నెల రోజుల్లో మనకు వ్యాక్సిన్‌: సీఎం | Yogi Adityanath We Are A Month Away From Covid Vaccine | Sakshi
Sakshi News home page

యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Dec 11 2020 10:13 AM | Last Updated on Fri, Dec 11 2020 10:16 AM

Yogi Adityanath We Are A Month Away From Covid Vaccine - Sakshi

లక్నో: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుభవార్త చెప్పారు. నెల రోజల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్నారు. గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌లో నిర్వహించిన ‘హెల్తీ ఈస్టర్న్‌ ఉత్తరప్రదేశ్’‌ కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహమ్మారి విజృంభిస్తోంది. అభివృద్ధి చేందిన అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ మరణాలు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా కోవిడ్‌ మరణాల రేటు 8 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం 1.04 శాతంగా మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మరో నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.  కరోనా కట్టడి కోసం మనం చేస్తోన్న కృషిని ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో అభినందించింది’ అని తెలిపారు యోగి. (చదవండి: ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్‌ గుణపాఠం)

సమిష్టి కృషితో ఎంతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎయిమ్స్‌ వంటి వైద్య శాలలు ఈ అంశంలో తమ పాత్ర పోషించాలి అన్నారు యోగి. వైద్య సంస్థలు ఈ రంగంలో మరెంతో కృషి చేయాలని తెలిపారు. బస్తీ డివిజన్లు, తూర్పు, ఉత్తర బిహార్‌, నేపాల్‌కు చెందిన దాదాపు ఐదు కోట్ల మందికి గోరఖ్‌పూర్‌ బాధ్యత వహిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement