
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశంలో వరుసగా మే నెలలో నాలుగో సారి రీటైల్ ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఏప్రిల్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 4.70 ఉండగా మే నెల సమయానికి 4.25 కి పడిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (National Statistics Office (NSO) తెలిపింది.
వినియోగదారుల ధరల సూచీ ప్రకారం..మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదై 25 నెలల కనిష్ఠానికి చేరింది.ఈ ఏడాది జనవరి నుంచి 227 పాయింట్లు పడిపోవడం గమనార్హం. అయినప్పటికీ సీపీఐ ద్రవ్యోల్బణం వరుసగా 44వ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది.