
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు సహా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అనుమానంతో కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో, నందినగర్‌లోని కేటీఆర్ నివాసం గులాబీమయం అయ్యింది.