How To Update Date of Exit in EPF Account Online, Details Inside - Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త.. ఇక సులభంగానే!

Jan 26 2022 9:21 PM | Updated on Jan 27 2022 8:59 AM

How To Update Date of Exit in EPF Account Online - Sakshi

ఈపీఎఫ్‌ఓ తన చందాదారులకు శుభవార్త అందించింది. మీరు ఒక కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరినట్లయితే ఉద్యోగం మానేసిన తేదీని సులభంగానే ఈపీఎఫ్ ఖాతాలో అప్‌డేట్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విటర్ ఖాతా వేదికగా విడుదల చేసింది. మీరు ఈ వీడియోను చూడటం ద్వారా ఆన్‌లైన్ నిష్క్రమణ తేదీని మీరే స్వయంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

తేదీని అప్‌డేట్ చేసుకోండి ఇలా..

  • యుఏఎన్, పాస్‌వర్డ్‌తో వెబ్ సైట్ లాగిన్ అవ్వండి.
  • మేనేజ్ బటన్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్‌పై క్లిక్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ డ్రాప్‌డౌన్‌ని ఎంచుకోవడం ద్వారా పీఎఫ్ ఖాతా నంబర్‌ను ఎంచుకోండి
  • నిష్క్రమణ తేదీ, ఉద్యోగం నుంచి నిష్క్రమించడానికి గల కారణాన్ని తెలియజేయండి.
  • రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేసి ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్‌లో అందుకున్న ఓటీపీని నమోదు చేయండి.
  • చెక్ బాక్స్‌ని ఎంచుకుని అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఆపై ఓకేపై క్లిక్ చేయండి.
  • తర్వాత మీరు మునుపటి కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తేదీని విజయవంతంగా అప్‌డేట్‌ చేసినట్లు మీ మొబైల్‌కు మెస్సేజ్‌ వస్తుంది.

(చదవండి: గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ ధరలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement