
భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల ప్రకారం.. 9 మార్చి 2022న, భారత క్షిపణి సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో ఆ క్షిపణి పేలిందని భారత రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ( చదవండి: PM Modi: పంజాబ్‌లో ప్రభంజనం.. ‘ఆప్’కు మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే )
ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పడిన ఘటన తీవ్ర విచారం కలిగిస్తోందని, ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది.కాగా బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్‌సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది పాక్ అధికారి వెల్లడించాడు.