
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని మండిపడ్డారు. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ...హనుమాన్ శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు.
చదవండి: వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి