బుమ్రా, సూర్యకు షాకిచ్చిన ముంబై!.. పోస్ట్‌ డిలీట్‌ చేసిన దేవిశా | IPL 2024 Suryakumar Yadav Wife Devisha Shares Cryptic Post, Later She Deleted Her Post Know Why - Sakshi

IPL 2024: ఇలా చేయడానికి సిగ్గుండాలంటూ ఫైర్‌!.. పోస్ట్‌ డిలీట్‌ చేసిన సూర్య భార్య

Dec 16 2023 5:00 PM | Updated on Dec 16 2023 6:17 PM

IPL 2024 Suryakumar Heart Break Devisha Cryptic Post The Way You And Delete - Sakshi

హార్దిక్‌- రోహిత్‌ (PC: BCCI/IPL)- దేవిశా- సూర్య

Suryakumar Yadav Heartbreak Emoji- His Wife shares cryptic post: క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పు గురించే చర్చ నడుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై జట్టును ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలిపిన రోహిత్‌ శర్మను.. సారథ్య బాధ్యతల నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వద్దని వదిలేసుకున్న హార్దిక్‌ పాండ్యాను తిరిగి రప్పించడం బాగానే ఉన్నా.. హిట్‌మ్యాన్ ఉండగా అతడిని కెప్టెన్‌గా నియమించడం సరికాదంటూ సోషల్‌ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు.

ఇలా చేయడానికి సిగ్గుండాలి
ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నందుకు.. ‘‘మీరు సిగ్గుపడాలి’’ అంటూ #ShameOnMI అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తూ ముంబై ఫ్రాంఛైజీని ట్రోల్‌ చేస్తున్నారు. రోహిత్‌ శర్మకు మద్దతుగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని అయితే.. ముంబై జెర్సీని కాల్చివేస్తానంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాడు.

కెప్టెన్‌ కావాలని భావించిన బుమ్రా, సూర్య
ఇక అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కూడా ఫ్రాంఛైజీ నిర్ణయంతో కంగుతిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ తర్వాత కెప్టెన్‌ కావాలని భావించిన స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, వరల్డ్‌నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

కాగా రోహిత్‌ను తప్పిస్తూ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించినట్లు ముంబై ఇండియన్స్‌ ప్రకటించగానే సూర్యకుమార్‌.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ హార్ట్‌బ్రేక్‌ ఎమోజీని షేర్‌ చేయడం గమనార్హం. కాగా సూర్యకు రోహిత్‌ శర్మ ఆది నుంచి అండగా నిలబడిన విషయం తెలిసిందే.

వెంటనే పోస్ట్‌ డిలీట్‌ చేసిన సూర్య భార్య
అంతేగాకుండా గత సీజన్‌లో రోహిత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పలు మ్యాచ్‌లలో బరిలోకి దిగినపుడు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం రోహిత్‌, హార్దిక్‌ గైర్హాజరీలో టీమిండియా సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు కూడా రోహిత్‌ శర్మ తర్వాతి కాలంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ కాగలడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే, హార్దిక్‌ పాండ్యా రాకతో సూర్య కలలు ఇక కల్లలైనట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవిశా శెట్టి నెట్టింట ఓ పోస్ట్‌ పెట్టి డిలీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘‘మీ చుట్టూ ఉన్న వాళ్ల పట్ల మీరెలా వ్యవహరించాన్న విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది’’ అని దేవిశా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అయితే, వెంటనే దానిని డిలీట్‌ చేయడం చర్చకు తావిచ్చింది.

చదవండి: భారత జట్టులోనూ ‘వై నాట్‌ ఏపీ’.. సీఎం జగన్‌ విజన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement