
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం జియో బుధవారం నుంచి (నేడు) 4 నగరాల్లో 5జీ సర్వీసుల ట్రయల్స్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఈ నగరాల్లో ఉన్నాయి. జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను ప్రయత్నించాల్సిందిగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం పంపనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ ఆఫర్ కింద సదరు సబ్‌స్క్రయిబర్స్‌కు సెకనుకు 1 గిగాబిట్ వేగంతో అపరిమిత 5జీ డేటా లభిస్తుందని పేర్కొంది. ఆహ్వానం పొందిన యూజర్లను తమ ప్రస్తుత జియో సిమ్‌ను లేదా 5జీ హ్యాండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే జియో ట్రూ 5జీ సర్వీస్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ వివరించింది. ట్రయల్‌లో 5జీ డేటాకు అదనపు చార్జీలు ఉండబోవని పేర్కొంది.