TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్‌ | Amit Shah Class For Telangana Bjp Chief Leaders | Sakshi
Sakshi News home page

TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్‌

Published Thu, Dec 28 2023 3:53 PM | Last Updated on Thu, Dec 28 2023 4:21 PM

Amit Shah Class For Telangana Bjp Chief Leaders - Sakshi

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా క్లాస్‌ పీకారు.

సాక్షి, హైదరాబాద్‌: ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా క్లాస్‌ పీకారు. పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం హాట్‌హాట్‌ సాగింది.

నేతల మధ్య గ్యాప్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది.. ఇది రిపీట్‌ కావొద్దంటూ షా హెచ్చరించారు. ఎంపీ టికెట్‌ ఆశావహులు, వారి బలబలాలపైన ఆరా తీసిన అమిత్‌ షా.. సిట్టింగ్‌ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చారు. నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు.

గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్న అమిత్‌షా.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించారు.

ఇదీ చదవండి: శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement