
మనిషి లక్షలాది సంవత్సరాలుగా ఊహికందని ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతుండగా, లెక్కకు అందని సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక నిరాశ్రయులయ్యేవారి సంఖ్య చెప్పనలవి కాదు. ఇప్పుడు మనం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత భారీ విపత్తు గురించి తెలుసుకుందాం.
ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైన రోజు..
సైన్స్ అలర్ట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం 1556 జనవరి 23.. ఆరోజు మానవాళి పెను విపత్తును భీకర భూకంపం రూపంలో ఎదుర్కొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో 8 లక్షలమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో చైనాలో అప్పటివరకూ సంతరించుకున్న నాగరిత సర్వనాశనం అయ్యింది.
ఎంత శక్తివంతమైన భూకంపం అంటే..
సాధారణంగా ఎక్కడో ఒకచోట భూకంపం వస్తూనే ఉంటుంది. అయితే 1556 జనవరి 23న సంభవించినంతటి పెను భూకంపం ఇంతవరకూ ఎన్నడూ సంభవించలేదు. సాధారణంగా స్వల్పస్థాయి భూకంపాలు రిక్టర్ స్కేలుపై 2.3 లేదా 3.2గా నమోదవుతుంటాయి. అయితే 1556 జనవరి 23న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.0 నుంచి 8.3 మధ్యలో నమోదయ్యింది. ఇది పెను విపత్తుకు దారితీసింది. భూకంప కేంద్రం నగరం మధ్యలో ఉండటమే ఇంతటి భారీ విపత్తుకు కారణంగా నిలిచింది.
మానవ నాగరికత భవిష్యత్‌కు సన్నాహాలు
ఈ భారీ వినాశకర భూకంపం భవిష్యత్‌లో ఇటువంటి ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఘటన అనంతరం చైనాలో అత్యధికశాతం ఇళ్లను తేలికపాటి కలపతో నిర్మించసాగారు. అయితే ఇప్పటి ఆధునిక సాంకేతికతతో భూకంపాలను ముందుగానే పసిగట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విధానాలను కనుకొన్నారు. ఇదేవిధంగా తుపానులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను మనిషి ముందుగానే గుర్తించగలుగుతున్నాడు.
ఇది కూడా చదవండి: పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..