పారాగ్లైడింగ్‌తో పరీక్ష కేంద్రానికి  | Maharashtra student paraglides to reach exam center | Sakshi
Sakshi News home page

పారాగ్లైడింగ్‌తో పరీక్ష కేంద్రానికి 

Published Mon, Feb 17 2025 6:16 AM | Last Updated on Mon, Feb 17 2025 6:16 AM

Maharashtra student paraglides to reach exam center

పరీక్షకు ఆలస్యమవుతోందని విద్యార్థి సాహసం

సతారా: ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో కన్నీటిపర్యంతమైన అభ్యర్థులను ఎంతోమందిని చూశాం. తనకలా అవ్వొద్దనుకున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు. ట్రాఫిక్‌ కష్టాలు తప్పించుకుని సకాలంలో ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరేందుకు వినూత్న ఆలోచన చేశాడు. సతారా జిల్లా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ మహంగాడేకు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. పని నిమిత్తం పంచగని వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ఆలస్యమై పరీక్షకు వెళ్లడానికి కొద్ది నిమిషాలే మిగిలింది. 

రోడ్డు మార్గాన భారీ ట్రాఫిక్‌ లో చిక్కి ఎటూ సమయానికి చేరలేనని గ్రహించి అసాధారణ ఆలోచన చేశాడు. పంచగని జీపీ అడ్వెంచర్‌కు వెళ్లి సమస్య చెప్పాడు. సకాలంలో చేర్చాలని కోరాడు. సాహస క్రీడల నిపుణుడు గోవింద్‌ యెవాలే బృందం పారాగ్లైడింగ్‌ ద్వారా మనవాడిని నేరుగా పరీక్ష కేంద్రం సమీపంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దాంతో సమర్‌్థపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు పారాగ్లైడింగ్‌కు కూడా సతారా పెట్టింది పేరు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement