డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్ జిల్లాలోని మడ్‌కట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని గాలిస్తున్నామని ఆయన తెలిపారు.
#cloudburst in Uttarakhand's Tanga Village in #Pithoragarh , reports suggest 3 people burried under debris and 11 people yet to be traced. pic.twitter.com/9OLWxa2aro
— Utkarsh Singh (@utkarshs88) July 20, 2020
Comments
Please login to add a commentAdd a comment