గ్లోబల్ ఫార్మా దిగ్గజం రోచె (Roche) అత్యంత క్లిష్టమైన, అరుదైన వ్యాధి మెడిసిన్‌ను భారతదేశంలో.. చైనా & పాకిస్థాన్ దేశాలకంటే కూడా 15 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మందు ఏది? మన దేశంలో దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
నివేదికల ప్రకారం.. భారతదేశంలో 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ థెరపీ' (SMA) ఒక్కో బాటిల్ ధర రూ. 6.2 లక్షలకంటే ఎక్కువని తెలుస్తోంది. పాకిస్థాన్‌లో దీని ధర రూ. 41,002 కాగా.. చైనాలో రూ. 44,692 కావడం గమనార్హం. ఎస్ఎమ్ఏ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని దీని అవసరం చాలా ఉంటుందని చెబుతారు.
ఒక వ్యక్తి బరువు సుమారు 20 కేజీల కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారికి సంవత్సరానికి దాదాపు 36 బాటిళ్లు అవసరమవుతాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో స్పష్టంగా అర్థమయిపోతోంది. దీనిపైనా ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నడుస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ!
ఈ మెడిసిన్ 2021లో ప్రారంభించినట్లు.. ప్రారంభ ధరకు, ఇప్పటి ధరకు చాలా వ్యత్యసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే SMA వ్యాధికి కావలసిన మందులను బయోజెన్, నోవార్టిస్ వంటి కంపెనీలు కూడా తయారు చేస్తాయి. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లకు సరైన ధరలో మందులు అందివ్వాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment