
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఆత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రముఖ హిందీ షోలో పాల్గొన్న ధనుష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోన్న ఈ సమయంలో మీరు ఎవరు బయోపిక్స్‌లో నటిస్తారు?’ అనే ప్రశ్నకు ధనుష్ బదులిస్తూ– ‘‘రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం.. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు. తమిళంలో దాదాపు అరడజను సినిమాలకు కమిటైన ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.