Airtel Prepaid Plan Offers Free Hotstar And Amazon Prime Subscription, Details In Telugu - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త! ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌..!

Published Wed, Mar 23 2022 12:53 PM | Last Updated on Wed, Mar 23 2022 3:05 PM

Airtel Prepaid Plans With Free Disney Hotstar Subscription For A Year - Sakshi

దేశంలో ఐపీఎల్ సంద‌డి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా

దేశంలో ఐపీఎల్ సంద‌డి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్‌ను వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా బండిల్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లతో పాటు ఉచితంగా ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. 

కొద్దిరోజుల క్రితం రిలయన్స్‌ జియో ఉచితంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఎయిర్‌టెల్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో అదనంగా మరో 3రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రతినిధులు తెలిపారు. 

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్‌ సేవలు

ఎయిర్‌టెల్‌ రూ.499ప్లాన్‌: ఈ ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లకు ప్రతిరోజు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ,రోమింగ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.   

ఎయిర్‌టెల్‌ రూ.599 ప్లాన్‌: 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ బెన్ఫిట్‌ పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.839 ప్లాన్‌: 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్‌, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ బెన్ఫిట్స్‌, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.2,999 ప్లాన్‌: ఈ ప్లాన్‌లో యూజర్లు 365రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా , ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ బెన్ఫిట్స్‌ పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.3359ప్లాన్‌: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2జీబీ డేటా, దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ బెన్ఫిట్‌ పొందవచ్చు.

చదవండి: 'ఆఫర్లు మావి..ఛాయిస్‌ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement