Medicine
-
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..) -
‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది!
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన పార్వతి భర్త సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఎంతో కష్టం మీద రూ.7 వేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూపి, తన భర్త ఆపరేషన్ విషయం తెలిపింది.ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంలేదని, డబ్బులిస్తేనే చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీక భర్తను తీసుకుని పార్వతి తిరిగి ఇంటికి బయల్దే రింది. తన భర్తకు ఆపరేషన్ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానని, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరైంది. రూ.వేలు, రూ.లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత తమకులేదని ఆవేదన చెందింది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ లేదు. ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు.. ఉచితంగా చికిత్సలు చేయలేం వెళ్లిపోండి..’ అన్న మాటలు నెట్వర్క్ ఆస్పత్రుల దగ్గర సోమవారం వినిపించాయి. ఎంతో ఆశతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థాలు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బిల్లులు సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం, బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టాయి.‘బకాయిలు చెల్లించాలని వైద్యశాఖ అధికారుల నుంచి సీఎం వరకూ అందరినీ కలిసి పలు దఫాలుగా కోరాం.. ఇబ్బందులను వివరించాం. ప్రతినెలా రూ.330 కోట్ల మేర వైద్యసేవలను నెట్వర్క్ ఆస్పత్రులు అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మాకు అప్పులు మంజూరు చేయడంలేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సేవలు నిలిపేస్తున్నాం. అర్థం చేసుకోండి’.. అంటూ నెట్వర్క్ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అతికించాయి.ఎన్ని రకాలుగా అడిగినా పట్టించుకోని సర్కారు..సోమవారం ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను పథకం కింద యాజమాన్యాలు చేర్చుకోలేదు. నగదు రహిత సేవలు పూర్తిగా ఆపేశామని.. డబ్బులు కట్టి వైద్యసేవలు పొందాలని సూచించారు. దీంతో పేదరోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాస్తవానికి.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద అన్ని రకాల వైద్యసేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం (ఏప్రిల్ 7) నుంచి వైద్యసేవలు ఆపేస్తామని నెలరోజుల ముందే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తమ సమస్యలపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశా ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. బిలు్లలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా మంజూరు చేయకపోతే సేవలు కొనసాగించబోమని ప్రభుత్వానికి తేలి్చచెప్పారు. ఇన్ని రకాలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేసేదిలేక సమ్మెలోకి వెళ్లారు. ఆరోగ్యశ్రీ అమలును బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నారు.పేదలకు ఇబ్బందికరం.. నా కొడుకు ఐదేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవలు బందయ్యాయని చెప్పారు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. కార్పొరేట్ వైద్యసేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడం పేదలకు ఇబ్బందికరం. – కె. సత్యవతి, జగన్నాథపురం, కాకినాడ గుండె నొప్పితో వస్తే ఉచిత సేవలు లేవన్నారు.. మూడ్రోజుల నుంచి ఆయాసం, గుండె నొప్పితో బాధపడుతున్నా. నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఓ ప్రైవేటు ఆçస్పత్రికి వచ్చాం. నా భర్త సంజీవరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్ పరీక్షలు చేసి ఆస్పత్రిలో అడ్మిట్ కావాలన్నారు. అయితే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పారు. ఉచితంగా వైద్యం చేసేందుకు వీలుపడదన్నారు. రూ.15 వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంత డబ్బులేక వెనుదిరిగాం. మాలాంటి పేదలకు పెద్ద జబ్బులు వస్తే ఎవరు దిక్కు? – మల్లేశ్వరి, నంద్యాలఆపరేషన్ చేస్తారో లేదో.. ప్రమాదవశాత్తు కుడి భుజం విరిగింది. ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వచ్చాను. రిజి్రస్టేషన్‌లో పేరు రాసుకున్నారుగానీ డాక్టర్ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన వస్తేనే ఆపరేషన్ గురించి మాట్లాడాలని అంటున్నారు. ఇప్పుడేదో సమ్మె అంటున్నారు. ఆపరేషన్ చేస్తారో లేదో అని ఆందోళనగా ఉంది. – కె. సత్యం, నిద్దాం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లాఆరోగ్యశ్రీ అంటేనే.. లేదు పొమ్మంటున్నారు.. మాది తిరుపతి కొర్లగుంట, నా భర్త భవన నిర్మాణ కారి్మకుడు. ఆయనకు కొంతకాలంగా ఛాతీలో నొప్పి వస్తోంది. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాం. ఆరోగ్యశ్రీ కింద ఓపీలు ఇవ్వడంలేదు, వెళ్లిపొమ్మన్నారు. డబ్బులు కడితేనే ఓపీ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఇంటికి వచ్చేశాం. అప్పు కోసం ప్రయతి్నస్తున్నాం. గత ప్రభుత్వంలో మా నాన్నకు గుండె ఆపరేషన్ చేయించాం. ఒక్క రూపాయి లేకుండా వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. పైగా.. ఇంటికొచ్చిన మూడునెలలు పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఖర్చులకు ఇచ్చారు. – సావిత్రమ్మ, దినసరి కూలి, తిరుపతిసంజీవని’ ఊపిరి తీసిన చంద్రబాబు సర్కార్ఈ చిత్రం చూడండి.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన మహబూబ్ సాబ్‌కు సుస్తీ చేసి ప్రాణం మీదకు వచ్చింది. ఫోన్ చేస్తే 108 కుయ్ కుయ్‌మని రాలేదు సరికదా! కనీసం పలకలేదు. దీంతో మహబూబ్ కుటుంబానికి ఏంచేయాలో పాలుపోలేదు. చంద్రబాబు పాలనలో 108ని నమ్ముకోవడం దండగని అర్థం చేసుకున్న ఆ కుటుంబం అప్పటికప్పుడు బాడుగకు ఓ ట్రాలీ మాట్లాడుకున్నారు. ఆ ట్రాలీకి దుప్పటి కప్పి.. అందులోనే మహబూబ్‌ను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.దిగొచ్చిన ప్రభుత్వం..ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు స్తంభింపజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ‘ఆశ’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిలు చెల్లింపుల కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని ‘ఆశ’ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత వెల్లడించారు. ఈనెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఇందులో పెండింగ్ బకాయిలు, భవిష్యత్ చెల్లింపు షెడ్యూల్, ప్యాకేజీ రివిజన్లు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్‌లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్‌లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్‌లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్‌కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్‌కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్‌ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్‌స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
జ్వరం గోలీలూ లేవు!
ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక! ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్‌సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్‌జే, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ మందులకూ తిప్పలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్ –ఏ సిరప్ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.అలాగే సర్వ సాధారణ మందులైన రాన్టాక్, పాన్‌టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్ ఆయింట్మెంట్, డైక్లో, స్రైబీష్ లోషన్ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్‌కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్‌సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోనూ... ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్ షాపులే రోగులకు గతవుతున్నాయి. 293 మందులకు 100 కూడా ఉండటం లేదు.. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్‌సీల్లో ఉండాలి.కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్‌సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్‌సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని ఎన్హెచ్ఎం చెపుతుండటం గమనార్హం. మందుల కొరత లేదు.. టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్‌జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్‌లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్ (టీజీఎంఐడీసీ ఎండీ) పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్‌పైన గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. -
షుగర్ పేషెంట్ల కోసం గ్లెన్‌మార్క్ కొత్త మెడిసిన్
ప్రముఖ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ మధుమేహ రోగుల కోసం కొత్త మెడిషన్ విడుదల చేసింది. గ్లైసెమిక్ నియంత్రణ, బరువు తగ్గించే ఔషధాన్ని ప్రారంభించినట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఔషధ సంస్థ గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ) బ్రాండ్ పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను తన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)'తో కలిపి విడుదల చేసింది.టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ఈ మందులను రూపొందించారు. అదే సమయంలో కార్డియోవ్యాస్కులర్ ముప్పు ఉన్న రోగులకు కూడా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ (టీ2డీఎం) పేషంట్లలో గ్లైసెమిక్ నియంత్రణని మెరుగుపర్చడం, బరువు తగ్గడానికి మద్దతునివ్వడం, కార్డియోవాస్కులర్-రీనల్ రిస్కులను తగ్గించడంతో పాటు ఎంపాగ్లిఫ్లోజిన్ పలు ప్రయోజనాలు చేకూరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.“భారత్‌లో కార్డియోమెటబోలిక్ సంరక్షణకు సంబంధించి వినూత్నమైన చికిత్సలను అందుబాటు స్థాయిలో ఆవిష్కరించడంలో గ్లెన్‌మార్క్‌కు ఘన చరిత్ర ఉంది. సీవీడీతో పాటు టీ2డీఎంను సమర్ధంగా ఎదుర్కొనడంలో పేషంట్లకు, హెల్త్‌కేర్ నిపుణులకు సాధికారత కల్పించేందుకు సమగ్రమైన, చౌకైన సొల్యూషన్‌ను అందించాలన్న మా నిబద్ధతకు గ్లెంపా శ్రేణి ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తుంది” అని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ బిజినెస్ అలోక్ మాలిక్ తెలిపారు. -
గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్‌డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది. -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
నిర్వహణలోనూ రాణిస్తాం
ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్ సర్వీసెస్ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్‌కు వైస్ ప్రసిడెంట్... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్‌కు సీవోవో... మరికొందరు హాస్పిటల్ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ హాస్పిటల్ రంగంలో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్‌గా...నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్ చేశా. నా ఇంటర్న్‌షిప్ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాశా. అలా నేను డాక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌గా మారాను. ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. సమాజంలో ఈ వివక్ష ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్‌తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలూ, 16 నర్సింగ్ కాలేజీలూ, 28 పారామెడికల్ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్‌జెండర్ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్‌లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్ సర్వీసెస్‌లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి. – డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంకల్ప బలంతోనే సాధన సులభంఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా, మా టీమ్‌లోని ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్‌గా, మా హెచ్ఆర్ టీమ్‌లకూ, పారామెడికల్ స్టాఫ్‌కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్‌గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపట్టా. ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఏఎమ్పీహెచ్ ప్రోగ్రామ్ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్ గ్రూపునకు ఆపరేషన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను. – డాక్టర్ రూప పుట్టా, సీనియర్ రేడియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్ సారథ్యం అంత కష్టమేమీ కాదు!ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్ టైమ్‌లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్ కాలేజీలూ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్‌ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది. – డాక్టర్ గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మేనేజ్మెంట్లో మేమే బెస్ట్!మొదట నేను ఓ డాక్టర్‌గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్‌గా, ఓ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్ భాస్కర్రావుగారు కిమ్స్ తమ హాస్పిటల్ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్‌లో అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్‌గా కిమ్స్‌లో పనిచేయడం మొదలుపెట్టా. హాస్పిటల్ నడిపించడమెలాగో నేర్చుకోవడం కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్‌గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ విభాగానికి మెడికల్ డైరెక్టర్‌గా, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ తాలూకు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది. – డాక్టర్ హరిణి చేబ్రోలు, వైస్ ప్రెసిడెంట్ (రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్), కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కెరియర్ మెట్లపై‘ఫెమ్’నిస్టులం!అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్‌కేర్ సెంటర్‌ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్ సర్జన్ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్ విజేత. ఆమెకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్‌సిటీ హాస్పిటల్. ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్ 9 టు 5 జాబ్ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్ అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్‌తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్‌తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్‌సిటీ కేర్స్ అనే ఫౌండేషన్ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం. – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్), ఫెమ్‌సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్రంగుల కళఇంటర్నేషనల్ విమెన్స్ డే సింబల్, పోస్టర్ డిజైన్లలో సాధారణంగా పింక్ కలర్లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డేఅంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. యూకేలోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి. -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
స్థూల భారతం.. మందుల మార్గం!
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్మూడింతలు పెరిగిన మార్కెట్.. ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.2020 నవంబర్‌లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.ఖరీదైన వ్యవహారంగా చికిత్స..యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ కంపెనీల కన్ను.. భారత్‌లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్‌ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్‌మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్‌పై పరిశోధన చేస్తోంది. -
ఒట్టి హడావుడి.. మందులే లేవు మరి
సాక్షి, అమరావతి: విజయవాడ జీజీహెచ్‌లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా శ్రీను, శివయ్య తరహాలోనే పదుల సంఖ్యలో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మందుల దుకాణానికి క్యూ కట్టారు. ఎవరిని కదిలించినా లోపల మందుల్లేవ్.. అందుకే బయట కొనుక్కోమని చీటీలు రాసిచ్చారని చూపించారు. ఆ దృశ్యాలు రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థకు అద్దం పట్టాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ సరఫరా చేయలేని ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వంద మందికిపైగా ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ మెడికల్ స్టోర్ వద్దకు వచ్చారు. కడుపు నొప్పి, బీపీ, గ్యాస్, నొప్పులు వంటి చిన్న సమస్యలతో పాటు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, గుండె, ఇతర జబ్బుల్లో చికిత్సలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, సిరప్లు సొంతంగా కొనుగోలు చేశారు. వీరందరూ డబ్బు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోలేక.. ఉభయ గోదావరి, కృష్ణా జిలాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చారు. పశ్చి మ గోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి మెడికల్ స్టోర్ ముందు నిలబడి ‘ప్రభుత్వాస్పత్రి అంటే నే చికిత్స, మందులు, పరీక్షలు అన్నీ ఉచితం. దీంతో రానుపోను చార్జీలు, తిండి, ఇతర అవసరాలకు కొంత డబ్బు తెచ్చుకున్నాం. తీరా ఆస్పత్రిలో చేరాక మందుల్లేవ్ బయట కొనమన్నారు. రూ.వెయ్యి ఫోన్ పే చేయ్ రా’ అంటూ స్నేహితుడి ని అభ్యర్థించడం ఆవేదనకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు సుమారు వంద రకాల మందులు ఆస్పత్రి నుంచి ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.ఇంజెక్షన్ బయట కొనుక్కోమన్నారునా భర్తకు స్టెంట్లు వేశారు. చికిత్సలో భాగంగా ఓ ఇంజెక్షన్ (నికోరన్) రాశారు. ఇక్కడేమో అది లేదన్నారు. బయట కొనుక్కుని రమ్మన్నారు. రూ.450 పెట్టి ఇంజెక్షన్ కొనక తప్పలేదు. – హృద్రోగ బాధితుడు వెంకట సురేశ్ భార్య, తణుకుస్టాక్ లేవన్నారునా మనవరాలికి అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం వచ్చాను. వైద్యులు చూశారు. మందులు రాసిచ్చారు. కౌంటర్ వద్దకు వెళితే మందులు అందుబాటులో లేవన్నారు. బయట కొనుక్కోవాల్సిందే. లేదంటే మళ్లీ రమ్మన్నారు. మళ్లీ ఇంకో రోజు రావాలంటే రానుపోను చార్జీలు, ప్రయాసలు పడాల్సి వస్తుంది. చేసేదేమీ లేక కష్టాలుపడి డబ్బు పెట్టి మందులు కొనుకున్నాం. – నవమ్మ, పైడూరిపాడు, విజయవాడ రూరల్డాక్టర్ రాసిన మందులు ఇవ్వలేదునెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు. ఈ నెల 7న 38.23 శాతం మంది రోగులు మందులు ఇవ్వలేదని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్, బీపీ, గ్యాస్ సమస్యలకు కూడా బోధనాస్పత్రుల్లో బయటకు చీటీలు రాసిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూది, సర్జికల్ గ్లౌజ్‌లకు సైతం కటకటగా ఉంటోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. -
Snake: పాము గాయాలకు శస్త్రచికిత్స
మైసూరు: నాగుపామును చూడగానే జడుసుకుని అంత దూరం పరిగెడతారు. కానీ వీరు మాత్రం దానికి వైద్యం చేశారు. పొలంలో మట్టిని నింపుతున్న సమయంలో హిటాచీ యంత్రంలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. మైసూరు తాలూకాలోని వరగొడు గ్రామంలో ఓ పొలంలో పాము ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హిటాచి వాహనం పామును జాగ్రత్తగా సంచిలో వేసుకుని మైసూరులోని పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్. యశ్వంత్‌కుమార్ నాగుపామును పరిశీలించగా పలుచోట్ల పెద్ద గాయాలు కనిపించాయి. శస్త్రచికిత్స ద్వారా 24 కుట్లు వేసి మందు అంటించాడు. తరువాత దూరంగా అడవిలో వదిలేశారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత.. గ్యాస్ బిళ్లలకు కటకట.. అరకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్.. కనీసం దగ్గు సిరప్లు కూడా ఆస్పత్రుల్లో లభించడంలేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3, 4 వెయిల్స్ ఇచ్చేవారు. నాలుగైదు నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీమోఫీలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో దొరకడంలేదు. ఇలా.. అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఇది రోగులపై భారాన్ని మోపుతోంది.సరఫరా ‘గుండు సున్నా’రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి మూడు క్వార్టర్లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు, సర్జికల్స్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు. ఇక నాలుగో క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) మొదలై నెల రోజులైనా ఈ మూడు నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గతేడాది డిసెంబర్‌కి పూర్తయిన మూడు క్వార్టర్లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. మందులు లక్షల సంఖ్యలో అవసరమని ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ పెట్టారు. రాజధానికి చేరువలోని ఆస్పత్రుల్లోనూ అవస్థలేరాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన మూడు క్వార్టర్లలో ఈ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాబ్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 ఎంజీ మాత్రలు 25 వేలు కావాలని గుంటూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్క మాత్ర కూడా రాలేదు. బ్యాక్టీరియా చికిత్సల్లో వాడే అమోక్సిలిన్, క్లావులనేట్ యాసిడ్ మందు 50 వేలు, మూర్ఛ, కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వినియోగించే లారాజెపామ్ ఇంజెక్షన్లు వెయ్యి కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్–8 ఇంజెక్షన్ వెయిల్స్ 50, మైగ్రేన్ మాత్రలు ఫ్లూనరిన్ 13 వేలు, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు 21 వేలకు డిమాండ్ పెట్టినా ఒక్కటీ పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నిగవారణకు వినియోగించే నాప్రొక్సెన్ 500 ఎంజీ మాత్రలు 30వేలు, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్ప కాలిక విముక్తికి వాడే ట్రమాడోల్ హెచ్‌సీఎల్ 100 ఎంజీ ఇంజెక్షన్లు 8 వేలు అవసరమైన నెల్లూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్కటీ సరఫరా చేయలేదు. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు బయట నుంచి మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగులకు రాసిచ్చిన చీటీలు దగ్గు సిరప్లకూ కటకటేప్రీవెంటివ్ కేర్‌లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లనూ మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరప్‌లకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటిబయోటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండటంలేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్మెంట్ల కొరతా తీవ్రంగానే ఉంది.సూపరింటెండెంట్లు లేఖ రాసినా..డ్రగ్ స్టోర్స్‌లో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్లు తెలిపారు. ప్రధాన మందుల కోసం ఇండెంట్ పెట్టినా ఒక్క మందు, ఇంజెక్షన్ కూడా సరఫరా అవలేదని, దీంతో స్థానికంగా కొనాల్సివస్తోందని వెల్లడించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందులు, అత్యవసర మందుల సరఫరాకు గత ప్రభుత్వంలో ఓ సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేశారు. ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తిరుపతికి చెందిన జన్–ఔషధి మందుల సరఫరా సంస్థతో ఓ మంత్రి డీల్ కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారానే బోధనాస్పత్రులకు మందులు సరఫరా అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులు ఇప్పించారు. జన్–ఔషధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక పెట్టారు. అయితే ఆస్పత్రులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే జన్–ఔషధి మందులను వేగంగా సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల జాతీయ ఆయుర్వేద సంస్థాన్ రక్తపోటుపోటుపై పరిశోధనలు నిర్వహించింది.జాతీయ ఆయుర్వేద సంస్థాన్(National Institute of Ayurveda) పదేళ్ల పరిశోధనల అనంతరం రక్తపోటు నియంత్రణకు ఔషధాన్ని తయారు చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలను కలుగజేయదని ట్రయల్స్‌లో తేలిందని సంస్థాన్ పరిశోధనకులు తెలిపారు. ఈ ఔషధాన్ని తొమ్మిది రకాల వనమూలికలను కలిపి తయారు చేశారు. ఈ ఔషధం క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, పేటెంట్ పొందిన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థాన్ హెచ్ఓడీ డాక్టర్ సుదీప్త రథ్ మాట్లాడుతూ తమ వైద్యుల బృందం రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద గుళికలను రూపొందించిందని తెలిపారు. ఈ గుళికలు క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రభావవంతంగా పనిచేశాయని, ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదన్నారు. ఈ ఔషధానికి పేటెంట్(Patent) పొందిన వెంటనే, దానిలో ఉపయోగించిన మూలికలను బహిర్గతం చేస్తామన్నారు. కాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు 22.6 శాతంగా ఉన్నారు. పురుషులలో ఈ రేటు మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తపోటు(blood pressure) ప్రభావం అధికంగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా, ఛాతీ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే.. -
‘జన్ ఔషధి’కి అవినీతి ‘సత్యం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ధనార్జనే ధ్యేయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓ రేటు మాట్లాడేసుకుని టెండర్లు లేకుండానే ప్రభుత్వ శాఖల్లో పనులను నచ్చిన వారికి కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఓ మంత్రి కమీషన్ల రూపంలో రూ.కోట్లలో కొట్టేయడానికి పన్నాగం పన్నారని వైద్య శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలుకు కేటాయించే బడ్జెట్లో 80 శాతం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడీసీ ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది.మిగిలిన 20 శాతం డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఏటా డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో రూ.50 కోట్ల మేర కొనుగోళ్లు చేపడుతుంటారు. వీటితో పాటు, సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందుల కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గతేడాది వైద్య శాఖ ప్రవేశపెట్టింది. జన్ ఔషధిలో సరఫరా చేయని మందులనే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేయాలని షరతులు పెట్టారు. ఏకంగా ఉత్తర్వులు మార్చి గ్రీన్ సిగ్నల్ ఈ నేపథ్యంలో సదరు మంత్రి ఒక మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకున్న క్రమంలోనే జన్ ఔషధి వ్యవహారం తెరమీదకు వచ్చిందని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు చర్చించుకుంటున్నారు. తిరుపతికి చెందిన సదరు సంస్థ ప్రతినిధులు ‘జన్– ఔషధి విధానం ప్రవేశపెట్టిందే మా కోసం.. మాతోనే ఎంవోయూ చేసుకోవాలి’ అని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను సంప్రదించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఫలానా సంస్థతో ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలివ్వాలని మంత్రి కార్యాలయం ఒత్తిళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి.. సదరు సంస్థతోనే సూపరింటెండెంట్లు ఒప్పందం కుదుర్చుకునేలా నిబంధనల్లో మెలికలు పెడుతూ గత నెల (జనవరి) 23న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణలు చేశారు. మంత్రికి చెందిన సరఫరాదారుడికి రాయలసీమతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ జన్ ఔషధి స్టోర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ పీఎంబీజేకే – జన్ఔషధి స్టోర్స్ ఉన్న సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవాలని నిబంధనలు మార్చారు. అదే విధంగా తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో కనీసం ఏడాది ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఈ నిబంధనను సవరించి, రెండేళ్ల కాలనికి పొడిగించారు. హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ మందుల కొనుగోళ్లలోనూ ఇవే నిబంధనలు పాటించాలని మెలిక పెట్టారు.ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను జనవరి 28న ఇచ్చారు. దీంతో ఏటా రూ.50 కోట్లకుపైగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు మేలు జరిగేలా మంత్రి చక్రం తిప్పారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలోనే లబ్ధి పొందాలని మంత్రి ప్రణాళికలు రచించినట్టు స్పష్టమవుతోంది.పెనాల్టీలు కూడా లేవట!పీఎంబీజేకే–జన్ ఔషధి గుర్తింపు పొందిన, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మందులు సరఫరా చేసే సంస్థలతో ఎంవోయూ చేసుకోవాలని డీఎంఈ డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రధానంగా సూపరింటెండెంట్లకు సూచించారు. ఎమర్జెన్సీ మందులు అయితే 24 గంటల్లో, తక్కువ మొత్తంలో మందులు అయితే ఇండెంట్ పెట్టిన మూడు రోజుల్లో, పెద్ద ఎత్తున అయితే వారంలో సరఫరా చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు రూపొందించారు. నిర్దేశించిన సమయంలోగా మందులు సరఫరా చేయకుంటే సదరు సంస్థకు పెనాల్టీ విధించేలా ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే ఎంవోయూ రూపొందిస్తున్నట్లు సమాచారం. మందుల సరఫరాలో పదే పదే ఆలస్యం చేసినా చర్యలు తీసుకోలేని విధంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు తయారు చేశారని తెలిసింది. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మందుల సరఫరాలో మతలబు!
సాక్షి, అమరావతి : ఓ వైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను తన వాళ్లకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూనే మరోవైపు బీమా పథకం పేరిట ప్రభుత్వ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించి దోపిడీకి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇదే తరహాలో ప్రభు త్వా స్పత్రులకు మందుల సరఫరా వ్యవహారంలోనూ కూటమి ప్రభుత్వం అవినీతికి తెరలేపింది. బోధనా స్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా కోసం తిరుపతికి చెందిన సంస్థతో ఓ మంత్రి డీల్ కుదు ర్చుకున్నట్లు తెలిసింది. ఆ సంస్థతోనే బోధనాస్ప త్రుల సూపరింటెండెంట్లు ఒప్పందం (ఎంఓయూ) చేసుకునేలా లిఖితపూర్వక ఆదేశాలివ్వా లని వైద్యశాఖ అధికారులపై మంత్రి కార్యాలయం ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.మా కోసమే ఆ ఉత్తర్వులు..ఇదిలా ఉంటే.. జన్ ఔషధి మందుల కొనుగోలుపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశా రు. దీంతో మంత్రితో డీల్ కుదుర్చుకున్న మందుల సరఫరా సంస్థ ప్రతినిధులు కొద్దిరోజులుగా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను సంప్రదిస్తున్నారు. ‘మేం మంత్రి తాలూకా.. మా కోసమే జన్ ఔషధి ఉత్తర్వులిచ్చారు. మా సంస్థతో ఎంఓయూ చేసు కోవాలి’ అని కోరినట్లు తెలిసింది. అయితే, ఫలాన సంస్థతోనే ఎంఓయూ కుదుర్చుకోవాలని తమకెక్కడా రాతపూర్వక ఆదేశాల్లేవని సూపరింటెండెంట్లు చెబుతుండడంతో సంస్థ ప్రతినిధులకు నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది. దీంతో.. నేరుగా సదరు సంస్థతోనే ఎంఓయూ చేసుకోవాలని అంద రు సూపరింటెండెంట్లను ఒప్పించడానికి మంత్రి కా ర్యాలయం కిందామీదా పడుతున్నట్లు తెలుస్తోంది.డీల్‌లో భాగంగానే తెరపైకి జన్ ఔషధీ..సాధారణంగా బోధనాస్పత్రులకు మందుల కొనుగోలుకు కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మేర మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌తో ఆస్పత్రులు అత్యవసర మందులను స్థానికంగానే కొనుగోలు చేస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఈ మందులను సైతం కేంద్రీకృత విధానంలోనే సరఫరా చేశారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా కాని, ఇతర అత్యవసర మందులను పీఎంబీజేకే–జన్ ఔష«ధి కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాల్లో అందుబాటులో లేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేసేలా మార్గదర్శకాలిచ్చింది. మంత్రి డీల్ మేరకు జన్ఔషధీ విధానం తెరపైకి వచ్చిందని వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు రాయలసీమతో పాటు, మరికొన్ని జిల్లాల్లో జన్ ఔషధీ మందుల కేంద్రాలున్నాయి. -
ఆల్చిప్పలే దివ్యౌషధాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అనారోగ్యాలను తగ్గించడంలో యాంటీబయోటిక్ మందులు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే యాంటీబయోటిక్‌లకు సైతం చావని కొన్ని సూక్ష్మక్రిములను అంతం చేయగల శక్తి ఓ సముద్రజీవికి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆల్చిప్పల (oyster) రక్తంలోని యాంటీమైక్రోబియల్ ప్రొటీన్లు, పెప్టిన్లు సూపర్ బగ్స్‌ను (Super Bugs) సమర్థంగా చంపగలవని తేల్చారు. ‘ప్లోస్ వన్’లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం ఆల్చిప్పల్లోని హీమోలింఫ్ (ఆల్చిప్పల రక్తంగా దీన్ని చెప్పొచ్చు)లో సూక్ష్మక్రిములను చంపే మాంసకృత్తులు ఉన్నాయి. అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సూక్ష్మక్రిములను సమర్థంగా అరికట్టే శక్తి హీమోలింఫ్ ప్రొటీన్లకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొండి బ్యాక్టీరియా జాతుల (సూపర్ బగ్స్) పీచమణిచేలా యాంటీబయాటిక్స్ ఔషధాలను శక్తివంతం చేయడంలో ఆల్చిప్పల ప్రొటీన్లు ఉపయోగపడతాయని అంటున్నారు.ఏమిటీ సూపర్ బగ్స్?స్ట్రెప్టోకాక్కస్ న్యూమోనియే అనే సూక్ష్మక్రిమి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ఇదే ముఖ్యకారణం. వృద్ధులు తరచూ ఆసుపత్రులపాలవ్వడానికి కారణం కూడా ఇదే. టాన్సిలైటిస్ లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సాధారణంగా చాలా మంది చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. స్ట్రెప్టోకాక్కస్ ప్యోజెనెస్ సూక్ష్మక్రిమి చర్మంపై, గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది నొప్పులతో రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బుకు కూడా దారితీయొచ్చు. ఇటువంటి ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ మందులు తరచూ వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సూక్ష్మక్రిములు ఈ మందులకు నిరోధకత పెంచుకొని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాగా మారుతాయి. ఈ సూపర్ బగ్స్ కారణంగా వ్యాధులకు చికిత్స చేయడం కష్టతరంగా మారుతోంది.బయోఫిల్మ్‌ల రక్షణ వలయంలో..సూపర్ బగ్స్ తమ చుట్టూతా బయోఫిల్మ్‌లు (Bio Film) అనే రక్షణ కవచాలను రూపొందించుకొని యాంటీబయాటిక్ ఔషధాల నుంచి రక్షించుకుంటూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాలు బయోఫిల్మ్‌ల రక్షణలోనే ఉంటాయి. ఈ రక్షణ వలయాన్ని ఛేదించగలగటంపైనే యాంటీబయోటిక్‌ల విజయం ఆధారపడి ఉంటుంది. 32 రెట్లు మెరుగుపడ్డ ఫలితాలు ఇప్పటికే వాడుకలో ఉన్న యాంటీబయోటిక్స్‌కు ఆస్ట్రేలియా రాతి ఆల్చిప్పల ప్రొటీన్లను జోడించగా వాటి ప్రభావశీలత 3 నుంచి 32 రెట్లు మెరుగైనట్లు ప్రయోగాల్లో తేలిందని పరిశోధకులు ప్రకటించారు. చర్మవ్యాధులు, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు కలిగించే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను ఆల్చిప్పల రక్తంలోని ప్రొటీన్లు సమర్థంగా అరికట్టాయని పరిశోధకులు వివరించారు. మనుషుల కణాలపై ఎటువంటి విషపూరిత ప్రభావం లేదని స్పష్టం చేశారు. అయితే సూపర్ బగ్స్‌ను అరికట్టే ఆల్చిప్పల ప్రొటీన్లపై జంతువులు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది. సిడ్నీ రాతి ఆల్చిప్పల్లో ఔషధ గుణాలు.. సముద్ర జలాల వల్ల కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటీన్లు, పెప్టయిడ్లను ఆల్చిప్పలు తమ రక్తంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాసకోశ, ఇన్ఫ్లమేషన్ సమస్యలకు చైనా, ఆస్ట్రేలియా సంప్రదాయ వైద్యులు ఆల్చిప్పల ఔషధాలను అనాదిగా వాడుతున్నారు. చదవండి: నెలలో 1,000 విస్ఫోటాలుఈ దిశగా పరిశోధించిన శాస్త్రవేత్తలు.. సిడ్నీ రాక్ ఆయిస్టర్ల రక్తంలోని ప్రొటీన్లు, పెప్టయిడ్లలో స్ట్రెప్టోకాకస్ ఎస్పీపీ జాతి బ్యాక్టీరియాను చంపే ఔషధగుణాలు ఉన్నట్లు గుర్తించారు. సూక్ష్మక్రిముల చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని ఛేదించటమే కాకుండా అది ఏర్పడకుండా చూసే శక్తి కూడా ఈ ప్రొటీన్లు, పెప్టయిడ్లకు ఉందని తేల్చారు. -
ఆ మెడిసిన్‌తో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్
వృద్ధాప్యాన్ని(Anti-ageing) తిప్పికొట్టే ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(Bryan Johnson) కోట్లకొద్దీ డబ్బుని ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. యవ్వనంగా ఉండేలా జీవసంబంధమైన వయసును తిప్పికొట్టేందుకు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ..అత్యంత కఠినమైన డైట్‌ని అవలంభించేవాడు. ఇది ఒక రకంగా మనిషి దీర్ఘాయవుని పెంచడం ఎలా అనేదాన్ని సుగమం చేస్తుందని తరుచుగా చెప్పేవాడు బ్రయాన్. కానీ ఈ క్రమంలో కొన్ని చికిత్సలు వికటించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బ్రయాన్ స్వయంగా సోషల్‌మీడియాలో పేర్కొన్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ విషయాలన్ని వెల్లడించారు. తాను జీవ సంబంధ వయసును తిప్పికొట్టేలా తీసుకునే దీర్ఘాయువు(Longevity) మెడిసిన్ రాపామైసిన్(rapamycin)తో ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్ల తాను దీన్ని తీసుకోవడం ఆపేసినట్లు తెలిపారు. నిజానికి ఆయన గత ఐదు ఏళ్లుగా యవ్వనంగా ఉండేలా దీర్ఘాయువు కోసం ఈ రాపామైసిన్ను 13 మిల్లీ గ్రాముల చొప్పున తీసుకుంటున్నారు. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వైద్యులు ఈ మెడిసిన్‌ని అవయవాల మార్పిడి చేయించుకున్న రోగులకు ఇస్తారు. ఎందుకంటే శరీరం కొత్తగా మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించకుండా.. వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేలా ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మెడిసిన్ వల్ల దీర్ఘకాలం ఉండేలా చేసే ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే అధికంగా ఉన్నాయని పరిశోధన(research)లో తేలడంతో ఈ రాపామైసిన్ మెడిసిన్‌ను ఉపయోగించడం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్ జీవితాంతం తీసుకుంటే..భారీ దుష్ప్రభావాలు తప్పవని వెల్లడవ్వడంతో తన వైద్య బృందం తక్షణమే ఆపేయాలనే నిర్థారణకు వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేగాదు ఈ రాపామైసిన్ మెడిసిన్ వల్ల లిపిడ్ జీవక్రియను దెబ్బతీసి ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుందని బ్రయాన్ వైద్య బృందం చెబుతోంది. తద్వారా గ్లూకోజ్‌ని బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం లేదా పడకపోవడం జరుగుతుందన్నారు. తన వైద్య బృందం చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ దీర్ఘాయువు పరిశోధనను అభివృద్ధి చేయడమేనని చెప్పారు. కాగా, ఈ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టే ప్రయోగంలో భాగంగా ఇటీవలే కొన్ని నెలల క్రితం ప్లాస్మా మార్పిడి చేయించుకున్నారు. దీనికంటే ముందుకు కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నారు. ఇలా యవ్వనంగా ఉండేందుకు రకరకాల ప్రయోగాలకు, చికిత్సలకు ఇప్పటి వరకు దాదాపు రూ.17 కోట్లు పైనే ఖర్చు పెట్టారు బ్రయాన్.(చదవండి: నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!) -
నాడు సురక్ష.. నేడు శిక్ష
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన జె.అప్పలనాయుడు గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి, గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్‌లను నివారించడంతో పాటు.. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించిన మందులను రోజూ వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందులను బయట కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి స్తోమతకు మించిన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమలులోకి తెచ్చిన మందుల డోర్ డెలివరీ ఈ కుటుంబానికి వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లోని సీహెచ్‌వో నెలనెలా ఆన్లైన్లో ఇండెంట్ పెడితే మందులు పోస్టల్లో గ్రామానికి వచ్చేవి.ఆ మందులను సీహెచ్‌వో/ఏఎన్ఎం ఇంటి వరకూ తీసుకెళ్లి అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి మందుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆపేసింది. దీంతో మందుల కోసం అప్పలనాయుడు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఇలాఅప్పలనాయుడు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్న వారు ప్రయాణ చార్జీలు పెట్టుకుని, ఆపసోపాలు పడి పెద్దాస్పత్రులకు వెళుతుంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేదలు లబోదిబోమంటున్నారు. పక్షవాతం బారినపడి.. కాళ్లు, చేతులు పని చేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేమీ లేక స్థానికంగా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి.బాధితులకు భరోసా కరువు⇒ గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్లైన్లో పొందు పరిచింది. ఈ సమాచారం ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు ప్రతి నెలా మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్సిల్‌ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి, వాటిని ఎలా వాడాలో వివరించే వారు. ⇒ అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఆన్లైన్లో ఇండెంట్ పెడుతున్నప్పటికీ, ఏపీఎంఎస్ఐడీసీ మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావడం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించక పోవడంతో సీహెచ్‌వోలు ఇండెంట్ పెట్టడం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ⇒ బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు రూ.వేలల్లో కూడా ఖర్చు అవుతుంది. వ్యవసాయ, రోజు వారీ కూలి పనులపై ఆధారపడే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాధితులు ఖరీదైన మందులు నెలనెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.⇒ ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండి పడుతున్నాయి.ఆత్మస్థైర్యం కోల్పోయినట్లైందిగతంలో ప్రభుత్వమే నేరుగా ఇంటి దగ్గరకు మందులు పంపేది. నర్సమ్మ ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేసి, నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, మందులు ఎలా వాడాలో వివరించేది. నాకు ఎంతో ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాను. పై నుంచి వచ్చే మందులు కొద్ది నెలలుగా రావడం లేదని ఏఎన్ఎం, నర్సమ్మ చెప్పారు. – అప్పలకొండ, అనకాపల్లి జిల్లారోగాలు ముదిరిపోతాయిదీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, కదల్లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా మంది ఉంటారు. క్రమం తప్పకుండా మందుల వాడకంతో బాధితుల్లో జబ్బులు నియంత్రణలో ఉంటాయి. మందులు ఆపేస్తే జబ్బులు ముదిరి, మరిన్ని అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
సరైన బట్టల్లేక.. దుప్పట్లు లేక..
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు. కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం. 20 లక్షల మంది భద్రతకు ముప్పు గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది. ‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు. -
భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..
భారత్‌లోని తొలి విడాకులు కేసు లేదా విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్ క్వీన్ జోక్యంతో తనకు అనుకూలంగా తీర్పు పొందింది. ఆ రోజుల్లో దీన్ని అందరూ విమర్శించినా..ఒంటరిగానే మహిళల హక్కుల కోసం పోరాడింది. పైగా పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు కూడా ఈమెనే కావడం విశేషం. ఇంతకీ ఎవరామె..? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించ గలిగిందంటే..?ఇది 1885లో జరిగిన ఘటన. చెప్పాలంటే భారత్లొని మొట్టమొదటి విడాకులు కేసు(Divorce Case) లేదా విడాకుల తీసుకున్న తొలి హిందు మహిళగా చెప్పొచ్చు. ఆ మహిళ పేరు రఖ్మాబాయి రౌత్. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకుందామె. రఖ్మాబాయికి కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అక్కడే తన చదువుని కొనసాగించింది కూడా. అయితే ఇది ఆమె భర్తకు నచ్చక తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా కోర్టులో ధైర్యంగా తన వాదన వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాని, అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే గాక, చదువే ఆమెను భ్రష్టుపట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకునేవారు. అయితే కోర్టు.. రుఖ్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యకరంగా జైల్లో ఉండేందుకు మొగ్గు చూపింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే 'ఎ హిందూ లేడీ' అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి రాశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా(Queen Victoria) దృష్టికి రావడమే గాక అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రఖ్మాబాయి కేసులో జోక్యం చేసుకుని మరీ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. మహిళలను హేళనగా చూసే ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం. అయితే ఆ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్‌గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుఖ్మాబాయి. అంతేగాదు ఆమె కారణంగానే భారత్‌లో బాల్యవివాహాలపై చర్చలు, వ్యతిరేకించడం ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది ఆమె గాథ. (చదవండి: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!) -
పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది. బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. » 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది. » 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది. » ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. » 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2048 నాటికి 12% పడకలు పెరుగుదలటైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్‌లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి. ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. -
సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్‌లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ. అలీస్ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన తర్వాత, మన దేశపు తొలి తరం మహిళా న్యాయవాదులలో ఒకరైన ఈమె అక్క కొర్నేలియా స్వరాబ్జీ ప్రోత్సాహంతో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వైద్యశాస్త్ర పట్టాను 1905లో సాధించారు.భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బహవల్పూర్లోని జనానా హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు. అక్కడే 1906లో బ్రిటిష్ మిషనరీ డాక్టర్ థియొడర్ లైటన్ పెన్నెల్‌ను కలవడం, 1908లో పెళ్లి చేసుకోవడం సంభవించింది. పిమ్మట ఢిల్లీలోని విక్టోరియా హాస్పిటల్ బాధ్యురాలిగా తరలి వచ్చారు. 1914–18 మధ్య కాలంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహాబలేశ్వర్ దగ్గర సైనికుల ఆరో గ్యాన్ని కాపాడిన, పర్యవేక్షించిన తొలి మహిళా వైద్యులలో ఈమె కూడా ఒకరు.అఫ్గానిస్తాన్‌లోని గిరిజన తెగల వారితో జీవనం గడిపిన క్రిస్టియన్ మిషనరీ మిస్టర్ పెన్నెల్, తన తల్లి ఇచ్చిన సొమ్ముతో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న) బన్నులో మిషనరీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో అలీస్ పెన్నెల్ కూడా ఈ ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఎంతో గౌరవ భావంతో వైద్య వృత్తిని కొనసాగించిన అలీస్ తన భర్తతో కలిసి ఉర్దూ, పష్తూన్ భాషలను నేర్చుకొని అక్కడి పఠాన్ల, పష్తూన్ల హృదయాలను చూరగొన్నారు. అంతే కాదు ఆ ప్రాంతాలలో ఈ దంపతులు జానపద నాయకులుపొందే గౌరవాలను పొందగలిగారు. ఈ సేవలకు ఆమె ‘కైజర్–ఇ–హింద్’ బంగారు పతకాన్ని కూడా పొందారు.చదవండి: అంతర్జాతీయ జీవ పరిణామ దినం.. ఎందుకు జరుపుకుంటారంటే?అయితే ఆమె భర్త 44 ఏళ్ల వయసులో చనిపోవడం విషాదం. ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత అలీస్ ఢిల్లీకి తరలివచ్చి సమాజ, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో మునిగి పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాగానే లండన్‌లో స్థిరపడ్డారు. తన 74వ ఏట 1951 మార్చి 7వ తేదీన అలీస్ మాడే సొరాబ్జీ పెన్నెల్ అనారోగ్యంతో కనుమూశారు.– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
ఆస్పత్రుల్లో ఔషధ కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్వోలను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఫుడ్సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంతో చెడుగుడు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా.. బీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లా, బోధనాస్పత్రులకు మందులు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. ఆస్పత్రులకు అత్యవసర మందులు సరఫరా కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసింది. డీ–సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులను ఆస్పత్రులే స్థానికంగా కొనుగోలు చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది. కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం జిల్లా, బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెండర్లలో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఎంఆర్పీలో 35.6 శాతం రాయితీపై మందులు సరఫరా చేస్తూ వచ్చింది. అత్యవసర మందులతో పాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులను సరఫరా చేసేలా అనుమతులు ఇచ్చారు.తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. దీంతో గతంలో ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తే అంతా ఖర్చైందని అదనపు బడ్జెట్ కోసం అడిగే పరిస్థితుల నుంచి రోగులకు మందుల కొరత లేకుండా ప్రజాధనం ఆదా అయ్యేలా పరిస్థితులు మెరుగయ్యాయి. 2022–23 నుంచి ఇప్పటి వరకు అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం రూ.84 కోట్లు కేటాయించగా అందులో రూ.37.09 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉంటుంది.అవినీతికి గేట్లు ఎత్తిన సర్కార్రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరతో ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షణలో పారదర్శకంగా మందులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు అవినీతికి గేట్లు తెరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కొందరు వైద్యులతో తమకున్న పరిచయాలతో కమీషన్ ఆశ చూపిన సంస్థలకు మందులు సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ విధానంలో మందుల ధరల్లో ప్రతి జిల్లాకు వ్యత్యాసం ఉంటుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బోధనాస్పత్రుల సంఖ్య, మందుల వినియోగం, బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.ఆస్పత్రుల్లో గందరగోళంఅత్యవసర మందుల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్లకు గత వారంలో డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫళంగా ప్రస్తుత విధానాన్ని రద్దు చేశారు. స్థానికంగా కొనుగోళ్లకు సరఫరా సంస్థలను ఎంపిక చేసే వరకూ జన్స్టోర్స్లో ఎంఆర్పీపై మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే బోధనాస్పత్రులకు అవసరమైన మందులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మందులు ఆ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రులకు అవసరమైన స్థాయిలో సరఫరా చేయలేమని నిర్వాహకులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి 80 శాతం బడ్జెట్‌కు సంబంధించి 608 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఎక్కడ చూసినా 100 నుంచి 200 మేర మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరత ఉన్న మందులను సైతం ఆస్పత్రులు అత్యవసర మందుల సరఫరా సంస్థ నుంచే పొందుతున్నాయి. ఉన్నఫళంగా సరఫరా వ్యవస్థను రద్దు చేయడంతో గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ సహా చాలా ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిలిన్స్, క్రిటికల్ కేర్, థియేటర్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత నెలకొంది. దీంతో రోగుల చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలువురు సూపరింటెండెంట్లు స్థానికంగా సరఫరాదారులను ఎంపిక చేసే వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖ కూడా రాసినట్టు సమాచారం. -
ప్రపంచ స్థాయి వైద్యం నగరంలో దొరుకుతుంది : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాప్లో ఔషధ, సుగంధ మొక్కల సాగుపై శిక్షణ
హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రియ ఔషధ, సుగంధ పరిశోధన మొక్కల సంస్థ (సీమాప్) ఆవరణంలో నవంబర్ 12–14 తేదీల్లో నిమ్మగడ్డి, కాశగడ్డి, అశ్వగంధ, వటివేర్, సిట్రొనెల్లా, జెరేనియం, మింట్, పచౌళి, సోనాముఖి, కాలమేఘ్ తదితర ముఖ్య ఔషధ, సుగంధ వాణిజ్య పంటల సాగు, ప్రాసెసింగ్, నాణ్యత, మార్కెటింగ్ అంశాలపై ఆంగ్లంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చీఫ్ సైంటిస్ట్ జి.డి కిరణ్‌బాబు తెలిపారు. నమోదు రుసుం రూ. 3,500. నవంబరు 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత్రి వసతి సదుపాయం లేదు. వివరాలకు: 94910 43252, 94934 08227ఇదీ చదవండి : దొండతో దండిగా ఆదాయం! -
ఆ మందులు ఇక మరింత ఖరీదు.. ధర పెరగనున్న 8 మెడిసిన్లు!
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.పెరగనున్న మందులు ఇవే..» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml» ఇంజెక్షన్లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml» పిలోకార్పైన్ 2% డ్రాప్స్» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg» ఇంజెక్షన్లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg» లిథియం మాత్రలు 300 mgడ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. -
మోకాలి నొప్పి భరించలేకపోతున్నారా? నల్లేరు పచ్చడి చక్కటి ఔషధం
ఔషధ మొక్క నల్లేరు గురించి ఎపుడైనా విన్నారా? అసలు పచ్చడి ఎపుడైనా తిన్నారా? పూర్వకాలంలో పెద్దలు దీన్ని ఆహారంగా వాడేవారు. పోషకాలమయమైన నల్లేరు చేసే మేలు చాలా గొప్పదని ఆయుర్వేదం చెబుతోంది. నల్లేరు ప్రకృతి ప్రసాదించిన వరం. దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. అంటే వజ్రంలాంటి శక్తినిస్తుందన్నమాట. నల్లేరు కాడలతో చేసిన పచ్చడి మోకాళ్లు, నడుము నొప్పులను, బీపీ షుగర్ సహా పలు రకాల వ్యాధులను బాగా తగ్గిస్తుందని చెబుతారు.నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని పిలుస్తారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, పైల్స్,మధుమేహం వంటి అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని వాడతారు.నల్లేరు పచ్చడికావలసినవి10 నల్లేరు కాడలు, తరిగినవి ( లేత కాడలు అయితే బావుంటాయి.) ½ కప్పు వేరుశెనగలు కొద్దిగా చింతపండు రెండు ఎర్ర మిరపకాయలు నాలుగు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు ధనియాలు, పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర ,తాజా కొత్తిమీరతయారీముందుగా లేత నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక బాణలిలో వేరుశెనగలను వేయించి పక్కన పెట్టండి. అదే బాణలిలో కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరపకాయలను సువాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారనిచ్చి వీటిని మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూనె వేడి చేసి, తరిగిన నల్లేరు కాడలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ముక్కల్లో పల్లీల మిశ్రమం, చింతపండు, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి ఈ పచ్చడిని పోపు పెట్టాలి. దీన్ని ఒక నిమిషం పాటు ఆ నూనెలో మగ్గనిచ్చి తాజాగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో, రవ్వంత నెయ్యి వేసుకుని తింటే జిహ్వకు భలే ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. (మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!)లాభాలునల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.నోట్ : మోకాలి నొప్పికి కారణాలను నిపుణులైన వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. వారి సలహా మేరకు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. శరీరంలో విటమిన్ డీ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. -
Nobel Prize 2024: జన్యు నియంత్రణ గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోం: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. 2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచి్చందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్, రువ్కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు. -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
సాక్షి, వరంగల్/నర్సంపేట: ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం ఉండాలి.. అవి అమలు చేసేదిశగా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని వెల్లడించారు. 7 వేల మందికి నర్సింగ్ పోస్టింగ్‌లు ఇచ్చామని, త్వరలో ఇంకో 2,500 మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ‘సామాన్యులకు ఎక్కడి నుంచైనా 20 నుంచి 45 నిమిషాల్లో వైద్యచికిత్స అందేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా 108, 104, 102 ఆరోగ్యశ్రీ ట్రస్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ చార్జెస్ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచింది. దానికోసం రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చు చేశాం’అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని, రూ.46వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా, 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు. మంత్రుల నోట వైఎస్ అభివృద్ధి మాట దేశ చరిత్రలోనే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ కొనియాడారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ సేవలు మరచిపోలేమన్నారు. -
గ్యారంటీల అమలుకు గంజాయి సాగు.. కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లో గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.వైద్యంలో గంజాయి వాడకం..గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్ఎస్డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.అమెరికాలో ఇలా.. ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు. -
70 ఏళ్ల వయసులో మెడికల్ గ్రాడ్యుయేట్‌గా
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్‌కెంగ్ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన తోహ్ ఇటీవల మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన వారిలో ఒకరిగా తోహ్ రికార్డ్ సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుందా..! చిరంజీవి స్టైల్‌గా క్లాస్‌లోకి వస్తుంటే అందరూ ఆయనను ప్రొఫెసర్ అని పొరబడతారు. ఫిలిప్పీన్స్‌లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పీహెచ్ ఎంఏ విద్యార్థులు సైతం తోహ్ మొదటిసారి క్లాసులో అడుగుపెట్టినప్పుడు అలాగే అనుకున్నారు. కానీ తోటి విద్యార్థి అని తర్వాత తెల్సుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయనను ‘సర్ తోహ్’అంటూ గౌరవంగా పిలుచుకుంటున్నారు. అయితే ఆయన చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్ ఇంజనీరింగ్ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్ చెప్పారు. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. ఈ వయసులోనూ తనను మెడిసిన్ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు. 2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్లైన్లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్డ్ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు. విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కోసం.. మెడికల్ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్íÙప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. త నలాగా మెడిసిన్ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్íÙప్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థు లకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్ సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మందులు ఇవ్వండి మహాప్రభో
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: వరదలో చిక్కుకున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వైద్య సేవలు, మందులు అందక అగచాట్లు పడుతున్నారు. కావాల్సిన ఆహారం, మందులు బయటకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు లేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వద్దామంటే ప్రభుత్వం కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైద్య శాఖ మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ వరదల్లో చిక్కుకుపోయిన వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. వరద ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల బారినపడిన వారు వేసుకోవాల్సిన మందులపై వైద్య శాఖ సోమవారం ప్రి్రస్కిప్షన్ను జారీ చేసింది. మందులు ఇవ్వకుండా ఈ ప్రి్రస్కిప్షన్ జారీ చేసి ఏం ప్రయోజనం అని బాధితులు మండిపడుతున్నారు. మా కష్టం పగవాడికి కూడా రాకూడదు నాకు రెండు కాళ్లు లేవు. పైగా గర్భిణిని కూడా. దీనికి తోడు మా అమ్మ మెదడు సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరం నిస్సహాయులం. ఎవరైనా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారని చాలా ఎదురుచూశాం. కానీ ఎవరు రాలేదు. రెండు రోజులుగా నాకు, మా అమ్మకు ఆహారం లేదు. మాకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. – ఎస్కె. తాహిరున్నిసా, డాబాకొట్లు సెంటర్, సింగ్నగర్ఇదో విషమ ‘పరీక్ష’విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి, ప్రతినిధి : కుమార్తెలు ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్న సంకల్పానికి వరద ముంపు విషమ పరీక్ష పెడితే.. ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇద్దరు ఆడ బిడ్డలతో ఊరుకాని ఊర్లో.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాడు. పలకరించిన నాథుడు లేడు. తిన్నావా అని అడిగే దిక్కులేదు. కళ్ల ముందు బోట్లు తిరుగుతున్నా.. ఎక్కించుకునే వాడే లేడు. భీమవరానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్.. ఇద్దరు బిడ్డలతో కండ్రిగలోని ఓ పరీక్ష కేంద్రంలో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ ప్రవేశానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం వచ్చారు. పరీక్ష కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. అయితే వరద ఉధృతి పెరగడంతో ఆకస్మాత్తుగా పరీక్ష రద్దయ్యింది. అప్పటికే ఆ ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. అక్కడి నుంచి బయట పడేందుకు ట్రాక్టర్ ఎక్కితే.. డ్రైవర్ మధ్యలో దించేశాడు. ఇక అంతే.. సోమవారం ఉదయం 11 గంటలకు వరకూ తిండీతిప్పల్లేకుండా నీళ్లలో ఇద్దరు ఆడ బిడ్డలతో ఉండిపోయారు. ప్రాణాల కోసం ఆరాటం.. ఆకలితో పోరాటం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘చిన్నా’ కన్నవారి కోసం పడిన ఆవేదన వర్ణనాతీతం. సింగ్‌నగర్‌లోని డాబాకొట్లు సెంటర్లో మనిషి ఎత్తు లోతులో నీళ్లు చేరాయి. చిన్నా నివాసం ఉంటున్న ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున కట్టుబట్టలతో ఇంటి మేడపైకి చేరుకున్నారు. వర్షం వచి్చనా తడుస్తూనే అక్కడే ఉండిపోయారు. ఇంటిలో వంట సామగ్రి మొత్తం తడిచిపోయింది. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. సోమవారం ఉదయం 11 గంటలకు పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లయ్ఓవర్పైకి చేరుకున్నాడు. ఆహారం కోసం వెతుకులాట తప్ప దక్కిందేమీ లేదు. కనుచూపు మేరలో వరద నీళ్లు తప్ప.. తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి దాతలు ఇచ్చిన పాల ప్యాకెట్లతో కన్నవారి కోసం మళ్లీ నీటిలో నడక ప్రయాణం ప్రారంభించాడు.’’ జీవితం ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ పడవలు షో కోసమే నీళ్లలో తిరుగుతున్నట్టు ఉంది. మాలో ఏ ఒక్కరినీ వాళ్లు ఒడ్డుకు తీసుకురాలేదు. ఇంకెన్నీ రోజులు చస్తూ బతకాలో తెలియడం లేదు – చిన్నా. దెబ్బతిన్న విద్యుత్ సరఫరాసాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దెబ్బతిన్న వ్యవస్థను సరిచేయడానికి 356 మంది సిబ్బందిని 102 బృందాలుగా నియమించినట్లు ఇంధనశాఖ తెలిపింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్‌లోకి బుడమేరు బ్యాక్ వాటర్ భారీగా రావడంతో ఒక్కోటీ 210 మెగావాట్ల సామర్థ్యం గల 6 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. -
156 ఔషధాలపై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషనల్‌ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.ఈ 156 ఎఫ్డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్ఫ్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. -
విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది. -
ఒక్క మెడిసిన్ రిజెక్ట్.. 75% ఉద్యోగుల తొలగింపు
ఒక్క మెడిసిన్ రిజెక్ట్ అయినందుకు ఏకంగా 75% ఉద్యోగులను తొలగించింది ఓ అమెరికన్ ఔషధ సంస్థ. లైకోస్ థెరప్యూటిక్స్ అనే కంపెనీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ చికిత్సలో ఉపయోగించే సైకోథెరపీ డ్రగ్ ఎండీఎంఏను తయారు చేసింది. దీన్ని యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదానికి పంపగా తిరస్కరించింది.ఎఫ్‌డీఏ ఎండీఎంఏ ఔషధాన్ని తిరస్కరించిన వారం రోజుల్లోనే తమ సిబ్బందిలో 75% మందిని తొలగిస్తున్నట్లు, కంపెనీ వ్యవస్థాపకుడు బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు లైకోస్ థెరప్యూటిక్స్ ప్రకటించింది. "మేము ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత కృషి చేస్తాం" అని బోర్డు ఛైర్మన్ జెఫ్ జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎఫ్‌డీఏ తిరస్కరణ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్న కంపెనీ తమ ఔషధానికి మళ్లీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందేలా తీవ్ర ప్రయత్నాలను చేపట్టింది. క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏజెన్సీతో సమన్వయం సహా ఆ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి జాన్సన్ & జాన్సన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ హగ్‌ని నియమించింది. ఇప్పుడు లైకోస్లో సీనియర్ మెడికల్ అడ్వైజర్ అయిన హగ్, 17 ఏళ్లకు పైగా జాన్సన్ & జాన్సన్లో ఉన్నారు.ఎఫ్‌డీఏ ఆమోదం కోసం తమ ఎండీఎంఏ ఔషధాన్ని మళ్లీ సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైకోస్ తెలిపింది. అయితే ఇది ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేదు. మరొక ఫేజ్ 3 అధ్యయనాన్ని నిర్వహించాలని ఎఫ్‌డీఏ కోరిందని కంపెనీ గతంలో చెప్పింది. సాధారణంగా ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం, 2020లో దాదాపు 13 మిలియన్ల అమెరికన్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను కలిగి ఉన్నారు. దీని చికిత్స కోసం అతి తక్కువ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన రెండు మందులు ఉన్నప్పటికీ కొంత మంది రోగులకు అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. -
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?
చాలామంది తమ ఉదయాన్ని కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మార్నింగ్ కాఫీతోనే పరగడుపు మాత్రలు తీసుకుంటుంటారు. చాలావరకు కప్పు కాఫీతో మందులు మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదని, వివిధ దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏఏ మందులు కాఫీతో కలిపి తీసుకోకూడదో సవివరంగా తెలుసుకుందామా..!కాఫీ కడుపుని ప్రేరేపించి జీర్ణవ్యవస్థ ఆహారాన్ని తీసుకునే సమయాన్ని మారుస్తుంది. మందులు మింగే వారికి ఈ కాఫీ వాటితో రియాక్షన్ చెంది రక్తప్రవహంలోకి శోషించటానికి ఎక్కువ వ్వవధి తీసుకునేలా చేస్తుంది. ఇది మానువుల జీవక్రియ, విసర్జనపై గణనీయమైన ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాఫీతో తీసుకోవడం నివారించాల్సిన మందులు..యాంటీబయాటిక్స్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాఫీ కూడా ఒక ఉద్దీపన కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అశాంతి, నిద్రలేమి దారితీస్తుంది లేదా దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణమవుతుంది.ఫెక్సోఫెనాడిన్ వంటి అనేక ఇతర అలెర్జీ ఔషధాలను కాఫీతో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది - విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను పెంచుతుంది.థైరాయిడ్ మందులుహైపో థైరాయిడిజం ఉన్నవారికి - తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి అవ్వదు. దీంతో బరువు పెరగడం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన జుట్టు రాలడం మహిళల్లో క్రమరహిత రుతుక్రమాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, హార్మోన్లను సమతుల్యం చేయడం కోసం థైరాయిడ్ మందులు తీసుకునేవారు కాఫీతో తీసుకుంటే గనుకు ఆ మందులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.ఆస్తమా మందులుఆస్తమా మందులు ఊపిరితిత్తులలోని కండరాలను సడలించి, వాయు వాయుమార్గాలను విస్తరించేలా చేసి..సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. ఇక్కడ కెఫీన్ ఒక తేలికపాటి బ్రోంకోడైలేటర్. ఇది ఈ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేగాదు ఈ బ్రోంకోడైలేటర్లను మందులతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, చిరాకు వంటివి కూడా ముఖ్యంగా పిల్లలలో కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.మధుమేహం మందులుకాఫీని చక్కెర లేదా పాలతో కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. అందువల్ల మధుమేహం మందులు అంతబాగా ప్రభావితంగా పనిచెయ్యవు. పైగా మధుమేహం ఉన్నవారికి కెఫీన్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.అల్జీమర్స్ ఔషధంఅల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒకరకమైన మెదడు రుగ్మత లేదా అభిజ్ఞా పనితీరును కోల్పోవడం. దీనివల్ల రోజువారీ పనులను ఆలోచించడం, గుర్తుంచుకోవడం లేదా చేయడం చాలా కష్టం.అల్జీమర్స్‌తో నివసించే మిలియన్ల మంది ప్రజలు ఈ పరిస్థితికి మందులు తీసుకుంటారు. అయినప్పటికీ, డోపెజిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి మందులు కెఫిన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ రక్తం, మెదడు మధ్య అవరోధాన్ని బిగించి, ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ అల్జీమర్స్ మందులు న్యూరోట్రాన్స్మిటర్, ఎసిటైల్కోలిన్ను రక్షించడం ద్వారా పని చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటామో అప్పుడు ఈ కెఫీన్ ఆ రక్షణ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలిందని వివరించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?) -
బ్రాహ్మి: ఇది.. మీ మెదడుకు మేతలాంటిది!
బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.– పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!
దేశీయ ఫార్మా కాంట్రాక్ట్ తయారీ వ్యాపార విభాగం త్వరలోనే రెట్టింపు అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు చైనా ఫార్మా కంపెనీల కొనుగోళ్లు జరపకుండా అమెరికా బయోసెక్యూర్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. చైనా నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా భారత్‌కు మళ్లుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ తయారీ సెగ్మెంట్ వచ్చే మూడేళ్లలో రెండింతలు కాగలదని, అలాగే కాంట్రాక్ట్ రీసెర్చ్ సెగ్మెంట్ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో అంతర్జాతీయంగా కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సెగ్మెంట్ (సీడీఎంవో) 22.51 బిలియన్ డాలర్లు(రూ.1.8 లక్షల కోట్లు)గా ఉంది. ఇది ఏటా 14.67 శాతం వృద్ధితో 2029 నాటికి 44.63 బిలియన్ డాలర్ల(రూ.3.7 లక్షల కోట్లు)కు చేరనుంది. ఫార్మా విభాగం గణాంకాల ప్రకారం దేశీయంగా కాంట్రాక్ట్ రీసెర్చ్ (సీఆర్వో) సెగ్మెంట్ వార్షికంగా 10.75 శాతం వృద్ధితో 2030 నాటికి 2.5 బిలియన్ డాలర్ల(రూ.20 వేలకోట్లు)కు చేరనుంది. భారతీయ సీడీఎంఏ సెగ్మెంట్ ఇప్పటికే అభివృద్ధి చెందినా, బయోసెక్యూర్ చట్టం అమల చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది.ప్రస్తుతం చైనా సీడీఎంవో పరిశ్రమకు అంతర్జాతీయంగా 8 శాతం మార్కెట్ వాటా ఉండగా, భారత్‌కు 2.7 శాతం వాటా ఉంది. చైనా వాటాను కొల్లగొట్టడానికి ఈ చట్టం భారత్‌కు బాగా ఉపకరించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు అమెరికన్ సంస్థలు ఉత్పత్తి కొనుగోళ్ల కోసం పలు భారతీయ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు వివరించాయి. సుమారు 60 శాతం భారతీయ ఫార్మా కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీపోటీ కూడా ఉంది..బయోసెక్యూర్ చట్టంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మన ఫార్మా కంపెనీలకు వెంటనే ప్రయోజనాలు లభించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి మన కంపెనీలకు గట్టి పోటీ ఉండొచ్చని వివరించాయి. అమెరికాలో ప్రస్తుతం 120 ఔషధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా తోడ్పాటు ఉన్న ఈ ప్రాజెక్టులు మన వైపు మళ్లేందుకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఒప్పందాలను మరికొంత కాలం కొనసాగించుకునేందుకు వీలు కల్పించే నిబంధనల వల్ల తక్షణం ఆర్థిక లబ్ధి చేకూరకపోవచ్చని వివరించాయి. అయితే, భారతీయ కంపెనీలకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిప్లా, సింజీన్ వంటి సీడీఎంవోలు తక్కువ వ్యయాలతో ఔషధాలు తయారు చేయగలవు. అలాగే వాటికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు కూడా అందిస్తోంది. మొత్తం మీద బయోసెక్యూర్ చట్టమనేది భారతీయ సీడీఎంవో విభాగానికి గేమ్ చేంజర్‌గా ఉండగలదని విశ్లేషకులు తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మందుల సరఫరాను పూర్తిగా వదిలేసింది. కనీసం దూది, గ్లౌజులు, కాన్యులాలు కూడా లేక ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. ప్రాథమిక వైద్య సేవలందించే పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల రెండో క్వార్టర్ మందుల సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి రెండో క్వార్టర్ మందులు, సర్జికల్స్ ఈపాటికే ఆస్పత్రులకు అందాలి. అయినా ప్రభుత్వం మందుల సరఫరాపై దృష్టే పెట్టలేదు. దీంతో మందులు సరఫరా చేయాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ కూడా నిస్తేజంగా మారిపోయింది. పైకి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం అంటూ చెబుతున్నా, ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. అన్ని ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన మందులకంటే అతి తక్కువగా అందుబాటులో ఉన్నాయి.గ్లౌజ్‌లు.. కాటన్‌కూ కొరత..ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారికి అందించే చికిత్సల ఆధారంగా జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో వందకు పైగా రకాల మందులు లేవు. చాలా ఆస్పత్రుల్లో కనీసం గ్లౌజ్‌లు, కాటన్, ఐవీ కాన్యులా, అనస్తీషియా కోసం వాడే స్పైనల్ నీడిల్స్, శస్త్ర చికిత్సలు, క్షతగాత్రులకు కుట్లు వేయడానికి మెటీరియల్ కూడా అందుబాటులో లేవు. రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీసీ)లు ఉన్నాయి. వీటిల్లోనే డ్రగ్స్, సర్జికల్స్ లేవని, ఇండెంట్ పెడదామంటే నిత్యం అవసరమైన కొన్ని రకాల మందులు కూడా చూపించడం లేదని ఆస్పత్రుల్లోని ఫార్మాసిస్ట్లు వాపోతున్నారు. లివర్, కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత రోగులకు వాడే ఖరీదైన యాంటిబయోటిక్స్, ఆల్బుమిన్, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్కు గుంటూరు, కర్నూలు, వైజాగ్ సహా పలు ఆస్పత్రుల్లో కొరత ఉంది. నెల్లూరు జీజీహెచ్‌లో గ్యాస్ సమస్యకు ఇచ్చే పాంటప్రజోల్ వంటి మాత్రలకు సైతం కొరత ఉంది. డెంటల్ విభాగంలో పంటి నొప్పితో వచ్చిన రోగులకు సిమెంట్ మెటీరియల్ కూడా లేదు. అదే విధంగా చెవిలో వాడే డివాక్స్ ఇయర్ డ్రాప్స్ సైతం బయటకు రాస్తున్నారు. థైరాయిడ్ పరీక్షల వంటివి చేయడం లేదు. తెనాలి జిల్లా ఆస్పత్రిలో క్యానులా, గ్లౌజ్‌ల కొరత వేధిస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) మందులు, పెయిన్ కిల్లర్ మాత్రలు అందుబాటులో లేవు. దీంతో బీపీ, షుగర్ రోగులకు 30 మాత్రలకు బదులు 10 లేదా 15 మాత్రమే వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. -
టాబ్లెట్ త్వరగా పనిచేయాలంటే ఇలా చేయండి!
టాబ్లెట్ వేసుకున్న తర్వాత కుడి పక్కకు ఒరిగి కూర్చున్నా లేదా కుడిపక్కకే ఒరిగి పడుకున్నా కడుపులో టాబ్లెట్ త్వరగా కరిగి, ప్రతి కణానికీ అందుతుందంటున్నారు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. ‘‘టాబ్లెట్ వేసుకున్నాక రక్తంలోకి వెళ్లడానికి ముందు అది చిన్న పేగుల్లోకి వెళ్లాలి. అయితే అలా వెళ్లాలంటే... కడుపును దాటాక టాబ్లెట్ మొదట చిన్నపేగుల తలుపు (వాల్వ్) ‘పైలోరస్’నూ దాటాక కరిగి రక్తంలో చేరాలి. కుడిపక్కకు ఒరగడం వల్ల అది మరింత వేగంగా, ప్రభావవంతంగా చేరుతుందన్నది వారి మాట. (చదవండి: అన్యురిజమ్స్ అంటే?) -
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్‌కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
Medi Tips: గ్యాస్ సమస్యా? తగ్గించుకోండిలా!
కడుపులో గ్యాస్‌తో పొట్ట ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్లేవరకు ఓ సమస్యే. ఎంతో ఇబ్బందిగానూ ఉండవచ్చు, మరి ఈ గ్యాస్ సమస్య తగ్గాలంటే పాటించాల్సిన సూచనలివి...– తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. అది కూడా బాగా నమలి తినడం. – గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమలడం. – కొవ్వు ఎక్కువగా ఉండేవీ, డీప్ ఫ్రైలు, వేపుళ్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. – కాఫీ, టీ పరిమితంగా తీసుకోవడం. – సోడాలు, కార్బొనేటెడ్ అండ్ కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం.– సరిపడనివారు ΄ాలూ, ΄ాల ఉత్పాదనలకు దూరంగా ఉండటం. – ΄÷గ, ఆల్కహాల్ అలవాట్లు పూర్తిగా మానేయడం. – రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. – బరువు పెరగకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడంఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు.. -
చెంచుల అడ్డాలో లక్ష్మీగడ్డ
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది. కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.చెంచులకు అవినాభావ సంబంధం చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్ఓఎఫ్ఆర్, పెద్దదోర్నాలఎన్నో ఔషధ గుణాలు భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు. -
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్‌కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్‌ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్‌గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్‌లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్‌రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్‌లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్‌కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్‌లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్
కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్‌కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్‌లోని అమోలి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు. అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే బెటర్‌గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు. అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్‌లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్‌ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు. చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్‌లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్‌ని కట్టడి చేశారు రవిచంద్ర. (చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..) -
ఈఏపీసెట్, నీట్ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేరి్పస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్..అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లున్కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్ పరీక్షలకు ‘సాక్షి’ మాక్ టెస్ట్‌లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా ‘మై ర్యాంక్’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్న్ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 22 చివరి తేదీ. రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్‌కు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఏప్రిల్ 27న నీట్, ఏప్రిల్ 28న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలకు హాల్ టికెట్ నంబర్ (యూజర్ నేమ్), ఫోన్ నెంబర్ (పాస్వర్డ్)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు. మాక్ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వహిస్తారు. టెస్ట్ కీ ని ఏప్రిల్ 30న ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. çపూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్ చేయవచ్చు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. చంద్రబాబు పాలనలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉండేది. దీంతో అప్పట్లో ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో పూర్తిగా చక్కబెట్టింది. ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులను ఉంచేలా చర్యలు తీసుకుంది. 2019 ముందు ఏటా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేసి మందుల సరఫరా చేపట్టింది. కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరాకు సంబంధించి 2018–19 సమయంలో రేట్ కాంట్రాక్ట్‌లో 608 గాను 229 మందులే ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్‌లో ఉంటున్నాయి. రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. పీహెచ్‌సీలు, విలేజ్‌క్లినిక్స్‌కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే అందుబాటులో ఉంచుతున్నారు. మందుల బడ్జెట్లో గణనీయమైన పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందుల కోసం బడ్జెట్ గణనీయంగా పెరిగింది. పెరిగిన బడ్జెట్ ప్రభుత్వాస్పత్రుల్లో పుష్కలంగా మందులు ఉంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వంలో 2015–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 216 కోట్లు మాత్రమే మందులకు వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్లు వ్యయం చేశారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనంగా మందుల కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి వైద్య సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.700 కోట్ల మేర మందుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
నకిలీ మందుల ముఠా గుట్టు రట్టు!
దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్ నకిలీ మందులను పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్ తివారీ, అభినయ్ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. -
దేశం చూపు రాష్ట్రం వైపు
సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి. ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. అభివృద్ధికి ఊతం ♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం. ♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. ♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది. -
నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?
ప్రకృతిని ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.! పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. నల్లేరుతో వంటలు అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి. ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది. ఔషధ గుణాలు ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్‌కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. -
అబద్ధాల రోగం.. కథనాలు ఘోరం
సాక్షి, అమరావతి: అబద్ధాలు అచ్చేయకపోతే రామోజీరావుకు నిద్రపట్టేలా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లకుండా ఆయన భోజనం చేయలేరు. పేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యం పైనా విషపురాతలే. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం రామోజీరావుకు నచ్చడం లేదు. మన రాష్ట్రంతో పాటు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలపై నిత్యం కడుపు మంటను ప్రదర్శిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగానే ‘బకాయిల రోగం.. సేవలు ఘోరం!’ అంటూ ఈనాడు పత్రికలో శుక్రవారం కథనం అచ్చేశారు. ఆ పథకం సమర్థవంతంగా అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. బకాయిల కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోయాయంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఏడాది రూ. 2,790.61 కోట్లు చెల్లించిన ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. బాబు పాలనలో నిర్వీర్యమైన పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ఊపిరిలూదారు. ఇటీవలే పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచారు. 1,059 ప్రొసీజర్లను 3,257కు తీసుకుని వెళ్లారు. ప్రొసీజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2019కు ముందు రోజుకు సగటున 1,547 చికిత్సలు చేయగా, ప్రస్తుతం 5,608 చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ఇంత ఘనంగా కొనసా గుతుంటే.. రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయంటూ అబద్ధాలను అల్లి ఆ కథనం ప్రచురించారు. నిజానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏ నెట్వర్క్ ఆస్పత్రిలోనూ రోగులను చేర్చుకోని ఘటనలు లేవు. కావాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు, సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన క్లెయిమ్‌లు గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ. 2,146.90 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 2,790.61 కోట్లు విడుదల చేశారు. ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్‌లను త్వరితగతిన అత్యంత పారదర్శకంగా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిమ్స్, హోమీబాబా, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన డీఎంఈ, స్విమ్స్, విమ్స్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్లెయిమ్స్ ఆమోద ప్రక్రియలో తీవ్రమైన జాప్యానికి ఆస్కారమే లేదు. లంచాలకు తావు లేకుండా లంచాలకు, డబ్బు వసూళ్లకు తావులేకుండా పేదరోగులకు పూర్తి ఉచితంగా పథకం సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్వర్క్ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానం అమలు చేస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కూడా రోగులు ఇంటికెళ్లి ఏఎన్ఎంలు మరోమారు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైన రోగులు లంచాలు, చేతి నుంచి డబ్బు చెల్లించిన ఘటనలు వెలుగు చూస్తే వెంటనే ఆ డబ్బులు వెనక్కి ఇప్పించడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు పథకం విషయంలో సందేహాల నివృత్తి వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు 104 కాల్ సెంటర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటున్నారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్‌ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్‌కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్‌కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్‌డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్‌పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్‌ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌తో పాటు అమెజాన్, వాల్‌మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
డ్రోన్ సాయంతో మందుల తరలింపు?
బీబీనగర్: గ్రామీణ రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాలకు తరలించి, వాటి ఆధారంగా తిరిగి రోగులకు అవసరమయ్యే మందులను డ్రోన్ విమానంలో తరలించేలా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భువనగిరిలోని ఓ మార్కెట్ ఆవరణలో నుంచి చిన్నపాటి డ్రోన్‌లో మందులను అమర్చి కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తూ ఎయిమ్స్‌కు పంపినట్లు సోషల్ మీడియాలో బుధవారం ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై ఎయిమ్స్ అధికారులు, డ్రోన్ విమానాన్ని తరలించిన ప్రాజెక్టు నిర్వాహకులను వివరాలను అడిగినప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎయిమ్స్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా వైద్య శిబికాలె నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి వివిధ పరీక్షల నమూనాలను సేకరించి వారికి సిబ్బంది నేరుగా మందులను పంపిణీ చేస్తారు. కానీ, ఇప్పుడు డ్రోన్ విమానం ద్వారా ఎయిమ్స్‌కు మందులు, శాంపిల్స్ తరలించేలా ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రభుత్వానికీ మనసు ఉండాలని..
సాక్షి, అమరావతి : విశ్వసనీయతకు నిలువెత్తురూపం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆలోచనల్లో నిబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆచరణలో ఎంతటి కష్టం, నష్టం ఉన్నా వెనక్కి తగ్గని గుణం ఆయన సొంతం. జీవనశైలి అత్యంత సాదాసీదాగా ఉంటుంది. మితాహారం ఆయనకు ఇష్టం. నిద్ర కూడా పరిమితమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అధికారంలో ఉన్నప్పుడూ అంతే నిరాడంబరత ఆయనలో కనిపిస్తుంది. మాట, భాష, వ్యవహార శైలే దీనికి నిదర్శనం. రోజురోజుకూ ఆయనలో ఓపిక, సహనం పెరుగుతూనే ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడినా, ఎన్ని గంటలు చర్చించినా ముఖంలో చిరునవ్వు అలాగే కనిపిస్తుంది. మితాహారం మితాహారం తీసుకోవడం, అదే సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఆయన లేచిన తర్వాత రెండు కప్పుల టీ, తర్వాత గ్లాసుడు జ్యూస్ మాత్రమే ఉదయం తీసుకుంటారు. లంచ్‌కు ముందు కప్పు కాఫీ, లంచ్‌లో వెజిటబుల్ సలాడ్, పన్నీర్, తక్కువ మొత్తంలో ఫిష్ లేదా సంబంధిత ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. సాయంత్రం కూడా ఒక కప్పు కాఫీ తాగుతారు. రాత్రికి పుల్కా లేదా, రోటీతో కూరగాయలు తీసుకుంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పరిమితమైన ఆహారం, వ్యాయామం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. స్వీట్లు లాంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. ఆపన్నులకు అండ వైఎస్ జగన్.. అనే పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఒక నమ్మకం. ఆయన ఉన్నాడు.. మనల్ని చూసుకుంటాడనే భరోసా కనిపిస్తుంది. ఇంతటి విశ్వాసం పొందడానికి ఆయన అనుసరిస్తున్న మార్గాలు కూడా స్ఫూర్తిదాయకం. ఒక నాయకుడిగా తాను నడవటమే కాదు పది మందినీ నడిపించే ప్రేరణతో కూడిన శక్తి ఆయన సొంతం. రుజువర్తన, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల, అవి నేరవేరే దాకా చెక్కుచెదరని సంకల్పం, అన్నింటికీ మించి క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. గొంతు విప్పలేని వర్గాలకు ఒక స్వరమై, ఆపన్నులకు ఆపద్భాంధవుడై ఆయన నిలవడం వెనుక ఈ వ్యక్తిత్వమే కారణం. దినచర్య ఇలా.. సమయాన్ని అత్యంత విలువైనదిగా జగన్ భావిస్తారు. అందుకనే రోజువారీ ప్రణాళిక విషయంలో షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతారు. తెల్లవారక ముందే నిద్రలేచే అలవాటును అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ వదులుకోలేదు. ఉదయం 4గంటలకు ఆయన దినచర్య ప్రారంభం అవుతుంది. ఆరోజు దినపత్రికలను ఒకసారి పరిశీలిస్తారు. స్పందించదగ్గ విషయాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ఆదేశాలు ఇస్తారు. గంటకు పైగా వ్యాయామం ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇంగ్లిషు ఛానల్స్, లేదా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, పాలనా రంగాల్లో వస్తున్న అంశాలపై నిపుణులు చేసిన పోడ్కాస్ట్ వింటారు. ఇందులో స్వీకరించదగ్గ అంశాలను గుర్తు పెట్టుకుని ఒక పేపర్‌పై రాసుకుంటారు. రాష్ట్రానికి అవసరమైన అంశాల విషయంలో అవి ఎంత వరకు మేలు చేస్తాయనే విషయాన్ని ఆలోచించి వాటిని అమలు చేస్తారు. వ్యాయామం ముగిసిన తర్వాత తన కార్యాలయానికి రెడీ అవుతారు. సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయంలోనే ఉంటారు. అధికారులతో సమీక్షలు, పాలనా పరమైన వ్యవహారాలు, పార్టీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత మొదట సీఎంఓ అధికారులతో సీఎం ప్రతి రోజూ సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలపై చర్చ ఉంటుంది. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అన్నదానిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే ఆయన అధికారులతో నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు. ‘నేను అయినా, మీరు అయినా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. దాపరికంతో ఉన్నా, మీ ముందు నేను మనసు విప్పి ఓపెన్‌గా మాట్లాడకపోయినా ఈ సమావేశానికి అర్థం ఉండదు. ఏ అంశంపైనైనా మీ అభిప్రాయాలను సంకోచం లేకుండా చెప్పొచ్చు. అప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం’ అని పలుమార్లు చెప్పారు. వ్యతిరేకులు చెప్పిన విషయాల్లో కూడా తీసుకోదగ్గవి ఉంటే మనస్ఫూర్తిగా స్వీకరించాలని, వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలని అధికారులకు సూచించడం.. ఆయన వ్యవహార శైలిలో భాగం. విపత్తు సమయాల్లో అసహాయులైన వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా సీఎం మెరుపు వేగంతో స్పందించడం గురించి పలుమార్లు అధికారులు గుర్తు చేస్తుంటారు. ఒంటరిగా భోజనం చేయడం అరుదు మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా ఆ సమయం వృథా కాకుండా సీనియర్ అధికారులతోనో లేదా పారీ్టకి చెందిన నాయకులతోనో కలిసి భోజనం చేస్తూ అనేక విషయాల మీద మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకల్లా కార్యాలయానికి వచ్చి.. పాలనా విధుల్లో నిమగ్నమవుతారు. సాయంత్రం దాదాపు 7 గంటల వరకూ కార్యాలయంలో ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్లిన సందర్భంలో కూడా ఒకరిద్దరు కార్యదర్శులు, సీనియర్ అధికారులు వెంటవెళ్తారు. ఈ సమయంలో మరో గంటన్నరసేపు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు ఉంటాయి. రోజు వారీ విధులు ముగించిన తర్వాత ఒక ఆలోచన వచ్చినా, లేక టీవీల్లో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా వార్తను చూసినా, ఇంగ్లిషు ఛానళ్లలో కొత్త అంశాలు వచ్చినా.. అప్పటికప్పుడు స్పందించి ఆయన అధికారులకు, పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తారు. తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రాత్రి ఎంత లేటైనా, ఎంత అలసట ఉన్నా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఆయన దినచర్య ప్రారంభిస్తారు. ప్రభుత్వానికి మనసు ఉండాలి ప్రభుత్వానికి మనసు ఉండాలని అధికారులకు పదేపదే చెప్తారు ముఖ్యమంత్రి. అలాంటి మనసుతో ఆలోచించినప్పుడే పేదల కష్టాలను తీర్చగలమని తరచుగా అంటుంటారు. ఈ ప్రభుత్వ పాలనకు ప్రధానమైన పునాది ఉందంటే అది మానవత్వమేనంటూ అధికారుల్లో నిరంతరం స్ఫూర్తి నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక బాలుడికి జీన్ థెరపీ అవసరం అని, దానికోసం కనీసంగా రూ.50 లక్షలు ఖర్చు చేయాలని అధికారులు ప్రతిపాదించినప్పుడు ఏం చేద్దామని ఆయన ప్రశ్నించినప్పుడు.. అంత ఇవ్వలేమని అధికారులు బదులిచ్చారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ మనం ప్రజలకు అంత కష్టం వచ్చినప్పుడు, ఆలోచిస్తూ నిబంధనల సాకు చూపించడం అత్యంత అమానవీయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వంగా మనం తప్పక సహాయం చేయాలని నిర్దేశించారు. అటు విశాఖలో పాలిమర్స్ ఘటన అయినా, బోటు ప్రమాదాలు అయినా, ప్రమాదాలు సంభవించినా, చివరకు మొన్నటి తుపానులో కానిస్టేబుల్ విధి నిర్వహణలో మరణించినా.. వైఎస్ జగన్ అత్యంత మానవీయతను చూపిస్తూనే ఉన్నారు. పేదల బాగు కోసం ఉన్న వ్యవస్థలను మార్చడానికైనా, బడ్జెట్లు దాటడానికైనా, నిబంధనలను తిరిగి రాయడానికైనా వెనుకాడని తత్వం ఆయన సొంతం. నాన్చడం తెలియదు జగన్ పరిపాలనా వ్యవహారాలను దగ్గరగా చూస్తే కొన్ని అంశాల్లో వినూత్నత కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడు మాదిరిగా ప్రతి అంశాన్ని నాన్చి మూలన పడేసే తత్వానికి ఆయన చాలా దూరం. ఏ విషయం మీద కూర్చున్నా దాని మూలాల వరకూ వెళ్తారు. అవసరమైతే మరింత ఆలోచన కోసం మరి కొంత సమయం వెచ్చిస్తారు. తన ఆలోచన మీద సంబంధిత అధికారులు, నిపుణులతో లోతైన చర్చ చేస్తారు. పూర్తిగా అవగతమైన తర్వాత కార్యాచరణకు దిగుతారు. అమలులో ఇబ్బందులొస్తే వెనక్కి తగ్గడం, వాయిదా వేయడం చేయకుండా, మరింత పట్టుదలతో ముందడుగు వేయడం ఆయన నైజం. విద్య, వైద్యం ప్రజలకు నాణ్యంగా అందించాలని తపన విద్యలో నాణ్యత, ప్రజలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన తపనను అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ రెండు రంగాల్లో నాడు–నేడు అలా పుట్టుకొచ్చిన కార్యక్రమాలే. అత్యంత భారంగా మారిన విద్య, వైద్యాన్ని విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రజలకు ఒక హక్కుగా అందించడంతోపాటు, జనాభాలో మెజార్టీ ప్రజలు ఆధారపడే వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు, పారిశ్రామిక–ఉపాధి రంగాన్ని పటిష్టం చేయడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం ఒక యజ్ఞమే చేశారు. జిల్లాల్లో పర్యటనలు లేని సమయంలో ఎక్కువ సమయం ఈ అంశాలకు సంబంధించిన వ్యవస్థలను పరుగులెత్తించడంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. క్రమం తప్పకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, వారికి లక్ష్యాలు నిర్దేశించడం, మరుసటి సమీక్షా సమావేశాలకల్లా వాటిలో ప్రగతిని సమీక్షించడం సీఎం ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. కాబట్టే ఈ నాలుగున్నరేళ్లు సాగిన సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కూడా జరిగాయి. ప్రతి సమీక్ష ఒక సమస్యకు పరిష్కారాన్ని సాధించేలా సాగింది. తాను చేయాల్సిన పనులు, దృష్టి పెట్టాల్సిన అంశాలు కూడా తన జేబులో ఉన్న చిన్న పుస్తకంలో సీఎం ఇప్పటికీ రాసుకుంటారు. వాటిని తప్పనిసరిగా ఫాలో అప్‌చేసి ఫలితాలు సాధించే వరకూ ఆయన నిద్రపోరు. హడావిడి లేకుండా సాఫీగా, సజావుగా సత్వర ఫలితాలను సాధించాలనే శైలి ఆయనది. ఆదేశాల్లో స్పష్టత అధికారులకు స్థిరమైన బాధ్యతలు అప్పగించడం, అందులో కూడా స్పష్టత ఉండడం ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుకు అద్దం పడుతుంది. అధికారులు ఎవరైనా వారిలో పూర్తి సామర్థ్యాలను వెలికితీసి, లక్ష్యాల దిశగా అడుగులు వేయించడం సాధ్యమవుతుందని ఆయన బలంగా విశ్వసిస్తారు. నాయకుడిగా ఆయనకున్న వ్యక్తిత్వం అధికారుల నుంచి ఉత్తమ పనితీరును రాబట్టుకోగలిగింది. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, వారి అభిప్రాయాలను పూర్తిగా వినడం, బాధ్యతలను పూర్తిగా అప్పగించడం, సమిష్టి తత్వాన్ని పెంపొందించడం.. ఇలా అధికారుల పట్ల ఆయన వ్యవహరించే తీరుకు ప్రశంసలు దక్కాయి. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన శాఖాధిపతులు చాలా వరకు సుదీర్ఘకాలంగా అదే స్థానాల్లో ఉండి సేవలు అందించారు. ఇప్పుడూ కొనసాగుతున్నారు. కీలక ఘటనలు 02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం 09.04.2010: పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ 29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు రాజీనామా 12.03.2011: ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకం ఆవిష్కరణ.. పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన 13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,46,673 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి. 27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ 14.06.2012: 19 శాసనసభ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయభేరి, ఒక లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం 24.09.2013: అక్రమ కేసుల్లో జైలు నుంచి బెయిల్‌పై వైఎస్ జగన్ విడుదల 05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్‌లో ఆమరణ దీక్ష 18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం 16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం 20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు 25.10.2017: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ 06.11.2017: ఇడుపులపాయలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం 09.01.2019: 3,648 కి.మీ.లు సాగిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగింపు 23.05.2019: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం 30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
నాణ్యతలేని మందులకు కళ్లెం..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన మందులే ప్రజలకు అందేలా అనేక చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు లేని మందులను లేకుండా చేసేందుకు నాలుగున్నరేళ్లుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా జాతీయస్థాయితో పోలిస్తే మన రాష్ట్రంలో నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సగటున 4% ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ మందుల శాతం 1.55 మాత్రమే. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంచుకుని తనిఖీ చేసేవారు. మూసధోరణిలో సాగే ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తిపలికింది. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా తనిఖీల నిర్వహణ, ఇంటెలిజెంట్ శాంపిలింగ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్‌ను రూపొందించారు. ఈ విధానంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలనే విషయమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు నిర్వహించి, రిపోర్టులను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు శాంపిళ్ల సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో ఎస్వోపీ రూపొందించారు. మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులు, అసాధారణంగా ధరలు ఎక్కువ/తక్కువ ఉండటం.. ఇలా వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని శాంపిళ్లు సేకరించి విశ్లేషణకు లే»ొరేటరీలకు పంపుతున్నారు. నిరంతర నిఘా రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంకులు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రిటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తయారీ సంస్థలు, హోల్‌సేల్, రిటెయిల్ మందుల షాపులపై ఔషధ నియంత్రణ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు మందుల షాపుల్లో 12,686, మందుల తయారీ యూనిట్లలో 243 తనిఖీలు చేసింది. వాటిలో 3,015 నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ విశ్లేషణలో 47 నమూనాలు (1.55%) ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఎన్‌ఎస్‌క్యూగా తేలిన ఘటనల్లో అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికి 16 కేసుల్లో దోషులకు కోర్టు శిక్ష విధించింది. -
దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1.84 కోట్ల మందిలో షుగర్ లక్షణాలు.. గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్ జబ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించిన నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కేసులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నెల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలుగులోకి వచ్చాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు క్షయ అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుంచి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గుర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మందిలో కంటి సమస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సాధారణ మందులతో తగ్గే సమస్యలున్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మందిని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్ సర్జరీలకు రిఫర్ చేశారు. వీరిలో 833 మందికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్షయ తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు.. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం. –జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ -
గాజాకు భారత్ మానవతా సాయం!
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలిసిందే. ఈ భీకర యుద్ధంలో వేలాది మంది సాధారణ పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పాయారు. హమస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయల్ సైన్యం గాజాపై విధ్యంసకరంగా విరుచుపడింది. ఈ దాడులతో గాజా చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ నేడు గాజాలోని పాలస్తీనియన్లకు వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. అంతేగాక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు తదితరాల తోపాటు ఇతర అత్యవసర వస్తులు, నీటి శుద్దీకరణ మాత్రలు గాజాకు పంపిచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఈ దాడుల్లో దాదాపు 4,300 మంది పాలస్తనీయన్లు మరణించారని, ప్రధానంగా పౌరులే ఎక్కువుగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే వేలాదిమందికి పైగా ప్రజలు క్షతగ్రాతులుగా మారారని పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో గాజాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ వారం ప్రారంభంలోనే చర్చించిన సంగతి తెలిసిందే. పైగా భారత్ పాలస్తీనియన్ల కోసం తన వంతుగా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని మోదీ పాలస్తీనా అధ్యక్షుడుకి హామీ కూడా ఇచ్చారు. ఈ ఘర్షణలో పౌరుల మరణాలే అధికంగా ఉండటం బాధకరం అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారు తప్పక దీనికి బాధ్యత వహించక తప్పదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ జిప్టు శిఖరాగ్ర సమావేశంలో యూఎన్ చీఫ్ ఆంటోనియా గుటెర్రెస్ కూడా మానవతావాద దృక్పథంతో కాల్పులు విరమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాలో తాగునీరు, ఆహరం, పెట్రోలు వంటివి లేక తీరని మానవతా పరిస్థితితో అట్టుడుకుతోందన్నారు. గాజా పరిస్థితిని చక్కబడేలా ప్రపంచ దేశాలన్ని తమవంతుగా సాయం అందించేలా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థ ప్రయత్నాలు ఫలితంగా ఇజ్రాయెల్ కూడా గాజాకు మానవతా సాయం అందించేందుకు అంగీకరించింది 🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt. The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph — Arindam Bagchi (@MEAIndia) October 22, 2023 (చదవండి: గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్) -
పొట్టి దూడ.. గట్టి మేలు!
పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నట్టే. వీటిలో మొదటిరకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు మెండు అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది. అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి. వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి... 1953లో పలమనేరు కెటిల్ఫామ్ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్‌లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. గణనీయ ఉత్పత్తికి కృషి ఆంధ్రప్రదేశ్ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్ఫామ్లో సెమన్ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు -
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్‌ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్‌లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు. -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్‌లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్‌లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్‌లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
సొంత వైద్యం మానుకో!
కర్నూలు నగరంలోని సి.క్యాంపు ప్రాంతానికి చెందిన లీలాదేవికి రెగ్యులర్‌గా నెలసరి వచ్చేది. ఒకసారి వారింట్లో పూజ ఉండటంతో ఆ సమయానికి పీరియడ్స్ రాకుండా మెడికల్‌షాపునకు వెళ్లి మాత్రలు తెచ్చి వేసుకునేది. అయితే అవి కాస్తా సైడ్ఎఫెక్ట్ ఇచ్చి ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే గానీ సమస్య పరిష్కారం కాలేదు. ఆదోనికి చెందిన లారీ డ్రైవర్ వీరస్వామి వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని బయటకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతను మెడికల్ షాపునకు వెళ్లి పురుషాధిక్యం కోసం మాత్రలు తీసుకుని వాడేవాడు. ఒకసారి పరిమితికి మించి మాత్రలు వాడటంతో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సకాలంలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న వైద్యుడు అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. వీరే కాదు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి మాత్రలు తీసుకుని వేసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కొందరికి ఏమీ గాకపోయినా మరికొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇంకొందరికి దీర్ఘకాలంలో సమస్యలు వచ్చి ప్రాణాపాయంలోకి నెట్టేస్తున్నాయి. సొంత వైద్యం కొంత మానుకుని వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,800 దాకా పైగా రిటైల్ మెడికల్‌షాప్‌లు, 220 వరకు హోల్‌సేల్ మందుల ఏజెన్సీలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత మందుల దుకాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, కోవిడ్ అనంతరం పలు వ్యాధులు వస్తుండటంతో ప్రజలకు అటు వైద్యులు, ఇటు మందుల అవసరం అధికమైంది. ఈ క్రమంలో వైద్యుల సంఖ్యతో పాటు మెడికల్ షాపుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఇప్పుడు మెడికల్ షాపులు దర్శనమిస్తున్నాయి. అయితే, అధిక శాతం దుకాణాల్లో వైద్యుల మందుల చీటి లేకుండానే అన్ని రకాల మందులు విక్రయిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి ఈ విపరీత ధోరణి మరింత అధికమైంది. వైద్యుల వద్ద ఖర్చు పెరగడమే కారణం ఏదైనా ఒంట్లో నలతగా ఉంటే గతంలో సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకునేవారు. అప్పటి వైద్యులు రోగి వ్యాఽధి లక్షణాలు గుర్తించి ఆ మేరకు అవసరమైన మందులు రాసేవారు. అనవసరంగా వైద్యపరీక్షలు, మందులు రాసేవారు కాదు. కానీ ఇప్పుడు జ్వరం వచ్చిందని వైద్యుల వద్దకు వెళ్లినా అధిక శాతం మంది అవసరం లేకపోయినా మందులు, వైద్యపరీక్షలు రాస్తున్నారు. జ్వరం వస్తేనే వారికి డాక్టర్ బిల్లు రూ.2వేల నుంచి రూ.2,500 దాకా అవుతోంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి వాటికి డాక్టర్ వద్దకు వెళ్తే ఖర్చు రూ.5 వేలు దాటుతుంది. ఈ ఖర్చులు తగ్గించుకునేందుకు కొందరు, భరించలేక మరికొందరు రోగులు మెడికల్‌షాపులను ఆశ్రయిస్తున్నారు. ఒంట్లో ఏదైనా నలతగా ఉంటే తెలిసిన మెడికల్‌షాపునకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్నారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం, నొప్పుల వరకు అయితే ఓకే గానీ కొన్నిసార్లు యాంటిబయాటిక్స్, తీవ్రమైన స్టెరాయిడ్స్, నొప్పుల మాత్రలు కూడా రోగులకు విక్రయిస్తున్నారు. కర్నూలులోని కొన్ని దుకాణాల్లో మత్తు కలిగించే మందులు, ఇంజెక్షన్లు కూడా వాటికి బానిసైన వారికి విక్రయిస్తున్నారు. దీనికితోడు దగ్గు సిరప్‌లను అధిక శాతం విక్రయించే దుకాణాలు సైతం నగరంలో ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. అతిగా వాడితే ప్రాణాంతకం వైద్యుల సూచన లేకుండా ఎడా పెడా మందులు కొని వాడితే అది మొదటికే మోసం చేస్తుంది. వైద్యులు 6 నుంచి 10 సంవత్సరాల పాటు వైద్య విద్యను అభ్యసిస్తే గానీ ఏ వ్యాధికి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, వారి శరీర బరువు, వారి శరీర తత్వం, వారి శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుంది, ఏ మందుకు ఎలా స్పందిస్తుంది లాంటి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే వారు ఫలానా మందులను సూచిస్తూ ఉంటారు. వారి ప్రమేయం లేకుండా నేరుగా మందుల దుకాణంలో కొని వాడితే కొన్నిసార్లు ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా యాంటిబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలోని మంచి బ్యాక్టిరియా కూడా నశిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వేసుకుంటే భవిష్యత్‌లో మళ్లీ వ్యాధి వచ్చినప్పుడు అవి పనిచేయకుండా పోతాయి. అలాగే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడితే కడుపులో పుండ్లు, కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. పీరియడ్స్ రావడానికి, పీరియడ్స్ వాయిదా పడేందుకు వాడే మందులు సైతం వైద్యుల సూచన లేకుండా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. ఇలా మందులు విక్రయించడం రోగుల ప్రాణాలతో ఆటలాడుకోవడమే. కొన్ని మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వాటిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాము. –రమాదేవి, అడిషనల్ డైరెక్టర్, ఔషధనియంత్రణ శాఖ కడుపులో అల్సర్స్ ఏర్పడే ప్రమాదం వైద్యుల సూచన లేకుండా నొప్పులు, స్టెరాయిడ్ మందులు వాడటం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎక్కువశాతం కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. కీళ్లనొప్పులు, ఇతర నొప్పులు తగ్గేందుకు వాడే ఈ మందులు తాత్కాలికంగా పనిచేసినా దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు హెర్బల్ పౌడర్ వాడుతున్నారు. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువ. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, -
యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువర్గాలకు చెందిన వందలాదిమంది మృతి చెందగా, లెక్కలేనంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో, అదే నిజమైతే దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో ఉన్న నియమనిబంధనలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే పాతతరం యూదులు చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే యూదులు రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మెల్లగా మారుతోంది. నేడు యూదులు కూడా తమకు రక్తం అవసరమైనపుడు దానిని ఎక్కించుకునేందుకు అంగీకరిస్తున్నారు. నాటి తరం యూదులు తమ దేవుని శక్తిపై మాత్రమే గాఢమైన నమ్మకాన్ని కలిగివుంటారు. తాము అనారోగ్యానికి గురైనప్పుడు దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే ఆరోగ్యవంతులమవుతామని నమ్ముతుంటారు. వీరిలోని చాలామంది నేటికీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకోరు. మందులు వాడరు. అయితే నేటి తరం యూదులు ఆధునిక వైద్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా, వైద్య పద్ధతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? -
ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): కొన్ని రకాల మందులు అరోగ్యంతో ఆటలాడకుంటున్నాయి. నకిలీ, నిషేధిత మందులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా ఈ మందుల విక్రయాలు ఉనికి చాటుకుంటునే ఉన్నాయి. సాధారణ ప్రజలకే కాదు చదువుకున్న చాలామందికీ మందులపై లోతైన అవగాహన లేకపోవడంతో వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మార్కెట్లో అధిక లాభాపేక్షతో మందుల షాపుల యజమానులు ఈ తరహా మందులు విక్రయిస్తున్నారు. ఇలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా.. మార్కెట్లో నకిలీ మందుల విక్రయాలు పెరిగిపోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొన్ని చిన్నపాటి మందుల కంపెనీలు నకిలీలతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. మందుల పేరులో కొద్దిపాటు అక్షరాల మార్పుతో తప్పుదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా జ్వరానికి పారాసెట్మాల్ టాబ్లెట్‌ను వాడతారు. ఈ మందునే కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లతో విక్రయిస్తుంటాయి. ఇదే మందును డోలో–650 పేరిట కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. కానీ కొన్ని మోసపూరిత కంపెనీలు డోలో పేరును రకరకాలుగా ముద్రించి గుర్తించలేని విధంగా నకిలీవి తయారు చేస్తున్నాయి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలా చాలా మందుల్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మందుల షాపు వాళ్లు ఇచ్చినవి తీసుకుంటున్నారు. కనీసం ఈ మందు అసలైనదా కాదా అని పరిశీలించే అవగాహన కొరవడుతోంది. ఈ బలహీనతే మందుల షాపులకు..కంపెనీలకు కలిసివస్తోంది. ప్రస్తుతం నకిలీ మందులే ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ తరహా మందులు వాడినా ప్రయోజనం పెద్దగా ఉండదు. పైగా అనారోగ్యం పెరుగుతుంది. మందుల వ్యాపారంలో వచ్చిన ఈ ధోరణి అత్యంత ప్రమాదకరమని ఔషధ నియంత్రణ శాఖ హెచ్చరిస్తోంది. పల్లెల్లో టోకరా కార్పొరేట్ లేదా పేరున్న మందుల షాపుల్లో నకిలీలకు ఆస్కారం తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా మందులను అధికంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిరక్షరాశ్యులే కాదు చదువుకున్న వారూ ఈ మందుల మోసాల బారిన పడుతున్నారు. చాలా మంది అధికంగా గ్యాస్ట్రిక్ ట్యాబెట్లు కొంటుంటారు. పేంటాప్రజోల్ మందు దీని నివారణకు ఉపయోగపడుతుంది. ఈ మందుతో రకరకాల టాబ్లెట్లు వచ్చాయి. పేంటాప్ బ్రాండ్ పేరు. కానీ కొన్నింటిపై ఎక్కడోచోట చిన్నపాటి అక్షరం మార్చి పేంటాప్ మాత్రగా భ్రమింపజేస్తున్నారు. అవగాహన లేక చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా అమ్ముతున్న మందుల్లో పాంటాసిడ్ డీఎస్ఆర్ సైతం ఉందని డ్రగ్స్ అధికారులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరు జిల్లాల్లో రూ.1 లక్ష విలువైన నకిలీ మందులను పట్టుకున్నారు. అప్రమత్తత అవసరం అత్యవసరంలోను, డాక్టర్ పర్యవేక్షణలోనూ వాడాల్సిన మందుల వాడకం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలుపాటించాల్సిందే. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలస్ట్రాల్ తగ్గుదలకు రోస్వాస్..షుగరుకు గ్లూకోనార్మ్..ఫిట్స్‌కు గబాపెండింగ్..బీపీకి టెల్మా–హెచ్..జీర్ణాశయ అల్సర్లకు పెంటాప్–డీఎస్సార్ మందులు వాడుతుంటారు. కానీ ఈ మందులకు సంబంధించి గుంటూరు..విజయవాడ..నరసరావుపేటల నుంచి నకిలీలు ఎక్కువగా మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రాణహాని ఉందని చెబుతున్నా వీటిని విచ్చలవిడిగా కొంటున్నారు. వీటిని విక్రయించవద్దని మందుల దుకాణాలకు ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖాధికారులు అదేశాలు జారీ చేశారు. వీటి అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి నకిలీ మందుల కట్టడి కోసమే షాపులో తప్పనిసరిగా సీసీ కెమెరా ఉండాలనే నిబంధన విధించారు. మందులు ఎవరికి ఇచ్చారు. ఏ వైద్యుని చీటీపై ఇచ్చారో రికార్డు అవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. దొరికితే లైసెన్సు రద్దే... నకిలీ మందులు, నిషేధిత మందులు, హెచ్, హెచ్ 1, షెడ్యూల్ ఎక్స్ మందుల అమ్మకాలపై నిఘా పెట్టాం. వీటిపై మందుల దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటి అమ్మకాల వల్ల జరిగే అనర్దాలు, డ్రగ్స్ అధికారులకు పట్టుబడడం వల్ల జరిగే వ్యాపార నష్టం, జైలుశిక్షలపై వివరిస్తున్నాం. ఎవరైనా దొరికితే వెంటనే మందుల దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. మందులు కొనుగోలుపై ప్రజల్లో పూర్తిగా అవగాహన రావాలి. కొన్ని రకాల మందులు డాక్టర్ సలహా మేరకే వాడాలి. కొన్ని మందులు వాడడం వల్ల ఉన్న రోగం తగ్గే మాట ఎలా లేని పోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటివల్ల తాత్కాలిక ఉపశమనమున్నా శరీర భాగాలకు హాని చేయడంలో ఇవి కత్తి కన్నా పదునుగా పనిచేస్తాయి. – డి.నాగమణి, సహాయ సంచాలకులు, ఔషధనియంత్రణశాఖ. ఏం చేయాలి లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేయాలి. అన్ని అర్హతలూ ఉన్న వైద్యులతోనే చికిత్స చేయించు కోవాలి. మందులు తీసుకునేటప్పుడు బిల్లు రాయించుకోవాలి. ఆయా మందులు వాడేటప్పుడు అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి సంబంధిత డాక్టరుకు, డ్రగ్స్ అధికారులకు తెలియజేయాలి. మందుల నాణ్యతపై అనుమానమొస్తే వెంటనే ఔషధ తనిఖీ అధికారికి సమాచారమివ్వాలి ఫిర్యాదు చేస్తే సంబంధిత మందును లేబరొటరీ పరీక్షలకు పంపుతారు. నిషేఽధిత మందులు వాడొద్దు నిమ్సులైడ్, సిట్రిజన్ హైడ్రోక్లోరైడ్,, లివోసిట్రిజన్,పారాసిటమాల్ బ్రోమోహెక్సెన్,యామ్బ్రాక్సల్ లాంటి మందులలో బ్రాండ్లను అనుసరిస్తూ నకిలీలు ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు ఇటీవల దాడుల్లో గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హరిద్వార్, బద్ది వంటి ప్రాంతాల్లోని కంపెనీలు ఈ మందులను రకరకాల పేరుతో నకిలీవి తయారు చేసున్నాయి. 12 ఏళ్లలోపు వయసున్న వారికి నిమ్సులైడ్ మందు వాడకూడదు. దీనిని నిషేధించారు. అయినా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్రాణానికి హానిచేసే 200 రకాల ఔఽషధాలను నిషేధించారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 24 మంది మృత్యువాతపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నాందేడ్ జిల్లాలో శంకర్రావు చావన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం వెలుగుచూసింది. అయితే ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న మృతుల సంఖ్య నాందేడ్ ప్రభుత్వ వైద్యశాలలో గత 24 గంటల్లో 24 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. మరోవైపు నాందేడ్ ఆసుపత్రిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దురదృష్టవశాత్తు మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో చనిపోయిన వారిలో 4గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. తాజా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. नांदेडमध्ये मृत्यूचे थैमान सुरूच. शासकीय वैद्यकीय महाविद्यालयाच्या रुग्णालयात कालपासून आणखी ७ रुग्णांचा दुर्दैवी मृत्यू. मृतकांमध्ये ४ बालकांचाही समावेश. राज्य सरकारने जबाबदारी निश्चित करावी. — Ashok Chavan (@AshokChavanINC) October 3, 2023 మందుల కొరత వల్లే మరణాలు రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన మిగతా పన్నెండు మంది పెద్దవారిలో పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన పేర్కొన్నారు. 70-80 కి.మీలో ఏకైక ఆసుపత్రి ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, కానీ చుట్టుపక్కల 70,80 కిలీమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక హెల్త్ కేర్ సెంటర్ ఇదే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని డీన్ తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు పేషెంట్ల సంఖ్య ఆసుపత్రి బడ్జెట్‌ను మించిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని తెలిపారు. చదవండి: ప్రాణం పోయేలా ఉందన్నా.. పడేసి పోయారు! సిబ్బంది బదిలీతోనూ ఇబ్బందులు హాఫ్కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగడం లేదని అన్నారు డీన్. దీంతో రోగులు స్థానిక మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన తర్వాతే రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు అనేకమంది ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆవేదన.. మరోవైపు మృతుల్లో నవజాత శిశువులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. తమ పిల్లల మరణాలకు ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని, వైద్యులు సరిగా చికిత్స చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను చూడటానికి సిబ్బంది అనుమతించడం లేదని మరికొంతమంది చెబుతున్నారు. మా బిడ్డ క్షేమంగా ఉన్నాడో లేదో.. మాకు ఏమీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల మండిపాటు ఇక ఈ ఘటన విషయంలో మహారాష్ట్రలోని శివసేన(షిండే వర్గం), బీజేపీ, ఎన్సీపీ(అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాందేడ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులతో సహా 24 మరణాలు మందుల కొరత వల్ల మాత్రమే సంభవించలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని విరుచుకుపడ్డాయి. పండుగలు, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, చిన్నారుల మందుల కోసం డబ్బులు కేటాయించకపోవడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని మండిపడుతున్నాయి. नांदेड़, महाराष्ट्र के सरकारी अस्पताल में दवाइयों की कमी से 12 नवजात शिशुओं समेत 24 लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। भाजपा सरकार हज़ारों करोड़ रुपए अपने प्रचार पर खर्च कर देती है, मगर बच्चों की दवाइयों के लिए… — Rahul Gandhi (@RahulGandhi) October 2, 2023 విచారణకు ఆదేశం ఎన్సీపీ(శరద్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు. -
ప్రజారోగ్యానికి ‘రక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం. వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్‌సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్‌ను పెంచాం. గతంలో 915 నెట్వర్క్ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం. ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయాలి. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్ వర్క్ అంతా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా), అసోసియేషన్ ఆఫ్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ: గ్రామంలోని విలేజ్ క్లినిక్‌లో ఒక భాగానికి సీహెచ్‌వో, మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి పుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. నాలుగో దశ: హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. -
క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..
క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా వచ్చి ఒక్కసారిగా మనిషిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే భయానక వ్యాధి అనే చెప్పాలి. ఇంతవరకు డబ్బున్న వాళ్లకు, చెడువ్యసనాలు ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చేది ఈ వ్యాధి. ఇప్పుడు ఇది కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందర్నీ అటాక్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తోంది. చాలావరకు కొన్ని క్యాన్సర్లను దశాల రీత్యా మందులతోనే నయం చేయొచ్చు. కానీ కొన్నింటికి కీమో థెరఫీ వంటి చికిత్సలు మరికొన్నింటికి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తారు వైద్యులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సంబంధించి వైద్యం మాత్రమే గాక మెడిసిన్ సైతం అత్యంత ఖరీదే. అలాంటి మందులను సైతం భారత్ ఫ్రీగా ఇస్తోంది. ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తుంది ఆరోగ్య సంరక్షణలో భారత్ తీసుకుంటున్న చర్యలు గురించే ఈ కథనం.! భారత్ క్యాన్సర్‌కి సంబంధించి సుమారు 90 మందులలో 42 మందులను ఫ్రీగానే రోగులకు అందిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సంజీవని: యునైటెడ్ ఎగైనెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తూ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచామననారు. ఆరోగ్యం ఎప్పుడూ రాజీకీయ అంశం కాదని అదొక గొప్ప సేవ అని చెప్పారు. కాలక్రమేణ వ్యాధుల తీరు మారుతోంది. దీనిపై సమగ్ర దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పారు మాండవీయ. అంతేగాదు భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిలోకి విలీనం చేసిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యమే అత్యంత కీలక పాత్ర అని చెప్పారు. అందువల్లే ప్రభుత్వం ఆరోగ్య సేవలు పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించిందన్నారు. కోవిడ్ 19 తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో అధిగమించింది. అలాగే మాండవియా తాను ప్రారంభించిన సంజీవని ఫౌండేషన్ గురించి కూడా వివరించారు. ఇది నిశబ్దంగా కబళించే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, వ్యాధికి సంబంధించిన భయాలను పోగొట్టడం తదితర అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తూ వారిక తగిన సలహాలు సూచనలు ఇస్తున్న 'ఆశా బెహన్' సామాజకి కార్యకర్తల పాత్ర చాలా గొప్పదని అన్నారు. అంతేగాదు క్యాన్సర్ సంరక్షణలో భారత విధానం గురించి కూడా విపులీకరించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పేద రోగులకు ఫీజులు మినహాయింపు ఇవ్వడమేగాక లాభప్రేక్షలేని ధరల్లోనే మందులను అందిస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వల్ల భారత్ కొంతమేర ఆరోగ్య సంరక్షణను తక్కువ ధరలోనే అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించనున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి మాండవీయ. (చదవండి: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..) -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్‌లో ఉన్న పిల్లల మూడ్స్‌ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్‌లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్‌లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..?
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో తొమ్మిది మెడికల్ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్‌రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభించినందుకు సెస్ కార్యాలయం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్ చేయాలనుకుంటే.. నాన్న నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారని ఆనాటి రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఎంసెట్‌లో 1600 ర్యాంక్ వచ్చినా.. మెడికల్ సీటు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్& ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే(సిరిసిల్ల) ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవని విమర్శించారు. చదవండి: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా? ‘మొన్నటి దాకా డాక్టర్ల కొరత వుండేది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వల్ల కేవలం సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేస్తాం. మోదీ లాంటి వాళ్ళు సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు బాసులు ఎవరూ లేరు. ప్రజలే మాకు బాసులు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్లనడగాలి.సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీనరసింహారావును మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు మంత్రి కేటీఆర్. -
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?
చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ఊపిరి పీల్చుకోలేక నరకయాతన పడుతుంటారు. పొరపాటున స్పీడ్‌గా నడిచినా లేక ఏదైనా ఆహారం తింటున్నప్పుడూ పొలమారి ఎగ ఊపిరి దిగ ఊపిరి అన్నట్లుగా ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. కొందరికి నిరంతరం ఓ సమస్యలా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు కూడా. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉనాయని చెబుతున్నారు. వాటిని వాడితే సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం. వేప నూనెతో ఈజీగా బయటపడొచ్చు.. వేప నూనె రోజు రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేయండి.వేసిన తర్వాత గట్టిగా పైకి లాగితే అది నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది దాంతోపాటు లోపల ఉన్న కఫం కూడా కొట్టుకు వచ్చేస్తుంది ఇది చాలామందిలో చక్కని ఫలితం ఇచ్చిన ఆయుర్వేద సలహా అని అంటున్నారు నిపుణులు నవీన్ నడిమింటి . ఇలా చేస్తే ఆపరేషన్ కడా అవసరం ఉండదు. అలా రెండు మూడు వారాలు చేయండి ఒక వారంలోనే మీకు చాలా రిలీఫ్ కనిపిస్తుంది తర్వాత చెక్ చేసుకోండి మొత్తం కండకరిగిపోతుంది. ఇతర ఔషధాలు.. 👉స్వర్ణభ్రాకాసిందుర: ఇది ఉబ్బసం, దగ్గు, ఛాతీ వణుకు చికిత్సకు సహాయపడుతుంది. అలాగే టీబీ రోగికి కూడా వినియోగించొచ్చు. మోతాదు : 1 గ్రా మోతాదు వసారిస్టాతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 👉వసరిష్ట (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): ఇది శ్వాసనాళ సమస్యలు, సైనసైటీస్ , గుండె ప్రభావాలలో ఉత్పత్తి చేసే దగ్గు, రక్త పిత్తానికి నమ్మకమైన నివారణ. మోతాదు: ఆహారం తర్వాత రోజూ రెండుసార్లు - 4 చెంచాల సిరప్ సమానమైన నీటితో కరిగించి ఆహారం తర్వాత తీసుకోవాలి. 👉చ్యవన్ ప్రాష్ (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): గొప్ప నరాల టానిక్. ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది, యవ్వనంగా ఉంచుతుంది. మోతాదు: 1.5 టీస్పూన్ బ్రోన్ఫ్రీ తర్వాత రోజుకు రెండుసార్లు వాడాలి. 👉మహాలక్ష్మివిలసరస: ఉబ్బసం కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు. మోతాదు : 1 గ్రా . రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు సాయంత్రం) తేనెతో వాడాలి. త్వరగా కోలుకోవటానికి చ్యవన్ ప్రాష్ని, వసరిష్టలతో పాటు లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సలహా. 👉లోహాసవ: మోతాదు: భోజనం తర్వాత 10ఎంఎల్ మోతాదులో నీటి సమాన పరిమాణంతో తీసుకోవాలి. 👉హేమమృతరాస: మోతాదు: వైద్యుడు దర్శకత్వం వహించినట్లు రోజుకు రెండుసార్లు చ్యవనప్రసాతో లేదా పరిక్షారిస్తాతో ద్రక్షారిస్తా / వసరిష్టతో కలిపి వాడాలి. సీతోపలాది 👉చూర్ణ: మోతాదు: 2 గ్రా నుంచి 3 గ్రా. రోజుకు రెండుసార్లు కండ చెక్కెరతో వాడాలి. బ్రాన్ఫ్రీ: శ్వాసనాళ రుగ్మతలపై పనిచేస్తుంది. మోతాదు: ఒక టాబ్లెట్ రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి. పై మందులను మూడు నెలల కాల పరిమితితో తీసుకున్నచో గొప్ప ఫలితాలు లభించును. శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావొచ్చు.. అలాంటి వారికి మరికొంత సమయం మందులు వాడవలసి ఉంటుంది.. తాము చెప్పే నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా.. చెప్పిన కాలపరిమితి వరకు ఈమందులను వాడితే మీరు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప ఫలితాలని మీరే స్వయంగా చూస్తారని చెబుతున్నారు నవీన్ నడిమింటి -ఆయుర్వేద వైద్యుడు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ! ధర తెలిస్తే..
గ్లోబల్ ఫార్మా దిగ్గజం రోచె (Roche) అత్యంత క్లిష్టమైన, అరుదైన వ్యాధి మెడిసిన్‌ను భారతదేశంలో.. చైనా & పాకిస్థాన్ దేశాలకంటే కూడా 15 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మందు ఏది? మన దేశంలో దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం.. భారతదేశంలో 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ థెరపీ' (SMA) ఒక్కో బాటిల్ ధర రూ. 6.2 లక్షలకంటే ఎక్కువని తెలుస్తోంది. పాకిస్థాన్‌లో దీని ధర రూ. 41,002 కాగా.. చైనాలో రూ. 44,692 కావడం గమనార్హం. ఎస్ఎమ్ఏ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని దీని అవసరం చాలా ఉంటుందని చెబుతారు. ఒక వ్యక్తి బరువు సుమారు 20 కేజీల కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారికి సంవత్సరానికి దాదాపు 36 బాటిళ్లు అవసరమవుతాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో స్పష్టంగా అర్థమయిపోతోంది. దీనిపైనా ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! ఈ మెడిసిన్ 2021లో ప్రారంభించినట్లు.. ప్రారంభ ధరకు, ఇప్పటి ధరకు చాలా వ్యత్యసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే SMA వ్యాధికి కావలసిన మందులను బయోజెన్, నోవార్టిస్ వంటి కంపెనీలు కూడా తయారు చేస్తాయి. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లకు సరైన ధరలో మందులు అందివ్వాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. -
‘లుపిన్’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్‌హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్)ను ట్రేడ్‌మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్హామ్తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది. ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు. -
నవ చరిత్ర : చెప్పాడంటే. చేస్తాడంతే
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో వందేళ్లుగా సాధ్యం కాని భూముల సర్వే లాంటి బృహత్తర కార్యక్రమాలను సైతం నాలుగేళ్లలోనే సాకారం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా గత 50 నెలల్లో డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. పలు రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ గత నాలుగేళ్లలో ఆరు ప్రధాన రంగాల్లో తెచ్చిన మార్పులను వివరించారు. వ్యవసాయం.. రాష్ట్రంలో 52 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఆర్బీకే స్ధాయిలో ఈ క్రాప్, ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. పంట నష్టపోతే సీజన్ ముగిసేలోగానే రైతులకు పరిహారం అందిస్తున్నాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్‌తోపాటు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. పాలవెల్లువ ద్వారా అదనంగా ఆదాయాన్ని సమకూర్చాం. మూతపడిన చిత్తూరు డెయిరీ సహా సహకార సంఘాలకు జీవం పోశాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టి భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నాం. అసైన్డ్ భూములపై సాగుదారులకు పూర్తి హక్కులు కల్పించాం. వీరిలో ఎస్సీ, బీసీ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. 1.54 లక్షల మంది ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలుగా ఇచ్చాం. చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించాం. షరతులు గల పట్టాలు కలిగిన మరో 22 వేల మంది రైతులకు 33 వేల ఎకరాలపై పూర్తి హక్కులు కల్పించాం. వడివడిగా ప్రాజెక్టులు.. గత ప్రభుత్వంలో మాదిరిగా ఫలితాలు లేకుండా, ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టకుండా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్ పూర్తి చేశాం. పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నింపగలుగుతున్నాం. కాలువల సామర్థ్యం పెంచటంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వెలిగొండలో మొదటి టన్నెల్‌ను మనమే పూర్తి చేయగా రెండో టన్నెల్ పనులు మరో రెండు నెలల్లో పూర్తికానుంది. ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్–2, వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులను పూర్తి చేసి డిసెంబర్ కల్లా ప్రారంభించనున్నాం. తోటపల్లి, తారకరామ తీర్థ సాగర్ పనులు 2024కి పూర్తి చేయనున్నాం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి వడివడిగా పనులు చేపట్టాం. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ఏటా దాదాపు 83 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేలా ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్ పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా ఇచ్చాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం. రోజుకో మెనూతో గోరుముద్ద రుచికరంగా అందిస్తున్నాం. రూ. 20 వేల వర కు వసతి దీవెన ఇస్తున్నాం. ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపు 330 కాలేజీల్లో, 21 ఫ్యాకలీ్టల్లో సీటు తెచ్చుకున్న పిల్లలకు రూ.1.25 కోట్ల వరకూ విదేశీ విద్యా దీవెన ఇస్తున్నాం. డిగ్రీ కరిక్యులమ్‌ను జాబ్ ఓరియంటెడ్‌గా మార్పు చేశాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులను తీసుకొచ్చాం. 10 నెలల ఇంటర్న్‌షిప్ విధానాన్ని తెచ్చాం. వర్సిటీలు, ట్రిపుల్ఐటీల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 3,295 టీచింగ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీ సహా ప్రతి మార్పును విద్యారంగంతో అనుసంధానిస్తూ ప్రపంచంతో పాటు అడుగులు వేస్తున్నాం. అందరికీ వైద్యం, ఆరోగ్యం వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ 50 నెలల్లోనే ఏకంగా 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 108, 104 సేవల కోసం మరో 1,514 వాహనాలను కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌తో కలిపి ఏకంగా 2,204 వాహనాలను నడుపుతున్న ఏకైక రాష్ట్రం మనది మాత్రమే. రికార్డు స్ధాయిలో 53,126 వైద్య సిబ్బంది నియామకాలు జరిపాం. స్పెషలిస్టు డాక్టర్లు దొరక్క జాతీయ స్థాయిలో 61 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్రంలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల ద్వారా 96.04 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేశాం. జాతీయ స్థాయిలో 27 శాతం నర్సులు, 33 శాతం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయకుండా వదిలేస్తే మన రాష్ట్రంలో 100 శాతం పోస్టుల్ని భర్తీ చేశాం. గతంలో ప్రమాణాలు లేని 292 రకాల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటే ఈ రోజు ఏకంగా 562 రకాల డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తెచ్చాం. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు గ్రామస్థాయిలోనే అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. ప్రివెంటివ్ కేర్‌లో ఇది నూతన అధ్యాయం. 95 శాతం జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతోపాటు ప్రొసీజర్లను 3255కి విస్తరించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.5 వేల వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్నాం. సామాజిక మార్పులు మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చాం. శాసన సభ స్పీకర్‌గా బీసీకి, మండలి చైర్మన్‌గా ఎస్సీకి,మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించాం. నామినేటెడ్ పోస్టుల్లో ౖచైర్మన్లుగా, డైరెక్టర్లుగా 50 శా తం పదవులను చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాం. నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీల కు దక్కేలా చట్టం చేశాం. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశాం. గత 50 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను పారదర్శకంగా అందించగా, అందులో ఏకంగా 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే లబ్ధి చేకూరింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. వీరిలో 80 శాతం ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. మూడేళ్లుగా మనమే నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో నంబర్ వన్ స్ధానంలో ఉంది. రాష్ట్ర విభజన నాటికి కేవలం నాలుగు చోట్ల మాత్రమే పోర్టులు ఉండగా ఈ నాలుగేళ్లలోనే మరో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం. విశాఖలో ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభించాం. కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. కడప విమానాశ్రయాన్ని విస్తరించాం. దేశంలో నిర్మిస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో మూడు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. గతంలో ఏనాడూ మన రాష్ట్రానికి రాని పారిశ్రామిక దిగ్గజాలు ఈ నాలుగేళ్లలోనే వచ్చారు. 2019 జూ న్ నుంచి నేటి వరకు రాష్ట్రంలో నెలకొల్పిన భారీ పరిశ్రమలు 127. వచ్చిన పెట్టుబడులు రూ.67, 196 కోట్లు. ప్రత్యక్ష ఉద్యోగాలు 84,607. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఏకంగా రూ.13.42 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదిరాయి. తద్వారా రానున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 6 లక్షలు. కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 2,00,995. ఉద్యోగాలు, ఉపాధి పొందినవారు 12.61 లక్షలు. కో విడ్ విసిరిన పెను సవాళ్లను తట్టుకుని మన రాష్ట్ర పారిశ్రామిక ర్యాంకును, ముఖ్యంగా ఎంఎస్ఎంఈని రక్షించుకోగలిగాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని స్థానికులే ఆహ్వానించేలా, తద్వారా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించింది మన ప్రభుత్వమే. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే మందులు!
దేశంలో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థ రైల్వేలు. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణికుల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొంత మంది ముందు జాగ్రత్తగా కొన్ని మందులు తమ వెంట తెచ్చుకున్నా చాలా మంది మందులు దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్ స్టాల్స్ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్లెట్లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొదట 50 స్టేషన్లలో.. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Water Bottles in Trains: రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి? రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. -
ఆహారంలోని ఔషధాన్నే వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది?
ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే. ‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్‌లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి. ఇంటర్నెట్ నేర్పించింది! ‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను. ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు. ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లను తీసుకున్నాను. తేనెతోపాటు ఇంకా... ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్ఫ్యూజ్డ్ హనీ తయారు చేశాం. అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను. దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్‌ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర. ఇష్టంగా పనిచేశాను! నా యూనిట్‌ని మా అన్నయ్య యూనిట్‌కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎమ్‌పీ, ఐఎస్ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే. – ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
మెడిసిన్‌లో బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభమవుతున్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు స్విమ్స్, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన విద్యార్థులు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://ugmq.ysruhs.com వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. నియమాలు, నిబంధనలపై స్పష్టత కోసం 8978780501, 7997710168, 9391805238, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, పేమెంట్ గేట్‌వేలో స్పష్టత కోసం 8333883934 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. నీట్ యూజీలో వచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా నిబంధనలకు లోబడి సీట్ల కేటాయింపు ఉంటుందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సీటు వచ్చేలా చేస్తామని కొందరు వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని ఆమె స్పష్టంచేశారు. -
మెడిసిన్ నకిలీదా.. కాదా? సింపుల్‌గా తెలుసుకోండిలా!
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. ఆరోగ్యం కూడా అంతే వేగంగా క్షిణిస్తోంది. కావున మెడిసిన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి అవి నకిలీ ముందుకు అయుండొచ్చని సందేహం వస్తుంది. అలాంటి అనుమానాలకు చెక్ పెట్టటానికి క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్.. నివేదికల ప్రకారం.. సుమారు 300 మందుపైన క్యూఆర్ కోడ్ వేయాలని 'డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCJI) ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కావున నిర్దేశిత మందులపైన క్యూఆర్ లేదా బార్ కోడ్ తప్పనిసరి అయింది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. క్యూఆర్ లేదా బార్ కోడ్ కలిగిన మందుల జాబితాలో యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీ డయాబెటిక్స్ మిక్స్‌టార్డ్, గ్లైకోమెట్-జిపి, యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో మెడిసిన్ వంటివి ఉన్నాయి. ఫార్మా రిటైల్ మార్కెట్లో దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన అధికంగా అమ్ముడవుతున్న 300 కంటే ఎక్కువ మందులపై క్యూఆర్ కోడ్ రానుంది. ఈ క్యూఆర్ కోడ్ అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగితే భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని డసీజేఐ ఆదేశించింది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు! మెడిసిన్ డీటెయిల్స్.. నిజానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే దాని జనరల్ నేమ్, బ్రాండ్ నేమ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, తయారీదారు లైసెన్స్ నెంబర్ వంటివి ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి ప్రభుత్వం నకిలీ మందులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ విధానం మీద కృషి చేయగా ఈ రోజు (2023 ఆగష్టు 01) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని సవరించింది. -
టెలి మెడిసిన్‌లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: వయో వృద్ధులు, మహిళలకు టెలీ మెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,10,12,570 మంది వయో వృద్ధులు టెలిమెడిసిన్ సేవలు పొందగా ఆంధ్రప్రదేశ్‌లో 34.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది. దేశవ్యాప్తంగా పోలిస్తే 31.04 శాతం వయో వృద్ధులకు ఏపీలో సేవలు అందాయి. మహిళలకు టెలిమెడిసిన్ సేవలందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5,22,15,224 మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందగా ఆంధ్రప్రదేశ్‌లోనే 1.37 కోట్ల మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే ఏపీలో 26.41 శాతం మంది మహిళలు టెలి మెడిసిన్ సేవలు పొందారు. ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ కోటి మందికి పైగా మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందలేదు. పశ్చిమ బెంగాల్లో 85.16 లక్షల మంది మహిళలు, తమిళనాడులో 62.94 లక్షల మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21,236 స్పోక్స్ హబ్‌లు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా అస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలకు సంబంధించి 21,236 స్పోక్స్ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్ నుంచి వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి తగిన ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. ఆ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌తో ఇంటి నుంచే వైద్య సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారితో పాటు వాటిని వినియోగించలేని వారి కోసం ఇంటి వద్దే ఈ–సంజీవని ఓపీ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్ ల కు అనుసంధానించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను పొందగలుగుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో అత్యధికంగా వృద్ధులు, మహిళలకు టెలి మెడిసిన్ సేవలు అందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. -
'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO అలర్ట్
భారత్‌లో తయారై.. ఇరాక్‌లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్‌లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్‌పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్‌లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్‌లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్‌లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్‌బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్‌వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్‌వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్‌లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది. సిరప్ ఫలితాలపై ఇరాక్ ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇరాక్‌లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్‌లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు. గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్‌లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్‌లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో -
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఏపీ విద్యా విధానాలు భేష్
సాక్షి, అమరావతి : అందరికీ విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలు, నాడు – నేడు, సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎకనావిుక్, సోషల్ కౌన్సిల్ అంతర్జాతీయ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్‌లో ఆర్థిక, సామాజిక మండలి నేతృత్వంలో సుస్థిరాభివృద్ధి పై జూలై 17న జనరల్ అసెంబ్లీ హాలులో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు, విద్యారంగంలో పధకాలకు సంబంధించి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, విద్యా దీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యార్ధులకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాల పోస్టర్లను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్మార్ట్ బోర్డ్స్, బైజూస్ ట్యాబ్స్ నమూనాలను ప్రదర్శించారు. ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, వివిధ పథకాల ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరు, డిజిటల్ బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి వివరించారు. నాడు – నేడు స్టాల్‌ని సందర్శించిన ఎకనావిుక్ సోషల్ కౌన్సిల్ ప్రపంచ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు టోఫెల్ ట్రైనింగ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైలింగ్యువల్ డిక్షనరీలు, గోరుముద్ద, ఆణిముత్యాల పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేద విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని షకిన్ కుమార్ ఆమెకు వివరించారు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ఏపీ స్టాల్‌పై పలు దేశాల ఆసక్తి టాంజానియా ఆర్థిక శాఖా మంత్రి నటూ వాంబా ఏపీ స్టాల్‌ను సందర్శించి విద్యాభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా పర్మినెంట్ అబ్జర్వర్ మిషన్ టూ యునైటెడ్ నేషన్స్ ప్రొఫెసర్ ఒట్టో ఫీజిన్ బ్లాట్, అమెరికన్ డిపొ్లమాటిక్ అకాడమి రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్ బిల్ గ్రాహమ్ తదితరులు ఏపీ విద్యా విధానాలను తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సునీత చిట్టూమూరి తదితరులు పాల్గొన్నారు. -
మందుల పైనా మాయదారి రాతలు
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నరకానికి నకళ్లు. మంచాలు, బెడ్లు, దుప్పట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఉండే వారు కాదు. కంపు కొట్టే వార్డులు, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఆస్పత్రులు ఉండేవి. చిన్నపాటి మందు బిళ్లలకు కూడా కొరతే. అన్ని మందులూ బయట కొనుక్కోవాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్పత్రుల రూపురేఖలే మార్చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అధునాతన వైద్య సౌకర్యాలతో తీర్చిదిద్దారు. నిరంతర వైద్య సేవలందేలా వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. మందులకు కొరతే లేదు. ఏ మందు కావాలన్నా ప్రభుత్వాస్పత్రుల్లో దొరుకుతుంది. మొత్తంగా వైద్య రంగం ముఖచిత్రాన్నే మార్చిన సీఎం వైఎస్ జగన్. అందుకే ఇప్పుడు ప్రజలంతా నిర్భయంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న ఆస్పత్రులు ఈనాడు అధిపతి రామోజీరావుకు కనిపించలేదు. ఎందుకంటే.. ఆయనకు అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా కనిపించాయి. మరి ఇప్పుడు.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు నిరంతర వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులపై అబద్ధాలు ఆచ్చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత అంటూ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే... కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో 608 రకాల మందులకుగాను 229 రకాలే సరఫరా చేసేవారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 357 రకాలకు గాను 232 మాత్రమే అందుబాటులో ఉండేవి. రీఎజెంట్స్ అసలు సరఫరా చేసేవారే కాదు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అరకొరగా సరఫరా చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో 608 రకాల మందులకు గాను 566 రకాలు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా చేస్తున్నారు. మిగిలిన 42 మందులు డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల ద్వారా నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 377 కు గాను 326, రీఎజెంట్స్ 449 కు గాను 172 అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ వినియోగం ఉన్న మందులు, రీఎజెంట్స్, సర్జికల్ కన్జ్యూమబుల్స్ను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఎమ్మార్పీపై 35.60 శాతం డిస్కౌంట్‌తో సరఫరా చేస్తున్నారు. రీఎజెంట్స్ను రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వంలోనే సెంట్రల్ టెండర్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్స్‌కు డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద బోధన, జిల్లా ఆస్పత్రులకు రూ.14.59 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 3.44 కోట్లు వినియోగించారు. భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఏపీఎంస్ఐడీసీ మందులు, సర్జికల్స్ నిల్వలను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఉంచుతోంది. ప్రస్తుతం 13 డ్రగ్ స్టోర్స్‌లలో వచ్చే మూడు నెలలకు సరిపడా రూ.117.10 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్ నిల్వ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో మందుల కొరత అంటూ రామోజీరావు కథనాలు ప్రచురించడం ప్రభుత్వ వైద్య రంగం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలనే కుట్రకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 229 రకాల మందులు అందుబాటులో ఉండి, ఇతర వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రభుత్వాస్పత్రులకు జనాలు పోటెత్తుతున్నారని ఇదే ఈనాడులో ప్రచురించారు. గతంతో పోలిస్తే గణనీయంగా మందులు, సర్జికల్స్, మానవ వనరులు పెరిగిన సందర్భంలో నేడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని రాతలు రాయడం దిగజారుడుతనానికి నిదర్శనమని వైద్య రంగ నిపుణులు వాపోతున్నారు. బడ్జెట్ గణనీయంగా పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ పుష్కలంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2015–18 మధ్య మందుల కోసం రూ. 1080 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ.235.94 కోట్లు చొప్పున రూ.1,315.94 కోట్లు ఖర్చు చేశారు. అదే 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మందుల కోసం రూ.2,229.99 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ. 458.33 కోట్లు వెచ్చించింది. ఇలా 2019–23 మధ్య రూ.2,688.32 కోట్లు ఖర్చు చేశారు. అంటే గత ప్రభుత్వం కన్నా రూ.1372.38 కోట్లు అదనంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వెచ్చించింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లిన రూ. 150 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రూ. 8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 5 వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల్లో వసతుల కల్పనతో పాటు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను కూడా బలోపేతం చేశారు. గ్రామాల్లో ప్రతి 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటిలోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వైద్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఇప్పటి వరకు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సమయపాలన పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశా రు. డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ సహా పత్తాలేని పలువురు మంత్రి వచ్చిన సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు విధుల్లో లేరు. దీంతో విచారణకు మంత్రి ఆదేశించారు. ఇక స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వార్డుల్లో కలియ తిరిగారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ అరుణశ్రీ లీవ్ పెట్టకుండా వెళ్లిపోవడం, పీడియాట్రిక్‌లోని ఇద్దరు ప్రొఫెసర్లు విధుల్లో లేకపోవడం, అనస్తీషి యా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోపా టు, ఆప్తాల్మజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత లీవ్‌కు దరఖాస్తు చేయకుండా వెళ్లిపోవడంపై మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులకు మెమో జారీచేయాలని డీఎంఏ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. కాగా, ‘వైద్యులు ఉన్నా.. లేనట్లే’శీర్షికన ఈనెల 7న ‘సాక్షి’కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి.. ఇటీవల జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రిలోని వైద్యులతో నేరుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. -
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022
-
పేద ప్రజలకు చేరువగా వైద్యం
గుడివాడ టౌన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు సీఎం జగన్ కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలతో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో రూ.10.28 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి బ్లాక్–2 భవనాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్ జయంతి రోజున 100 పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందించాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ వైద్య రంగం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గతంలో ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడేవారని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ఆస్పత్రి దుస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 22మంది వైద్యులు, 80 మందికి పైగా నర్సులు, ఇతర సిబ్బందితో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
బయోఫ్యాక్చురాతో అరబిందో కంపెనీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్‌కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు. ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి. -
మరపురాని మహానేత
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. ఆయన మరణించి 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కా>ంగ్రెస్‌కు ప్రాణం పోశారు. 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు. ఐదేళ్లు సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించి.. 2009 ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యత అని నిబ్బరంగా ప్రకటించారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. రైతును రాజు చేసిన మారాజు సీఎంగా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. మద్దతు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. ఫీజుల పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు సైతం ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. వైఎస్సార్ బాటలో పలు రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశాన్ని కూడా తాకినా, ఉమ్మడి రాష్ట్రంపై పడకుండా వైఎస్సార్ నివారించగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. ఇది జంట నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు దోహదం చేసింది. -
ఇక మెడ్‌ప్లస్ సొంత బ్రాండ్ మందులు.. 80 శాతం వరకు డిస్కౌంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయంలో ఉన్న హైదరాబాద్ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్.. సొంత బ్రాండ్‌లో మందుల అమ్మకాల్లోకి ప్రవేశించింది. 50–80% డిస్కౌంట్‌తో వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. కంపెనీ సీవోవో చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ చేతన్ దీక్షిత్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివిధ చికిత్సలు, దీర్ఘకాలిక జబ్బులకువాడే 500లకుపైగా పేటెంట్‌యేతర ఔషధాలను మెడ్‌ప్లస్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టినట్టు మధుకర్ చెప్పారు. జీఎంపీ, ఈయూ జీఎంపీ ధ్రువీకరణ పొందిన ప్లాంట్లలో మందులు తయారవుతున్నట్టు వివరించారు. ఏటా 1,000 స్టోర్లు.. ప్రతి ఏటా మెడ్‌ప్లస్ ఫార్మసీ విభాగంలో 1,000 రిటైల్ ఔట్లెట్లను తెరుస్తామని మధుకర్ రెడ్డి తెలిపారు. ‘వీటి ఏర్పాటుకు ఏటా సుమారు రూ.300 కోట్లు అవసరం అవుతాయి. ఏడు రాష్ట్రాల్లోని 552 నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 3,822 స్టోర్లు ఉన్నా యి. ఈ ఏడాదే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రా ష్ట్రాల్లో అడుగుపెడుతున్నాం. 2022–23లో రూ. 4,550 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25% వృద్ధి ఆశిస్తున్నాం. డిస్కౌంట్ల వల్ల లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు’ అని వెల్లడించారు. సంస్థకు 22 వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
హత్యకు కుట్ర.. ఇండో అమెరికన్ డాక్టర్‌పై నిషేధం
డెవిల్స్ సైడ్ అని పిలువబడే 250 అడుగుల కొండపై కారును నడుపుతూ తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన ఇండో అమెరికన్ డాక్టర్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు. వివరాల ప్రకారం.. రేడియాలజిస్ట్ ధర్మేష్ పటేల్ తన కారులో శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన ఉన్న పసిఫిక్ కోస్ట్ హైవే నుంచి జనవరి 2, 2023న కొండపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది అతను ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అతను మాత్రం ఈ నేరాన్ని అంగీకరించలేదు. ప్రమాద సమయంలో అతని ఇద్దరు పిల్లలు, భార్య నేహా పటేల్ ఆ కారులో ఉన్నారు. వెంటనే రెస్క్యూలో సహాయం చేయడానికి అధికారులను ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చిన్నారులను స్ట్రెచర్లపై రోడ్డుపైకి తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దంపతులకు ప్రాణాపాయం తప్పిన తీవ్ర గాయాలు కావడంతో వారిని హెలికాప్టర్లో ఎక్కించి హైవేపైకి తీసుకెళ్లి.. అక్కడ వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత, పటేల్ ఉద్దేశపూర్వకంగా తన కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో అధికారులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించారు. చదవండి: గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్ -
కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు 'లీ' ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చూపు మందగించడం, కంటికి వచ్చే అంటువ్యాధులకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ ‘డీ–మాక్యులా’ పేరుతో సహజ సిద్ధ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. అశ్వగంధ, బోస్విల్లా శరాషియో, జీగ్జాంథిన్, త్రిఫల, బిటా కెరోటిన్, కుంకుమ పువ్వును దేశీయ ఆవు నెయ్యిలో మరిగించి సేకరించిన రసాయనంతో డీ–మాక్యులా సాఫ్ట్‌జెల్ క్యాప్సూల్ తయారైందని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కంటి మంట, పొడిబారడం, హానికర నీలి కాంతికి వ్యతిరేకంగా పోరాడడానికి, డయాబెటిక్ రెటినోపతి చికిత్సలో సహాయకారిగా ఉంటుందన్నారు. అమెజాన్, లీహెల్త్డొమెయిన్.కామ్ ద్వారా కూడా లభిస్తుంది. -
ఈ మందులు వాడొద్దు.. 14 ఔషధాలను బ్యాన్ చేసిన ప్రభుత్వం
భారత ప్రభుత్వం 14 ఔషధాలను బ్యాన్ చేసింది. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిమెసులైడ్, పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోఫెనిరమైన్ మేలేట్, కోడైన్ సిరప్‌లతో సహా 14 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని, వాటిని ఉపయోగించడం వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నిషేధించిన మందులు ఇవే.. నిషేధిత ఔషధాలలో సాధారణ అంటువ్యాధులు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. నిమెసులైడ్ + పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోర్ఫెనిరమైన్ మలేట్ + కోడైన్ సిరప్, ఫోల్కోడిన్ + ప్రోమెథాజైన్, అమోక్సిసిలిన్ + బ్రోమ్హెక్సిన్ బ్రోమ్హెక్సిన్ + డెక్స్ట్రోమెథోర్ఫాన్ + అమ్మోనియం క్లోరైడ్ +మెంథాల్ పారాసెటమాల్ + బ్రోమ్హెక్సిన్ + ఫినైల్ఫ్రైన్ + క్లోర్ఫెనిరమైన్ + గుయిఫెనెసిన్ సాల్బుటమాల్ + బ్రోమ్హెక్సిన్ ఎఫ్డీసీ మందులు అంటే.. ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్ (ఎఫ్డీసీ) అనేవి స్థిర నిష్పత్తిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాల కలయికను కలిగి ఉంటాయి. 344 కాంబినేషన్ల ఔషధాల తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు 2016లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఆయా మందుల తయారీదారులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. శాస్త్రీయ సమాచారం లేకుండా ఆ మందులను రోగులకు విక్రయిస్తున్నట్లు ఆ కమిటీ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం నిషేధించిన 14 ఎఫ్డీసీ మందులు కూడా ఆ 344 ఔషధాల జాబితాలో ఉన్నవే. -
మోగింది వీణ... నెటిజనుల గుండెలలోనా!
పాటలలో వీణ పాటల తీయదనం వేరయా! మన తెలుగులోనైతే ‘లీలాకృష్ణా నీ లీలలు’ ‘ఈ వీణపైన పలికిన రాగం... నాలో విరిసిన అనురాగం’లాంటి ఎన్నో పాటలు గుర్తు వస్తాయి. హిందీలోనైతే ‘మేరీ వీణ తుమ్ బిన్ రోయే’ (దేఖ్ కబిర రోయా–1957)లాంటివి ఎన్నో గుర్తు వస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే... వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా ‘బేడియా’ లోని ‘అప్నా బనా లే పియా’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సచిన్–జిగర్ ద్వయం కంపోజ్ చేసిన ఈ పాటను కుశాల అనే మెడిసిన్ స్టూడెంట్ వీణపై అద్భుతంగా ప్లే చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజనులు భారతీయ సినిమాలలోని ప్రసిద్ధ వీణ పాటలను గుర్తు తెచ్చుకున్నారు. రాగాల గురించి వివరంగా మాట్లాడుకున్నారు. కొందరు మాత్రం ‘మన సినిమాలో వీణ పాటలు బొత్తిగా కరువయ్యాయి’ అంటూ కడు విచారం వ్యక్తం చేశారు. -
ఔషధ రంగ ప్రక్షాళనే మందు!
ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా ఘనంగా ప్రకటించారు. కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది. ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది. గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్సైట్లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే. ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది? వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం. మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. -
లేటు వయసులోనూ నీట్ రాశారు..69 ఏళ్ల వయసులో పేదల కోసం..
సాక్షి, విశాఖపట్నం: పేదలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 69 ఏళ్ల వయసులోనూ ఎంబీబీఎస్ చేసేందుకు సంకల్పించారు విశ్రాంత ప్రొఫెసర్ డీకేఏఎస్ ప్రసాద్. సేవాభావం ముందు వయసు ఎప్పుడూ చిన్నదేనంటున్న ప్రసాద్ విజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో ఆదివారం నీట్ పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన ప్రొఫెసర్ ప్రసాద్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. కరోనా సమయంలో అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు. హోమియో వైద్యంపై కొంత అవగాహన ఉన్న ప్రొఫెసర్ ప్రసాద్ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఎంతో అభిమానం, అభిరుచి గల వైద్య వృత్తిని కొనసాగించాలంటే ఆయనకు పట్టా లేదు. ఎంబీబీఎస్ చదవకుండా వైద్య వృత్తి చేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన నీట్‌కు దరఖాస్తు చేశారు. వయో పరిమితి ఎత్తివేయడంతో.. నీట్ పరీక్ష రాయడానికి ఇప్పుడు వయసు నిబంధనలేవీ లేవు. గతంలో 21 సంవత్సరాలలోపు వయసు వారికి మాత్రమే నీట్ పరీక్షకు అనుమతి ఉండేది. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో.. వైద్యుడు కావాలన్న ఆకాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం ప్రొఫెసర్ ప్రసాద్‌కు లభించింది. ఆయన దరఖాస్తు చేసిన వెంటనే హాల్‌టికెట్ రాగా.. ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష బాగా రాశానని.. తనకున్న అనుభవం వల్ల పరీక్షలో ర్యాంక్ సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో.. తాను పట్టా తీసుకుంటే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో పరీక్ష రాశానన్నారు. చదవండి: ఉన్నత విద్యే లక్ష్యం -
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 105 రకాల మందులు
సాక్షి, అమరావతి: ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ), లెప్రసీ, థైరాయిడ్ సహా పలు వ్యాధులతో బాధపడేవారు మందుల కోసం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల కోసం వెళ్లాల్సిన తిప్పలు తప్పనున్నాయి. ఈ తరహా వ్యాధులకు వాడే మందులను ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులో ఉండే మందుల రకాలను 67 నుంచి 105కు పెంచింది. పెంచిన రకాల మందులను అన్ని విలేజ్ క్లినిక్స్‌కు పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామీణులకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తూ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 10,032 విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)ను ప్రతి క్లినిక్‌లో నియమించారు. ఈ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లోనే 12 రకాల వైద్య, 14 రకాల నిర్ధారణ పరీక్షలను అందబాటులోకి తెచ్చారు. టెలీమెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, పీహెచ్సీ వైద్యుడి కన్సల్టేషన్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో రోజుకు సగటున ఒక్కో క్లినిక్‌లో 20 నుంచి 30 ఓపీలు నమోదవుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పల్లె ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రతి విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండుసార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. రోజంతా ఆ గ్రామంలో ఉండి ఓపీలు నిర్వహించడంతో పాటు, మంచానికే పరిమితమైన వారికి కూడా వైద్యం చేస్తున్నారు. చదవండి: జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు దీంతోపాటు మిగిలిన రోజుల్లో టెలీమెడిసిన్ కన్సల్టేషన్‌లో వైద్యులు వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలున్న వారికి మందులను ప్రిస్క్రెబ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మందులు క్లినిక్స్‌లో అందుబాటులో లేకపోతే బాధితులు ప్రత్యేకంగా మందుల కోసం 5–10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ, అంతకంటే దూరంలో ఉండే ఏపీవీవీపీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడానికి విలేజ్ క్లినిక్స్‌లోనే అదనంగా 38 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. -
సామాన్యులకు ఊరట..తగ్గిన 651 మందుల ధరలు!
ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం కాస్త ఊరట కల్పించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న 651 మందుల ధరలపై కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ ఔషధాల ధరలు దాదాపు 6.73 శాతానాకి దిగొచ్చాయి. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ జాతీయ అత్యవసర ఔషధాల జాబితా- 2022ను విడుదల చేశారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు. అయితే తాజాగా అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 870 రకాల మందుల్లో 651 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరను మించి విక్రయించేందుకు అనుమతులు ఉండవు అని ఎన్పీపీఏ వెల్లడించింది -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్‌కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్‌లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్‌ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు
అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని మినహాయించింది. అలాగే వివిధ క్యాన్సర్ల చికిత్సలో వాడే పెంబ్రోలిజుమాబ్ (కీట్రుడా) ఔషధంపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. వ్యక్తిగత దిగుమతిదారులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఔషధాలు, ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం మినహాయింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర ఉంటుంది. ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, వ్యాక్సిన్లపై మాత్రం 5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. కొన్ని మందులపై అయితే కస్టమ్స్ డ్యూటీ అస్సలు ఉండదు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద జాబితాలో చేర్చిన అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు, ఆహార పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మినహాయింపును పొందేందుకు వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. -
800 రకాల ఔషధాల 'ధరలు పెరుగుదల'
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 800 రకాల అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులన్నింటి ధరలు 12.12 శాతం పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారని, ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులపై భారం పడుతుందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ సంజయ్‌రెడ్డి అన్నారు. రక్త హీనత, మధుమేహం, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, టీబీ, వివిధ రకాల కేన్సర్లకు రోగులు ఉపయోగించే మందుల ధరలు పెరుగుతాయని చెపుతున్నారు. అలాగే మెడికల్ డివైజ్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని, జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వీటి ధరలను పెంచిందని సంజయ్ పేర్కొన్నారు. అసలే కరోనా తర్వాత అనేకమంది పలు సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. దీంతో అనేకమంది నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. మందుల ధరల పెంపువల్ల ఆదాయంలో కొంత భాగం వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచింది. కాగా, ఏయే మందుల ధరలు పెరిగాయో వాటి జాబితాను కేంద్రం ఒకటిరెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సంజయ్‌రెడ్డి తెలిపారు. -
మందులు వాడేవారికి ధరల దెబ్బ!
వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా... ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, పెయిన్కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే... హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు. పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్ యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్ కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి. యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు. మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి. చర్మసంబంధమైన మందులు యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి. బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్టీ ఔషధాలు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి. హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి. ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్ మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? -
ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్!
నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. నాణ్యత లేమి డ్రగ్స్‌ను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను రద్దుతో పాటు తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించింది. భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నకిలీ మందులు విదేశాలకు విక్రయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో భారత్‌లో తయారు చేసిన డ్రగ్స్ వినియోగించడం కారణంగా పలువురు మరణించడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) సంస్థ కీళ్ల నొప్పుల్ని నయం చేసే జనరిక్ మెడిసిన్ తయారు చేసి యూఎస్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఆ ఔషదాలున్న 55 వేల బాటిళ్లను రీకాల్‌కు పిలుపునిచ్చింది. గత ఏడాది నోయిడాకి చెందిన మరియన్ బయోటెక్ ఫార్మా సంస్థ నకిలీ దగ్గు మందును తయారు చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆరోపణలతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు మరియన్ బయోటెక్ ఫార్మాలో శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌లలో 22 రకాల మరియన్ బయోటెక్ తయారు చేసిన డ్రగ్స్ నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఇలా ఫార్మా కంపెనీలపై వరుస ఫిర్యాదులు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపి చర్యలు తీసుకుంటుంది. -
గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా?.. డేంజర్లో పడ్డట్టే.. డాక్టర్ల వార్నింగ్ ఇదే..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సాధారణంగా ఒంట్లో నలతగా ఉంటే ఏం చేస్తాం.. డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పుకుంటాం. బాధితుడు చెప్పిన లక్షణాల ఆధారంగా ఆయన అందుకు అవసరమైన మందులు రాసి వాడమంటారు. ఆ తర్వాత ఫార్మసీకి వెళ్లి వాటిని కొనుక్కుని వాడుతుంటాం. ఇది రివాజు. కానీ, ఇప్పుడు నయా ట్రెండ్ మొదలైంది. డాక్టర్ స్థానంలో గూగుల్ వచ్చి చేరింది. జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా గూగుల్‌లో ఆ లక్షణాలను సెర్చ్ చేసేసి అది ఏ రోగమో తెలుసుకుని ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి తమకు ఫలానా రోగం ఉంది.. వైద్యం చేయమంటున్నారు. కరోనా తదనంతర కాలంలో యువత, విద్యావంతుల్లో ఈ తరహా సంస్కృతి పెరిగిపోతోందని వైద్యులంటున్నారు. ఈ సిండ్రోమ్‌ను ‘ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ అని సంబోధిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యంపట్ల అతిగా ఆదుర్దా పడడం.. అనవసరంగా దీని గురించి నెట్లో సెర్చ్ చేయడం ఈ సిండ్రోమ్ ప్రధాన లక్షణం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారు. అంతేకాదు.. వైద్యుడు మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. అక్కడ చూపించే దుష్ఫలితాలను చూసి మందులు వాడకుండా మానేస్తున్నారని.. ఇలాంటివి కోవిడ్ సమయంలో ఎక్కువగా జరిగినట్లు వైద్యులంటున్నారు. ఇంటర్నెట్ బాగా విస్తృతమవడంతో ప్రజల్లో కూడా ఈ తరహా వెతుకులాట ఎక్కువైందని వారు అభిప్రాయపడుతున్నారు. కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఇక ఇలా ప్రతి విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా ప్రజలు కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మందులు, జబ్బు విషయంలో ఏదైనా సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో వెతకడం సరైన విధానం కాదని వారంటున్నారు. ఒక రకం మందు లక్ష మంది వాడితే వారిలో ఒకరికో ఇద్దరికో దుష్ఫలితాలు కనపడినా గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చివరికి జ్వరానికి వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో చూస్తారని, వైద్యులు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అవసరం మేరకు టెక్నాలజీని వాడుకోవాలి ఇంటర్నెట్ టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. అంతేకానీ, జబ్బు చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించకుండా గూగుల్‌లో చూసి మందులు వాడటం, గూగుల్‌లో చూసి జబ్బును నిర్ధారించడం సరైన పద్ధతి కాదు. అలాగే, వైద్యుడు రాసిన మందులను సైతం గూగుల్‌లో సెర్చ్‌చేసి, అక్కడున్న దుష్ఫలితాలను చూసి మందులు వాడటం మానేస్తున్నారు. దీంతో జబ్బు ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చూశాం. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి పరిష్కరించుకోవాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ జబ్బును నిర్ధారించేది వైద్యుడే ఏదైనా సమస్యతో వైద్యుని వద్దకు వచ్చే రోగి, తనకున్న రోగం ఏమిటో చెప్పేస్తున్నారు. గూగుల్‌లో చూశామండి.. దానికి చికిత్స అందించమని అడుగుతున్నారు. అసలు లక్షణాలు చెప్పమంటే ఏదేదో చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదు. గూగుల్‌లో అంతా ఖచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పలేం. ఎవరి అనుభవాలనైనా దానిలో షేర్ చేసుకోవచ్చు. వాటిని చూసి తమకూ అలా జరుగుతుందని భావించడం సరైన విధానం కాదు. పారాసిటమాల్ మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గూగుల్‌లో చూపుతుంది. కానీ, వైద్యులు దానిని కామన్ మందుగా సిఫార్సు చేస్తారు. గూగుల్‌తో కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. – డాక్టర్ విశాల్‌రెడ్డి ఇండ్ల, మానసిక వైద్య నిపుణులు -
మాయదారి మందులు.. ఔషధం నుంచి డ్రగ్‌గా అవతారం!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు కేవలం మాదకద్రవ్యాల పైనే దృష్టి పెట్టిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), టాస్‌్కఫోర్స్ అధికారులు తమ పంథా మార్చారు. పక్కదారి పడుతున్న పలు ఔషధాలపైనా కన్నేయాలని నిర్ణయించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగానే కోడిన్ ఫాస్పేట్ సిరప్, ఆల్ఫాజోలం, స్టామ్బేర్, ఏర్క్లెన్, డెబొలాన్ టాబ్లెట్లు... డ్యురాడెక్స్, సీ–జెక్ట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాలు చిక్కాయి. ఈ నిఘా, దాడులు కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు ఇలాంటి ఔషధాల వినియోగాన్ని అధ్యయనం చేస్తున్నారు. కీటమైన్... ఔషధం నుంచి డ్రగ్‌గా.. శస్త్రచికిత్స చేసే సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం ఇచ్చే కీటమైన్ హైడ్రోక్లోరైడ్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తుండటంతో అనేక మంది మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్‌ను వినియోగించడం మొదలెట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 1969లో దీన్ని ‘యంత్రణ జాబితాలోని మందు’గా మార్చింది. కీటమైన్ నుంచి పొడిని తయారు చేసి నిషా కోసం వాడుతుండటంతో 2011లో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఈ పొడిని ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారు పుట్టుకువచ్చారని అధికారులు గుర్తించారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా నెట్రావిట్.. కేవలం ఇదొక్కటే కాదు మాదకద్రవ్యాలు కాని ఇలాంటి మత్తు ‘మందులు’ అనేకం నగరంలో చెలామణి అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారికి బ్లాక్మార్కెట్లో ఆ మత్తు ‘మందుల్ని’ సరఫరా చేయడానికి అనేక వ్యవస్థీకృత ముఠాలు సైతం పుట్టుకువచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా తయారైనవి, మందుల దుకాణాలు, డీలర్ల నుంచి బయటకు వచ్చినవి బానిసలకు చేరుతున్నాయని హెచ్–న్యూ గుర్తించింది. గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్ టాబ్లెట్స్ వినియోగిస్తున్నారు. వీరికి బ్లాక్‌లో విక్రయించడానికి ఈ మాత్రలను మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువస్తున్నారు. దగ్గు మందులే ఎక్కువ దుర్వినియోగం.. మత్తు కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో దగ్గు మందులే ప్రధానమైనవి. కొన్ని రకాలైన ఔషధాలను సేకరించడం కష్టసాధ్యం. అలాగే వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినప్పటికీ వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల నేపథ్యంలో దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథారి్ఫన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాత తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్ట్రోమెథారి్ఫన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారని పోలీసులు గుర్తించారు. స్టెరాయిడ్స్ గానూ కొన్ని.. ఇలా ఔషధాలను కేవలం మత్తు కోసమే కాదు... కండల కోసమూ వినియోగించడం ఆందోళన కలిగించే అంశం. అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజెక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాలను గతంలో టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్, డ్యురాడెక్స్, సీ–జెక్ట్ ఇంజెక్షన్లు, స్టామ్బేర్, ఏర్క్లెన్, డెలాన్ టాబ్లెట్లు ఉ్రత్పేరకాలుగా పని చేస్తాయని చెప్తున్నారు. ఈ టాబ్లెట్లు, ఇంజెక్షన్లను అథ్లెట్స్ స్టెరాయిడ్గానూ వాడుతున్నారు. మెడికల్ షాపులపై డేగకన్ను... ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి వీలులేదు. ఇలా చేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అ«ధికారులతో పాటు హెచ్–న్యూ నిఘా ఉంచింది. ఒక్క టాబ్లెట్/ఇంజెక్షన్/టానిక్ దుర్వినియోగమైనా చర్యలు తప్ప వని స్పష్టం చేస్తోంది. యజమానుల అరెస్టు, దుకాణాల సీజ్ వంటి తీవ్రమైన చర్యలు తక్షణం, లైసెన్సు రద్దుకు సిఫార్సు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
నిమ్స్ బిల్లింగ్ విభాగానికి మోక్షం
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది. ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మెడికల్ మాఫియాపై ఫోకస్
సాక్షి, అమరావతి/తణుకు: వైద్యుల రాసిచ్చే చీటీల (డాక్టర్ ప్రిస్క్రిప్షన్)పై మాత్రమే విక్రయించాల్సిన మందులు బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడాన్ని ఔషధ నియంత్రణ విభాగం తీవ్రంగా పరిగణిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన వ్యాపారి ఒకరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోగా.. అతడికి నిద్రమాత్రలు ఎక్కడ లభించాయనే దానిపై ఔషధ నియంత్రణ శాఖాధికారులు దృష్టి సారించారు. పలుచోట్ల తనిఖీలు నిర్వహించగా.. వైద్యుల చీటీలపై మాత్రమే విక్రయించాల్సిన అబార్షన్ కిట్లు, నిద్ర మాత్రలు, వయాగ్రా మాత్రలను విచ్చలవిడిగా విక్రయిస్తున్న వైనం వెలుగుచూసింది. వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాల్సిన ఈ మందులు కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా సరఫరా అవుతున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తణుకు, ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ల పరిధిలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.16.41 లక్షల విలువైన అబార్షన్ కిట్లు, వయాగ్రా, మత్తు మందులను సీజ్ చేశారు. ఐదుగురిపై కేసులు కూడా నమోదు చేసిన అధికారులు ఈ వ్యవహారంపై విస్తృతస్థాయి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా ఇలాంటి మందులను నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ రిటైల్ మందుల దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే విక్రయించాలి. లేదంటే ఆ మందుల దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. కర్ణాటక నుంచి అనధికారికంగా రాష్ట్రంలోకి సరఫరా అవుతున్న ఇలాంటి మందులను ఆర్ఎంపీ, పీఎంపీలకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. మందులపై ఉన్న ఎమ్మార్పీ ధరలను చెరిపేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అధికారులు కేసు నమోదు చేసిన ఐదుగురిలో ఒక వ్యక్తి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, తుముకూరు, బీదర్ నుంచి ఈ మందులను తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. నిందితుడి బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్స్, ఇతర సాంకేతిక వివరాల ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు. దీంతో కర్ణాటక నుంచి అనధికారికంగా రాష్ట్రంలోకి మందుల సరఫరా వ్యవహారాన్ని ఆ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు ఇప్పటికే తెలియజేసినట్టు సమాచారం. తదుపరి విచారణ కోసం బెంగళూరు, హుబ్లీ, తుముకూరు, బీదర్ ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాల్లో పోలీసులు సైతం ఉంటారు. పల్నాడు జిల్లా నుంచి కూడా.. మరోవైపు పల్నాడు జిల్లా నుంచి కూడా నాలుగు రకాల మందులు సరఫరా అయినట్టు విచారణలో తేలింది. ఆ మందులను సరఫరా చేసిన వ్యక్తిని విచారించగా చిలకలూరిపేట, నరసరావుపేటల్లోని రెండు మెడికల్ షాపుల నుంచి అనధికారికంగా కొనుగోలు చేసి సరఫరా చేసినట్టు వెల్లడించాడు. దీంతో చిలకలూరిపేట, నరసరావుపేటల్లోని సంబంధిత రెండు మెడికల్ షాపుల్లో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండుచోట్ల సుమారు రూ.60 లక్షల వరకూ విలువ చేసే మందులను అనధికారికంగా విక్రయించినట్టు గుర్తించారు. దీంతో ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. -
కోర్టు తీర్పు.. మైడెన్ ఫార్మా ఫౌండర్ జైలుకి!
చాలా సంవత్సరాల క్రితం వియత్నాంకు నాసిరకం మందులను ఎగుమతి చేయడం వల్ల గాంబియాలో ఎంతో మంది పిల్లలు మరణించారు. పిల్లల మరణాలకు దగ్గు సిరప్లు కారణమని కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇటీవల వెల్లడైంది. 2022 అక్టోబర్‌లో మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి తయారైన నాలుగు దగ్గు సిరప్లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఉత్పత్తిని నిలిపివేసింది. (ఇదీ చదవండి: భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా) పిల్లల మరణాలకు గాంబియాలో తమ ఔషధాలే కారణం అనటాన్ని కంపెనీ కండించింది. అంతే కాకుండా గవర్నమెంట్స్ నిర్వహించిన టెస్ట్‌లో కూడా అందులో విషపదార్థాలు లేదని తేలింది. అయినప్పటికీ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. హర్యానా సోనిపట్‌లోని కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణను సముచితంగా రుజువు చేశారని హార్ట్‌బర్న్ ఔషధాన్ని వియత్నాంకు ఎగుమతి చేసినందుకు కంపెనీ వ్యవస్థాపకుడు నరేష్ కుమార్ గోయెల్, టెక్నికల్ డైరెక్టర్ ఎంకే శర్మలకు జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు 2023 మార్చి 23 వరకు గడువు ఇచ్చింది. రెనిటిడిన్ టాబ్లెట్స్ బిపి (మాంటెక్-150) మెడిసిన్ వియత్నాంకు ఎగుమతి చేసినందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించారు.అయితే గోయెల్ కాల్లకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఎంకే శర్మ సంప్రదింపు వివరాలను అందించడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
213 ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్.. జాబితా ఇదే! తెలిసీతెలియక ప్రాణాల మీదకు
సాక్షి, హైదరాబాద్: కాస్త ఒళ్లు వెచ్చబడితే వెంటనే ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పారాసిటమాల్ మాత్ర వేసుకుంటాం.. గొంతునొప్పి రాగానే మెడికల్ షాపుకెళ్లి అజిత్రోమైసిన్ అడుగుతాం.. ఒళ్లు నొప్పులకు ఐబూప్రోఫిన్ మాత్ర మింగేస్తాం.. ఇలా సాధారణ రోగాలకు మనలో చాలామంది వైద్యుడిని సంప్రదించకుండానే సొంత చికిత్స తీసుకుంటుంటారు. అయితే ఇది ప్రమాదకరమని, ఎలాంటి మందులనైనా డాక్టర్ సలహాతోనే వాడాలని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ సూచించింది. ఇష్టారాజ్యంగా మందులను వేసుకుంటే శరీరంలో తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని తెలిపింది. ముఖ్యంగా 213 ఔషధాల వాడకం వల్ల కొందరిలో ఈ తరహా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చంటూ ఆ జాబితాను విడుదల చేసింది. పరిశోధనల తర్వాత.. వివిధ కంపెనీలు పరిశోధనలు, అనుమతులు పొందాక తయారుచేసి విక్రయించే మందులను రోగులు వాడాక కొందరిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. దీనిపై అందే ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఈ విషయాన్ని ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేస్తాయి. ఆయా సైడ్ ఎఫెక్ట్స్‌పై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ పరిశోధనలు చేసింది. గుర్తించిన అదనపు సైడ్ఎఫెక్ట్స్ సమాచారాన్ని ప్రజలకు, డాక్టర్లకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసింది. ఆ ప్రకారం కంపెనీలకు సమాచారమివ్వాలని కోరింది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకురావాలని కోరింది. 2014 నుంచి 2020 వరకు సైడ్ ఎఫెక్ట్స్ వెలుగుచూసిన 213 రకాల మందుల జాబితాను ఇండియన్ ఫార్మకోఫియా కమిషన్ విడుదల చేసింది. వాటిల్లో కొన్నింటి వివరాలు.. ►పైపరాసిలిన్ కజోబ్యాక్టిమ్ ఇంజెక్షన్: తీవ్రమైన ఇన్ఫెక్షన్ కోసం వాడే యాంటిబయాటిక్ ఇది. దీనివల్ల కొందరిలో శ్వాస సమస్య, ఎముకల బలహీనత, పోటాషియం లోపం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. ►మ్యానిటాల్ ఇంజెక్షన్: తలకు దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చి మెదడులో నీరు చేరినపుడు దీన్ని వాడతారు. దీనివల్ల పొటాషియం లోపం వంటి సైడ్ఎఫెక్ట్స్ రావొచ్చు. ►రేబిస్ వ్యాక్సిన్: దీనివల్ల ఒక్కోసారి శరీరం మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ►ర్యాంటిడిన్: సాధారణంగా ఎసిడిటీకి వాడ తారు. దీనివల్ల కొందరిలో సడన్‌గా గుండె ఆగి పోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్యుడి సలహా మేరకు మరేదైనా మందు వాడాలి. ►సెఫ్ట్రాక్జోమ్: దీన్ని సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు, విరేచనాలకు, చిన్నచిన్న గడ్డలకు కూడా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రి యాక్షన్ రావొచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంత కం కావొచ్చు. కొందరిలో చర్మం ఊడిపోతుంది. ►అజిత్రోమైసిన్: యాంటీబయోటిక్. జలుబుకు ఎక్కువగా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీర మంతా చిన్నచిన్న చీము కురుపులు వస్తాయి. ►బ్రూఫెన్: దీన్ని మధ్యస్థాయి నొప్పులు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. చర్మం లేచిపోతుంది. ►అమాక్సిలిన్ క్లలానిక్ యాసిడ్ ట్యాబ్లెట్: జలుబు వంటి వాటికి వాడే యాంటీబయోటిక్ ఇది. కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. ►సిప్రోఫ్లాక్సిన్: దీన్ని తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లకు, చీముగడ్డల తగ్గుదలకు వాడతారు. కొందరిలో శరీరమంతా రియాక్షన్ వచ్చే అవకాశముంది. ►యామ్‌లో డెఫిన్: బీపీని తగ్గించే మందు ఇది. దీన్ని వాడటం వల్ల కొందరిలో వెంట్రుకలు ఊడిపోతాయి. చిగుళ్లు పెరుగుతాయి. ►సెఫిక్జిమ్: యాంటీబయోటిక్. తేలికపాటి గొంతు, శ్వాసకోశ సమస్యలు, ఉదర ఇన్ఫెక్షన్లకు వా డతారు. కొందరికి నోట్లో అల్సర్లు ఏర్పడతాయి. ►ఓఫ్లాక్సిన్: విరేచనాలు తగ్గేందుకు వాడతారు. కొందరిలో శరీరమంతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరిలో ప్రాణాంతకమైన రియాక్షన్లు రావొచ్చు. ►ట్రెమడాల్: నొప్పి తగ్గేందుకు వాడే మాత్ర. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి మూత్రం ఆగిపోవచ్చు. ►గ్లిబెంక్లమైడ్: షుగర్ తగ్గించేందుకు వాడతారు. దీన్ని వల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►ప్యాంటొప్రజోల్: దీన్ని ఎసిడిటీకి వాడతారు. దీన్ని వాడటం వల్ల కొందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ►జింక్: బలానికి వాడే ఈ టాబ్లెట్ వల్ల కొందరిలో విరేచనాలు రావొచ్చు. ►పారాసిటమాల్: జ్వరానికి వాడతారు. దీనివల్ల కొందరిలో చర్మంపై చిన్నచిన్న కురుపులు వస్తాయి. ►లోసార్టాన్: బీపీని తగ్గించే ఈ మందు వాడకం వల్ల కొందరిలో కండరాలు పట్టుకుంటాయి. అతిగా పనిచేస్తే ఎలా నొప్పులు వస్తాయో దీనివల్ల అలాగే జరుగుతుంది. ►రెమిడిసివీర్: కరోనా, ఎబోలా వైరస్ కట్టడికి వాడతారు. దీనివల్ల కొందరిలో గుండె వేగం తగ్గుతుంది. ►ఎటినెలాల్: బీపీ తగ్గించే మందు. దీన్ని వాడటం వల్ల కొందరిలో చర్మానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ►యాంబ్రాక్సాల్: దగ్గు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో కన్నీళ్లు వస్తాయి. ►డెకడ్రాన్: ఆస్తమాలో, ఇన్ఫెక్షన్లకు వాడతారు. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ►అమాక్సిలిన్: తేలికపాటి యాంటీబయోటిక్ ఇది. దీనివల్ల కొందరిలో కళ్లమంటలాంటిది వస్తుంది. ►ఎమిట్రిప్లిన్: తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌కు వాడతారు. దీర్ఘకాలిక నొప్పులకు ఉపయోగిస్తారు. దీనివల్ల కొందరిలో చిగుళ్ల రంగు మారుతుంది. ►సెఫ్ట్రాజోమ్: ఆసుపత్రుల్లో చేరినవారికి సర్జరీకి ముందు వాడే యాంటీబయోటిక్. దీనివల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►టెల్మాసార్టాన్: బీపీకి వాడతారు. దీంతో కొందరిలో చర్మ సంబంధ రియాక్షన్లు వస్తాయి. కొందరిలో ముఖం నల్లబడుతుంది. ►అటర్వస్టాటిన్: దీన్ని చెడు కొవ్వు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో విటమిన్–డి కొరత ఏర్పడుతుంది. -
ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..
వైద్యవృత్తితో పది మందికి సేవా చేయాలనే కోరికతో, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ప్రీతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతి ఇలా చేయడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే, ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కల్పించుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. -
మెరుగైన వైద్యం అందించండి
చింతూరు: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పూర్తిస్థాయిలో సౌకర్యాలను 50 రోజుల్లో కల్పిస్తామన్నారు. అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గైనిక్ సేవలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామన్నారు. ఆర్ధోపెడిక్ సేవలకు సంబంధించి ఎక్స్‌రే ప్లాంట్‌కు మరమ్మతులు, ఫ్రాక్చర్ టేబుల్, సిఆర్ట్ సిస్టమ్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈఎన్టీ వైద్యులకు అవసరమైన పోర్టబుల్ ఎండోస్కోపును వెంటనే కొనుగోలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో పుల్లయ్యను ఆదేశించారు. అత్యాధునిక పడకలు, చిన్న పిల్లల మందులు కొనుగోలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవలని సూచించారు. గ్రామ స్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులను భద్రాచలం తరలించకుండా స్థానికంగా మెరుగైన వైద్యసేవలు అందించేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గైనిక్ డాక్టర్ శశికళ, వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో తెలంగాణ ఫస్ట్
సాక్షి, యాదాద్రి: వైద్య సేవల్లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. హరీశ్‌రావు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం సైదాపురం గ్రామంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. సీఎం కేసీఆర్ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆస్పత్రికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. వారి చేతికి పోతే ఆగమే..: రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సిందిపోయి బాధపడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే ఒకరు కుట్ర అంటున్నారని, అంబేడ్కర్ పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకరు కూలుస్తం అంటున్నారని మండిపడ్డారు. పేల్చేటోని చేతికో.. కూల్చేటోని చేతికోపోతే తెలంగాణ ఆగం అవుతుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో న్యూట్రిషన్ కేసీఆర్ కిట్టును ప్రారంభించనున్నామని, ఏప్రిల్ మొదటి వారంలో 33 జిల్లాల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటక సర్పంచులు.. తమను తెలంగాణాలో కలపాలని వినతులు ఇస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వార్త వచి్చందని బీబీసీ మీద ఐటీ దాడులు చేయించడాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ కాఫ్ సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కొంతమందికి వర్షాకాలం వస్తే చాలు... జలుబు, దగ్గు, కఫం. ఇంకొందరికి చలికాలంలో ఈ బాధలు వస్తాయి. అయితే ఈ కాలం ఆ కాలం అని కాకుండా కొందరు ఎప్పుడూ ఖంగ్ ఖంగ్... హాచ్ ∙హాచ్ ... అని అంటూ ఉంటారు. నానా విధాలైన దగ్గు మందులు, రకరకాలైన టాబ్లెట్లు వాడినా కొద్ది రోజులకే సమస్య షరామామూలే! అయితే, ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్నిపాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ... ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే అంటే వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పుదీనా, తులసి వంటివి సరిపోతాయి. ఇంతకూ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికడు పసుపు వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. స్టవ్ మీదినుంచి దించి గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీలోని కఫం వదులుతుంది. కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులుపాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కా΄ాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. ఈ కషాయాన్ని ఫ్రిజ్‌లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజులపాటు తాగకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు. -
జాడలేని జిల్లేడు.. కానరాని తంగేడు
సాక్షి, హైదరాబాద్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. నాగజెముడు..తంగేడు..కుంకుడు.. జిల్లేడు..ఉమ్మెత్త.. తిప్పతీగ..మునగ.. కరివేపాకు..వేప.. ఇవి కూడా మనిషికెంతో మేలు చేస్తాయి. ఇప్పుడంటే ఆధునిక వైద్యం అంతటా అందుబాటులోకి వచ్చింది కానీ ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో ఉండే ఇలాంటి మొక్కలు, చెట్లపైనే ఆధారపడి పల్లె ప్రజలు ప్రాణాలు కాపాడుకునేవారు. ప్రాణం మీదకొచ్చే జబ్బైతే తప్ప ఓ మోస్తరు అనారోగ్యం నుంచి బయటపడేందుకు ఆకు పసర్లే ఉపయోగించేవారు. వాటి మీదే ఆధారపడి జీవించేవారంటే అతిశయోక్తి కాదు. రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు పెరట్లో ఈ తరహా ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లు కన్పించేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా జీవనశైలి మారిపోయింది. సంప్రదాయంగా వైద్యానికి వాడే పెరటి మొక్కల పెంపకం 80 శాతం పడిపోయింది. ఏ ఇంటి పెరట్లో అయినా ఇలాంటి మొక్క ఒకటి కన్పిస్తే అది నిజంగా వింతే. పెరటి వైద్యం అంటే ఏమిటో కూడా నేటి యువతరానికి తెలియని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నాగజెముడు, తంగేడు, జిల్లేడు, కుంకుడు, ఉమ్మెత్త లాంటివి ఎక్కడో తప్ప కన్పించకుండా పోయాయి. అయితే కోవిడ్ తదనంతర కాలంలో మొక్కలపై కాస్త మక్కువ పెరిగింది. కుండీల్లోనైనా ఇతర మొక్కలతో పాటు ఒకటో రెండో ఔషధ మొక్కలు పెంచాలనే ఆరాటం మొదలైంది. ఈ మక్కువ విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మాయమైన మన పెరటి మొక్కల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ‘ఊపిరిపోసే’ నాగజెముడు పెరట్లో ముఖ్యంగా పొలాల వెంట ముళ్ళ పొదల్లా ఉండే నాగజెముడు ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. పల్లె జనం ఆధునిక వైద్యానికి అలవాటు పడి దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు. నిజానికి ఈ తరానికి ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాగజెముడు పూలను ఆస్తమా తగ్గించేందుకు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వాడతారు. చర్మ వ్యాధులకు ఉమ్మెత్త ఉమ్మెత్త పరిస్థితి కాస్త నయం. ముళ్ళ కాయలతో పెరట్లో కన్పించే దీన్ని ప్రజలింకా పూర్తిగా మరిచిపోలేదు. ఇప్పటికీ అక్కడక్కడా గ్రామాల్లో కన్పిస్తోంది. కానీ ఈ మొక్కను కార్పొరేట్ ఆయుర్వేద వైద్యం విస్తృతంగా అభివృద్ధి చేస్తోంది. ఔషధ రూపంలో ప్రతి ఊరూ వెళ్ళిన ఈ మొక్క.. పెరట్లో ఉన్నా పల్లె జనం దీని విలువ తెలుసుకోవడం లేదు. ఉమ్మెత్త ఆకులు, కాయలను చర్మవ్యాధులకు బాగా వాడతారు. దీర్ఘకాల చర్మ వ్యాధులను సైతం తగ్గించే గుణం దీని సొంతం. ఇంత మంచి గుణాలున్న మొక్క మరో ఆరేళ్ళ తర్వాత పల్లెల్లో కన్పించదని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కెర స్థాయి తగ్గించే తంగేడు తంగేడు తాతల కాలం నుంచి తెలిసిన మొక్క. చిన్న చిన్న పసుపు వన్నె పూలు దీని ప్రత్యేకత. బ్రష్‌లు, పేస్టులు లేని రోజుల్లో వేపతో పాటు తంగేడు పుల్లలతో కూడా పళ్లు తోముకునేవారు. మధుమేహం వ్యాధికి దీన్ని మించిన మందులే లేవని పరిశోధనల్లో తేలింది. బతుకమ్మ పండుగొచ్చి తంగేడును కాస్త బతికించింది కానీ.. లేకపోతే ఈ చెట్టూ మనకు కన్పించనంత దూరంగా వెళ్ళేది. ఆయుర్వేద వనమూలికల్లో తంగేడు కీలక పాత్ర పోషిస్తోంది. దీన్ని మళ్ళీ పల్లె దరికి చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. షాంపూలు రాకముందు కుంకుడే.. కుంకుడు కాయ.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అందమైన ప్యాకెట్‌గా కన్పించే వస్తువైంది. కానీ ఒకప్పుడు ప్రతి ఊళ్ళో విరివిగా ఈ చెట్లు ఉండేవి. షాంపూలు రాకముందు వరకు కుంకుడు రాజసానికి ఏ మాత్రం దెబ్బ తగల్లేదు. కుంకుడు రసం వాడినంత వరకు కేశాల వన్నె తగ్గలేదు. మంచి ఔషధ గుణాలున్న చెట్టును కార్పొరేట్ కంపెనీలు ఆయుర్వేదం పేరుతో అభివృద్ధి చేస్తున్నాయి. పల్లెల్లో ఎవరికీ పట్టని కుంకుడు క్రమంగా పల్లె వాకిటి నుంచి కార్పొరేట్ ఫామ్‌లకు వెళ్తోంది. పొలాలకు ‘రక్షణ కంచె’ మంగళగిరి కంచె.. ఈ మొక్క గురించి చాలామందికి తెలియదు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకు చాలా పల్లెల్లో ఇంటి పెరట్లో, పొలం గట్టుపై కన్పించిన మొక్క ఇది. కార్బన్–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీనికో ప్రత్యేకత ఉంది. పంట పొలాల్లో మొక్కలకు హాని చేసే క్రిమి కీటకాలను అదుపు చేస్తుంది. చిన్న మొక్క వేస్తే చాలు పొలం చుట్టూ రక్షణ కవచంలా అల్లుకుపోయే ఈ మొక్క... ఇనుప కంచెల ఆవిర్భావంతో కనుమరుగైంది. ఈ మొక్కపై విస్తృత పరిశోధనలు జరిగి దీని ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైనా.. మన దగ్గర ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయింది. ఇతర దేశాల్లో మాత్రం ఈ మొక్క పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కాల గర్భంలో ఎన్నో.. విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అన్పించే తలనొప్పిని తగ్గించే సొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిబట్టే మారేడు.. సర్వ రోగ నివారిణి తులసి..ఇలాంటివెన్నో మనకు కన్పించకుండా పోతున్నాయి. ఇవీ నిజాలు.. ►వృక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వాటి ఔషధ గుణాలు గుర్తించారు. ఇప్పటికే 1.26 లక్షల మొక్క జాతులను వివిధ రూపాల్లో వాడుకుంటున్నారు. ►30 ఏళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మొక్క జాతులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 80 వేల లోపే ఉన్నాయి. ►పెరటి వైద్యం 30 ఏళ్ళ క్రితం వరకూ 92 శాతం ఉండేది. ఏదో ఒక మొక్కతో వ్యాధిని నయం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కేవలం 12 శాతమే పెరటి వైద్యాన్ని నమ్ముతున్నారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఇది 21 శాతానికి పెరిగింది. ►పల్లెల్లో పెరటి వైద్యంగా వాడిన మొక్కల్లో 20 జాతులు ప్రస్తుతం ఆయుర్వేద ముందుల రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ.2 వేల కోట్లతో వీటిని పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోని 82 రకాల ఔషధ మొక్కల ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు. -
ముంగిటకే వైద్యం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ప్రారంభమయ్యాక వైద్యుడితోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్స్‌ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో మందులు, ర్యాపిడ్ కిట్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించేలా ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్ కిట్లు సమకూరుస్తున్నారు. -
డాక్టర్ రెడ్డీస్ ‘సిడ్మస్’ ఔషధ రేటు తగ్గింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) హృద్రోగ చికిత్సలో ఉపయోగించే సిడ్మస్ ఔషధం రేటు ను గణనీయంగా తగ్గించింది. దీనితో 50 మి. గ్రా. ట్యాబ్లెట్ ధర రూ. 78.32 నుంచి రూ. 29కి తగ్గుతుంది. అలాగే 100 మి.గ్రా. ధర రూ. 83.86 నుంచి రూ. 49కి, 200 మి.గ్రా. ట్యా బ్లెట్ రేటు రూ. 96.71 నుంచి రూ. 79కి తగ్గు తుందని కంపెనీ తెలిపింది. భారత మా ర్కె ట్‌కు సంబంధించి సిడ్మస్ బ్రాండును నొవార్టిస్ నుంచి గతేడాది డీఆర్ఎల్ కొనుగోలు చేసింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
డాక్టర్ రెడ్డీస్‌కు ప్రిమ్సివ్ ట్రేడ్‌మార్క్ హక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైజర్ ప్రోడక్ట్స్ నుంచి ప్రిమ్సివ్ ఔషధానికి సంబంధించి భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్ హక్కులను దక్కించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తెలిపింది. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. 2022 మే నుంచి ఫైజర్ ప్రోడక్ట్స్ ఇండియా తో కలిసి డీఆర్ఎల్ ఈ బ్రాండును భారత్‌లో మా ర్కెటింగ్ చేస్తోంది. తాజాగా ట్రేడ్‌మార్క్ హక్కులు కొనుగోలు చేయడంతో ఇకపై ఇందులో ఉపయో గించే ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్)ను, ఔ షధాన్ని తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేయనుంది. దీనితో ఈ ఔషధం ధర దాదాపు 85 శాతం మేర తగ్గనుంది. చదవండి: ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి -
కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..
జీరో కోవిడ్ పాలసీని ఎత్తేశాక ఘోరంగా కేసులు పెరిగిపోవడంతో పాటు అదేరీతిలో ఘెరంగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకపక్క వైద్యులు నిరంతరం సేవలు అందిచంలేకపోతుంటే, మరోవైపు ఔషధాల కొరతతో గందరగోళంగా ఉంది. ఇంకోవైపు రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ..ఆస్పత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి క్లినిక్ రోగులతో నిండి పోయి..ఆఖరికి వైద్యం ఆరుబయటే అందిచాల్సినంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో తూర్పు చైనాలో అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన అన్హుయ్ పట్టణం కరోనాతో విలవిలలాడుతోంది. గత కొద్ది నెలల నుంచి పెరుగుతున్న కేసుల కారణంగా అధిక సంఖ్యలో వృద్ధులు ఆస్పత్రుల పాలయ్యారు. దీనికి తీడు ఔషధాల కొరతతోపాటు, కరోనాను నిర్థారించే కిట్లు సైతం వేగంగా అయిపోయాయి. అందువల్ల అక్కడ ప్రస్తుతం కరోనా టెస్ట్‌లు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ ఎంతమందికి కరోనా పాజిటివ్ అన్నది కూడా తెలియనంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ చేసినప్పుడే పరిస్థితులు బాగున్నాయని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. ఆ ప్రావిన్స్‌కి సమీపంలోని పట్టణంలో ఉన్న హెల్త్ సెంటర్ అధికారి మాట్లాడుతూ..మందుల కోరత ఘోరంగా ఉందని, అందువల్లే ప్రిస్క్రిప్షన్లను కూడా నిలిపేశామని చెప్పారు. అలాగే ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోవడంతో మెట్ల వద్ద, ఆస్పత్రి వెలుపల వైద్యం అందిచాల్సి వస్తుందని అన్నారు. పైగా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్న వృద్ధులను నగరంలోని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులంతా నిరాశ నిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనగా చెప్పారు. అందువల్ల తాము వారిని ఉత్సాహపరిచేలా..."ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, బ్రతికేందుకు ప్రయత్నిద్దాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి" అనే నినాదంతో కూడిన బ్యానర్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు అక్కడి గ్రామాల్లో కరోనా బారిన పడిన వృద్ధులు అసులు కోలుకోలేదని, కనీవినీ ఎరుగని రీతిలో అధిక సంఖ్యలో వృద్ధులే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం కూడా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బహిర్గతం చేయకుండా గట్టి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడ ఉన్నవారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు వెల్లడించడం కూడా నిషిద్ధమే. దీంతో అక్కడి ప్రజలు వాటి గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. (చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..) -
ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మందులు ఎట్టి పరిస్థితు ల్లోనూ బయటకు రాయ కూడదని, డిశ్చార్జి అయిన రోగు లకు ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే మందులు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి అవస రమైన మందులు ఆసుపత్రు లకు సకాలంలో అందించాలన్నా రు. సోమవా రం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి లోని ఆసు పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన 56 టిఫా స్కానింగ్ సేవలు గర్బిణులకు అందేలా చూడాలని సూచించారు. సి సెక్షన్ల శాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కు వగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సెలింగ్ ద్వారా వివరించాలన్నారు. సి సెక్షన్ లేదా సాధా రణ డెలివరీ చేయాలా వద్దా అనేది పూర్తిగా డాక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలని ఆయన చెప్పారు. డైట్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది రోగు లు, వారి సహాయకులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
National Siddha Day: ద్రవిడుల ప్రాచీన శాస్త్రీయ వైద్యం
భారతీయ వైద్యవిధానాలలో ‘సిద్ధ’ ఒకటి. ఇది ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖలో ఒక భాగం. దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైనది. దీనికి ప్రాచుర్యం కల్పించిన వారిని ‘సిద్ధార్దులు’ లేక శైవ భక్తులైన ఋషులు అంటారు. వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ప్రామాణికం. అందుకే అగస్త్య మహర్షిని సిద్ధ వైద్య పితామహుడిగా పరిగ ణిస్తున్నారు. ఈ సిద్ధ విజ్ఞానాన్ని మెుట్టమెుదట శివుడు, పార్వతిదేవికి ఉపదేశించాడనీ, ఆమె దీనిని నందిదేవునికి అందించిందనీ, నందికేశుడు దీనిని సిద్ధులకు అందజేశాడనీ తమిళ గ్రంథాలు చెబుతాయి. ‘అగస్తియార్’ రాసిన గ్రంథాలు సిద్ధవైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన వరమమ్ (ప్రెజర్ చికిత్స), తక్కానమ్ (మసాజ్ చికిత్స), నాటి (నాడీ పరీక్ష), శస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాల పద్ధతులు ఉన్నట్లు తెలియ చేస్తున్నాయి. నేటికీ ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి. ప్రాచీన గ్రంథం ‘తొలకప్పియం’ అనేక సిద్ధ వైద్య విషయాలను అందిస్తుంది. క్రీ.పూ 2వ శతాబ్దపు ‘తిరుక్కురై’ సిద్ధ విలువల గురించి చెబుతుంది. ‘మణిమేఖలై’ త్రిదోషాల గురించి చెబుతుంది. 13వ శతాబ్దంలో రాణి ‘కుందవై నాచియార్’ తన తండ్రి ‘కుంత్రకోజన్’ పేరు మీద ఉచిత వైద్యశాల నిర్వహించిందని తెలుస్తోంది. ఈ విధానంలోని సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేదంతో సారూప్యతను కలిగి ఉంటాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే వాలి (వాత), అజల్ (పిత్త), అయమ్ (కఫ) దోషాలుగా ఉంటాయనీ, వీటిని బట్టే ఔషధాలు నిర్ణయిస్తారనీ రాశారు. సిద్ధ వైద్య విధానంలో రస ఔషధాలు ప్రాముఖ్యత వహిస్తాయి. మెుక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో ఔషధాల తయారీ ఉంటుందని ‘ఆయుష్’ ప్రచురించిన ‘హాలిస్టిక్ హెల్త్’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ విధానం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్ వంటి అనేక దేశాలలోనూ ఆదరణ కలిగివుంది. కరోనా సమయంలో కబాసురనీర్ ఔషధం తమిళనాడులో అనేక కేసులను తగ్గించడం వలన ప్రత్యేక ప్రజాదరణ పొందింది. – డాక్టర్ బాలాజీ దీక్షితులు పి.వి. (జనవరి 9 అగస్త్య మహర్షి జయంతి, జాతీయ సిద్ధ దినోత్సవం) -
కరోనా వచ్చినా కంగారొద్దు..
సాక్షి, అమరావతి: కరోనా మొదటి, రెండో విడత ఉధృతిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న తాజా వ్యాప్తిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలు చికిత్స అందించడానికి, వైరస్ నియంత్రణకు అన్ని వనరులను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇంకా అవసరమయ్యే పరికరాలు, వస్తువుల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. గతంలో వైరస్ వ్యాప్తి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులుగా వైద్య శాఖ నోటిఫై చేసింది. వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు తగ్గడంతో ఈ ఆస్పత్రులను డీ నోటిఫై చేశారు. మళ్లీ పాజిటివ్ కేసుల నమోదు పెరిగితే ఆస్పత్రులను తిరిగి నోటిఫై చేయనున్నారు. ఆయా ఆస్పత్రుల్లో 8,594 ఐసీయూ, 34,763 ఆక్సిజన్, 12,292 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5813 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐసోలేషన్/క్వారంటైన్ పడకలు 54వేల చొప్పున ఉన్నాయి. 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు, 5,610 పీడియాట్రిక్ వెంటిలేటర్లు, 297 నియోనాటల్ వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రాణవాయువు పుష్కలం రెండో విడత కరోనా వ్యాప్తిలో ఆక్సిజన్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఆæ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆక్సిజన్‌కు కొరత రాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 170 పీఎస్ఏ ప్లాంట్లు నెలకొల్పడంతో పాటు 33,902 డీ–టైప్ సిలెండర్లు, 15,565 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చారు. మరోవైపు స్వల్ప లక్షణాలుండి ఇంటిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారికి అందజేసేందుకు 4,61,729 హోమ్ ఐసోలేషన్ కిట్లు ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి 16,32,714 ఎన్ 95 మాస్క్‌లు, 4,80,441 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి 14,24,000 ఆర్టీపీసీఆర్, 8,44,763 ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలి కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్–7 కేసులు నమోదవలేదు. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు 48 నమూనాలను జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ కేసులన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవే. ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు ప్రారంభించాం. అంతర్జాయతీ ప్రయాణికులకు ఎరికైనా పాజిటివ్‌గా తేలితే వారి నమూనాలను జీనోమ్ ల్యాబ్‌కు పంపి సీక్వెన్సింగ్ చేపట్టాలని నిర్ణయించాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
నాణ్యమైన మందులే లక్ష్యం.. సత్ఫలితాలనిస్తున్న ఏపీ సర్కార్ చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ నూతన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. దాని ఆధారంగా ఔషధ నియంత్రణ మండలి హోల్‌సేల్, రిటెయిల్ మందుల దుకాణాలు, మందుల తయారీ కంపెనీలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లలో విశ్లేషించడం పకడ్బందీగా జరుగుతోంది. నాణ్యత తక్కువ ఉండే నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులను తయారు చేస్తున్న సంస్థలు, విక్రయిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకుంటోంది. దీని ఫలితంగా ఎన్ఎస్క్యూ మందులు రాష్ట్రంలో తగ్గిపోతున్నాయి. నాణ్యమైన మందులు ప్రజలకు లభిస్తున్నాయి. ఎన్ఎస్క్యూ మందులలో జాతీయ స్థాయికంటే రాష్ట్రస్థాయి సగటు తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 4 శాతం ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతుండగా, రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకు విశ్లేషించిన నమూనాల్లో 2.5 శాతం లోపు మాత్రమే ఎన్ఎస్క్యూ నమోదు ఉంది. తనిఖీ ఎక్కడ చేయాలో యాప్ చెబుతుంది ఔషధ నియంత్రణ మండలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు గతంలో వారి అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంపిక చేసుకొని తనిఖీలు చేసేవారు. ఈ విధానానికి చెక్ పెడుతూ ఎన్ఫోర్స్మెంట్లో నూతన విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్‌ను రూపొందించింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు వారి పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. వెంటనే వారు యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు చేసి, ఆ నివేదికలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. శాంపిల్స్ సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించారు. ఈ ఎస్‌వోపీకి అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపాలి. దీనిద్వారా తనిఖీలు, శాంపిళ్ల విశ్లేషణ పకడ్బందీగా జరిగి, నాణ్యత తక్కువుండే మందుల తయారీ తగ్గుతోంది. తద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది. 3370 నమూనాలు విశ్లేషణ రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంక్‌లు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రీటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు మధ్య ఔషధ నియంత్రణ విభాగం మందుల షాపుల్లో 17,051 తనిఖీలు చేసింది. బ్లడ్ బ్యాంకులలో 289, మందుల తయారీ యూనిట్లలో 505 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు 3,370 నమూనాలను సేకరించి విశ్లేషించగా 2.49 శాతం అంటే 84 నమూనాలు ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఈ ఘటనల్లో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా... వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరణ వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరించి, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పక్కాగా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి. శాంపిళ్ల విశ్లేషణలో ఎన్‌ఎస్‌క్యూగా తేలినప్పుడు కేసులు నమోదు చేసి బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 77 కేసులు నమోదు చేయగా, వాటిలో 36 కేసుల్లో ముద్దాయిలకు కోర్టు శిక్ష విధించింది. మిగిలిన కేసుల్లో పై కోర్టులను ఆశ్రయించి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్ -
చందాదారులకు శుభవార్త.. ఈఎస్ఐలో 24/7 మందులు!
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) చందాదారులకు శుభవార్త. ఇప్పటివరకు కేవలం ఓపీ పనివేళల్లోనే ఈఎస్ఐ నాచారం ఆస్పత్రిలో రోగులకు మందులు లభిస్తుండగా అతిత్వరలో ప్రతిరోజూ 24 గంటలపాటు అక్కడ మందులు లభించనున్నాయి. ఇందుకోసం నాచారం ఆస్పత్రిలో 24 గంటలపాటు మందులు అందించేలా ఒక మెడికల్ స్టాల్‌ను కార్మిక శాఖ ఏర్పాటు చేయనుంది. ఈఎస్ఐ ఖాతాదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇటీవల జరిగిన ఈఎస్ఐ అధికారుల సమావేశంలో వెల్లడించారు. మందుల కొనుగోలుకు ఇప్పటికే రూ. 37 కోట్లు విడుదల చేశామన్నారు. ముందుగా నాచారం ఆస్పత్రిలో 24/7 మందుల పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత మరో రెండు ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు జ్వరం మొదలు బీపీ, షుగర్, హృద్రోగాలకు సంబంధించిన మందులను ప్రధాన ఆస్పత్రులతోపాటు క్షేత్రస్థాయిలోని డిస్పెన్సరీల్లోనూ ప్రత్యేక కోటా కింద కేటాయించి నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉండగా వాటికి అదనంగా 25 ప్యానెల్ క్లినిక్‌లు ఉన్నాయి. ఈఎస్ఐ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు. -
నేరేడు పండ్లలోనే కాదు.. ఆకుల్లోనూ గుణాలు.. పరిశోధన చేశారిలా..
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటి వరకు నేరేడు పండ్లలోనే ఔషధ గుణాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ నేరేడు ఆకుల్లోనూ ఔషధ గుణాలున్నట్లు కనుగొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సమాజానికి ఉపయుక్తంగా నిలిచే అంశంపై అధ్యయన ప్రక్రియలో భాగంగా నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలను అన్వేషించే ప్రాజెక్ట్‌ను వీరు చేపట్టారు. హెచ్‌వోడీ ఎ.కృష్ణమంజరి పవార్ పర్యవేక్షణలో నందిన, శ్రీదేవి, అనూష, కళ్యాణ్, రాజ్‌సుశితశ్రీ , శిరీష తమ పరిశోధనల్లో నేరేడు ఆకుల్లో రెండు ఫ్లావనాయిడ్స్‌ను గుర్తించారు. దాదాపు 50 గ్రాముల ఆకుల పొడిలో కొర్సిటిన్ 0.342 మైక్రో గ్రాములు, రూటిన్ 1.397 మైక్రో గ్రాములున్నట్లు తేల్చారు. ఈ ఫ్లావనాయిడ్స్ మధుమేహం, క్యాన్సర్ నియంత్రణకు ఉపకరిస్తాయి. పరీక్ష చేశారిలా.. తొలుత కొన్ని నేరేడు ఆకులను తీసుకుని ఆరబెట్టారు. వాటిలో తేమ పూర్తిగా ఆరిపోయాక పొడి చేసి.. సన్నని జల్లెడతో వడగట్టారు. అనంతరం నేరేడు ఆకుల పొడి ఇథనాల్, మిథనాల్‌లలో కరుగుతోందని గుర్తించారు. ఇన్ఫ్రారెడ్ కిరణాలలో ఈ పొడిని పరిశీలించారు. ఈ పరీక్షతో ఆ పొడిలో ఫ్లావనాయిడ్స్ ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా నిలుస్తాయి. మలినాలను తొలగించే వ్యవస్థగా పనిచేస్తాయి. తదుపరి దశలో సినోడా టెస్ట్ చేసి దానిలో ఉన్న ఫ్లావనాయిడ్స్ రకాన్ని గుర్తించారు. టీఎల్సీ (థిన్ లేయర్ క్రొమెటోగ్రఫీ) చేసి కొర్సిటిన్, రూటిన్‌లు ఉన్న శాతాన్ని గుర్తించారు. విద్యార్థులు తమ రిపోర్టును వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డికి అందజేశారు. సమాజ ఉపయుక్త అంశంపై పనిచేస్తున్న విద్యార్థులను వీసీ అభినందించారు. గతేడాది ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఫోర్టిఫైడ్ రైస్‌పైన ఇదే విధంగా అధ్యయనం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిపే ప్రతి పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా అధికారులు కృషిచేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
కొత్త డ్రగ్ రూల్ తో నకిలీ మందులకు చెక్
-
భారత్ కి జరిగిన అవమానం పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్..
-
అడవిలో అగ్నిశిఖ
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అడవినాభి అద్భుతమైన ఔషధి నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. – ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు -
ఆ జీవో చెల్లదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సిఫార్సులు లేకుండానే సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాంశు ధూలియాలతోకూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజి చెరో రూ.2.5 లక్షలు ఆరు వారాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జమ చేయాలని, ఆ మొత్తాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా), సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీలకు బదిలీ చేయాలని తీర్పులో పేర్కొంది. జరిగిందిదీ.. ఏఎఫ్ఆర్సీ 2011లో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల రుసుములు నిర్ణయించింది. మూడేళ్లకోసారి ఈ ఫీజులు సవరిస్తూ ఉంటుంది. 2017 వచ్చినప్పటికీ ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేయలేదు. ఏఎఫ్ఆర్సీ తగిన సమయంలో సిఫార్సులు చేయకపోవడంతో 2017 జూన్ 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవోను కొంతమంది విద్యార్థులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు 2019లో జీవో చెల్లదని ఆదేశాలు ఇచ్చింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం జీవో ఇవ్వాలని స్పష్టం చేసింది. దీన్ని నారాయణ మెడికల్ కాలేజ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
మన మందులు మంచివేనా?
ఒక భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా దేశంలో 66 మంది పిల్లలు చనిపోయారన్న వార్త దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారతదేశంలో తయారయ్యే ఔషధాలు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తున్నాయా? భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ కాదు. మన తయారీ నాసిరకపు ఔషధాల వల్ల పేద దేశాల్లోని రోగులే కాదు, లక్షలాది మంది భారతీయులు కూడా ప్రభావితం అవుతున్నారు. లేబుల్ మీద ప్రకటించినంత మందు తీరా మాత్రలో ఉండకపోవడం, ఔషధాల్లో కలిసే అవకాశమున్న విష రసాయనాలను గుర్తించే యంత్రసామగ్రి లేకపోవడం, అసలు మొత్తంగానే ఒక కఠినమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు దేశీయుల ఉసురు తీస్తున్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతూ దినేష్ ఎస్. ఠాకూర్, టి.ప్రశాంత్ రెడ్డి రాసిన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్లు గాంబియా దేశంలో 66 మంది పిల్లల మరణాలకు దారితీశాయని వచ్చిన వార్తలు ఇండియాను ఇబ్బందికి గురిచేశాయి. భారతదేశంలో ఔషధాలను ఎలా తయారుచేస్తున్నారో, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారో తెలిపే దుర్భరమైన వాస్తవానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ నెలలోనే ప్రచురితమైన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని వెల్లడించింది. ఈ పుస్తక రచయితలు దినేష్ ఎస్. ఠాకూర్, టి. ప్రశాంత్ రెడ్డి రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఒకటి, భారతీయ మందులు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తు న్నాయా? రెండు, భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? సమాధానం ‘లేదు’ అనే చెప్పాల్సి ఉంటుంది. తొలి ప్రశ్నకు ఈ పుస్తక రచయితలు చెప్పిన సమాధానం ఏమిటంటే... ‘‘మార్కెట్లో పంపిణీ అవుతున్న నాసిరకపు మందుల సునామీని భారతదేశం విప్పారిన నేత్రాలతో చూస్తోంది... దీనివల్ల ప్రభావితులైన రోగుల మొత్తం సంఖ్య... వందలు, వేలు మాత్రమే కాదు బహుశా లక్షల్లో ఉంటుందని మేం అనుమానిస్తున్నాం.’’ ఇక రెండో ప్రశ్నకు జవాబుగా వారు సింపుల్‌గా చెప్పిందేమిటంటే: ‘‘మేము అలా భావించడం లేదు’’ అనే. ఈ పుస్తకంలోని వివరణాత్మకమైన, చక్కటి పరిశోధనతో కూడిన 500 పేజీల అధ్యయనం విస్తృతమైన అంశాలను తడిమింది. దేశంలో ఔషధాలు తయారు చేస్తున్న విధానం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో ఈ పుస్తకం వివరించింది. కొన్ని కంపెనీలు తప్పుడు ప్రక టనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి లైసెన్సు లేకుండానే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు చేయడానికి సమర్థమైన యంత్ర సామగ్రి కూడా వీటివద్ద లేకపోవడం గమనార్హం. అనేక తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కొన్ని కంపెనీల బండారం బయటపడుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. భారతీయ మందుల దుర్భరమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ గురించిన సమగ్ర వివరాలను కూడా ఈ పుస్తకం పొందుపర్చింది. మన రెగ్యులేటర్లు అరుదుగా, ఎప్పుడో తప్ప ఔషధ తయారీ కర్మా గారాలను భౌతికంగా తనిఖీ చేయరు. దీనికి బదులుగా వాళ్లు ప్రశ్నించదలచిన మందుల తయారీ బ్యాచ్ రికార్డుల కాపీని మాత్రమే అడుగుతుంటారు. వారు అనుసరించే మార్గదర్శకాలు న్యాయ విచారణను సైతం నిరుత్సాహపరుస్తుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వ్యవ హారం కోర్టు వరకూ వెళ్లిన ప్పుడు, చాలా మామూలు శిక్షలు మాత్రమే పడుతుం టాయి. ‘కోర్టు ముగిసే వరకూ విధించే సాధారణ శిక్ష’ లాంటిది. అది అసలు శిక్షే కాదని చెప్పవచ్చు కూడా! ఈ పుస్తక రచయితలు తమ ముందుమాటలో ఇచ్చిన ఉదాహరణతో ఒక భయానక స్థితి గురించి నన్ను వర్ణించనివ్వండి. 2019 సంవత్సరంలో డైయాథిలిన్ గ్లైకాల్ (డీఈజీ)ను కలిగివున్న దగ్గు సిరప్ తీసుకున్న 21 మంది చిన్నపిల్లల చనిపోయారు. దీన్ని తయారుచేసింది డిజిటల్ విజన్ కంపెనీ. డైయాథిలిన్ గ్లైకాల్ అనేది పారిశ్రామిక ద్రావణి(సాల్వెంట్). దీన్ని ‘ఆంటీఫ్రీజ్’గానూ, ‘బ్రేక్– ఫ్లూయిడ్’గానూ ఉపయోగిస్తుంటారు. 1972 నుంచి డీఈజీ అనేది పిల్లలకు విషంగా మారిన ఘటనలు అయిదుసార్లు సంభవించాయి. అయినప్పటికీ ఔషధాల్లో దీని జాడను ఎవరూ కనుగొనలేక పోతున్నారు. కారణం... భారతీయ ఔషధ కంపెనీలు ఔషధ తయా రీకి ముందు తమ ముడి సరుకును గానీ, తయారయ్యాక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడానికి ముందుగానీ పరీక్షించడంలో తరచుగా విఫలమవుతుండటమే! ఇది డిజిటల్ విజన్ కంపెనీ తొలిసారి చేసిన క్షమించరాని తప్పేమీ కాదు. 2012–19 మధ్యకాలంలో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాణ్యతా పరీక్షల్లో మొత్తంమీద 19 సందర్భాల్లో విఫల మయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలోకి వచ్చే డిజిటల్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఆ డ్రగ్ కంట్రోలర్ డీఈజీ మిశ్రమాలను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు కంపెనీ చేయనేలేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఆ డ్రగ్ కంట్రోలర్ ఈ విషయాన్ని కనుగొనడానికి అంతకుముందు 19 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ అలా పరీక్షించడంలో విఫలమయ్యారు. డ్రగ్ కంట్రో లర్ తనిఖీ సమయంలోనే ఈ లోపాలను కనిపెట్టి ఉండాలనీ, అలా చేసివుంటే కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్సును తక్షణమే రద్దు చేసి ఉండేవారనీ ఈ పుస్తక రచయితలు పేర్కొన్నారు. ఇంకోసంగతి. మరి, ఒక ఔషధం దాని లేబుల్ మీద ప్రకటించిన మేరకు లేకపోతే దాని పరిణామాలేమిటి? ఈ పుస్తకం అజిత్రో మైసిన్కు సంబంధించి ఒక విషయం పేర్కొంటోంది. ఆల్కేర్ లేబొ రేటరీస్ తయారుచేసే అజిత్రోమైసిన్‌లో లేబుల్ ప్రకారం నిజానికి 200 మిల్లీగ్రాముల అజిత్రోమైసిన్ ఉండాలి. కానీ అందులో ఉన్నది 25.69 గ్రాములే. అంటే కేవలం 12.85 శాతమే. ఇలాంటి మందులు వాడినప్పుడు ఉండదగిన పరిణామం గురించి రచయితలు ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘రోగి చనిపోవడానికి అత్యధిక అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ మాత్రలో ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి అవసరమైన ‘చాలినన్ని’ యాక్టివ్ ఇన్గ్రేడియెంట్లు లేవన్న మామూలు కారణంతో.’’ భారతదేశంలో చౌక ధరలకు లభ్యమవుతూ జనాదరణ పొందిన జనరిక్ మందులు నిజానికి అసలు మందులతో సమానం కాకపోతే జరిగేదేమిటో కూడా ఈ పుస్తకం వివరించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే జనరిక్ మందులపై జీవ సమానత్వ (బయో ఈక్వలెన్స్) పరీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్ష అరుదుగానే జరుగు తుంది. ‘‘తప్పనిసరిగా చేయవలసిన జీవసమానత్వ పరీక్ష లేమి కారణంగా దేశంలో వందలాది కాదు, వేలాది జనరిక్ మందుల బ్రాండ్లను ఆమోదించవలసి వచ్చింది. ఇలా ఆమోదం పొందిన చాలా బ్రాండ్లు ఎందరో రోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది’’ అని ఈ పుస్తక రచయితలు చెబుతున్నారు. అనేక భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు నాణ్యతతో పాటు, విధానపరమైన నియంత్రణ, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా యన్నదే ఈ పుస్తకానికి ముగింపు అని నేను చెబుతాను. అయిన ప్పటికీ, ప్రజలను దెబ్బతీస్తున్న లేదా చంపుతున్న నేరాలకు పాల్పడిన ఈ కంపెనీలు అరుదుగా కూడా భౌతిక శిక్షలు ఎదుర్కోవడం లేదు. ఇదే నిజానికి అత్యధికంగా భయపెడుతోంది. కానీ ప్రభుత్వం ఏ చర్యలకూ ఉపక్రమించకపోతే, మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘ఫార్మా’లిటీస్ దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొందరు ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) దందా జోరుగా కొనసాగుతోంది. మందుల దుకాణాల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ దుకాణాలకు వెళ్లారంటే చాలు లోపాలను సరిచేయాల్సింది పోయి, వాటిని అడ్డంపెట్టుకొని అడ్డంగా తినేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే అదనుగా కొన్ని ఔషధ దుకాణ దారులు కూడా నాసిరకం మందులు, అనుమతిలేని విక్ర యాలు, ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నియంత్రణ గాలికి.. దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. పలు దేశాలకు ఇక్కడి నుంచే మందులు ఎగుమతి అవుతున్నాయి. ముడిసరుకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు సైతం రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అటు ఉత్పత్తి, ఇటు విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లే చూడాలి. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఔషధ నియంత్రణ గాల్లో దీపం చందంగా మారింది. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని జాతీయ ఔషధ సర్వే తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మందుల్లో 12.57 శాతం ఔషధాలకు నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు వెల్లడించింది. వేధిస్తున్న అధికారుల కొరత... రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 36 వేల మందుల దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి 100 మందుల దుకాణాలకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంటే రాష్ట్రంలో దాదాపు 360 మంది అవసరం. మరోవైపు రాష్ట్రంలోని 560 ఔషధ ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25 మంది అధికారులు కావాలి. ఇలా మొత్తంగా 385 మంది నియంత్రణాధికారుల అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు 71 మంది మాత్రమే. ఇందులోనూ 18 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే 53 మందే ఉన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల చేతుల్లో ఎక్కువ మందుల దుకాణాలు ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానరాని నిబంధనల అమలు... వాస్తవానికి ఉత్పత్తి సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేయాలి. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన లేబరేటరీల్లో వాటిని పరీక్షించాలి. ఫార్మసిస్టులకూ మందులను నిల్వ చేయడంపై శిక్షణ ఇవ్వాలి. అలాగే ఫార్మసిస్టుల సమక్షంలోనే మందులు విక్రయించాలి. కానీ రాష్ట్రంలో 70 శాతం మందుల దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. అలాగే డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను అమ్మడానికి వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించాలి. బిల్లుల నిర్వహణ ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచరాదు. ఔషధ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే శాంపిల్ మందులు, ప్రభుత్వాసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ల దందా, వారి కొరత కారణంగా చాలా ఔషధ దుకాణాల్లో ఆ నిబంధనలు అమలు కావడంలేదు. బదిలీలు బంద్! ఒక్క హైదరాబాద్ నగరంలోనే 15 వేలకుపైగా మందుల దుకాణాలు ఉండగా ఇక్కడ 20 మందే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వారు జిల్లాలకు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. అలాగే జిల్లాల నుంచి బదిలీపై ఎవరైనా హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవానికి మూడేళ్లకోసారి బదిలీ జరగాల్సి ఉన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏడెనిమిదేళ్లుగా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ నగరంలోనే పాతుకుపోయారు.