
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
బనశంకరి: కేజీల కొద్దీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఫిబ్రవరి 3న బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో అరెస్టయి, రిమాండులో ఉన్న నటి రన్య రావు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. 64 వ సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించడంతో ఆమె న్యాయవాది హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. రన్యకు బెయిలు ఇవ్వరాదని డీఆర్‌ఐ వకీళ్లు గట్టిగా వాదిస్తున్నారు.
యత్నాళ్ కేసు మీద స్టే జారీ
నటి రన్య రావు పై అవహేళన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ పై నమోదైన క్రిమినల్ కేసు విచారణపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. రన్య శరీరమంతా బంగారం అంటించుకుని స్మగ్లింగ్ చేస్తోంని ఇటీవల యత్నాళ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రన్య బంధువు బెంగళూరు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని యత్నాళ్ హైకోర్టులో అర్జీ వేశారు. విచారించిన జడ్జి ప్రదీప్‌సింగ్ యెరూర్.. స్టే జారీ చేయడంతో ఆయనకు ఊరట లభించింది.