
ఐదు లక్షల కరోనా మరణాలతో భారత్ మూడో స్థానంలోకి చేరింది. యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా..
Corona New Cases Update: గత 24 గంటల్లో భారత్‌లో 1, 49, 394 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. అలాగే టెస్టుల ఆధారంగా పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదు అయ్యింది.
ఇక రికవరీల సంఖ్య 2, 46, 674 కాగా, గత ఒక్కరోజులో కరోనాతో దేశవ్యాప్తంగా 1,072మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య అధికారికంగా ఐదు లక్షలు దాటింది(5, 00,055). ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14, 35, 569గా ఉంది. అత్యధిక కేసులు Omicron variant of SARS-COV2(ఒమిక్రాన్ వేరియెంట్)వే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 168.47 కోట్ల డోసులకు చేరుకుంది. కరోనా విజృంభణ కేరళలో అత్యధికంగా కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదు అయిన దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 387.5 మిలియన్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇప్పటిదాకా.