మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌ | Suspended BJP MLA Dance With Weapons In Uttarakhand | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో బహిష్కృత ఎమ్మెల్యే

Published Wed, Jul 10 2019 1:52 PM | Last Updated on Wed, Jul 10 2019 2:10 PM

Suspended BJP MLA Dance With Weapons In Uttarakhand - Sakshi

మద్యం మత్తులో ఓ బహిష్కృత ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. మద్దతుదారులను...

డెహ్రాడూన్‌ : మద్యం మత్తులో ఓ బహిష్కృత ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు తుపాకులను చేతపట్టుకుని చిందులు వేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌ చాంపియన్‌ ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా పార్టీనుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పురాలేదు. కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో తుపాకులను పట్టుకుని డ్యాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్కారు. కాలు ఆపరేషన్‌ తర్వాత కోలుకున్న ఆయన మద్దతు దారులతో కలిసి చిందులు వేశారు. మద్యం తాగుతూ.. గన్నులను నోట్లో పెట్టుకుంటూ బాలీవుడ్‌ పాట‘‘ ముజ్‌కో రాణాజీ మాఫ్‌ కర్‌నా’’కు డ్యాన్స్‌ వేశారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలై పోలీసు అధికారుల దృష్టిలో పడింది. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఈ సంఘటనపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఆయుధాలకు లైసెన్స్‌ ఉందో లేదో తేల్చి, ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement