
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని వేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. కాగా ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
చదవండి : (మరో మంత్రిపై నిమ్మగడ్డ ఆంక్షలు)