మద్యం మత్తులో ఓ బహిష్కృత ఎమ్మెల్యే హల్‌చల్ చేశారు. మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు తుపాకులను చేతపట్టుకుని చిందులు వేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్ ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పురాలేదు. కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. కాలు ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆయన మద్దతు దారులతో కలిసి చిందులు వేశారు.