Heavey rains
-
‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'
More than 30,000 people were evacuated from their homes in Malaysia మలేషియా: దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు. డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చదవండి: మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో.. -
మందులు కొనుగోలు చేయలేని దీనస్థితి.. ప్రాణం తీసిన పేదరికం
నార్నూర్: జ్వరం వస్తే వైద్య పరీక్షలు చేయించుకునేంత కూడా ఆర్థిక స్థోమతలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. వారం రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతున్నా మందులు కొనుగోలు చేయలేని దీనస్థితిలో ఇంటి ఇల్లాలిని కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధి ముక్తాపూర్ కొలాంగూడ గ్రామంలోని కొలాం గిరిజన తెగకు చెందిన మహిళ ఆత్రం ధర్మిబాయి(37) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె వారం రోజులగా టైఫాయిడ్‌తో బాధ పడుతోంది. రెండు రోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించాడు. కాని నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక ఎలాంటి పరీక్షలు చేయించలేదు. చివరికి మందులు కూడా కొనుగోలు చేయకుండా ఇంటికి తిరిగొచ్చారు. మరునాడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా భారీ వర్షం కారణంగా సాధ్యపడలేదు. పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి భర్త నాగోరావు, ఇద్దరు కతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
జలదిగ్బంధంలో భైంసా పట్టణం
నిర్మల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల ధాటికి భైంసా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తోంది. వరద తీవ్రత ఎక్కువ కావడంతో భైంసా పట్టణం ఆటోనగర్‌లోని 60 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరన్ రెడ్డి పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా రెస్క్యూ టీం నాటు పడవలతో సహాయక చర్యలు ప్రారంభించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురువడంతో.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. గ్రామాల్లో మురుగుకాల్వలు, ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. -
ఉత్తరాఖండ్‌లో వరదలు: ముగ్గురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్ జిల్లాలోని మడ్‌కట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని గాలిస్తున్నామని ఆయన తెలిపారు. #cloudburst in Uttarakhand's Tanga Village in #Pithoragarh , reports suggest 3 people burried under debris and 11 people yet to be traced. pic.twitter.com/9OLWxa2aro — Utkarsh Singh (@utkarshs88) July 20, 2020 -
నేటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సారంగాపూర్, బజర్హతనూర్‌ల్లో 7 సెం.మీ., దిల్వార్పూర్, వంకడి, ఖానాపూర్‌ల్లో 6 సెం.మీ., కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట, భూపాలపల్లి, మోర్తాడ్, బోథ్, మంథని, నవీపేట్‌ల్లో 5 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాజస్తాన్‌లో టెంట్‌కూలి 14 మంది మృతి
-
ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్మీర్ జిల్లాలో టెంట్ (గుడారాలు) కూలి 14 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం సంభవించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో మరికొంతమంది మరణించినట్లు సమాచారం. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు ఉన్నట్లు తెలస్తోంది. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. ప్రధాని మోడీ దిగ్ర్బాంతి బార్‌మీట్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాకు అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. -
వానొచ్చే.. వరదొచ్చే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు తోతట్లు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 72.10 మీటర్లకు చెరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 74, 440 క్యూసెక్కుల కాగా, ఔట్ ఫ్లో 75, 440 క్యూసెక్కుల చేరుతోంది. భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 404 అడుగులకు చేరింది. సత్తుపల్లిలోని జీవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీళ్లు చేరడంతో 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 5.04 సెం.మీ, పెనుబల్లిలో 5.86 సెం.మీ వేంసూరు 3.64, కల్లూరు 3.58 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోని నీటి ప్రవహం ఎక్కువగా ఉండటంతో 5 గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలతో గుండివాగు, తుంపల్లివాగులు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్‌లోని ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో డోర్లి 1, 2 ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 20.175 టీఎంసీలకు కాను ప్రస్తుత నీటి మట్టం 18.50 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తికి నీటి మట్టం చేరనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,60,190 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 80,023 క్యూసెక్కులు. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆత్యధికంగా బీర్పుర్, జైన, కోల్వాయిర్లో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎండపల్లి, గుల్లోటలో 24 సెం.మీ, ధర్మపురిలో 22.9, సిరికోండ 22 సెం.మీల వర్షపాతం నమోదైంది. ధర్మపురి మండలం ఆయసాయిపల్లె వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో 63వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.34 టీఎంసీలకు చేరింది. ఎగువన ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద మరితం పెరిగే అవకాశం ఉంది. డిచ్పల్లి, భీమ్‌గల్, వేల్పుర్ మండలాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం నమోదైంది. బాన్సువాడ, బిర్కూర్, నసురుల్లబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెండొరా మండలంలో 105.2 మి.మీ, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో 80 మి.మీ వర్షపాతం నమోదైంది. -
పై-లీన్.. టెన్షన్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: బంగాళఖాతం ఏర్పడిన పెనుతుపాన్ ైపై-లీన్ తీరంవైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిశాలోని పారా దీప్ మధ్య శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి లోపు తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ తీరం దాటే సమయంలో 200 నుంచి 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో నష్టతీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాదసూచిక ఎగురవేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సెట్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. పత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోలు రూం(0861-2331477) ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు. విధుల్లో రెవెన్యూ సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇప్పటివరకు సమ్మెలో ఉన్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు. ఏజేసీ పెంచలరెడ్డి, డీఆర్వో రామిరెడ్డి, ఆర్డీఓలు, తహశీల్దార్లు, సిబ్బంది శుక్రవారం విధుల్లో చేరారు. తీరంలో అప్రమత్తం ముత్తుకూరు: పై-లీన్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలోని వాతావరణ పరిశోధన స్థానం అధికారుల సూచన మేరకు కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాదసూచికను ఎగురవేశారు. తుపాన్ కారణంగా ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈ సూచిక సారాంశం. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన మరపడవలు పోర్టుకు చేరాయి. కొన్ని ఫైబర్‌బోట్లను బకింగ్‌హాం కాలువలో కట్టేశారు.