
నేటినుంచి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి (బుధవారం)నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నేడు శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి గుట్టమీదకు ప్రవేశం, 3న సాయమారాధన, ప్రబంధ సేవాకాలం, 4న సేవాకాలం గరుడసేవా నమ్మాళ్వారుల పమర పథోత్సవం, 5న పుణ్యహవాచనం, అంకురార్పన, బేరి పూజా దేవతాహ్వానము, 6న శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం, 7న సాయమారాధన హోమం, 8న సుదర్శన నారసింహ హోమం, 9న నిత్య హోమం, బలిహరణ గోష్టి, 10న చక్రస్నానం, 11న బండ్లు తిరుగుట పారువేట, 12న సీతారామస్వామి వారు ఆలయ ప్రవేశం , ఏకాంత సేవలు ఉంటాయని ఈఓ తెలిపారు.