
Maruti, Quiklyz tie up for vehicle subscription: లీజింగ్ సబ్‌స్కిప్షన్ వేదిక క్విక్‌లీజ్‌తో వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలవారీ చందా ప్రాతిపదికన క్విక్‌లీజ్ వేదికగా మారుతీ సుజుకీ వాహనాలను వినియోగదార్లు తీసుకోవడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. సబ్‌స్క్రైబ్ పేరుతో మారుతీ సుజుకీ 2020 జూలై నుంచి సబ్‌స్క్రిప్షన్‌పైన వాహనాలను సమకూరుస్తోంది. వైట్ ప్లేట్ లేదా బ్లాక్ ప్లేట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు. వాహనం కస్టమర్ పేరునే నమోదు అవుతుంది.
హైదరాబాద్‌తో సహా 20 నగరాల్లో ఈ సౌకర్యం ఉంది. 12-60 నెలల కాలపరిమితితో వాహనాన్ని తీసుకోవచ్చు. కాల పరిమితి ముగిసిన తర్వాత వాహనాన్ని వెనక్కి ఇవ్వడం లేదా అప్‌గ్రేడ్‌కూ అవకాశం ఉంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. బీమా, నిర్వహణ ఖర్చులు కలుపుకుని నెలవారీ రుసుము రూ.11,000 నుంచి ప్రారంభం. క్విక్‌లీజ్‌ను మహీంద్రా ఫైనాన్స్ ప్రమోట్ చేస్తోంది. చందాపై వాహనాలను కస్టమర్లకు చేర్చడానికి ఏఎల్‌డీ ఆటోమోటివ్, మైల్స్, ఓరిక్స్‌తో ఇప్పటికే మారుతీ సుజుకీ చేతులు కలిపింది.