ఓపెనర్లుగా వీరూ, రోహిత్‌.. మిడిలార్డర్‌లో సచిన్‌, విరాట్‌: డీకే | Dinesh Karthik Picks His All Time Indian XI Across Formats Rohit Kohli Included | Sakshi
Sakshi News home page

మూడు ఫార్మాట్లలో టీమిండియా అత్యుత్తమ జట్టు ఇదే: డీకే

Aug 15 2024 2:02 PM | Updated on Aug 15 2024 2:35 PM

Dinesh Karthik Picks His All Time Indian XI Across Formats Rohit Kohli Included

టీమిండియా మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్‌ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్‌టైమ్‌ టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించాడు.

ఓపెనర్లుగా వీరూ, రోహిత్‌
మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్‌ కార్తిక్‌ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.

మిడిల్‌ ఆర్డర్‌లో సచిన్‌, విరాట్‌
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 100కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్‌ రన్‌స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కు ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్‌, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.

ఇక ఆ తర్వాతి స్థానంలో రన్‌మెషీన్‌, 80 శతకాల వీరుడు విరాట్‌ కోహ్లికి చోటిచ్చిన దినేశ్‌ కార్తిక్‌.. ఆల్‌రౌండర్ల జాబితాలో వరల్డ్‌కప్‌ విన్నర్స్‌ యువరాజ్‌ సింగ్‌, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్‌ విభాగంలో.. సీమర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, జహీర్‌ ఖాన్‌, స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, లెజెండ్‌ అనిల్‌ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్‌. క్రిక్‌బజ్‌ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.

వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టు
వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి, యువరాజ్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అనిల్‌ కుంబ్లే, జస్‌ప్రీత్‌ బుమ్రా, జహీర్‌ ఖన్‌.
12th మ్యాన్‌: హర్భజన్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement