలేంటి? అనుకుంటున్నారా? డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌నగర్‌లో ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొంతకాలంగా ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు. మొదట ఈ పాఠశాలను ప్రారంభించినప్పుడు పది మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 4–12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 51 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ మిగతా పాఠశాలల తరహాలో బట్టీ పట్టడాలు, మార్కుల వేటలు ఉండవు. హిందీ, ఇంగ్లిష్, గణితం నేర్పుతారు. చదవడం వచ్చిన వారికి చరిత్ర, భౌగోళిక శాస్త్రం కూడా నేర్పుతారు. ముందుకొస్తున్న దాతలు పోలీసుల రక్షణలోనే పాఠశాల ఉండటంతో ఈ పాఠశాలకు పంపేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు కొంతమంది అవసరమైన సాయం అందించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులను తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు వ్యాన్ కోసం ఓ వ్యక్తి నెలకు రూ.5,000 ఇచ్చేందుకు అంగీకరించారు. మరొకరు ఉచితంగా బ్యాగులు ఇచ్చారు. ఈ స్కూల్‌కు వచ్చే పిల్లలకు అరటిపళ్లు, సమోసా వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని దాతలు అందజేస్తున్నారు. నందాకీ చౌకీ స్లమ్‌లో నివసించే బడిఈడు పిల్లల కోసం ఆసరా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట ఈ పాఠశాలను పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని చక్రతా రోడ్డు పక్కన నడిపేవారు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఈ రోడ్డు బిజీగా ఉండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగేది. ఇది గమనించిన ప్రేమ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేశ్ త్యాగి పాఠశాలను పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగితే ఒక్కో సెషన్ రెండు గంటల చొప్పున మూడు సెషన్స్ నిర్వహిస్తామని ఆసరా ట్రస్ట్‌కు చెందిన రాఖీ వర్మ తెలిపారు. ‘మా నాన్న చిత్తు కాగితాలు ఏరుతారు..నేను అడుక్కుంటూ కుటుంబానికి సాయం చేస్తాను...ఇప్పుడు ఈ స్కూల్‌కి వెళ్లి హాయిగా చదువుకుంటున్నాను’ అని గాయత్రి అనే విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్క గాయత్రే కాదు.. ఎప్పుడూ పాఠశాల గడప తొక్కని పలువురు ఇక్కడ హాయిగా చదువుకుంటున్నారు. -
ఏటీఎం గార్డ్‌కు క్రికెటర్ సెల్యూట్!
హైదరాబాద్ : ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ చేసే మంచి పనికి టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముగ్ధుడయ్యాడు. అతని సేవను ప్రశంసిస్తూ ట్విటర్ వేదికగా సెల్యూట్ కొట్టాడు. డెహ్రాడూన్‌లో ఓ ఏటీఎంకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిసున్న రిటైర్డ్ సైనికుడు బ్రిజేందర్ సింగ్ దేశం కోసం తన సేవను కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని నిరూపేద పిల్లలను చేరదీసి చదువుచెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్.. అతని సేవను కొనియాడుతూ వారికి చదువు చెబుతున్న ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘రియల్ హీరో బ్రిజేంద్రను కలవండి.. ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ మాజీ సైనికుడు దేశం కోసం తన సేవను ఇంకా కొనసాగిస్తున్నాడు. సాయంకాలంవేల ఏటీఎం వెలుగుల్లో అక్కడి మురికివాడలకు చెందిన పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఈ మహోన్నత వ్యక్తికి నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ సేవలను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. Meet a true hero Brijendra , who works as a security guard at an ATM in Dehradun. Having retired from the army, he still continues to serve the nation, he teaches children from nearby slums in the evenings under the ATM lights. Salute to an incredible man 🙏🏼 pic.twitter.com/vNobfOvBzH — VVS Laxman (@VVSLaxman281) August 24, 2018 -
పోర్న్ వీడియో చూసి ఐదుగురు బాలురు..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్పూర్ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
యాత్రా స్థలాల్లో నాన్ వెజ్ విందుల రగడ
డెహ్రాడూన్ : యాత్రా స్ధలాల్లోని ప్రభుత్వ అతిథి గృహాల్లో నాన్ వెజ్ వంటకాలను వడ్డిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహరాజ్ తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్‌లో మాంసాహార వంటకాలు అందుబాటులో ఉన్నాయనే వదంతులు నిరాధారమని స్పష్టం చేశారు. ఈ తరహా వదంతులను కొందరు ప్రేరేపిస్తున్నారని, చార్ధామ్ యాత్ర చేపట్టే భక్తులతో సహా యాత్రికులు ఇతరులందరికీ వీటిని విశ్వసించరాదని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను యాత్రాస్థల పునరుద్ధరణ, ఆథ్యాత్మిక వాతావరణ మెరుగుదల (ప్రసాద్) పథకం కింద కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో టూరిజం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ కనబరుస్తోందన్నారు. భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర మార్గాల మూసివేత అనంతరం నెలకొన్న పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ సమీక్షిస్తున్నారని చెప్పారు. -
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
-
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 44 మందికి పైగా మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పౌరీ-ఘడ్వాల్ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు భోవన్ నుంచి రామ్‌నగర్ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.ఘటన గురించి తెలియగానే హూటాహూటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృత దేహాలను వెలికి తీశారు. ప్రధాని దిగ్భ్రాంతి.. ఘటనా స్థలంలో 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. -
యోగా వేడుకల్లో వృద్ధురాలు మృతి
సాక్షి, డెహ్రాడూన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ అటవీ పరిశోధనా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధా మిశ్రా అనే 73 ఏళ్ల వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. యోగా వేదిక వద్ద వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, అస్వస్థతకు గురైన వెంటనే మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఆమె మృతికి కారణాలను వైద్యులు వెల్లడిస్తారని ఎస్పీ ప్రదీప్ రాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో దాదాపు 50000 మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా విశ్వజనీనమైందని, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే శక్తి దీనికుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
-
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
మహేశ్ బాబుని కలసిన సీఎం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలుత డెహ్రాడూన్‌లో కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలోని అధిక భాగం యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. -
‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’
డెహ్రాడూన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తరువాత కూడా తమ పార్టీ బలంగా ఉంటుందన్నారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో జవదేకర్ మాట్లాడారు. ఉపఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం పడదన్నారు. ఉప ఎన్నికల్లో ఓడినంతమాత్రాన మోదీ ప్రభావం తగ్గినట్లు కాదన్నారు. ఇటీవల జరిగిన ఏ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొన్నలేదని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందిని, ఏ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వందశాతం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. -
డెహ్రాడూన్‌లో పాగా!
మహేశ్‌బాబు నెక్ట్స్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురు చూసే అభిమానులకు శుభవార్త. ఆయన నెక్ట్స్ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమాను అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. డెహ్రాడూన్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్మాల్ గ్యాప్ ఇచ్చి, నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాకు కేయూ మోహనన్ ఛాయాగ్రాహకుడు. ఆయన డెహ్రాడూన్ అందాలను అద్భుతంగా క్యాప్చర్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. మహేశ్ అండ్ టీమ్ కొన్ని రోజుల పాటు డెహ్రాడూన్‌లో పాగా వేస్తారన్నమాట. -
గంగాదీప్ సింగ్ సోషల్ మీడియాలో హీరో
-
సోషల్ మీడియాలో పోలీసు హీరో
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గంగాదీప్ సింగ్ అనే సబ్ ఇనిస్పెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయ్యారు. కొంత మంది హిందూ మతతత్వవాదులు ఓ ముస్లిం యువకుడితో గొడవ పడి అతన్ని చితక్కొట్టబోతే సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి సింగ్ అతనికి తన శరీరాన్ని రక్షణ కవచంలా అడ్డేసి రక్షించారు. ఓ పక్కన ఆ ముస్లిం యువకుడిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్న అల్లరి మూకకు నచ్చ చెబుతూనే బాధితుడికి అంగరక్షకుడిలా నిలిచారు. ఇతర పోలీసుల్లాగా పోలీసు బలగాలు వచ్చే వరకు అతను నిరీక్షించలేదు. ఉద్రిక్త పరిస్థితి గురించి తెల్సిన వెంటనే పరుగుపరుగున అక్కడికి వచ్చారు. ఈ సంఘటనకు సంబం«ధించి ఎవరో శుక్రవారం తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై నిర్ధాక్షిణ్యంగా పోలీసులు కాల్పులు జరపడం, ఆ సంఘటనలో 13 మంది చనిపోవడం లాంటి సంఘటనలు విన్నప్పుడు పోలీసులు అంత దుర్మార్గులు మరొకరు ఉండరని అనిపిస్తుంది. గంగాదీప్ సింగ్ లాంటి వారిని చూసినప్పుడు పోలీసుల్లో కూడా మహానుభావులు ఉంటారనిపిస్తోంది. ఇలాంటి మహానుభావులు అరుదుగానే కనిపిస్తారు. ముంబైలోని కమలా మిల్స్ కాంప్లెక్స్‌లో కొంతకాలం క్రితం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వోర్లీ పోలీస్ స్టేషన్‌కు చెందిన సుదర్శన్ షిండే అనే పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి తన భుజాల మీదుగా బాధితులను మోసుకురావడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. నాటి అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో ఏఎస్ఐ సాజిష్ కుమార్ నదిలోకి దూకి మునిగిపోతున్న టీనేజర్‌ను రక్షించారు. అలాగే నాసిక్‌లో కుంభమేళ సందర్భంగా నీటిలో మునిగిపోతున్న ఓ మనిషిని రక్షించేందుకు మనోజ్ భారతే అనే పోలీసు అధికారి ఏకంగా 20 అడుగుల వంతెనపై నుంచి దూకారు. వాస్తవానికి పోలీసులు సామాజిక సేవకులుగానే ఉండాలి. కానీ రాజకీయ అవినీతి వల్ల వారు చెడిపోతున్నారు. నియామకాల్లో, బదిలీల్లో భారీ అవినీతి జరగడమే అందుకు కారణం. అవినీతిని నిర్మూలించడంతో పాటు సామాజిక సేవారంగంలో పోలీసులకు తగిన శిక్షణ కల్పించినప్పుడు, వారిలో సేవా దృక్పథాన్ని పెంచేందుకు సామాజిక శాస్త్రవేత్తల సేవలను వినియోగించినప్పుడు పోలీసుల్లో మహానుభావుల సంఖ్య పెరుగుతుంది. -
భోజనం బాగాలేదంటావా.?
డెహ్రాడున్: స్కూల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం బాగాలేదని ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇనుప రాడ్డుతో కొట్టాడు ఓ ప్రిన్సిపాల్. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని ఓల్డ్ దలన్వాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. రాహుల్ కుమార్(11) అనే పిల్లాడు ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో.. రాహుల్ ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ బానో దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందేలా చూడాల్సిన ప్రిన్సిపాలే ఫిర్యాదు చేసిన రాహుల్‌ను ఇనుప రాడ్‌తో కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాహుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాహుల్ తండ్రి ధర్మేంద్ర పాశ్వాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
క్రికెటర్ మహ్మద్ షమీకి గాయాలు
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. డెహ్రడూన్‌లో చికిత్స తీసుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడని సన్నిహితులు వెల్లడించారు. షమీ సురక్షితంగా ఉన్నాడని, అతడి తలకు కుట్లుపడ్డాయని తెలిపారు. షమీ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేయడంతో వ్యక్తిగత జీవితంలో షమీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తన భర్త స్త్రీలోలుడని, క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని షమీపై ఆరోపణలు చేసింది. తనను చిత్రహింసలు పెట్టాడని, హత్యాయత్నం కూడా చేశాడని వెల్లడించింది. అయితే జహాన్ ఆరోపణలను షమీ తోసిపుచ్చాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మొదట బీసీసీఐ కూడా కాంట్రాక్ట్ ఇవ్వవపోవడంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కాంట్రాక్టును బీసీసీఐ తర్వాత పునరుద్ధరించడంతో అతడికి ఊరట లభించింది. -
చైనా చేష్టలకు భారత కౌంటర్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టును భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తమ ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడి నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలతో గస్తీని నిర్వహణకు సిద్ధమైపోయింది. ‘రెండు సుఖోయ్(సు-30 ఎంకేఐ) విమానాలు ఫిబ్రవరి 19వ తేదీ ఉదయాన్నే బయలుదేరుతాయి. రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి 20వ తేదీ సాయంత్రం తిరిగి ఎయిర్ బేస్‌కు చేరుకుంటాయి. సినో(చైనా)-భారత్ సరిహద్దు వెంబడి ఇవి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాయి. కొన్ని రోజులకు దీనిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మాములు చర్యే అని ప్రకటించుకున్నప్పటికీ.. దీనివెనుక ముందు చూపు ఉన్నట్లు స్పష్టమౌతోంది. రెండు దేశాల మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. భవిష్యత్తులో చైనా సరిహద్దు(గగనతలం గుండా) ఉల్లంఘనకు పాల్పడితే అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్ ప్రాంతాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో భారత సరిహద్దుల దాకా చైనా యుద్ధ విమానాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన అయినా దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ధాటిగా సమాధానం ఇచ్చేందుకే భారత సైన్యం ఈ ఎయిర్ బేస్‌ను నెలకొల్పినట్లు అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
డెహ్రాడూన్‌లో మిర్యాలగూడ విద్యార్థి మృతి
సాక్షి, మిర్యాలగూడ: తన మిత్రులతో కలిసి నరహరి అనే విద్యార్థి డెహాడూన్కు వెళ్లాడు. గంగోత్రి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. వివరాలివి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నరహరి స్వస్థలం. అతను డెహ్రాడూన్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఈ క్రమంలో నిన్న స్నేహితులతో కలిసి గంగోత్రి నది వద్దకు వెళ్లారు. అందరూ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరహరి ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. కుమారుని మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసిన టీకొట్టు..!
సాక్షి, డెహ్రాడూన్: చిన్న టీకొట్టు దగ్గర సంభాషణ ఓపెద్ద కిడ్నీ రాకెట్ పట్టుకోవడానికి కారణం అయ్యింది. పక్కా సమాచారం ఉన్న కేసుల్లోనే చేతులెత్తేస్తున్న పోలీసులు ఉన్న ఈరోజుల్లో ఒక చిన్న టీకొట్టు దగ్గర జరిగిన సంభాషణ కారణంగా పెద్ద కుంభకోణాన్ని వెలికి తీశారు డెహ్రాడూన్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే హరిద్వార్‌లోని రాణీపూర్ పోలీసు స్టేషన్లో పంకజ్ శర్మ నెలరోజుల క్రితం విధుల్లో చేరాడు. ఒక రోజు సాధారణ దుస్తుల్లో సమీపంలోని చిన్న టీకొట్టు దగ్గర టీతాగడానికి వెళ్లాడు. ఆసమయంలో నగరంలోని గంగోత్రి ఛారిటబుల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుతుందని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్నాడు. వెంటనే సమాచారాన్ని పోలీసు స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు చేరవేశారు. అంతేకాకుండా జిల్లాస్థాయి అధికారులకు కూడా గంగోత్రి హాస్సిటల్లో కిడ్నీతో పాటు జరుగుతున్న అవయవ రాకెట్‌ను గురించి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం హాస్సిటల్ పరిసరాల్లో నెలరోజులు పాటు రెక్కీ నిర్వహించారు. నిందితులను పట్టుకోవడానికి హాస్పిటల్లో రహస్యంగా ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారి కీలక సమాచారం సేకరించారు. ఇందులో కీలక సూత్రధారి అమిత్‌కుమార్, డాక్టర్లకు కిడ్నీలను సరఫరా చేస్తున్న జావేద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేధించడంలో కీలకపాత్ర పోషించిన పంకజ్ శర్మకు వచ్చే ఏడాది గణతంత్రదినోత్సవం రోజున రివార్డు వచ్చేవిధంగా రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు సిఫారసు చేశారు. -
ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు..
-
ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు..
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్న నదులను తలపిస్తున్నాయి. ఓ జంట ప్రయాణిస్తున్న కారు వరద మధ్యలో చిక్కుకుంది. వరద దాటికి కారు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. అక్కడ ఉన్న స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడటానికి ముందుకెళ్లారు. ఒక్కసారి ప్రమాదం వారి వైపు మళ్లింది. వారిని రక్షించే క్రమంలో కారుని ఒడ్డుకి మధ్య ఏర్పాటు చేసిన నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. వారు వరదలో కొట్టుకుపోతుండగా ఒడ్డున ఉన్న వారు చేయి చేయి కలిపి వారిని కాపాడారు. ఈ సంఘటన డెహ్రాడూన్‌లోని నలపాణిలో చోటుచేసుకుంది. ఇది ఓ ఫోన్లో రికార్డవడంతో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. -
ఆ దుర్మార్గుడికి జీవిత ఖైదు
డెహ్రాడూన్: భార్యను అతిదారుణంగా హత్య చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేశ్ గులాటి(38) కు కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో గులాటిని కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. సుమారు ఏడేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీర్, భార్య అనుపమను దారుణంగా హత్య చేశాడు. 2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి తన భార్య అనుపమ (36)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన రాజేశ్, ఆమెను హత్య చేశాడు. కాగా, 1999లో అనుపమను ప్రేమ వివాహం చేసుకున్నాడు రాజేశ్. ఆ తర్వాత ఇద్దరూ అమెరికా వెళ్లారు. 2008లో తిరిగి డెహ్రాడూన్ వచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరిగాయి. ముఖ్యంగా కోల్ కతాకు చెందిన ఓ మహిళతో రాజేశ్ కు వివాహేతన సంబంధం ఉందని అనుపమ నిలదీస్తుండేది. ఈ నేపథ్యంలో తరచూవారి వారి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అనుపమను అతి దారుణంగా హత్య చేసి 72 ముక్కలుగా చేశాడు. వాటిని పాలథీన్ కవర్లలో ఉంచి డీప్ ఫ్రీజర్ లో ఉంచాడు. రోజుకో పాలథీన్ కవర్లో ఉంచి నగర శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అయితే డిసెంబర్ 12, 2010 అనుపమ సోదరుడు ఎస్కెమహంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఈ హత్యోందంతం వెలుగు చూసింది. పోలీసులు రాజేశ్ ఇంట్లో సోదాలు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుడు రాజేష్ గులాటీని పోలీసులు అరెస్టు చేయగా అప్పటినుంచి ఆయన జైలులో ఉన్నాడు. -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 24 మందికి అస్వస్థత
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో చిన్నారులు, పోలీసులు సహా మొత్తం 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నగరంలోని జల సంస్థాన్ మంచినీటి శుద్ధీకరణ కేంద్రంలో గురువారం రాత్రి క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రభావానికి లోనయ్యారు. ఆక్సిజన్ కొరత: క్లోరిన్ వాయువును పీల్చి అస్వస్థతకు గురైనవారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆక్సిజన్ కొరత ఉండటంతో బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీఎం ట్వీట్: గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ లీకేజీ లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నానని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఉత్తరాఖండ్ సీఎంగా రావత్
నేడు డెహ్రాడూన్‌లో ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఆరెస్సెస్ కార్యకర్త, మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్రివేంద్ర సింగ్ రావత్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. జార్ఖండ్ బీజేపీ ఇంచార్జిగా ఉన్న రావత్.. పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలకు అత్యంత సన్నిహితుడు. మోదీ ఉత్తరాఖండ్ బీజేపీ ఇంచార్జీగా ఉన్నప్పటినుంచీ రావత్‌కు సత్సంబంధాలున్నాయి. దీనికి తోడు జార్ఖండ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించారని రావత్‌కు పార్టీలో మంచి పేరుంది. శుక్రవారం డెహ్రాడూన్‌లో సమావేశమైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు.. పార్టీ కేంద్ర పరిశీలకులు సరోజ్ పాండే, నరేంద్ర తోమర్ల సమక్షంలో రావత్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. శనివారం త్రివేంద్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు అజయ్ భట్ తెలిపారు. -
ఇతడి చర్య కర్కశత్వానికి పరాకాష్ట
-
ఇతడి చర్య కర్కశత్వానికి పరాకాష్ట
డెహ్రాడూన్: సాధారణంగా పసి పిల్లలు ఏడుస్తుంటే ఓదార్చాలని అనిపిస్తుంది. ఆడిస్తూ ముద్దుచేయాలనిపిస్తుంది. అదే ఆస్పత్రుల్లో పనిచేసే వార్డు బాయ్‌లకు ఇలాంటి ఆలోచన కాస్తంత ఎక్కువగా ఉండాలి. కానీ, ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పట్టుమని మూడు రోజులు కూడా ఉండని పసి బాలుడిపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. ఏడుస్తుందనే కారణంతో ఆ బిడ్డ కాలు విరిచాడు. ఈ షాకింగ్ ఘటన ఆ ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. జనవరి 28న రూర్కీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శ్వాస సంబంధమైన సమస్యతో ఓ మూడు రోజుల పసిపాపను చేర్పించారు. పరిశీలనలో పెట్టారు. అదే గదిలో వార్డు బాయ్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పాప ఏడ్వడం ప్రారంభించింది. సాధారణంగా పసిపిడ్డలు చేసే పని ఏడ్వడం.. వారికి ఏ సమస్య వచ్చినా ఏడుపుద్వారా మాత్రమే చేయగలరు. ఈ విషయం అర్థం చేసుకోకుండా కోపంతో ఆ బిడ్డ వద్దకు వెళ్లి డయాపర్ మార్చే క్రమంలో కోపంతో కాలు మెలేశాడు. దీంతో అది కాస్త విరిగింది. పాప ఏడ్వడం మరింత ఎక్కువైనా అతడు మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. అనంతరం అక్కడికి వచ్చిన వైద్యులు పాప కాలు దెబ్బతినడం చూసి కారణాలు సీసీటీవీలో పరిశీలించి అవాక్కయ్యారు. అతడిని పోలీసులకు పట్టించారు. -
2017 చూడాలని ఉంది
ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు. 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్నాథ్ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి. కేదార్నాథ్ చేరుకోవాలంటే.. విమానమార్గంలో డెహ్రడూన్ (ఉత్తరాఖండ్) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్∙315, కేదార్నాథ్ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్ నుంచి కేదార్నాథ్ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్ అయి తెలుసుకోవచ్చు. 2 మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్ రిజర్వ్‌లో హోటల్ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్ స్పాట్ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్ పార్క్‌గా ప్రకటించింది. http://rtdc.tourism.rajasthan.gov.in 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు. చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్ సీయింగ్ టూర్స్‌కి హిమాచల్ ప్రదేశ్ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్ (రాజస్థాన్)కు దేశంలో అత్యంత రొమాంటిక్ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్ ఆఫ్ మేవార్’, ‘వెనీస్ ఆఫ్ ద ఈస్ట్’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్ లేక్, ఉదయ్‌సాగర్ లేక్, జైస్మండ్ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. http://rtdc.tourism.rajasthan.gov.in/ 5 ప్రకృతిప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్పోర్ట్ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్ బకులా రిన్పోచే’ ఎయిర్పోర్ట్ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు. నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు. 32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్ రూట్లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్ గ్రామం ఓవర్వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. 6 గుజరాత్లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్ గార్డెన్లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్ టెంపుల్ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్ టెంపుల్ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం. ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్ మెహసనాలో ఉంది. Mail: info@gujarattourism.com 7 ఇది దేశంలోనే అతి పెద్ద జైన్ టెంపుల్. భావనగర్‌కు (గుజరాత్) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు. రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు 9493350099 ఫోన్ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com 8 స్నేహబృందంతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లాలంటే మధేఘాట్ సరైన ప్లేస్. పశ్చిమlపూణె (మహారాష్ట్ర) రాయగడ్ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్. భటఘర్ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్ ఉంటుంది. రాయగడ్ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్ ఘాట్ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్ టేక్’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్ ఘల్ కి మహాబలేశ్వర్ రోడ్ మీదుగా వెళితే ముంబయ్–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు. 9 పశ్చిమ బెంగాల్లో టెర్రకోట టెంపుల్స్ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్ టెంపుల్ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక విద్యాలయాలకు పెట్టింది పేరు. బిష్ణుపూర్ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్పోర్ట్ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు: రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్ దర్వాజ, గడ్ దర్వాజ, దాల్‌మండల్ కమాన్, స్టోన్ చారియట్, నూతన్ మహల్, చిన్నమస్త టెంపుల్. 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్ ఛీఫ్తాన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్పోర్ట్ ఖజురహో. రైల్వేస్టేషన్ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్ మందిర్, షాహిద్‌స్మారక్ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్ ఉంది. www.mptourism.com----- 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్ లేక్. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం. కోయంబత్తూర్‌కి హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్ నుంచి ఎమరాల్డ్ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్ గార్డెన్, ఊటీ, రోజ్ గార్డెన్, లేక్ పార్ట్, ఊటీ లేక్, డీర్ పార్క్. 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్. సిక్కిమ్ వాసులు ఇక్కడ ‘పాంగ్ లహ్‌బ్సోల్’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ హెలీకాప్టర్ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్ నుంచి మే వరకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు బడ్జెట్ హోటల్స్ సదుపాయాలను పొందవచ్చు. మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్ అవ్వచ్చు. 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్ నేషనల్ పార్క్ లక్కమ్ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి. కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్. హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్ హార్ట్ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి. -
భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ
డెహ్రాడూన్: డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శనివారం నిర్వహించిన సైనిక దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటోన్న భద్రతా సవాళ్లపై తన ఆలోచనల్ని ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నేవీ, ఆర్మీ, వాయుసేన అధిపతులు నివేదికలు సమర్పించారు. -
ఆ ప్రేమపక్షులు అభిమానికి దొరికిపోయారు!
ముంబై: భారత డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా విరుష్కా జోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా.. ఒక వీరాభిమానికి దొరికిపోయారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా డెహ్రాడూన్‌లో ఈ జంట విహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో బాగా హల్చల్ చేస్తోంది. ఈ ఫొటో ఎక్కడ, ఏ సందర్భంలో తీశారనే వివరాలు కచ్చితంగా తెలియకపోయినా.. కొత్త సంవత్సరం వేడుకల్ని విరాట్-అనుష్క జంట కలిసి జరుపుకోబోతున్నదనేది ఈ ఫొటో ద్వారా స్పష్టమవుతోంది. కాగా, ఇటు అనుష్క, అటు కోహ్లి తాజా ట్విట్టర్ పోస్టులు కూడా ఒకింత ఆసక్తి రేపుతున్నాయి. Merry Christmas everyone. Ultimately, it's all about cherishing the simple things in life that truly bring peace 😇🙏🏼❤️ pic.twitter.com/nQN6GODZuj — Anushka Sharma (@AnushkaSharma) December 27, 2016 Merry Christmas everyone. 🎄 🎄 I hope all of you have a great day. 👍 😊 pic.twitter.com/Cs1zAT2ZUM — Virat Kohli (@imVkohli) December 25, 2016 -
బీజేపీలో చేరిన ప్రముఖ నటి
డెహ్రడూన్: బాలీవుడ్ సీనియర్ నటి హిమాని శివపురి గురువారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఉత్తరాఖండ్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్యోతి ప్రసాద్ గైరోలా సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా హిమాని శివపురి మాట్లాడుతూ.. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన హిమాని బాలీవుడ్ లో సహాయ నటిగా గుర్తింపు పొందారు. 1984లో వచ్చిన ‘ఆబ్ ఆయేగా మజా’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. రాజా, పరదేశ్, హీరో నంబర్ వన్, కోయలా, బంధన్, దీవానా మస్తానా, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, ఉమ్రావ్ జాన్ తదితర చిత్రాల్లో కనిపించారు. పలు హిందీ సీరియల్స్ లోనూ వివిధ పాత్రలు పోషించారు. ఆమెకు కత్యాయన్ అనే కుమారుడు ఉన్నాడు. -
పశువులకూ కు.ని. కేంద్రం
డెహ్రాడూన్: వీధి కుక్కల సంతతిని నిరోధించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలను అనుసరిస్తూ దేశంలోనే మొట్టమొదటి పశు సంతతి నిరోధక కేంద్రం ఏర్పాటయింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పట్టణంలో ఏర్పాటుచేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్(ఏబీసీ)ను కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ శనివారం ప్రారంభించారు. దాదాపు ఎకరం స్థలంలో నిర్మించిన ఈ కేంద్రంలో వీధి కుక్కలకే కాక పెంపుడు కుక్కలకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నట్లు, ఇందుకోసం అన్ని వసతులతో కూడిన 72 దొడ్లను నిర్మించినట్లు మంత్రి మనేకా పేర్కొన్నారు. ఈ తరహా కేంద్రం దేశంలో ఇదే మొదటిదని, పశు సంతతి వ్యాప్తి నిరోధమేకాక కుక్క కాటు వల్ల సోకే రెబీస్ వ్యాధి నిరోధక కేంద్రంగానూ ఏబీసీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం-1960ని అనుసరించి ఏర్పాటుచేసే ఇలాంటి కేంద్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. -
'సీఎం ఒత్తిడి చేస్తేనే రేప్ ఆరోపణలు చేశా'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. కుట్రలు చేసే వ్యక్తులకు అధికారంలో ఉండే హక్కు లేదని మండిపడింది. తనపై బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, అదే మహిళ ప్లేటు ఫిరాయించి తాను ముఖ్యమంత్రి రావత్ ఒత్తిడి చేస్తేనే అలా తప్పుడు కేసు పెట్టానంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. దీంతో బీజేపీ నేతలు రావత్ రాజీనామాకు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 'హరీశ్ రావత్‌కు అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయాడు. ఒక మహిళను బెదిరించి, ఆమెను కష్టాలుపాలు చేస్తామని హెచ్చరించి తప్పుడు కేసు పెట్టించారు. అలాంటి వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే హక్కు ఏమాత్రం లేదు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ అన్నారు. -
10 మంది ప్రాణం తీసిన కొండ చరియలు
డెహ్రడూన్: కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతిచెందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లా ఛక్రతా ప్రాంతంలో చోటుచేసుకుంది. టియోని-హనోల్ ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై కొండ చరియలు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని జిల్లా అధికారి రవీంద్రనాథ్ రమణ్ తెలిపారు. గాలివానల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా పనిచేసేందుకు కూలీలు ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. -
వైద్యుడికి పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ ప్రభుత్వ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని సాయుధులు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి కాల్చి చంపారు. అతడు విధుల్లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్ లోని గయ జిల్లాకు చెందిన సునిల్ కుమార్ సింగ్ అనే శిశు వైద్యుడు ఉత్తరాఖండ్ లోని జోష్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం ఆస్పత్రి విధుల్లో ఆయన బిజీబిజీగా ఉండగా అనూహ్యంగా దుండగులు అందరూ చూస్తుండగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో సదరు వైద్యుడు ప్రాణాలు విడిచాడు. -
హమ్మయ్య... నిలబడుతోంది!
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో బీజేపీ ఎమ్మెల్యే దాడిలో గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్' కోలుకుంటోంది. కృత్రిమంగా అమర్చిన కాలుతో నిలబడగలుగుతోందని 'శక్తిమాన్'కు చికిత్స చేస్తున్న డాక్టర్ రాకేశ్ నాటియాల్ తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే నిలబడగలగుతోందని చెప్పారు. అంతకుముందుతో పోలిస్తే 'శక్తిమాన్' ఆరోగ్య పరిస్థితిలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపిస్తోందన్నారు. కొన్ని రోజుల్లో నడవగలుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డెహ్రడూన్ లో ఇటీవల ప్రతిపక్షాల ఆందోళన సందర్భంగా బీజేపీ నేతలు జరిపిన దాడిలో ఈ తెల్ల గుర్రం తీవ్రంగా గాయపడింది. దీంతో దాని వెనుకకాలిని తొలగించి, కృత్రిమకాలు అమర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ గుర్రం 'దేశద్రోహి' అయి ఉంటుందా?
డెహ్రాడూన్: మూగజీవమన్న కనికరం లేకుండా పోలీసు గుర్రం కాలు విరిగేలా చావబాదిన బీజేపీ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ సోమవారం తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీ ఎమ్మెల్యే గణేష్ జోషి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. నోరులేని మూగజీవాన్ని లాఠీతో చితకబాదిన ఆయన పైశాచికత్వంపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో గణేష్ జోషి మాట మార్చారు. ఆయన గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ, ఆయన మాత్రం ఆ సమయంలో తాను అక్కడ లేనని చెప్తున్నారు. పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన ఆ అశ్వం ఎండలో నిలబడటం వల్ల అలసిపోయి ఉంటుందని, ఆ తర్వాత దానికి నీళ్లు తాగించడంతో అది కోలుకుందని, దానికి ఎలాంటి గాయం కాలేదని ఆయన వాదిస్తున్నారు. ఎమ్మెల్యే దాడితో తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా గుర్రంకాలిని తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మూగజీవాన్ని హింసించిన ఎమ్మెల్యేపై కఠినమైన చర్య తీసుకోవాలని జంతుహక్కుల సంస్థ పెటా డిమాండ్ చేస్తోంది. కాగా, ఆ పోలీసు గుర్రం 'దేశద్రోహి' అయి ఉంటుందని, అందుకే దానిపై ఎమ్మెల్యేగారు ప్రతాపం చూపి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఇటీవల ఢిల్లీ కోర్టు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే ఓ వ్యక్తిని కొట్టిన సంగతి తెలిసిందే. -
మూగజీవాన్ని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే!
డెహ్రాడూన్: ఓ ఎమ్మెల్యే విచక్షణ మరిచి రెచ్చిపోయాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తుండగా.. వారిని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు తమ ఆందోళన అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై కక్ష తీర్చుకున్నాడు. మూగజీవమన్న కనికరం లేకుండా లాఠీతో గుర్రాన్ని చితకబాదాడు. ఈ ఘటన సోమవారం డెహ్రాడూన్‌లో జరిగింది. హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నిరసనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ గుర్రంపై తన ప్రతాపం చూపాడు. లాఠీతో నిర్దాక్షిణంగా మూగజీవాన్ని బాదాడు. తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించారు. చికిత్సలో భాగంగా తీవ్రగాయమైన గుర్రంకాలిని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. గుర్రాన్ని తీవ్రంగా గాయపర్చిన ఎమ్మెల్యే గణేష్ జోషిపై కేసు పెడతామని పోలీసులు తెలిపారు. -
రివేంజ్ కోసం పూజలు చేస్తున్న ఖలీ!
డెహ్రాడూన్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 'ది గ్రేట్ ఖలీ షో'లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని, తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ఖండాతరాలు దాటేలా చేశారు. -
దొంగ బాబాను నమ్మి ఐఐటీ-ఎం విద్యార్థిని..
చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ-ఎంలో చదవాల్సిన ఓ విద్యార్థిని ఆధ్మాత్మిక పరధ్యానంలో పడి ఓ దొంగ బాబ వలలో చిక్కుకోబోయింది. తాను సాధువుగా మారేందుకు హిమాలయాలకు వెళ్లిపోతున్నానంటూ లేఖలు రాసి హాస్టల్ గదిలో వదిలి వెళ్లింది. చివరకు తల్లిదండ్రులు, ఉత్తరాఖండ్ పోలీసులు కఠినంగా శ్రమించడంతో ఆ దొంగబాబా వద్ద ఆమెను గుర్తించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. చెన్నైలోని ఐఐటీ-ఎం క్యాంపస్‌లో చదువుతున్న వేదాంతం ఎల్ ప్రత్యూష అనే అమ్మాయి గత నెల 17న తాను ఉంటున్న హాస్టల్ గదిలో రెండు ఆంగ్లంలో మూడు తెలుగులో లేఖలు రాసి తాను సాధువుగా మారిపోతున్నానని వివరిస్తూ అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా వెళ్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆమె తండ్రి పురుషోత్తమాన్ చెన్నైలోని కొట్టుర్పూరం అనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ కు వెళ్లి అక్కడ పోలీసుల సహాయం తీసుకున్నాడు. వారు ఆమె చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్ డేటా ప్రకారం ఆరోజు ఐదు సార్లు భాస్కర్ అనే వ్యక్తితో మాట్లాడింది. ఈ భాస్కర్ అనే వ్యక్తి దొంగ బాబా శివ గుప్తా అనే ఫేక్ ఆధ్మాత్మిక గురువుకు సంబంధించినవాడు. అతడు ఆమెకు పలుమాటలు చెప్పి తమ గురువు గారు మోక్ష మార్గాన్ని చెబుతారని నమ్మించి ఆమెను ఆశ్రమంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో చివరి కాల్ ప్రకారం ఆమె మాట్లాడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ చుట్టు పక్కల ప్రతి ఇంటి గడపకు వెళ్లి వెతకగా చివరకు ఆమె బాబా ఆశ్రమంలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బ్రాడిపేట్లోని తమ నివాసంలో సురక్షితంగా ఉందని తెలుపుతూ ఆమె తండ్రి చెన్నైలో కేసును వాపసు తీసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఎంతోమంది అమ్మాయిలు, మహిళలు ఉన్నట్లు వారంతా మాయమాటల నమ్మి ఆ బాబా వద్ద చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు. -
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని, ఈ విషయంలో తాము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందనీ, వివిధ మార్గాల ద్వారా అధిక మొత్తంలో నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా విశేషమైన లబ్ధి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్‌లో ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, హోంమంత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వల్ల విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు రావడంతోనే పురోగతి సాధించామని, ప్రారిశ్రామిక ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామికంగా వృద్ధి చెందామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి చర్యల ఫలితంగా గడచిన 16 ఏళ్లలో తమ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి రేటు నమోదు అయ్యిందనీ, ప్రస్తుతం తాము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి రఘువీరారెడ్డికి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు కోత పెట్టేందుకు యత్నించినా సమర్థంగా వ్యతిరేకించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టం చేశారు. -
బాంబులంటే మహా భయం: లావణ్యా త్రిపాఠి
దీపావళిని మా ఇంట్లో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి దీపావళికి మా నాన్నగారు వెండి నాణెం కొంటారు. దాన్ని పూజలో ఉంచుతాం. ఈ పూజ కోసం వారం రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెడతాం. ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాం. ఆ తర్వాత ప్రమిదలన్నీ అటక మీద నుంచి దించి అవి క్లీన్ చేస్తాం. మా నార్త్‌లో దీపావళిని న్యూ ఇయర్‌లా భావిస్తాం. కొత్త సంవత్సరం రోజు మంచి పనులు చేస్తే మిగతా సంవత్సరం అంతా బాగుంటుందని మా అమ్మ నమ్ముతుంది. అందుకని మా స్కూల్ డేస్‌లో క్లాస్ పుస్తకాలన్నిటినీ పూజలో ఉంచుతుంది. కాసేపు చదివించేది. ఇక టపాసులు గురించి చెప్పాలంటే నాకు బాంబులంటే మహా భయం. కాకరపువ్వొత్తులు అంటే చాలా ఇష్టం. వాటిని బాగా కాల్చేదాన్ని. ఈ దీపావళి మా ఇంట్లో (డెహ్రాడూన్) జరుపుకుంటున్నాను. యాక్చువల్‌గా హాలిడే ట్రిప్ కోసం వారం రోజుల క్రితం ఇండోనేషియా వెళ్లాను. దీపావళి పండక్కి కంపల్సరీగా ఇంట్లో ఉండాలని అమ్మ ఫోన్ చేసింది. అందుకే డెహ్రాడూన్ వచ్చాను. నా కోసం మా అమ్మ ఓ ట్రెడిషనల్ డ్రెస్‌ను డిజైన్ చేయించింది. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ పండగ జరుపుకోండి. -
ప్రతి రాష్ట్రంలో ఆలయం నిర్మిస్తాం
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బాలాజీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలయం కోసం స్థలాన్ని కేటాయించింది.. నిర్మాణానికి సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మీడియాకు తెలిపారు. డిజైన్లు, ఆలయ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని.. అతి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఇప్పటికే హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మితమైతున్న బాలాజీ ఆలయం మరో ఆరునెల్లో సిద్దమైతుందని తెలిపారు. టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు టీటీడీ లేఖ రాసినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి మహరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నైల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవం మరో వైపు ఈనెల 31 నుంచి నవంబర్ 8 వరకూ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం' నిర్వహించనున్నారు. ఢిల్లీ లో తొలి సారి వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. -
150 గంటల నిర్విరామ విద్యా బోధన సక్సెస్!
జహీరాబాద్: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కామర్స్ లెక్చరర్ మారుతీరావు తలపెట్టిన 150 గంటల నిర్విరామ బోధన ఆదివారం విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన అరవింద్ మిశ్రా పేరిట ఉంది. ఆయన 139 గంటలు ఏకధాటిగా బోధించి రికార్డు సాధించారు. తాజాగా ఆ రికార్డును మారుతీరావు అధిగమించారు. ఈ నెల 9న ఉదయం 7.30 గంటలకు స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాలలో నిర్విరామ విద్యాబోధనను ప్రారంభించిన మారుతీరావు ఆది వారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెమినార్ ముగించారు. లక్ష్యానికి గంటన్నర అదనంగా తరగతులు చేపట్టారు. ఈ సెమినార్లో ట్యాక్సేషన్, అకౌంట్స్, కాస్ట్ అక్కౌంట్స్‌పై విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. వీటికి సంబంధించి గిన్నిస్ వారికి ప్రతిపాదించనున్నట్లు మారుతీరావు పేర్కొన్నారు. 2006 నుంచి ప్రయత్నం.. మారుతీరావు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నిరంతర విద్యాబోధన తరగతులు నిర్వహించారు. మొదటి సారిగా 2006లో 12 గంటల పాటు ఏకధాటిగా తరగతులు బోధించారు. 2007లో 15 గంటలు, 2008లో 18 గంటలు, 2009లో 24 గంటలు, 2010లో 36 గంటలు, 2011లో 50 గంటలు, 2012లో 60 గంటలు, 2013లో 75 గంటల పాటు తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం 150 గంటలు విద్యాబోధన చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన 150 గంటలపాటు నిర్విరామ విద్యాబోధన చేసిన లెక్చరర్ మారుతీరావును జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి అభినందించారు. ఆదివారం జహీరాబాద్‌లో నిర్వహించిన ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి గంటపాటు తరగతి గదిలో కూర్చుని పాఠాలు విన్నారు. -
కామంధుల చేతుల్లో బలైన జంట
డెహ్రడూన్: దీపావళి పండుగను జరుపుకునేందుకు డెహ్రడూన్ వచ్చిన యువతీయువకులు కామాంధుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన మౌమిత దాస్(27), ఆమె స్నేహితుడు అవిజిత్ పాల్(24) గతనెల 21న డెహ్రడూన్ వచ్చారు. రెండు రోజుల తర్వాత వీరు కనిపించకుండాపోయారు. తర్వాత పాల్ మృదేహం ఉత్తరకాశీలోని పరోలా ప్రాంతంలో బయటపడింది. దీంతో పాల్ వెంట వెళ్లిన తన కూతురు కోసం మౌమిత తండ్రి అక్టోబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయడంతో చిక్కుముడి వీడింది. అక్టోబర్ 23న టైగర్స్ పాల్స్ కు వెళ్లి ట్యాక్సీలో తిరిగొస్తున్న మౌమితను డ్రైవర్ రాజు రేప్ చేసి హత్య చేశాడు. అంతకుముందే రాజు, అతడి స్నేహితులు బబ్లూ, గుడ్డు, కుందన్... అవిజిత్ ను గొంతునులిమి చంపేశారు. అవిజిత్ మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి కొండ మీద నుంచి కిందకు పడేశారు. ఇంటరాగేషన్ లో నిందితులు నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. మౌమిత మృతదేహాన్ని లఖమండల్ వద్ద యుమనా నదిలో పడేసినట్టు నిందితులు తెలపడంతో గాలింపు చేపట్టారు. -
తొమ్మిదో తరగతి పిల్లలు.. పెళ్లికోసం జంప్!
డెహ్రాడూన్: దేశంలో అత్యంత పేరు ప్రతిష్టలు గల డూన్ స్కూలు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఈనెల 14న అదృశ్యమయ్యారు. వాళ్లలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడకు, ఎందుకు వెళ్లారో తెలుసా? ముంబై వెళ్లి, హాయిగా పెళ్లి చేసుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని వెళ్లారు!! స్కూలు యాజమాన్యం విద్యార్థుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చేతిలో సొమ్ము ఖాళీ కావడం, ఆకలి వేయడంతో ఓ జంట తిరిగి స్కూలుకు తిరిగొచ్చింది. ఆ జంటను విచారించగా పెళ్లి చేసుకుని... ముంబైలో పెద్ద ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు చెప్పారు. దీంతో హతాశులైన విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆర్ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎంసీ)లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హామీ ఇచ్చారని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం సచివాలయంలో పీఆర్టీయూ-తెలంగాణ నేతలు సీఎస్‌ను కలిశారు. -
కాల్చే ఎండలు.. కరెంటు కోతలు!
యూపీలో విలవిల్లాడుతున్న ప్రజలు సబ్స్టేషన్లపై దాడి; విద్యుత్ అధికారుల నిర్బంధం మరో వారంపాటు ఇదే పరిస్థితంటున్న అధికారులు లక్నో: భానుడి భగభగలతో ఉత్తర భారతం మండిపోతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీల్లో శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీలోని అలహాబాద్‌లో 48.3 డిగ్రీలు, లక్నోలో 47 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 47.3 డిగ్రీలతో గత 11 ఏళ్లలో రికార్డు ఉష్ణోగ్రత నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో 44.9 డిగ్రీల అత్యధిక.. 30.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. జూన్ 10 వరకు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో వేడిమి ఈ వేసవిలోనే అత్యధికంగా 46.8 డిగ్రీలుగా ఉంది. ఎడారి ప్రాంతం చురులో 47.6, బికనూర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత హిల్‌స్టేషన్ డెహ్రాడూన్‌లోనూ శనివారం ఎండలు మండిపోయాయి. భరించలేని ఉష్ణోగ్రత, ఉక్కపోతలకు గంటల తరబడి విద్యుత్ కోతలు తోడవడంతో ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అల్లాడుతున్నారు. మీరట్, వారణాసి, సుల్తాన్పూర్, కాన్పూర్ సహా దాదాపు రాష్ట్రమంతా శనివారం సగటు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. యూపీలోని గ్రామాల్లో 2 నుంచి 3 గంటలు, పట్టణాల్లో 10 - 12 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల ప్రజలు విధ్వంసానికి దిగారు. లక్నో దగ్గర్లోని ఒక సబ్‌స్టేషన్‌పై దాడిచేసి పలువురు ఉద్యోగస్తులను నిర్బంధించారు. గోరఖ్‌పూర్, గోండ ప్రాంతాల్లో సబ్స్టేషన్లను తగలబెట్టారు. యూపీలో సాధారణంగానే విద్యుత్ డిమాండ్ కన్నా సరఫరా తక్కువగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పుడు డిమాండ్ మరింత పెరగడంతో అనధికార కోతలను అధికారులు అమలు చేస్తున్నారు. మరో వారంపాటు విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోవచ్చని ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ప్రకటించింది. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వాటికి తోడు తీవ్రస్థాయి వేడిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయని నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. షాజపూర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. -
మంచుకొండలలో...భక్తిధామాలు
మంచు దుప్పటి కప్పుకున్న హిమగిరులు భానుని కిరణాల స్పర్శతో మేలుకునే వేళ... వడివడిగా ఉరకలెత్తే నదీ నదాలు కొండల మీదుగా దుమికే వేళ... ఆ లోయలలోని సౌందర్యాలను కనుల నిండుగా నింపుకోవాల్సిందే! భక్తికి, ముక్తికి సోపానమయ్యే హరిహరాదుల ఆలయ సందర్శన వేళ... అడుగడుగునా ఆధ్యాత్మికత సౌరభాలు ప్రతి మదినీ తాకుతున్న వేళ... ఆ ఆనందాన్ని మది నిండుగా నింపుకోవాల్సిందే! చార్ధామ్... జీవిత కాలంలో ఒక్కసారైనా చేసితీరాలని ప్రతి హిందువూ కోరుకునే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్‌లను దర్శించుకొని, తరించాలని తపించే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. మే నెల నుంచి నవంబర్ వరకు అనుమతించే ఈ యాత్రకు కిందటి నెలలోనే సింహద్వారాలను తెరిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వైశాఖమాసం శుక్లపక్షం అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మరో రెండు ప్రసిద్ధ దేవస్థానాలైన కేదార్నాథ్, బదరీనాథ్‌లను కూడా కిందటి నెల 4, 5 తేదీల్లో తెరిచి, పూజలు నిర్వహించారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిరుడు ప్రకృతి విపత్తు మూలంగా చార్ధామ్ యాత్ర పర్యాటకులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ విషాదం నుంచి తేరుకొని, తిరిగి యథావిధిగా యాత్రకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థలు సైతం యాత్రికులకు సౌకర్యాల కోసం కృషి చేస్తున్నాయి. గత ఏడాది విపత్తు ఎలా జరిగింది? ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టింది? అనే ఉత్సుకతతోనూ, ప్రకృతి రామణీయకతను ఎద నిండా నింపుకోవడానికి వేల సంఖ్యలో ఈ యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ నాలుగు ధామాల గురించిన సమాచారం తప్పక తెలుసుకోవాలి. ఉత్తరకాశీ నుంచి ఈ యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా వెళ్లి బదరీనాథ్తో పూర్తవుతుంది. చాలామంది హరిద్వార్‌తో ఈ యాత్రను ప్రారంభిస్తారు. మన రాష్ట్రం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఢిల్లీ నుంచి లేదా రిషీకేశ్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకు పర్యాటకరంగం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ప్రైవేటు టూరిస్టులు కూడా తమ సర్వీసులను నడుపుతున్నారు. ముందుగా యమునోత్రి.. ఉత్తరాఖండ్ గర్హ్వాల్లో ఉన్న యమునోత్రికి డెహ్రాడూన్ మీదుగా వెళ్లాలి. యమునోత్రి సముద్రమట్టానికి 3164 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరకాశికి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం మరో 7 కి.మీ దూరంలో ఉందనగా జానకీ చట్టి అనే ప్రాంతం దగ్గర వాహనాలు నిలుపుతారు. ఇక్కడ నుంచి కాలినడకన లేదా గుర్రం మీద లేదా డోలీలో గానీ వెళ్లాల్సి ఉంటుంది. ఉష్ణం, చలితో కూడిన మధ్యస్థమైన వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. యమునోత్రి నుంచి 130 కి.మీ ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు. తదుపరి గంగోత్రి... గంగోత్రి సముద్రమట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడ గంగను హిమనీనదంగా పిలుస్తారు. ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని17 కి.మీ దూరం కాలినడకన వెళ్తే గోముఖం ఉంటుంది. ఇక్కడే గంగామాతను భగీరథిగా పేర్కొంటారు. ఇక్కడ నుంచి అలకనందా నదితో కలిసిన చోటు నుంచి గంగానదిగా పిలుస్తారు. జ్యోతిర్లంగం... కేదార్నాథ్ ఉత్తరకాశీ నుంచి తెహ్రీ డ్యామ్ మీదుగా గౌరీకుండ్‌కు చేరుకొని, అక్కడి నుంచి 14 కి.మీ దూరం కాలినడకన, గుర్రం లేదా డోలీలో కేదార్నాథ్ చేరుకోవచ్చు. శివుడి పన్నెండో జ్యోతిర్లంగం ఉన్న మందిరమే కేదార్నాథ్. హిమాలయ పర్వత శ్రేణులలో సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో మూడు కొండల మధ్య వెలసింది ఈ ఆలయం. మూడు కొండల నుంచి మూడు నదులు కిందికి వచ్చి కలిసిపోయి ఒకే నదిగా మారిపోయే దృశ్యం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. మందాకినీ నది ఒడ్డున వెలసిన కేదార్నాథ్ ఆలయం అత్యంత చీకటిగా ఉంటుంది. దీపం వెలుగులోనే శివుడి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో పాండవులతో పాటు ద్రౌపది విగ్రహం కూడా ఉంది. కేదార్నాథ్ దగ్గర దాదాపు వెయ్యి మంది యాత్రికులు ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. లించోలిలో హెలిప్యాడ్‌తో పాటు బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కేదార్నాథ్ నుంచి 75 కి.మీ కిందకు దిగి, అక్కడ నుంచి బద్రీనాథ్ ఆలయం చేరుకోవడానికి హిమాలయాల పైకి వెళ్లాలి. రేగుపండు... బదరీనాథ్... కేదార్నాథ్ నుంచి బదరీనాథ్ ఆలయానికి 203 కి.మీ దూరం ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ఇది. సముద్రమట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బదరీ అంటే రేగుపండు. నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలసిన దేవునికి బదరీనాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాల సమస్త దేవతలు నివసిస్తారని హిందువుల నమ్మకం. చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో అలకనందా నది ఒడ్డున, గఢ్వాల్ కొండలలో కేదార్‌నాథ్‌కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది బదరీనాథ్ ఆలయం. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లలో ఇది మొదటిది. బదరీనాథ్ మార్గంలో హిమాలయాల మధ్య ఓ అందమైన పూలవనం ఉంది. దీన్నే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. జోషీ మఠ్, అలకనందా నదిపై జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు. పటిష్ఠమైన భద్రత మధ్య ప్రయాణం పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత హిమాలయపర్వత శ్రేణులలో నమోదవుతుంది. యాత్ర మధ్యలో ఒక్కోసారి కొన్ని గంటల పాటు ప్రయాణానికి వీలుపడదు. అకస్మాత్తుగా అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పటిష్టమైన చర్యలను చేపట్టింది. ప్రయాణికుల అనారోగ్య సమస్యలను తీర్చడానికి మార్గమధ్యంలో ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా భక్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. వాతావరణ హెచ్చరికలు వారికి ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఇటీవల యాత్ర మొదలైన రెండు రోజులకే మంచు చరియలు విరిగిపడి కొన్ని రోజులు యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే మరిన్ని రక్షణ చర్యలను తీసుకొని యాత్రను పునరుద్ధరించారు. చార్ధామ్ యాత్రను సఫలం చేయడానికి గౌరీకుండ్, కాశీపూర్, రుద్రపూర్, భవాలీ, నైనిటాల్, హల్ద్వానీ డివిజన్లలో వందలాది మంది గాంగ్మెన్లు, కూలీలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. శ్రామికులతో పాటు రోలర్, టిప్పర్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లేదారిలో స్వచ్చంద సంస్థలు వెయ్యిమంది యాత్రికులకు సరిపడా భోజనవసతి కల్పించడానికి ముందుకు వచ్చాయి. హిమాలయ ప్రాంతాల్లో వర్షం, మంచు కురియడం వల్ల ఎప్పుడైనా రోడ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వెంట ఇవి తప్పనిసరి యాత్రికులు తమ వెంట అవసరమైన మందులు, బ్లాంకెట్స్, స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, శాలువా, రెయిన్‌కోట్, స్పోర్ట్ షూస్, టార్చ్‌లైట్.. తీసుకెళ్లాలి. - సాక్షి విహారి టూరు ప్యాకేజీ వివరాలు... స్వర్గధామంగా పేర్కొనే చార్ధామ్ యాత్రకు మన రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులు ఢిల్లీ, రిషీకేష్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకోసం పర్యాటకరంగం టూర్‌ప్యాకేజీలను అందిస్తోంది. రిషీకేష్ నుంచి యమునోత్రి -గంగోత్రి- కేదార్నాథ్ - బద్రీనాథ్ వెళ్లి... తిరిగి రిషీకేష్ చేరుకోవడానికి 10 రోజుల యాత్రకు... మే-జూన్ వరకు గాను ఒక్కొక్కరికి పెద్దలకు రూ.16280/-, పిల్లలకు రూ.15600/-, వృద్ధులకు రూ.15260/- చెల్లించాల్సి ఉంటుంది. జూలై - నవంబర్ యాత్రకు పెద్దలకు రూ.14670/-, పిల్లలకు రూ.14050/-, వృద్ధులకు రూ.13750/- చెల్లించాలి. మరిన్ని వివరాలకు: బాలయోగి పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్, ఫోన్ నెంబర్: 040-23409945, 23400254, మొబైల్ నెం: 09493982645, email: gmvnhyderabad@gmail.com లలో సంప్రదించవచ్చు. ప్రకృతి రామణీయకత... వేసవిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది కనుక వేడికి హిమపాతం తగ్గుముఖం పడుతుంది. దీంతో కొండలు, లోయలు, చెట్లు, నదులు, ప్రవాహాలు.. అడుగడుగునా మనల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. ప్రకృతి ప్రేమికులు ఈ యాత్రను ఎంతగానో ఆనందించవచ్చు. ఇందుకోసమే ఎందరో విదేశీయాత్రికులు ప్రతియేటా చార్ధామ్ యాత్రకు వస్తుంటారు. -
పేదవారి ఊటీ... కొల్లి మలై
వేసవి కాలం కుటుంబంతో కలసి సెలవులు హాయిగా, చల్లగా ఆస్వాదించాలనగానే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్, కులూ మనాలి లాంటివి గుర్తొస్తాయి. దక్షిణాదిలోనే చూద్దామనుకుంటే ఊటీ, కొడెకైనాల్ లాంటి వాటికి తప్ప వేరే సరికొత్త హిల్ స్టేషన్లు మనసులోకి రావు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - ‘కొల్లి మలై’గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పర్యాటకుల తాకిడికి ఇంకా పెద్దగా లోనుకాని ప్రాంతమిది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం కేవలం 1500 మీటర్ల ఎత్తున ఉంటుంది. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు ఇది నిలయం. ప్రాథమికంగా ఈ కొల్లి హిల్స్‌లో ‘మలయాళీ గిరిజనులు’గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. పట్టణ ప్రాంతపు నవ నాగరికులు ఎవరూ ఉండరు. అందుకే, ఈ కొల్లి హిల్స్‌కు కేంద్రస్థానమైన సెమ్మేడులో కూడా మనకు అపరిశుభ్రమైన రహదారులు కానీ, బహిరంగంగా ప్రవహించే మురుగు నీరు కానీ కనిపించవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులు కూడా ఎంతో సంస్కారయుతంగా ఉంటారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు. ఆ కొండ కోనల అభివృద్ధిలో చదువు కీలక పాత్ర పోషించిందని అనుకోవచ్చు. ఒక్కసారి గతంలోకి వెళితే, కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తావన ప్రాచీన తమిళ రచనలైన ‘శిలప్పదికారం’, ‘మణిమేఖలై’, ‘పురననూరు’, ‘ఐన్కుర్నూరు’ లాంటి వాటిలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని వసతులూ ఉండేవనీ, అందరికీ ప్రాథమిక విద్య ఉండేదనీ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇవాళ్టికీ కొనసాగుతోంది. ఈ కొండల్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా కొత్త పనులు చేపడుతుంటారు. ఇక, ఈ కొల్లి హిల్స్‌కు ఒకప్పటి పాలకుడైన వాళ్విల్ ఒరి ఎంతో ముందుచూపున్న మనిషి అని ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావన ఉంది. దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఈ కొండ ప్రాంతం, ఇక్కడి ప్రజలపై ఆయన ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది... చలి పెట్టదు! మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి భిన్నంగా కొల్లి హిల్స్ ప్రశాంతంగా ఎండాకాలంలో కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అనువుగా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. అందుకే, వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. పైగా, ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని ‘పేదవాళ్ళ ఊటీ’ అని పిలుస్తుంటారు. చుట్టుపక్కల చూడదగ్గవెన్నో! నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేసే ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా, సాహసోపేతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం కేవలం 15 కి.మీ.లే. కానీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 73 మలుపులతో ఉంటుందా మార్గం. పగటి పూట ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కొండల సౌందర్యాన్ని కళ్ళారా చూడవచ్చు. కెమేరాతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కొల్లి హిల్స్ పైకి చేరాక, అక్కడ ఉన్నంతలో పెద్ద పట్నం - సెమ్మేడు. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాలకు తిరిగి రావచ్చు. సెమ్మేడులోనే హోటళ్ళు, రిసార్టులు ఉంటాయి. సెమ్మేడుకు 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఋతుపవనాలు వచ్చి, తొలకరి జల్లులు కురిశాక, ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! ఇక్కడకు దగ్గరలోనే ప్రాచీన సంగ కాలానికి చెందిన ఆరపాలీశ్వర ఆలయం ఉంది. ఈ శివుడి గుడి ఎంతో మహిమాన్వితమైనదని స్థానికుల నమ్మకం. ఈ ‘పేదవారి ఊటీ’ని అభివృద్ధి చేయవచ్చని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గడచిన ఏడేళ్ళుగా ఆ పనిలో ఉంది. పర్యాటక స్థలంగా కొల్లి హిల్స్‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే, ఈ కొండల మీద ఓ రెండు వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని చూస్తోంది. అవే గనక సిద్ధమైతే, పర్యాటకులకు మరింత ఆకర్షణ తోడవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ వరం. ఇక్కడ సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సహజంగా పండించి, అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి తోటలు పుష్కలం. మిరియాలు, కాఫీ లాంటి వాణిజ్య పంటలు ఈ కొండల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దిగుబడి. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు గుర్తుగా ఇలాంటివి కొని తీసుకువెళ్ళచ్చు. గిరిజనుల పవిత్ర అరణ్యాలు మరో విశేషం ఏమిటంటే, ఈ కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్’లో పనిచేస్తున్న డాక్టర్ ఇజ్రాయెల్ ఆలివర్ కింగ్ ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే ఈ అడవులపై పిహెచ్.డి. చేశారు. ‘‘పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఎవరినీ గిరిజనులు అనుమతించరు. ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు. ఈ కొండలకే పరిమితమైన ఈ విలక్షణ ఆచారం, పవిత్ర అరణ్యాలనే ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు’’ అని కింగ్ వివరించారు. కొల్లి హిల్స్‌లోని ఈ మలయాళీ గిరిజనులు నేరాలకు పాల్పడరు. అందుకే, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినట్లు పెద్దగా ఎప్పుడూ వినం. అయితే, ఇక్కడ జరిగే ఒకే ఒక్క నేరం - వ్యభిచారం. గమ్మత్తేమిటంటే, అలా వ్యభిచరిస్తూ పట్టుబడిన జంట పంది మాంసం వండి, మొత్తం గ్రామ ప్రజలకు విందు పెట్టడమే శిక్ష! ఎలా వెళ్ళాలంటే... తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేలమ్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. చక్కటి రైలు మార్గం కూడా ఉంది. మరింకేం! ఈ ‘పేదవారి ఊటీ’కి వెళ్ళి, ప్రకృతిలో తాదాత్మ్యం కండి! * తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. * కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. * పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి * ఎవరినీ ఇక్కడి గిరిజనులు అనుమతించరు. - కె. జయదేవ్ (ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, చలనచిత్ర రూపకర్త. సైన్స్ పత్రిక ‘నానో డెజైస్ట్’కు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.) -
హైదరాబాద్‌కు చేరుకున్న జగన్
-
డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు కోర్టు అనుమతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. డెహ్రాడూన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆయన డెహ్రాడూన్ వెళ్లీ రావచ్చు. -
డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువ ప్రొఫెసర్ 130 గంటలపాటు (5 రోజులకు పైగా) నిరాఘాటంగా పాఠాలు బోధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. నిరాఘాటంగా పాఠాలు బోధించడంలో ఇప్పటి వరకు పోలాండ్ ఉపాధ్యాయుడి పేరుతో ఉన్న రికార్డును(121 గంటలు) అధిగమించారు. వివరాలు.. 26 ఏళ్ల అరవింద్ మిశ్రా స్థానిక గ్రాఫిక్ ఎరా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నిరాఘాట బోధనలో ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో మెకానికల్ ఇంజనీరింగ్ అంశాన్ని 130 గంటలపాటు నిరాఘాటంగా బోధించారు. వర్సిటీలోని ఎంబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ప్యానల్ హాజరై యువ ప్రొఫెసర్ బోధన పట్ల అచ్చరువొందింది. కాగా, మిశ్రాను వర్సిటీ చైర్మన్ పొగడ్తలతో ముంచెత్తి రూ. లక్ష రివార్డు అందజేయడంతోపాటు పదోన్నతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. -
డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల అరవింద్ మిశ్రా ఏకధాటిగా అత్యధిక సమయం బోధించిన టీచర్‌గా ఘనత సాధించారు. మెకానికల్ ఇంజనీరింగ్ బోధించే మిశ్రా.. ఇదే అంశంలో ఏకధాటిగా 130 గంటలకు పైగా ఉపన్యాసం ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆయన రికార్డు నెలకొల్పారు. ఇంతకుముందు ఈ రికార్డు పోలెండ్ టీచర్ ఎరోల్ ముజవాజి పేరిట నమోదైంది. ఆయన 2009లో వరుసగా 121 గంటల పాటు బోధించారు. -
ఫేస్బుక్ తెచ్చిన తంటా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత
డెహ్రాడూన్: సదాశయంతో నెలకొల్పిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, తప్పుడు ప్రచారాలకు కూడా వాడుకుంటున్నారు. ఓ మత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఓ యువకుడు ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓ మతానికి చెందిన ప్రజలు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారని అడిషనల్ డీజీ రామ్ సింగ్ మీనా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరగినట్టు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని చెప్పారు. ఫేస్బుక్లో 26 ఏళ్ల రాజీవ్ అనే వ్యక్తి ఫొటోలు ఉంచినట్టు గుర్తించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. -
విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి: థరూర్
డెహ్రడూన్: నేరమయ రాజకీయాలు అంతంకావాలంటే నాగరిక, విద్యాధిక సమాజం చొరవ చూపాలని కేంద్ర మంత్రి శశి థరూర్ పిలుపునిచ్చారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. ఇటువంటి వారు ప్రజలకు ప్రాతినిథ్యం వహించినప్పుడే రాజకీయాలు బాగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక డూన్ పాఠశాల విద్యార్థులతో థరూర్ ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసు ఉందని ఆయన తెలిపారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మంచివారు రాజకీయాల్లోకి రావాలన్నారు. -
తెలుగు బాగా నేర్చుకున్నాను : లావణ్య త్రిపాఠి
‘‘మాది డెహ్రాడూన్. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారిగా అడుగుపెట్టా. అప్పట్నుంచీ తెలుగు నేల, తెలుగు సినిమా అంటే బాగా ఇష్టం ఏర్పడిపోయింది. అందుకే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఒక్కసారి డైలాగ్ వింటే తిరిగి చెప్పగలిగే స్థాయిలో తెలుగు నేర్చుకున్నాను’’ అని చెప్పారు లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె ‘దూసుకెళ్తా’లో విష్ణుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌ని ముందుకు దూసుకెళ్లేలా చేస్తుందని నమ్మకం కనబరిచారు. మంగళవారం లావణ్య త్రిపాఠి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘‘అందాల రాక్షసి’ తర్వాత విభిన్న పాత్ర కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘దూసుకెళ్తా’లో అవకాశం వచ్చింది. ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ అలేఖ్య. హీరో విష్ణు, దర్శకుడు వీరు పోట్ల అన్ని విషయాల్లో చక్కటి సలహాలిచ్చారు’’ అని చెప్పారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ తన అభిమాన కథానాయకలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని, తెలుగులో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయని లావణ్య తెలిపారు. -
మట్టి దిబ్బల కింద 1.9 కోట్ల మనీ!
డెహ్రాడూన్: మృతదేహాల కోసం వెతుకుతుంటే.. రూ.కోట్ల మనీ దొరికింది.. వరద విలయంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాలు శవాల దిబ్బగా మారడం తెలిసిందే. మృతదేహాల కోసం మట్టి దిబ్బల కింద గత వారం గాలిస్తుండగా ఆలయ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లాకర్ దొరికింది. వరదల్లో ఆలయం పక్కనున్న ఎస్బీఐ ఆఫీసు నుంచి ఇది కొట్టుకుపోయింది. చివరికి ఇలా దొరికింది. డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఎస్బీఐ అధికారులు శనివారం దాన్ని తెరచి అందులో ఉండాల్సిన రూ.1.9 కోట్లు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. -
వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ
-
డెహ్రడూన్ లో వైఎస్సాఆర్ సీపీ సేవలు