
ఆ ప్రేమపక్షులు అభిమానికి దొరికిపోయారు!
విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే.
ముంబై: భారత డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా విరుష్కా జోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా.. ఒక వీరాభిమానికి దొరికిపోయారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా డెహ్రాడూన్‌లో ఈ జంట విహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో బాగా హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటో ఎక్కడ, ఏ సందర్భంలో తీశారనే వివరాలు కచ్చితంగా తెలియకపోయినా.. కొత్త సంవత్సరం వేడుకల్ని విరాట్-అనుష్క జంట కలిసి జరుపుకోబోతున్నదనేది ఈ ఫొటో ద్వారా స్పష్టమవుతోంది. కాగా, ఇటు అనుష్క, అటు కోహ్లి తాజా ట్విట్టర్ పోస్టులు కూడా ఒకింత ఆసక్తి రేపుతున్నాయి.
Merry Christmas everyone.
Ultimately, it's all about cherishing the simple things in life that truly bring peace 😇🙏🏼❤️ pic.twitter.com/nQN6GODZuj
— Anushka Sharma (@AnushkaSharma) December 27, 2016
Merry Christmas everyone. 🎄 🎄 I hope all of you have a great day. 👍 😊 pic.twitter.com/Cs1zAT2ZUM
— Virat Kohli (@imVkohli) December 25, 2016