
సంగ్యనాయక్, సంతెలిబాయి, అనిల్(ఫైల్)
కల్హేర్ (నారాయణఖేడ్): ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(బి) వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాన్‌పల్లి బుగ్యా నాయక్ తండాకు చెందిన కేతవత్ సంగ్యనాయక్ (50), అతని భార్య సంతెలిబాయి (45), కుమారుడు అనిల్ (15) బాచేపల్లి నుంచి బైక్‌పై వస్తున్నారు.
సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై ఖానాపూర్ (బి) వద్ద వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ నడుపుతున్న సంగ్యనాయక్, అతని కొడుకు అనిల్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయలైన సంతెలిబాయిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment