‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది! | Healthcare Services Halted in Network Hospitals Across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది!

Published Tue, Apr 8 2025 5:21 AM | Last Updated on Tue, Apr 8 2025 5:21 AM

Healthcare Services Halted in Network Hospitals Across Andhra Pradesh

సమ్మెలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు.. వైద్యం కోసం పేద, మధ్యతరగతి వర్గాల తీవ్ర అవస్థలు

ఎప్పటినుంచో ప్రభుత్వానికి చెబుతున్నా ఫలితంలేదు.. 

అర్థంచేసుకోండి.. అంటూ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాల పోస్టర్లు 

ఆరోగ్యశ్రీని ప్రైవేట్‌ బీమా సంస్థలకు కట్టబెట్టేందుకే ఇదంతా అంటూ ప్రజలు ఫైర్‌ 

ప్రజారోగ్యంతో టీడీపీ కూటమి చెలగాటమాడుతోందని మండిపాటు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన పార్వతి భర్త సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్‌ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఎంతో కష్టం మీద రూ.7 వేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూపి, తన భర్త ఆపరేషన్‌ విషయం తెలిపింది.

ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడంలేదని, డబ్బులిస్తేనే చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీక భర్తను తీసుకుని పార్వతి తిరిగి ఇంటికి బయల్దే రింది. తన భర్తకు ఆపరేషన్‌ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానని, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరైంది. రూ.వేలు, రూ.లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తమకులేదని ఆవేదన చెందింది.  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ లేదు. ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు.. ఉచితంగా చికిత్సలు చేయలేం వెళ్లిపోండి..’ అన్న మాటలు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల దగ్గర సోమ­వారం వినిపించాయి. ఎంతో ఆశతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థా­లు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బిల్లులు సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం, బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవ­డంతో సోమవారం నుంచి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టాయి.

‘బకాయిలు చెల్లించా­లని వైద్యశాఖ అధి­కా­రుల ను­ంచి సీఎం వరకూ అందరినీ కలి­సి పలు దఫాలుగా కోరాం.. ఇబ్బందులను వివరించాం. ప్రతినెలా రూ.330 కోట్ల మేర వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మాకు అప్పులు మంజూరు చేయడంలేదు. ఈ పరి­స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. గత్యంతరంలేని పరిస్థి­తుల్లో సేవ­లు నిలిపేస్తున్నాం. అర్థం చేసుకోండి’.. అంటూ నెట్‌­వర్క్‌ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అతికించాయి.

ఎన్ని రకాలుగా అడిగినా పట్టించుకోని సర్కారు..
సోమవారం ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధి­­దా­­­రులను పథకం కింద యాజమాన్యాలు చేర్చుకోలేదు. నగదు రహిత సేవలు పూర్తిగా ఆపేశామని.. డబ్బులు కట్టి వైద్యసేవలు పొందాలని సూచించారు. దీంతో పేదరోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాస్తవానికి.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్‌ఎస్‌ కింద అన్ని రకాల వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపేశాయి. 

అయినప్పటికీ ప్రభుత్వంలో చల­నం లేకపోవడంతో సోమవారం (ఏప్రిల్‌ 7) నుంచి వైద్య­సేవలు ఆపేస్తామని నెలరోజుల ముందే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తమ సమస్యలపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశా ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. బిలు­­్లలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా మంజూరు చేయకపోతే సేవలు కొనసాగించబోమని ప్ర­భు­­త్వానికి తేలి్చచెప్పారు. ఇన్ని రకాలుగా ఆస్ప­త్రుల యాజమాన్యాలు హెచ్చరించినా ప్ర­భు­త్వం పట్టించుకోకపోవడంతో చేసేదిలేక సమ్మె­లోకి వెళ్లా­రు. ఆరోగ్య­శ్రీ అమలును బీమా రూపంలో ప్రై­వే­ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కట్టబెట్టడం కోస­ం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెల­గాటం ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నా­రు.

పేదలకు ఇబ్బందికరం.. 
నా కొడుకు ఐదేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవలు బందయ్యాయని చెప్పారు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. కార్పొరేట్‌ వైద్య­సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్య­లు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడం పేదలకు ఇబ్బందికరం.  – కె. సత్యవతి, జగన్నాథపురం, కాకినాడ 

గుండె నొప్పితో వస్తే ఉచిత సేవలు లేవన్నారు.. 
మూడ్రోజుల నుంచి ఆయాసం, గుండె నొప్పి­తో బాధపడుతున్నా. నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఓ ప్రైవేటు ఆçస్పత్రికి వచ్చాం. నా భర్త సంజీవరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్‌ పరీక్షలు చేసి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలన్నారు. అయితే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పారు. ఉచితంగా వైద్యం చేసేందుకు వీలుపడదన్నారు. రూ.15 వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంత డబ్బులేక వెనుదిరిగాం. మాలాంటి పేదలకు పెద్ద జబ్బులు వస్తే ఎవరు దిక్కు? 
– మల్లేశ్వరి, నంద్యాల

ఆపరేషన్‌ చేస్తారో లేదో.. 
ప్రమాదవశాత్తు కుడి భుజం విరిగింది. ఆపరేషన్‌ కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వచ్చాను. రిజి్రస్టేషన్‌లో పేరు రాసుకున్నారుగానీ డాక్టర్‌ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన వస్తేనే ఆపరేషన్‌ గురించి మాట్లాడాలని అంటున్నారు. ఇప్పుడేదో సమ్మె అంటున్నారు. ఆపరేషన్‌ చేస్తారో లేదో అని ఆందోళనగా ఉంది. – కె. సత్యం, నిద్దాం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా

ఆరోగ్యశ్రీ అంటేనే.. లేదు పొమ్మంటున్నారు.. 
మాది తిరుపతి కొర్లగుంట, నా భర్త భవన నిర్మాణ కారి్మకుడు. ఆయనకు కొంతకాలంగా ఛాతీలో నొప్పి వ­స్తోంది. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాం. ఆరోగ్య­శ్రీ కింద ఓపీలు ఇవ్వడంలేదు, వెళ్లిపొమ్మన్నారు. డ­బ్బు­లు కడితేనే ఓపీ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఇంటికి వచ్చేశాం. అప్పు కోసం ప్రయతి్నస్తు­న్నాం. గత ప్రభుత్వంలో మా నాన్నకు గుండె ఆపరేషన్‌ చేయించాం. ఒక్క రూ­పాయి లేకుండా వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశా­రు. పైగా.. ఇంటికొచ్చిన మూడునెలలు పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఖర్చు­ల­కు ఇచ్చారు.         – సావిత్రమ్మ, దినసరి కూలి, తిరుపతి

సంజీవని’ ఊపిరి తీసిన చంద్రబాబు సర్కార్‌
ఈ చిత్రం చూడండి.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన మహబూబ్‌ సాబ్‌కు సుస్తీ చేసి ప్రాణం మీదకు వచ్చింది. ఫోన్‌ చేస్తే 108 కుయ్‌ కుయ్‌మని రాలేదు సరికదా! కనీసం పలకలేదు. దీంతో మహబూబ్‌ కుటుంబానికి 
ఏంచేయాలో పాలుపోలేదు. చంద్రబాబు పాలనలో 108ని నమ్ముకోవడం దండగని అర్థం చేసుకున్న ఆ కుటుంబం అప్పటికప్పుడు బాడుగకు ఓ ట్రాలీ మాట్లాడుకున్నారు. ఆ ట్రాలీకి దుప్పటి కప్పి.. అందులోనే మహబూబ్‌ను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.

దిగొచ్చిన ప్రభుత్వం..
ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్తంభింపజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ‘ఆశ’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. పెండింగ్‌ బకాయిలు చెల్లింపుల కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని ‘ఆశ’ అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి పొద్దు­పో­యిన తరువాత వెల్లడించారు. ఈనెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఇం­దులో పెండింగ్‌ బకాయిలు, భవిష్యత్‌ చెల్లింపు షెడ్యూల్, ప్యాకేజీ రివిజన్లు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement