Three people dead
-
ఉత్తరాఖండ్‌లో వరదలు: ముగ్గురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్ జిల్లాలోని మడ్‌కట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని గాలిస్తున్నామని ఆయన తెలిపారు. #cloudburst in Uttarakhand's Tanga Village in #Pithoragarh , reports suggest 3 people burried under debris and 11 people yet to be traced. pic.twitter.com/9OLWxa2aro — Utkarsh Singh (@utkarshs88) July 20, 2020 -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ... ముగ్గురి మృతి
కల్హేర్ (నారాయణఖేడ్): ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(బి) వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాన్‌పల్లి బుగ్యా నాయక్ తండాకు చెందిన కేతవత్ సంగ్యనాయక్ (50), అతని భార్య సంతెలిబాయి (45), కుమారుడు అనిల్ (15) బాచేపల్లి నుంచి బైక్‌పై వస్తున్నారు. సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై ఖానాపూర్ (బి) వద్ద వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ నడుపుతున్న సంగ్యనాయక్, అతని కొడుకు అనిల్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయలైన సంతెలిబాయిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని మి ర్యాలగూడ, చిట్యాల మండలాల పరి ధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మిర్యాల గూడ పట్టణం సీతారాంపురానికి చెందిన రామకృష్ణ,(32), శాబునగర్కు చెందిన ఎలియాజ్(33), నిమ్మకాయల ప్రవీణ్ స్నేహితులు. వీరు పనినిమిత్తం గురువా రం రాత్రి బైక్‌పై కిష్టాపురానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తెల్లవారుజామున మిర్యాలగూడకు బయలుదేరారు. కిష్టాపురం శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రామకృష్ణ, ఎలియాజ్లు అక్కడికక్కడే మృతిచెందగా, నిమ్మకాయల ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అటు నుంచి హైదారాబాద్ తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సర్ధార్‌నాయక్ తెలిపారు. కూతురును కాలేజీలో చేర్పించి వస్తూ.. పెద్దకాపర్తి(చిట్యాల) : హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన తువారి వెంకట సూర్యనారాయణ(42) తన కూతురు దీపికను శ్రీచైతన్య ఇంటర్ కాలేజీలో చేర్పిం చేందుకు గురువారం భార్య రజని, బావమరిది సతీష్‌లతో కలిసి విజయవాడకు వెళ్లాడు. కూతురును కాలేజీలో చేర్పించిన అనంతరం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వా హనం మండలంలోని పెద్దకాపర్తి శివారు మహాత్మాగాంధీ గుడి వద్దకు రాగానే నిలి చిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెంకటసూర్యనారాయణ, ఇన్నోవా డ్రైవర్ పాల వెంకటేశం వాహనం నుంచి కిందకు దిగారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్వాలిస్ వాహనం రోడ్డుపై ఉన్న ఇద్దరినీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట సూర్యనారా యణ అక్కడికక్కడే మృతి చెందగా పాల వెంకటేశానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటేశాన్ని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంకటసూర్యానారాయణ మృ తదేహానికి రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన క్వాలిస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిట్యాల ఏఎస్ఐ యాదగిరి తెలిపారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
సాక్షి, కడప : స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాదులో రెండు రోజుల క్రితం ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. హైదరాబాదు నుంచి వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అంతటా వైద్యాధికారులు అలర్ట్ అయ్యూరు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఏఎన్ఎంలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాకు చేరిన మందులు జిల్లాకు స్వైన్ ఫ్లూకు సంబంధించిన మందులు ఇది వరకే చేరాయి. హైదరాబాదు నుంచి చిన్నారులు, పురుషులు, మహిళలకు సంబంధించిన మందులు జిల్లాకు వచ్చినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అవసరమైతే ప్రత్యేక వార్డులను కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. 2008-09లో నాలుగు కేసులు జిల్లాలో 2008-09 ప్రాంతంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో స్వైన్‌ఫ్లూ నలుగురికి సోకడంతో రిమ్స్‌లోని టీబీ వార్డుకు సమీపంలోనే ప్రత్యేకంగా ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో స్వైన్‌ఫ్లూ నలుగురికి సోకినా అందరూ మళ్లీ కోలుకున్నారు. అయితే 2009 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్‌లోని స్వైన్‌ఫ్లూ వార్డును కూడా సాధారణ వార్డుగా మార్చేశారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు జలుబు ఎక్కువగా ఉండడంతోపాటు దగ్గు, తలనొప్పి, గొంతులో గరగర, చలి, అలసట ఉండడం....విరేచనాలు, వాంతులతో నిమోనియా తరహాలో ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ ఉన్న వాళ్లకు కూడా త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. గుండె సంబంధిత వ్యాధులున్న వారు, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లలకు కూడా సోకే ప్రమాదముంది. నివారణ చేతులు తరుచూ సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం.... సరిపడా నిద్ర.... రోగ నిరోధక శక్తి పెంపునకు మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలి. కిటికీ, గదులకు సంబంధించి తలుపులు మూసి ఉంచుకోవాలి. తుమ్మినా, దగ్గినా, ఆవులించినపుడు చేయి లేదా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం చేయాలి. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.