మా బిడ్డ ఎప్పుడొస్తుందో..? | married women missing in SPSR Nellore | Sakshi
Sakshi News home page

మా బిడ్డ ఎప్పుడొస్తుందో..?

Published Tue, Mar 25 2025 12:19 PM | Last Updated on Tue, Mar 25 2025 12:19 PM

married women missing in SPSR Nellore

తల్లిదండ్రుల ఆవేదన    

పక్షం రోజులుగా ఆచూకీ లేని మహిళ 

ఉలవపాడు: దా దాపు 15 రోజుల క్రితం తప్పిపోయిన వివాహిత ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. 

వీరేపల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన చొప్పర వెంకట రమణకు (31) వివాహమైంది. భర్త మరణించడంతో తల్లిదండ్రులు చొప్పర శ్రీను, వరలక్ష్మి వద్ద ఉంటోంది. ప్రతి రోజూ వీరేపల్లి నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని దేవి సీఫుడ్స్‌లోకి పనికి బస్‌లో వెళ్లి వస్తుంది. 7వ తేదీ తెల్లవారుజామున గ్రామంలో ఓ వివాహం జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత నుంచి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు వెతుకులాడారు. 

వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 8న మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు కొంత విచారణ జరిపినా ఫలితం లేకుండా పోయింది. నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు పెళ్లి జరుగుతున్న సమయంలో ఉన్న కొందరిని విచారించారు. ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి విచారించి వచ్చినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై మరింత దృష్టి సారించి తమ కుమార్తె ఆచూకీ తెలపాలని బాధితులు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement