
హీరోహీరోయిన్ల వారసులు దాదాపు ఇండస్ట్రీలోకే వస్తుంటారు. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఇందులో పెద్ద మార్పేం ఉండదు. ఒకరో ఇద్దరు తప్పితే దాదాపు హీరోహీరోయిన్లు అయిపోతుంటారు. కానీ ఓ స్టార్ హీరో కూతురికి మాత్రం ఇండస్ట్రీ అంటే ఆసక్తి లేదట. స్వయంగా తల్లి ఈ విషయాన్ని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)
బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగణ్-కాజోల్(Kajol)కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నైషా(Nysa Devgn) పెద్దది. ఇదివరకే చాలామంది పిల్లలు నటీనటులు అవుతున్నారు కదా? మీ అమ్మాయికి కూడా ఆసక్తి ఉందా అని తాజాగా జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్ 2025లో కాజల్ కి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె.. లేదు అని సమాధానమిచ్చింది.
తన కూతురు అస్సలు నటి అయ్యే అవకాశం లేదని హీరోయిన్ కాజోల్ క్లారిటీ ఇచ్చింది. తల్లిదండ్రుల్లానే అందంలో ఏ మాత్రం తీసిపోని విధంగా నైషా ఉంది. కానీ ఇండస్ట్రీలో రానని అనుకోవడం మాత్రం ఆశ్చర్యమే అని చెప్పాలి. అలాఅని రీసెంట్ టైంలో బాలీవుడ్(Bollywood)లోకి వచ్చిన నెపో కిడ్స్ చాలామంది సరైన యాక్టింగ్ చేయక ఘోరమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. బహుశా కాజల్ కూతురు ఇవన్నీ చూసి నటి కాకూడదని ఫిక్సయ్యిందేమో!
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)
