పంజాబ్‌ను చిత్తు చేసిన రాజ‌స్తాన్.. | IPL 2025: Punjab Kings vs Rajasthan Royals live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: పంజాబ్‌ను చిత్తు చేసిన రాజ‌స్తాన్..

Published Sat, Apr 5 2025 7:24 PM | Last Updated on Sat, Apr 5 2025 11:26 PM

IPL 2025: Punjab Kings vs Rajasthan Royals live updates and highlights

IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

పంజాబ్‌కు తొలి ఓట‌మి..
ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ తొలి ఓట‌మి చ‌విచూసింది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో పంజాబ్ ప‌రాజ‌యం పాలైంది. 206 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా(62) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాక్స్‌వెల్‌(30) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా అర్చ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ‌, థీక్ష‌ణ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కార్తికేయ‌, హ‌స‌రంగా ఓ వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్‌(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌(38), రియాన్ పరాగ్‌(45), హెట్‌మెయిర్‌(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.
వదేరా ఔట్‌..
పంజాబ్ కింగ్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. థీక్ష‌ణ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌(30) ఔట్ కాగా.. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో హ‌స‌రంగా బౌలింగ్‌లో వ‌ధేరా(62) ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్‌.. 6 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది.

వదేరా హాఫ్ సెంచ‌రీ..
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన త‌ర్వాత పంజాబ్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. క్రీజులో నేహ‌ల్ వ‌ధేరా(53), గ్లెన్ మాక్స్‌వెల్‌(30) ఉన్నారు. 
క‌ష్టాల్లో పంజాబ్‌
43 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మూడో వికెట్‌గా స్టోయినిష్‌, నాలుగు వికెట్‌గా ఫ్ర‌బ్ సిమ్రాన్ ఔట‌య్యాడు. 7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ 4 వికెట్ల న‌ష్టానికి 45 ప‌రుగులు చేసింది. క్రీజులో నేహాల్ వ‌ధేరా(9), మాక్స్‌వెల్‌(1) ఉన్నారు.

పంజాబ్‌కు భారీ షాక్‌..
206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గ‌లింది. తొలి ఓవ‌ర్‌లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్చ‌ర్ బౌలింగ్‌లో తొలి బంతికి ఆర్య ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి శ్రేయ‌స్ అయ్య‌ర్ క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులో ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌, మార్క‌స్ స్టోయినిష్ ఉన్నారు.

చెలరేగిన రాజస్తాన్‌ బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్‌ 
ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్‌(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌(38), రియాన్ పరాగ్‌(45), హెట్‌మెయిర్‌(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.

రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..
నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన రాణా.. జానెస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ 3 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. క్రీజులో ప‌రాగ్‌(12), హెట్‌మెయిర్‌(4) ఉన్నారు.

రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌..
య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.
రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌..
య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.

రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌
కెప్టెన్ సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 105 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(56), రియాన్ ప‌రాగ్‌(5) ఉన్నారు.

4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌:40/0
4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(25), సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  పంజాబ్ త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. 

రాజ‌స్తాన్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంస‌న్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సంజూనే వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు తుషార్ దేశ్ పాండే గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో యుద్ద్‌వీర్ సింగ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement