
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే దీని షూటింగ్ మొదలవొచ్చు. దీనితోపాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
అయితే మహాకాళి సినిమాని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు అనే మహిళా దర్శకురాలు స్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి 'ఛావా' విలన్ పాత్రధారి అక్షయ్ ఖన్నా వచ్చి చేరాడు.
మన దేశంలో వస్తున్న తొలి లేడీ సూపర్ హీరో మూవీ ఇది అని అంటున్నారు. ఇందులోనూ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలోనే కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టేయడంతో ఇప్పుడు వరస అవకాశాలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)
