
గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయడం, ఆయన పునరుత్థానం సందేశాన్ని గుర్తు చేసుకుంటూ రన్ ఫర్ జీసస్ నిర్వహిస్తున్నారు. ఈస్టర్ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చస్, అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న నగరంలో భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ర్యాలీ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. కాథలిక్, ప్రొటెస్టంట్ చర్చిలను ఏకంచేస్తూ అతిపెద్ద క్రైస్తవ ర్యాలీని ‘రన్ ఫర్ జీసస్’ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని చర్చిల నుండి వేలాది మంది క్రైస్తవులు కాలికనడక, రన్నింగ్, మోటార్ సైకిళ్ళు/నాలుగు చక్రాల వాహనాలపై ఆనందంగా ఈ ర్యాలీని నిర్వహిస్తారని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో,శనివారం, ఏప్రిల్ 19,ఉదయం 6:00 గంటల నుండి హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో RUN FOR JESUS ర్యాలీ జరుగుతుంది. హైదరాబాద్ ఆర్చ్‌డయోసెస్ ఆర్చ్ బిషప్ హిజ్ ఎమినెన్స్ కార్డినల్ పాల్ ఆంథోనీ, మెదక్ డయోసెస్ ఇన్‌ఛార్జ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కె. రూబెన్ మార్క్, అరదాన టీవీ చైర్మన్ బ్రదర్ పాల్ దేవప్రియం పుల్లా ,చర్చి మరియు,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర ప్రముఖులు నగరంలోని వివిధ ప్రదేశాలలో జరిగే ఈ పరుగులో పాల్గొంటున్నారు .చర్చిలు. స్థానిక సువార్త గాయకులు నిర్వహించే ప్రశంస మరియు ఆరాధనతో ఈ పరుగు ఆయా ప్రదేశాలలో గొప్ప ఆనందంతో ముగుస్తుందనీ సీనియర్ పాస్టర్లు ఈస్టర్ సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. క్రైస్తవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ తీసుకురావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఒక ప్రత్యేకమైన సువార్తిక & క్రైస్తవ ర్యాలీ అయిన RUN FOR JESUS యొక్క ఆలోచన మరియు భావనను 2011 సంవత్సరంలో అరదాన టీవీ బృందం రూపొందించి ప్రవేశపెట్టింది. తొలుత ఇది 30కిపైగా ప్రదేశాల్లో ఈ ర్యాలీని చేపట్టారు. ప్రస్తుతం RUN FOR JESUS ఏపీ, తెలంగాణాతో పాటు, కర్ణాటక ,మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ,విదేశాలలో కొన్ని ప్రదేశాలలో ఒక ప్రధాన వార్షిక క్రైస్తవ ర్యాలీగా మారింది.