
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.
May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025
కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.
పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.
