ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. 12 అడుగుల కింగ్‌ కోబ్రా పట్టివేత | 12 foot long King Cobra rescued in Karnataka Video viral | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. 12 అడుగుల కింగ్‌ కోబ్రా పట్టివేత

Published Fri, Jul 19 2024 4:30 PM | Last Updated on Fri, Jul 19 2024 5:22 PM

12 foot long King Cobra rescued in Karnataka Video viral

బెంగుళూరు: క‌ర్నాట‌క‌లో  సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రానుఅట‌వీశాఖ అధికారులు ప‌ట్టుకున్నారు. అగుంబే గ్రామంలో ఓ ఇంటి ముందున్న పొదల్లో సంచ‌రిస్తూ కనిపించిన ఆ భారీ నల్లత్రాచు పామును వన్యప్రాణి అధికారులు చాలా చాక‌చ‌క్యంగా బంధించి.. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఈ మేరకు అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీస‌ర్చ్ స్టేష‌న్‌లో ఫీల్డ్ డైరెక్ట‌ర్‌గా చేస్తున్న అజ‌య్ గిరి పామును రెస్యూ చేసిన వీడియోను ఎస్స్‌లో పోస్టు చేశారు. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత్ నందా కూడా ఆ  షేర్ చేశారు.

కాగా అగుంబే గ్రామంలో ఇంటి కాంపౌండ్‌లోని పొదల్లో నక్కిన నాగుపాము.. రోడ్డు దాటుతుండగా గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఇంటి యజమాని కి తెలియజేయగా.. ఆయన అటవీశాఖ అధికారులను అ‍ప్రమత్తం చేశారు. అధికారులు వచ్చే సరికి పాము ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కుంది. అక్కడకు వచ్చిన వన్యప్రాణి సంరక్షణ అధికారి గిరి, టీమ్‌తో కలిసి పామును ప‌ట్టుకున్నారు.. ఓ రాడ్డు సాయంతో చెట్టు మీద నుంచి పామును కింద‌కు దించి, ఆ త‌ర్వాత రెస్క్యూ బ్యాగ్‌లోకి పంపించారు. అనంతరం దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు.

 అయితే పామును పట్టుకుంటున్న వీడియోను గిరి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చెట్టుమీద నెమ్మదిగా కదులుతున్న నల్లత్రాచు పాము ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పడుకు గురిచేస్తున్నాయి. ఇక పోతే కింగ్ కోబ్రాను ప‌ట్టుకున్న అజ‌య్ గిరిపై ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత్ నందా ప్ర‌శంస‌లు వ్య‌క్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement