
అమెరికాలో విజయవాడ యువతి అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు..
విజయవాడ: అమెరికాలో విజయవాడకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన ఆమె కారులో ప్రయాణిస్తూ అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు.
వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించగా.. జహీరా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతికి సంబంధించి వైద్య నివేదికపై స్పష్టత రావాల్సి ఉంది.