
డెహ్రాడూన్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 48 గంటల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ శ్వేతా చౌబే శనివారం ప్రకటించారు. ఈరోజు నాయంత్రం నుంచి సోమవారం 7 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని తెలిపారు. నిత్యవసర వస్తువులు మినహా మిగతా దుకాణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం 7 గంటలకు లాక్‌డౌన్ ఎత్తివేస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,177 ఉండగా, ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 14, 516 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
(భారత్: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు )
Comments
Please login to add a commentAdd a comment