
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఎక్కువ శాతం ప్రేమ, తక్కువ యాక్షన్ పార్ట్ ఉంటుందని తెలిసింది. ఈ డిసెంబర్‌తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందని సమాచారం. దాంతో ప్రేమజంట ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి రేసులో పలు సినిమాలు ఉన్నాయి. మరి ‘రాధేశ్యామ్’ కూడా కూడా జాయిన్ అవుతారా? వేచి చూడాలి.