
బెంగళూరు: సరదాగా సినిమా చూద్దామని వెళితే తన విలువైన సమయం వృథా చేశారని ఓ యువ న్యాయవాది థియేటర్‌పై కేసు వేశారు. ఈ కేసులో వినియోగదారుల కోర్టు న్యాయవాదికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి రూ.65వేల నష్టపరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.
2023లో బెంగళూరులో అభిషేక్ అనే న్యాయవాది బుక్‌మైషో ప్లాట్‌ఫాంలో టికెట్లు బుక్ చేసుకొని పివిఆర్ ఐనాక్స్ థియేటర్‌లో సినిమాకు వెళ్లారు.సినిమా ప్రదర్శించే ముందు థియేటర్‌లో 25 నిమిషాల పాటు ప్రకటనలు వేశారు. దీంతో యువ న్యాయవాదికి చిర్రెత్తుకొచ్చి థియేటర్‌పై కేసు వేసి విజయం సాధించారు.
ఈ కేసులో తీర్పిచ్చే సందర్భంగా వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం డబ్బులతో సమానమని, అభిషేక్ విలువైన టైమ్ వేస్ట్ చేసినందుకు అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుంది. తాము కొన్ని ప్రకటనలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి.