
Kamal Haasan Gifts New Bikes to 13 Assistant Directors: విక్రమ్ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు హీరో కమల్ హాసన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విక్రమ్ టీం, కమల్ హాసన్ మూవీ సక్సెస్‌ను ఆస్వాధిస్తున్నారు. విక్రమ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు మంగళవారం ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటీకి పైగా విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును గిఫ్ట్‌గాఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.
చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లెక్సాస్ లగ్జరీ కారు బహుమతి
అలాగే విక్రమ్ మూవీకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ ఆర్‌టీఆర్ 160 (Apache RTR 160)బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా విక్రమ్ మూవీ కోసం వీరు చాలా హర్డ్ వర్క్ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ బైక్ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్
విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్స్‌లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.
https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc
— Ramesh Bala (@rameshlaus) June 7, 2022