
Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన రోహిత్.. టి20ల్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ రికార్డు సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ 373 మ్యాచ్‌ల్లో 10003 పరుగులు సాధించాడు. కాగా టీమిండియా నుంచి విరాట్ కోహ్లి మాత్రమే టి20 క్రికెట్‌లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా రోహిత్ ఈ ఫీట్ సాధించిన రెండో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు.
ఇక తొలి స్థానంలో విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 14562 పరుగులతో టీ20ల్లో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. పాక్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (472 మ్యాచ్‌ల్లో 11698 పరుగులు), విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ (582 మ్యాచ్‌ల్లో 11430 పరుగులు), ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (347 మ్యాచుల్లో 10444 పరుగులు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (328 మ్యాచుల్లో 10326 పరుగులు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10308 పరుగులు) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా రోహిత్ శర్మ(10003 పరుగులతో) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు.