వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో | Woman Brutally Assassination In Kurnool District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: ప్రియుడిని దూరం పెట్టడంతో

Published Tue, Mar 9 2021 11:43 AM | Last Updated on Tue, Mar 9 2021 12:40 PM

Woman Brutally Assassination In Kurnool District - Sakshi

హత్యకు గురైన రాధమ్మ (ఫైల్‌)  

ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో రాధమ్మ కొద్ది రోజులుగా అంజికి దూరంగా ఉంటోంది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన అతను నల్లబల్లి గ్రామానికి చెందిన తన మిత్రుడు రంగస్వామితో కలసి రాధమ్మను హతమార్చాలని పథకం రచించాడు.

ప్యాపిలి(కర్నూలు జిల్లా): మండల పరిధిలోని నల్లబల్లి గ్రామ శివార్లలో యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) దారుణ హత్యకు గురైంది. దాదాపు వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మహిళా దినోత్సవం రోజున సోమవారం వెలుగు చూసింది. యాటగాని గుట్ట వద్ద దుర్వాసన వస్తోందని స్థానికుల నుంచి సమాచారం అందడంతో ప్యాపిలి సీఐ రామలింగమయ్య, ఎస్‌ఐ మారుతి శంకర్‌ ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి రాధమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోతుదొడ్డికి చెందిన రాధమ్మకు బోయవాండ్లపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్‌తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. అయితే అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం రామ్మోహన్‌ మృతి చెందాడు. దీంతో పుట్టింటికి చేరుకున్న రాధమ్మ స్వగ్రామంలోనే చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన ధనుంజయులు అలియాస్‌ అంజితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో రాధమ్మ కొద్ది రోజులుగా అంజికి దూరంగా ఉంటోంది.

దీన్ని జీర్ణించుకోలేక పోయిన అతను నల్లబల్లి గ్రామానికి చెందిన తన మిత్రుడు రంగస్వామితో కలసి రాధమ్మను హతమార్చాలని పథకం రచించాడు. వారిరువురూ కలిసి ఆమెను పొలాల వద్దకు తీసుకుని వెళ్లి రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని కనిపించకుండా చేసేందుకు గుట్టలో పెద్ద బండ రాళ్ల మధ్య ఇరుకైన సందులోకి ఇరికించారు. వారం రోజుల తర్వాత శవం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్వాసన వ్యాపించింది. దీంతో సమీప పొలాల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శవాన్ని పరిశీలించి శవపంచనామా   నిర్వహించారు.  

అంగడి సరుకులు తెచ్చేందుకు వెళ్లి అదృశ్యం 
కుటుంబ పోషణకు దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న రాధమ్మ తరచూ ప్యాపిలికి వెళ్లి సరుకులు తెచ్చుకునేది. ఈ నెల మూడో తేదీన సరుకుల కోసం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పరిసర గ్రామాల్లో గాలించారు. ఆచూకీ తెలియక పోవడంతో ఆమె సోదరుడు సుంకన్న ఈ నెల 5 ప్యాపిలి పోలీస్‌ స్టేషన్‌లో తన చెల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే సోమవారం రాధమ్మ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ధనుంజయులు, అతని స్నేహితుడు రంగస్వామి తన సోదరిని హత్యచేసినట్లు సుంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.
చదవండి:
తల్లి నగ్న ఫొటోలు తీసి.. కూతురిపై లైంగికదాడి 
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement