
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యూపీలో అమలు చేస్తున్న యాంటీ రోమియో స్క్యాడ్ తరహాలో యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్(Eve Teasing Squad)కు రూపకల్పన చేయనుంది. దీనికి సంబంధించి పోలీసు కమిషనర్ ఒక ప్రకటన చేశారు. ఈ స్వ్యాడ్‌కు ‘శిష్టాచార్ స్క్వాడ్’ అనే పేరు పెట్టారు. ఢిల్లీలోని ప్రతీ జిల్లాలో ఈ తరహాలోని రెండు స్క్వాడ్‌లు విధులు నిర్వహించనున్నాయి.
ఈ ‘శిష్టాచార్ స్క్వాడ్’లో ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఎనిమిదిమంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండనున్నారు. వీరిలో నలుగురు మహిళా సిబ్బంది ఉంటారు. వీరిలో సాకేంతిక నిపుణత కలిగిన ఒకరు ఉండనున్నారు. ఈ స్క్వాడ్‌కు ఒక కారుతో పాటు ద్విచక్రవాహనాలను కూడా సమకూర్చనున్నారు. ఈ స్క్వాడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు(Public transport)లో కూడా ప్రయాణించనున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేవిధంగా వారిని మోటివేట్ చేయనున్నారు.
2017లో యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను నియమించింది. వీరు స్కూళ్లు, కాలేజీల బయట జరిగే ఈవ్ టీజింగ్‌ను అరికడుతుంటారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లో మహిళా కానిస్టేబుళ్లు సభ్యులుగా ఉంటారు. వీరు మహిళలపై వేధిపులకు పాల్పడేవారిని పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి