మిర్యాలగూడ అర్బన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని మి ర్యాలగూడ, చిట్యాల మండలాల పరి ధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మిర్యాల గూడ పట్టణం సీతారాంపురానికి చెందిన రామకృష్ణ,(32), శాబునగర్‌కు చెందిన ఎలియాజ్(33), నిమ్మకాయల ప్రవీణ్ స్నేహితులు. వీరు పనినిమిత్తం గురువా రం రాత్రి బైక్‌పై కిష్టాపురానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తెల్లవారుజామున మిర్యాలగూడకు బయలుదేరారు.
కిష్టాపురం శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రామకృష్ణ, ఎలియాజ్‌లు అక్కడికక్కడే మృతిచెందగా, నిమ్మకాయల ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అటు నుంచి హైదారాబాద్ తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సర్ధార్‌నాయక్ తెలిపారు.
కూతురును కాలేజీలో చేర్పించి వస్తూ..
పెద్దకాపర్తి(చిట్యాల) : హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన తువారి వెంకట సూర్యనారాయణ(42) తన కూతురు దీపికను శ్రీచైతన్య ఇంటర్ కాలేజీలో చేర్పిం చేందుకు గురువారం భార్య రజని, బావమరిది సతీష్‌లతో కలిసి విజయవాడకు వెళ్లాడు. కూతురును కాలేజీలో చేర్పించిన అనంతరం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వా హనం మండలంలోని పెద్దకాపర్తి శివారు మహాత్మాగాంధీ గుడి వద్దకు రాగానే నిలి చిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెంకటసూర్యనారాయణ, ఇన్నోవా డ్రైవర్ పాల వెంకటేశం వాహనం నుంచి కిందకు దిగారు.
ఇదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్వాలిస్ వాహనం రోడ్డుపై ఉన్న ఇద్దరినీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట సూర్యనారా యణ అక్కడికక్కడే మృతి చెందగా పాల వెంకటేశానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటేశాన్ని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంకటసూర్యానారాయణ మృ తదేహానికి రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన క్వాలిస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిట్యాల ఏఎస్‌ఐ యాదగిరి తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
Published Fri, Jun 12 2015 11:25 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement