
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య సోమవారంతో 10 లక్షలకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతర్యుద్ధం, రెండో ప్రపంచయుద్ధాల్లో మరణించిన అమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. వ్యాక్సినేషన్‌కు ఇష్టపడని గ్రామీణ ప్రజల వల్లే ఇంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ వాపోయింది. రెండు వారాలుగా అమెరికాలో కరోనా కేసుల్లో 60% పెరుగుదల నమోదవుతోంది. రోజుకు 86 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.
చదవండి: తుపాకుల రాజ్యం